ఎక్స్. కామ్ అధినేత ఎలాన్ మస్క్‌కు హ్యాకర్లు ఝలక్ ఇచ్చారు. తమ దేశంలోనూ స్టార్ లింక్ శాటిలైట్ ఇంటర్నెట్ సేవల్ని అందించాలని వార్నింగ్ ఇస్తూ సూడాన్‌కు చెందిన యాకర్లు ఎక్స్. కామ్‌ను హ్యాక్ చేశారు. ఆపై సోషల్ మీడియా ఫ్లాట్‌ఫామ్ పనిచేయకుండా బ్లాక్ చేశారు.
సుడాన్‌లోని ఓ రహస్య హ్యాకర్స్ బృందం ప్రపంచంలోని 12కు పైగా దేశాల్లో ఎక్స్. కామ్ పని చేయకుండా 2 గంటల పాటు నిలిపివేసినట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. మైక్రో బ్లాగింగ్ సైట్‌లో తలెత్తిన అంతరాయంతో యూజర్లు ఇబ్బంది పడినట్లు బ్రిటిష్ మీడియా సంస్థ బీబీసీ నివేదించింది.
‘ఎలాన్ మస్క్‌కు మేమిచ్చే మెసేజ్ ఇదే. సూడాన్‌లో శాటిలైట్ ఇంటర్నెట్ సేవల్ని అందించాలంటూ హ్యాకర్స్ గ్రూప్ టెలిగ్రాం ఛానల్‌లో ఓ మెసేజ్‌ను పోస్ట్ చేసింది.ఎక్స్. కామ్‌ను తమ అదుపులోకి తీసుకోవడంతో యూకే, యూఎస్‌కు చెందిన 20,000 మంది తమకు ఫిర్యాదు చేసినట్లు డౌన్ డిటిటెక్టర్ తెలిపింది.
ఎక్స్.కామ్ హ్యాకింగ్‌కు కారణం
అయితే, జరిగిన అంతరాయాన్ని ఎక్స్.కామ్ యాజమాన్యం స్పందించలేదు. ఈ సందర్భంగా హ్యాకింగ్ గ్రూప్ సభ్యుడు హోఫా మాట్లాడుతూ.. సూడాన్‌లో కొనసాగుతున్న సివిల్ వార్‌పై ప్రజల్లో అవగాహన కల్పించే లక్ష్యంతో డిస్ట్రిబ్యూటెడ్ డెనిషన్ ఆఫ్ సర్వీస్ (డీడీఓఎస్) హ్యాకింగ్ దాడి జరిగింది. కానీ ఇంటర్నెట్ పనితీరు కారణంగా మా నినాదాన్ని గట్టిగా వినిపించ లేకపోతున్నాం. తరచుగా ఇంటర్నెట్ సమస్యలు తలెత్తుతున్నాయని తెలిపాడు. కాబట్టే తమకు శాటిలైట్ ఇంటర్నెట్ సేవలం అవసరమని పేర్కొన్నాడు.
ప్రిగోజిన్‌కు వ్యతిరేకంగా
హ్యాకింగ్ గ్రూప్‌కు రష్యా సైబర్ మిలటరీ యూనిట్‌కు మంచి సన్నిహిత సంబంధాలున్నాయి. అయితే రష్యాతో తమకు ఉన్న అనుబంధాన్ని ఆ సంస్థ ఖండించింది. పుతిన్ ప్రభుత్వంపై తిరుగుబాటుదారుడు, వాగ్నర్ చీఫ్ యెవ్జెనీ ప్రిగోజిన్ పారామిలటరీని అంతం చేయడానికి రష్యా ప్రభుత్వానికి మద్దతుగా ఈ హ్యాకింగ్ గ్రూప్ జూన్‌లో ఓ మెసేజ్‌ను సైతం సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఈ హ్యాకింగ్ గ్రూప్ గతంలో ఫ్రాన్స్, నైజీరియా, ఇజ్రాయెల్, అమెరికాలో అలజడి సృష్టించింది.
Comments
Please login to add a commentAdd a comment