హాట్‌గా ఉన్న సమ్మర్‌లో ఏదైనా తాగాలి అంటే మనకు ముందుగా గుర్తొచ్చేది పెప్సీ, కోకో కోలా లాంటి సాఫ్ట్ డింక్సే. ఇప్పుడు ఈ శీతల పానియాల్ని తయారు చేస్తున్న కంపెనీలను ప్రపంచంలోని అతి పేద దేశాల్లో ఒకటైన సూడాన్ అంతర్యుద్ధం ఉక్కిరిబిక్కిరి చేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకు కారణం పెప్సీ, కోకోకోలా, ఫీజీ కూల్ డ్రింక్స్‌తో పాటు క్యాండీ (స్వీట్స్)లలో ఉపయోగించే ఓ పదార్ధం సుడాన్‌లో మాత్రమే లభ్యమవుతుంది. ఇప్పుడు ఆ పదార్ధం కొరత తయారీ కంపెనీలను తీవ్రంగా వేధిస్తోంది.
సూడాన్‌లో కొనసాగుతున్న ఆధిపత్య పోరు ప్రపంచ దేశాలే కాదు.. అంతర్జాతీయ కంపెనీలను సైతం ఆందోళనకు గురిచేస్తోంది. ప్రొడక్ట్‌ల తయారీకి అంతరాయం కలగకుండా ఉండేలా సుడాన్‌లో దొరికే పదార్ధాన్ని సమకూర్చుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నాయి.
పెప్సీ, కోకో కోలాలో ఉపయోగించే పదార్ధం
పెప్సీ, కోకో కోలాలో సాధారణంగా ఉపయోగించే ముఖ్యమైన పదార్థం 'గమ్ అరబిక్'. పెప్సీ, కోకో కోలా కంపెనీలు తయారు చేసే సాఫ్ట్ డ్రింక్స్‌లో ఈ గమ్ అరబిక్‌ను కలుపుతారు. దీన్ని కలపడం వల్ల కూల్ డ్రింక్‌ను తయారీ కోసం వినియోగించే ఇంగ్రీడియంట్స్ విడిపోకుండా ఉంటాయి. లేదంటే ఇంగ్రీడియంట్స్ విడిపోయి రుచి, పచి ఉండవు. కాబట్టే తయారీ సంస్థలు ఈ గమ్ అరబిక్‌ను ఉపయోగిస్తాయి. ఇక ఆ పదార్ధం సుడాన్‌లోని అకాసియా చెట్టు నుంచి పూసే జిగురు తరహాలో ఉంటుంది. ఈ జిగురు ప్రపంచ దేశాలకు సూడాన్ నుండే రవాణా అవుతుంది. ప్రపంచంలో 70 శాతం గమ్ అరబిక్ సరఫరా ఆఫ్రికాలోని సూడాన్ గుండా ప్రవహించే సాహెల్ ప్రాంతం నుండి ఎగుమతి అవుతుంది.
నిపుణుల అభిప్రాయం ప్రకారం.. వచ్చే 5-6 నెలల్లో గమ్ అరబిక్‌తో తయారు చేసిన ఉత్పత్తులు అయిపోవచ్చని ప్రధాన ఆహార, పానీయాల కంపెనీలకు గమ్ అరబిక్ సరఫరా చేసే కెర్రీ గ్రూప్ ప్రొక్యూర్మెంట్ మేనేజర్ రిచర్డ్ ఫిన్నెగన్ను ఉటంకిస్తూ రాయిటర్స్‌లోని ఓ నివేదిక పేర్కొంది. డచ్ సప్లయర్ ఫోగా గమ్ భాగస్వామి మార్టిజెన్ బెర్గ్కాంప్ ఇదే తరహా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
చదవండి👉 బ్యాంక్ ఉద్యోగులకు కేంద్రం గుడ్‌న్యూస్.. వారానికి 5 రోజులే పని దినాలు!
'గమ్ అరబిక్' ఉత్పత్తి
ఏటా ప్రపంచవ్యాప్తంగా 120.000 బిలియన్ డాలర్ల విలువైన 1,1,500 టన్నుల గమ్ అరబిక్ ఉత్పత్తి అవుతుందని కెర్రీ గ్రూప్ అంచనా వేసింది. తూర్పు నుండి పశ్చిమ ఆఫ్రికా వరకు 500 మైళ్ళలో విస్తరించి ఉన్న ప్రాంతం నుండి ఈ గమ్‌ను సేకరిస్తారు.
గమ్ అరబిక్ లేకపోతే
పెప్సీ, కోకాకోలా వంటి దిగ్గజాలు తమ ఉత్పత్తులలో గమ్ అరబిక్ లేకుండా తమ ఉనికిని కాపాడుకోవడం సాధ్యం కాదని అగ్రిగమ్ మార్కెటింగ్ డైరెక్టర్ డాని హద్దాద్ చెప్పారు. ఫిజీ డ్రింక్స్ వంటి ఉత్పత్తుల్లో గమ్ అరబిక్కు ప్రత్యామ్నాయం లేదని నిపుణులు చెబుతుండగా.. సూడాన్ అంతర్యుర్ధం ముగింపుపై ప్రపంచ దేశాలకు చెందిన దిగ్గజ కంపెనీలు సైతం ఐక్యారాజ్య సమితి వేదికగా తమ గొంతుకను వినిపిస్తున్నాయి.
500 మందికి పైగా మృతి
సాయుధ బలగాల నడుమ జరుగుతున్న ఆ ఆధిపత్య పోరులో నార్త్ ఆఫ్రీకా దేశమైన సూడాన్ అతలాకుతలమవుతోంది. పారామిలిటరీ ర్యాపిడ్ ఫోర్స్‌ను ఆర్మీలో విలీనం చేయాలనే ప్రతిపాదన.. ఈ రెండు వర్గాల నడుమ ఘర్షణలకు దారి తీసింది. సూడాన్ రాజధాని ఖార్తోమ్‌తో పాటు దేశంలో పలు చోట్ల ఈ ఘర్షణలు కొనసాగుతుండగా.. సాధారణ పౌరులు ఇబ్బంది పడుతున్నారు. ఘర్షణలు మొదలైన ఏప్రిల్ 15 నుంచి ఇప్పటివరకు (మే1) లక్ష మందికిపైగా పౌరులు సూడాన్‌ను వీడినట్లు ఐక్యరాజ్య సమితి వెల్లడించింది. మరో 3.30 లక్షల మంది నిరాశ్రయులయ్యారని తెలిపింది. మరోవైపు, ఈ హింసాత్మక ఘర్షణల్లో ఇప్పటివరకు 500 మందికిపైగా మృతిచెందగా.. నాలుగు వేల మందికి పైగా గాయపడ్డారు.
చదవండి👉 ‘ఆఫీస్‌కి వస్తారా.. లేదంటే!’, వర్క్ ప్రమ్ హోం ఉద్యోగులకు దిగ్గజ టెక్ కంపెనీల వార్నింగ్
Comments
Please login to add a commentAdd a comment