Candy
-
National Candy Day: మిఠాయి పుట్టుక వెనుక..
మిఠాయిలను ఇష్టపడనివారు ఎవరూ ఉండరు. స్వీట్స్‌ను చూడగానే పిల్లల నుంచి పెద్దల వరకూ అందరికీ నోరూరుతుంది. మరి ఇలాంటి మిఠాయిల గొప్పదనాన్ని గుర్తు చేసుకునేందుకు ఒక రోజు ఉందని మీకు తెలుసా? ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.ప్రతి సంవత్సరం నవంబర్ 4న జాతీయ మిఠాయి దినోత్సవం జరుపుకుంటారు. ఇది తీపిని ఇష్టపడేవారు తియ్యని వేడుక చేసుకునే రోజు. ఈ రోజు ఉద్దేశ్యం స్వీట్లను ఆస్వాదిస్తూ, చిన్ననాటి జ్ఞాపకాలను నెమరు వేసుకుంటూ, తీపి పదార్థాలపై మనకున్న ప్రేమను వ్యక్తపరడచడం. ఈ రోజున వివిధ రకాల క్యాండీలను రుచి చూడటమే కాకుండా కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలసి వేడుక చేసుకుంటుంటారు.మిఠాయి కథ భారతదేశంలోనే మొదలయ్యింది. ప్రాచీన భారతీయులు చెరకు రసాన్ని ఉడికించి, అచ్చులుగా పోసేవారు. వీటిని ముక్కలుగా చేసి దానిని ‘ఖండ’ అని పిలిచేవారు. దీనినే చరిత్రకారులు తొలి మిఠాయిగా అభివర్ణించారు. పురాతన చైనా, మధ్యప్రాచ్యం, ఈజిప్ట్, గ్రీస్, రోమ్లలో తేనెతో మిఠాయిలు తయారు చేసేవారు. పారిశ్రామిక విప్లవానికి ముందు మిఠాయిని జీర్ణవ్యవస్థను మెరుగుపరడచానికి, గొంతు సమస్యల నుంచి ఉపశమనం కలిగించడానికి ఔషధంగా ఉపయోగించేవారు.18వ శతాబ్దంలో క్యాండీ.. ఫ్రాన్స్ బ్రిటన్ నుంచి అమెరికాకు వచ్చింది. వంటలలో నైపుణ్యం కలిగినవారు చక్కెరతో మిఠాయిలు చేసేవారు. 1830వ దశకంలో పారిశ్రామిక విప్లవం కొనసాగుతున్న సమయంలో మిఠాయి సంపన్నులకే కాకుండా అందరికీ అందుబాటులోకి వచ్చింది. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా వివిధ రకాల క్యాండీలు అందుబాటులో ఉన్నాయి. మనదేశంలో చాలామంది ఏదైనా మంచి పనిని ప్రారంభించే ముందు మిఠాయి తింటుంటారు. ఇలా చేయడం వలన తాము అనుకున్న పనులు సఫలమవుతాయని భావిస్తుంటారు.ఇది కూడా చదవండి: 2025.. ప్రపంచం అంతానికి ఆరంభం: బాబా వంగా కాలజ్ఞానం -
కృత్రిమ రంగులపై కొరడా: భారీ జరిమానా, జైలు
కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.అనేక ఆనారోగ్య సమస్యల కారణంగా కాటన్ క్యాండీలు, గోబీ మంచూరియన్లో వాడే ఫుడ్ కలరింగ్ ఏజెంట్లపై నిషేధం విధించింది. ఈ మేరకు కర్ణాటక ఆరోగ్య శాఖ మంత్రి దినేష్ గుండూరావు ఉత్తర్వులు జారీ చేశారు. గోబీ మంచూరియా, కాటన్ క్యాండీ శాంపిల్స్‌లో హానికరమైన రసాయనాలను వాడినట్లు గుర్తించడంతో ఈ ఉత్తర్వులు జారీ అయ్యాయి. అయితే గోబీ మంచూరియా, కాటన్ క్యాండీ విక్రయాలను పూర్తిగా నిషేధించే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. దీంతో ఫుడ్ కలరింగ్ ఏజెంట్లపై కొరడా ఝళిపించిన రాష్ట్రాల జాబితాలో తాజాగా కర్ణాటక చేరింది. రోడమైన్-బి , కార్మోయిసిన్ వంటి కలరింగ్ ఏజెంట్ల వాడకం హానికరమైందని తెలిపింది. కృత్రిమ రంగులను ఉపయోగించి తయారు చేసే ఆహార పదార్థాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఈ మేరకు మంత్రి దినేష్ గుండూరావు ప్రకటించారు. హానికరమైన కలర్స్‌ను ఉపయోగిస్తున్నట్లు తేలితే, ఆహార భద్రతా చట్టం కింద వారిపై కఠిన చర్యలు తీసు కుంటామని ఆయన హెచ్చరించారు. నేరం రుజువైతే కనీసం ఏడేళ్ల జైలు శిక్ష, రూ.10 లక్షల జరిమానా విధించేలా ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా సేకరించిన 171 నమూనాలలో 107 టార్ట్రాజైన్, సన్‌సెట్ ఎల్లో, రోడమైన్-బీ, కార్మోయిసిన్ లాంటి హానికర రసాయనాలను ఉపయోగించి తయారు చేసినట్లు అధికారులు గర్తించారు. 64 సురక్షితంగా ఉన్నట్టు తేలింది. అలాగే 25 కాటన్ క్యాండీ నమూనాలను సేకరించగా, వాటిలో 10 సురక్షితమైనవిగానూ, 15 హానికరమైనవిగా తేలాయి. -
TN: పీచు మిఠాయి విక్రయాలు.. తమిళనాడు సంచలన నిర్ణయం
చెన్నై: చిన్నా పెద్ద తేడా లేకుండా అందరూ ఎంతగానో ఇష్టపడే కాటన్ క్యాండీ(పీచు మిఠాయిల)పై తమిళనాడు ప్రభుత్వం నిషేదం విధించింది. ఈ విషయాన్ని ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సుబ్రమణియన్ వెల్లడించారు. వీటిల్లో క్యాన్సర్ కారక రసాయనాలున్నందునే నిషేదం విధించినట్లు తెలిపారు. రాజధాని నగరం చెన్నై వ్యాప్తంగా ఇటీవల ఫుడ్‌సేఫ్టీ అధికారులు పీచు మిఠాయిల నమూనాలను సేకరించారు. వీటిని పరిశీలించగా కాటన్ క్యాండీల్లో రోడమైన్-బి అనే రసాయనం ఉన్నట్లు గుర్తించారు. కృత్రిమ రంగుల కోసం దీన్ని పీచు మిఠాయిల్లో వినియోగించినట్లు తేలింది. రోడమైన్-బిని ఇండస్ట్రియల్ డైగా పిలుస్తారు. దుస్తుల కలరింగ్, పేపర్ ప్రింటింగ్‌లో ఎక్కువగా వినియోగిస్తారు. ఆహారంలో రంగు కోసం దీన్ని వాడరు. దీనివల్ల దీర్ఘకాలంలో ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశముందని అధికారులు తెలిపారు. ఇది ఎక్కువ మొత్తంలో శరీరంలోకి వెళ్తే కిడ్నీ, లివర్ పనితీరుపై ప్రభావం చూపిస్తుందని, క్యాన్సర్‌కు కూడా దారితీసే ప్రమాదముందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇదీ చదవండి.. జీఎస్ఎల్వీ ఎఫ్-14 రాకెట్ ప్రయోగం సక్సెస్ -
కాటన్ క్యాండీలపై నిషేధం.. వీడియో విడుదల చేసిన తమిళిసై!
కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరిలో కాటన్ క్యాండీ (తీపి తినుబండారం) విక్రయాలపై నిషేధం విధిస్తున్నట్లు లెఫ్టినెంట్ గవర్నర్ తమిళిసై సుందరరాజన్ ప్రకటించారు. విషపూరిత రసాయనాలను ఉపయోగించి కాటన్ క్యాండీలను తయారు చేస్తున్నారనే కారణంతోనే వీటిపై నిషేధం విధించారు. ఒక వీడియోలో పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ తమిళిసై సుందరరాజన్ మాట్లాడుతూ కాటన్ క్యాండీలో విషపూరిత రోడోమైన్ బీ ఉన్నట్లు ఆహార అధికారులు కనుగొన్నారన్నారు. కాటన్ క్యాండీలలోని విష రసాయనాలు ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతాయన్నారు. అందుకే పుదుచ్చేరిలో కాటన్ క్యాండీ విక్రయాలను నిషేధిస్తున్నట్లు లెఫ్టినెంట్ గవర్నర్ తెలిపారు. குழந்தைகளின் உடல்நலத்தை பாதிக்கும் ரசாயனம் கலந்த பஞ்சு மிட்டாயை குழந்தைகளுக்கு வாங்கி கொடுக்காதீர்கள்.#CottonCandy #PanchuMittai #Puducherry pic.twitter.com/VJR451Y403 — Dr Tamilisai Soundararajan (@DrTamilisaiGuv) February 8, 2024 లెఫ్టినెంట్ గవర్నర్ తన అధికారిక సోషల్ మీడియా పేజీలో దీనికి సంబంధించిన ఒక వీడియో క్లిప్ షేర్ చేశారు. పిల్లల కోసం కాటన్ క్యాండీలను కొనుగోలు చేయడం మానుకోవాలని, అందులోని రసాయనాలు ఆరోగ్యానికి హాని కలిగిస్తాయని తెలిపారు. కాటన్ క్యాండీలు విక్రయించే అన్ని దుకాణాలలో తనిఖీ చేయాలని ప్రభుత్వ అధికారులను ఆదేశించినట్లు లెఫ్టినెంట్ గవర్నర్ ఆ వీడియోలో తెలిపారు. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ తెలిపిన వివరాల ప్రకారం, రోడోమైన్ బీ అనే రసాయనాన్ని ఆహార పదార్థాలకు రంగు వచ్చేందుకు ఉపయోగిస్తారు. ఇది శరీరంలోకి ప్రవేశించినప్పుడు కణాలలో ఆక్సీకరణ ఉద్రిక్తతకు కారణమవుతుంది. ఫలితంగా కాలేయ వైఫల్యం, క్యాన్సర్ వంటి తీవ్రమైన ఆరోగ్య సమస్యలు ఎదురయ్యేందుకు అవకాశం ఉంది. -
పొగలు కక్కే క్యాండీ తింటున్నారా? పేగులు చిల్లులు పడతాయి జాగ్రత్త
పొగలు కక్కే మిఠాయి కొద్దికాలంగా ఇండోనేషియాలో వేలంవెర్రిగా మారింది. రంగురంగుల్లో నోరూరించే ఈ మిఠాయిపేరు ‘చికి ఎంగెబుయి’. ఇది సాదాసీదా క్యాండీలాంటి మిఠాయే! అయితే, పొగలు కక్కుతూ కనిపించేందుకు దీనిపై లిక్విడ్ నైట్రోజన్ చల్లి తినడానికి అందిస్తారు. దట్టమైన ఆవిరిలాంటి పొగలు కక్కుతూ ఉండటంతో దీనికి ‘డ్రాగన్ బ్రీత్’ అని ముద్దుపేరు కూడా పెట్టుకున్నారు. ఇక ఇండోనేసియాలో ఈ క్యాండీ పెద్ద తంటానే తెచ్చిపెట్టింది. దీనిని తినడం వల్ల పశ్చిమ జావా ప్రాంతంలో దాదాపు ముప్పయిమంది పిల్లలు గతంలో ఆస్పత్రిపాలయిన సంగతి తెలిసిందే. పొగలు కక్కే ఈ చిరుతిండి కడుపులోకి వెళ్లాక, పేగులు చిల్లులు పడేలా చేస్తుందని వైద్యులు చెబుతున్నారు. దీనిపై గగ్గోలు చెలరేగడంతో పశ్చిమ జావా గవర్నర్ రిద్వాన్ కామిల్ జనవరి 10న ఈ చిరుతిండిపై నిషేధం విధిస్తూ ఆదేశాలు జారీ చేశారు. View this post on Instagram A post shared by Cool. Yogurt. Roll. (@coyoro) View this post on Instagram A post shared by Cool. Yogurt. Roll. (@coyoro) ఇండోనేసియాలోని మిగిలిన ప్రాంతాల్లోనూ ఈ పొగలు కక్కే మిఠాయి వల్ల పిల్లలు అనారోగ్యం పాలవుతున్నారని, దేశవ్యాప్తంగా దీనిని నిషేధించాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. ఇటీవలి కాలంలో మన దేశంలోనూ అక్కడక్కడా కొన్నిరకాల చిరుతిళ్లపై లిక్విడ్ నైట్రోజన్ చల్లుతున్నారు. మన ప్రభుత్వాలు దీనిపై ఎప్పుడు దృష్టిసారిస్తాయో చూడాలి మరి! -
క్రికెట్ అభిమానులకి బ్యాడ్ న్యూస్.. భారత్-పాకిస్తాన్ మ్యాచ్ కష్టమే!
క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న భారత్-పాకిస్తాన్ మ్యాచ్‌కు సమయం అసన్నమైంది. ఆసియాకప్-2023లో భాగంగా సెప్టెంబర్ 2న కాండీ వేదికగా దాయాదుల పోరు జరగనుంది. అయితే ఈ బ్లాక్ బస్టర్ మ్యాచ్ జరిగేది అనుమానంగా మారింది. ఈ మ్యాచ్‌కు వర్షం ముప్పు పొంచి ఉంది. మ్యాచ్ జరిగే సమయంలో 90 శాతం వర్షం పడే అవకాశం ఉందని అక్కడి వాతవారణ శాఖ వెల్లడించింది. ఇక హైవోల్టేజ్ మ్యాచ్ కోసం టిక్కెట్లు ఇప్పటికే అమ్ముడుపోయాయి కూడా. ఈ క్రమంలో మ్యాచ్ జరుగుతుందా లేదా అన్న ఆందోళన ఫ్యాన్స్‌లో నెలకొంది. కాగా గురువారం కాండే వేదికగా జరగనున్న బంగ్లాదేశ్-శ్రీలంక మ్యాచ్‌కు కూడా వరుణడు అటంకం కలిగించే ఛాన్స్ ఉంది. అంతే కాకుండా సెప్టెంబర్ 4న భారత్-నేపాల్ మధ్య మ్యాచుకు సైతం వర్షం అంతరాయం కలిగించే అవకాశం ఉంది. కాగా ఏడాది ఆసియాకప్ శ్రీలంక, పాకిస్తాన్ వేదికలగా హైబ్రిడ్ మోడల్లో జరుగుతన్న సంగతి తెలిసిందే. ఈ టోర్నీలో మొత్తం 13 మ్యాచ్ లు జరుగుతాయి. ఇందులో 4 మ్యాచ్‌లు పాకిస్తాన్ వేదికగా .. మిగిలిన 9 మ్యాచ్ లు శ్రీలంక వేదికగా జరగనున్నాయి. ఇక ఈ మెగా ఈవెంట్‌ను పాకిస్తాన్ విజయంతో ఆరంభించింది. ముల్తాన్ వేదికగా నేపాల్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో 238 పరుగుల తేడాతో పాక్ విజయం సాధించింది. ఆసియాకప్‌కు భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), హార్దిక్ పాండ్యా (వైస్ కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, రవీంద్ర జడేజా, ఇషాన్ కిషన్, జస్ప్రీత్ బుమ్రా, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, మహ్మద్ షమి, శార్దూల్ ఠాకూర్, అక్షర్ పటేల్, ప్రసిద్ధ్ కృష్ణ రిజర్వు ప్లేయర్: సంజూ శాంసన్ చదవండి: Asia Cup 2023: టీమిండియాతో మ్యాచ్.. పాకిస్తాన్‌కు బిగ్‌షాక్! ఇక అంతే సంగతి -
ఈ చెట్టు లేకపోతే ప్రపంచంలో కూల్‌డ్రింక్స్ తయారీ కంపెనీల పరిస్థితి ఏంటో?
హాట్‌గా ఉన్న సమ్మర్లో ఏదైనా తాగాలి అంటే మనకు ముందుగా గుర్తొచ్చేది పెప్సీ, కోకో కోలా లాంటి సాఫ్ట్ డింక్సే. ఇప్పుడు ఈ శీతల పానియాల్ని తయారు చేస్తున్న కంపెనీలను ప్రపంచంలోని అతి పేద దేశాల్లో ఒకటైన సూడాన్ అంతర్యుద్ధం ఉక్కిరిబిక్కిరి చేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకు కారణం పెప్సీ, కోకోకోలా, ఫీజీ కూల్ డ్రింక్స్‌తో పాటు క్యాండీ (స్వీట్స్)లలో ఉపయోగించే ఓ పదార్ధం సుడాన్లో మాత్రమే లభ్యమవుతుంది. ఇప్పుడు ఆ పదార్ధం కొరత తయారీ కంపెనీలను తీవ్రంగా వేధిస్తోంది. సూడాన్‌లో కొనసాగుతున్న ఆధిపత్య పోరు ప్రపంచ దేశాలే కాదు.. అంతర్జాతీయ కంపెనీలను సైతం ఆందోళనకు గురిచేస్తోంది. ప్రొడక్ట్‌ల తయారీకి అంతరాయం కలగకుండా ఉండేలా సుడాన్లో దొరికే పదార్ధాన్ని సమకూర్చుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నాయి. పెప్సీ, కోకో కోలాలో ఉపయోగించే పదార్ధం పెప్సీ, కోకో కోలాలో సాధారణంగా ఉపయోగించే ముఖ్యమైన పదార్థం 'గమ్ అరబిక్'. పెప్సీ, కోకో కోలా కంపెనీలు తయారు చేసే సాఫ్ట్ డ్రింక్స్‌లో ఈ గమ్ అరబిక్‌ను కలుపుతారు. దీన్ని కలపడం వల్ల కూల్ డ్రింక్‌ను తయారీ కోసం వినియోగించే ఇంగ్రీడియంట్స్ విడిపోకుండా ఉంటాయి. లేదంటే ఇంగ్రీడియంట్స్ విడిపోయి రుచి, పచి ఉండవు. కాబట్టే తయారీ సంస్థలు ఈ గమ్ అరబిక్‌ను ఉపయోగిస్తాయి. ఇక ఆ పదార్ధం సుడాన్‌లోని అకాసియా చెట్టు నుంచి పూసే జిగురు తరహాలో ఉంటుంది. ఈ జిగురు ప్రపంచ దేశాలకు సూడాన్ నుండే రవాణా అవుతుంది. ప్రపంచంలో 70 శాతం గమ్ అరబిక్ సరఫరా ఆఫ్రికాలోని సూడాన్ గుండా ప్రవహించే సాహెల్ ప్రాంతం నుండి ఎగుమతి అవుతుంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. వచ్చే 5-6 నెలల్లో గమ్ అరబిక్‌తో తయారు చేసిన ఉత్పత్తులు అయిపోవచ్చని ప్రధాన ఆహార, పానీయాల కంపెనీలకు గమ్ అరబిక్ సరఫరా చేసే కెర్రీ గ్రూప్ ప్రొక్యూర్మెంట్ మేనేజర్ రిచర్డ్ ఫిన్నెగన్ను ఉటంకిస్తూ రాయిటర్స్‌లోని ఓ నివేదిక పేర్కొంది. డచ్ సప్లయర్ ఫోగా గమ్ భాగస్వామి మార్టిజెన్ బెర్గ్కాంప్ ఇదే తరహా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చదవండి👉 బ్యాంక్ ఉద్యోగులకు కేంద్రం గుడ్‌న్యూస్.. వారానికి 5 రోజులే పని దినాలు! 'గమ్ అరబిక్' ఉత్పత్తి ఏటా ప్రపంచవ్యాప్తంగా 120.000 బిలియన్ డాలర్ల విలువైన 1,1,500 టన్నుల గమ్ అరబిక్ ఉత్పత్తి అవుతుందని కెర్రీ గ్రూప్ అంచనా వేసింది. తూర్పు నుండి పశ్చిమ ఆఫ్రికా వరకు 500 మైళ్ళలో విస్తరించి ఉన్న ప్రాంతం నుండి ఈ గమ్‌ను సేకరిస్తారు. గమ్ అరబిక్ లేకపోతే పెప్సీ, కోకాకోలా వంటి దిగ్గజాలు తమ ఉత్పత్తులలో గమ్ అరబిక్ లేకుండా తమ ఉనికిని కాపాడుకోవడం సాధ్యం కాదని అగ్రిగమ్ మార్కెటింగ్ డైరెక్టర్ డాని హద్దాద్ చెప్పారు. ఫిజీ డ్రింక్స్ వంటి ఉత్పత్తుల్లో గమ్ అరబిక్కు ప్రత్యామ్నాయం లేదని నిపుణులు చెబుతుండగా.. సూడాన్ అంతర్యుర్ధం ముగింపుపై ప్రపంచ దేశాలకు చెందిన దిగ్గజ కంపెనీలు సైతం ఐక్యారాజ్య సమితి వేదికగా తమ గొంతుకను వినిపిస్తున్నాయి. 500 మందికి పైగా మృతి సాయుధ బలగాల నడుమ జరుగుతున్న ఆ ఆధిపత్య పోరులో నార్త్ ఆఫ్రీకా దేశమైన సూడాన్ అతలాకుతలమవుతోంది. పారామిలిటరీ ర్యాపిడ్ ఫోర్స్‌ను ఆర్మీలో విలీనం చేయాలనే ప్రతిపాదన.. ఈ రెండు వర్గాల నడుమ ఘర్షణలకు దారి తీసింది. సూడాన్ రాజధాని ఖార్తోమ్తో పాటు దేశంలో పలు చోట్ల ఈ ఘర్షణలు కొనసాగుతుండగా.. సాధారణ పౌరులు ఇబ్బంది పడుతున్నారు. ఘర్షణలు మొదలైన ఏప్రిల్ 15 నుంచి ఇప్పటివరకు (మే1) లక్ష మందికిపైగా పౌరులు సూడాన్‌ను వీడినట్లు ఐక్యరాజ్య సమితి వెల్లడించింది. మరో 3.30 లక్షల మంది నిరాశ్రయులయ్యారని తెలిపింది. మరోవైపు, ఈ హింసాత్మక ఘర్షణల్లో ఇప్పటివరకు 500 మందికిపైగా మృతిచెందగా.. నాలుగు వేల మందికి పైగా గాయపడ్డారు. చదవండి👉 ‘ఆఫీస్‌కి వస్తారా.. లేదంటే!’, వర్క్ ప్రమ్ హోం ఉద్యోగులకు దిగ్గజ టెక్ కంపెనీల వార్నింగ్ -
వావ్ అదిరిపోయే జాబ్ నోటిఫికేషన్.. రుచి చూస్తే చాలు నెలకు రూ.6 లక్షలు!
చదివిన చదువుకు నచ్చిన ఉద్యోగం పొందేందుకు యువత అహర్నిశలు శ్రమిస్తుంటారు. అనుకున్నది సాధిస్తారు. అదే సమయంలో కొన్ని కంపెనీలు తమకు కావాల్సిన ఉద్యోగి కోసం అంతే శ్రమ పడుతుంటాయి. ఒక్కోసారి కొన్ని ఉద్యోగాలు భలే తమాషాగా ఉంటాయి. వీటికి కూడా జీతం ఇస్తారా అనిపిస్తుంటుంది. తాజాగా అమెరికాకు చెందిన ఓ సంస్థ అలాంటి జాబ్ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఇంతకీ ఆ జాబ్ ఏంటో తెలుసా? ఆఫీస్‌లో కూర్చొని తినడమే. పైగా భారీ ఎత్తున శాలరీ పే చేసేందుకు సిద్ధమైంది. ఆ..ఏంటీ..తినేందుకు జాబ్.. పైగా అందుకు కళ్లు చెదిరిపోయే శాలరీ ఇస్తారా అని ఆశ్చర్యపోకండి. వివరాల్లోకి వెళితే..ఉత్తర అమెరికాలో అతిపెద్ద ఆన్లైన్ క్యాండీ రిటైలర్ కంపెనీ తమ సంస్థకి చీఫ్ కాండీ ఆఫీసర్ పోస్ట్ కోసం ఉద్యోగి కావాలని నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ ఉద్యోగానికి ఎంపికైన వారు ఈ కంపెనీలో తయారయ్యే చాక్లెట్‌ను రుచి చూసి రేటింగ్ ఇస్తే చాలు. ఇందుకు అర్హతగా ఐదేళ్లు నిండిన వారెవరైనా ఈ ఉద్యోగానికి దరఖాస్తూ చేసుకోవచ్చని తెలిపింది. ఎంపిక కాబడిన వారికి ఏడాదికి రూ. 1లక్ష డాలర్లు జీతం ఇస్తామని తెలిపింది. -
ఎంత క్యూట్‌గా రిక్వెస్ట్ చేశాడో..!
చిన్న పిల్లలతో విమానయానం చేసే వారి కష్టాలు చూడాలి. పాపం అనిపిస్తుంది. మాటలు రాని వయసులో ఆకలి, బాధ వంటి వాటిని ఏడుపు ద్వారానే తెలియజేస్తారు చిన్నారులు. కానీ అర్థం చేసుకోలేని వారు ఏంటీ గోళ అని విసుక్కుంటారు. అంతటితో ఊరుకోక ప్రయాణం మధ్యలోనే దించేస్తారు. ఈ మధ్యకాలంలో ఇలాంటి వార్తలను చాలానే చూశాం. వీటి గురించి ‘లోకం తెలయని పిల్లలు.. కాస్తా ఓపిక పడితే ఏం పోతుంద’ని కొందరు.. ‘పిల్లలు ఏడుస్తూంటే ఇబ్బందిగా ఉండదా’ అని మరి కొందరు వాదించారు కూడా. ఏం చేస్తాం రెండు నిజమే. అయితే ఈ సమస్యను కాస్తా సృజనాత్మకంగా పరిష్కరించింది ఓ తల్లి. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన స్టోరి సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. ఓ మహిళ తన నాలుగు నెలల పసికందుతో కలిసి అమెరికా వెళ్తుంది. ఈ నేపథ్యంలో తన చిన్నారి వల్ల కలిగే ఇబ్బందిని పెద్ద మనసుతో అర్థం చేసుకోండంటూ కోరుతూ.. క్యాండీస్,ఇయర్‌ప్లగ్స్ ఉన్న ప్యాకెట్‌ను తోటి ప్రయాణికులకు పంచింది. ఇలా విమానంలోని దాదాపు 200 మంది ప్రయాణికులకు ఈ బ్యాగ్స్‌ను అందజేసింది. గిఫ్ట్ ప్యాక్‌ల కంటే కూడా వాటి మీద ఉన్న స్టోరి ప్రయాణికులకు తెగ నచ్చింది. గిఫ్ట్ ప్యాక్ మీద ‘హలో.. నా పేను జున్వూ.. నా వయసు నాలుగు నెలలు. ఈ రోజు నేను మా అమ్మ, నానమ్మతో కలిసి మా ఆంటీని చూడ్డానికి అమెరికా వెళ్తున్నాను. ఇదే నా తొలి విమానయానం. అందువల్ల కాస్తా నెర్వస్‌గా, భయంగా ఫీలవుతున్నాను. సో నాకేమన్నా ఇబ్బందిగా అనిపించినప్పడు ఏడుస్తాను.. బాగా గొడవ చేస్తాను. వెంటనే ఏడుపు ఆపేస్తానని మీకు ప్రామిస్ చేయలేను. ముందు జాగ్రత్తగా మా అమ్మ ఈ గిఫ్ట్ ప్యాక్‌లను మీకు ఇస్తుందన్నమాట. నేను బాగా గొడవ చేసినప్పుడు మీకిచ్చిన ప్యాకెట్లో ఉన్న ఇయర్ప్లగ్స్ను వాడండే. మీ ప్రయాణం సంతోషంగా సాగాలని కోరుకుంటూ చిన్నారి జున్వూ’ అని ఉంది. ఈ స్టోరిని ఫేస్బుక్లో షేర్ చేసిన డేవ్ కరోనా ఆ 200 మంది ప్రయాణికుల్లోఒకరు ఉన్నారు. ఈ తల్లి ప్రయత్నం నా హృదయాన్ని హత్తుకుందన్నారు కరోనా. అంతేకాక గిఫ్ట్ ప్యాక్‌ల మాట ఏమో కానీ.. జున్వూ రిక్వెస్ట్ మాత్రం ప్రయాణికులకు తెగ నచ్చేసిందని తెలిపారు. సోషల్ మీడియాలో తెగ వైరలవుతోన్న ఈ స్టోరి నెటిజన్ల హృదయాలను గెలుచుకుంది. ప్రస్తుతం జున్వూ సోషల్ మీడియాలో చిన్న సైజు హీరో అయ్యాడు. ‘చాలా మంచి ప్రయత్నం’.. ‘విమానంలో ప్రయాణించే వారు చిన్నారుల పట్ల కాస్త దయగా వ్యవహరిస్తే బాగుంటుందం’టూ కామెంట్ చేస్తున్నారు నెటిజన్లు. -
పత్తి@రూ.5,425
► నిర్మల్ మార్కెట్లో రికార్డు ధర ►ఈ సీజన్ లో అదే అత్యధికం! ► క్యాండీ, సీడ్ ధరలు అమాంతం పెరగడంతోనే.. ► అన్నదాతల్లో ఆనందం సాక్షి, నిర్మల్ : ఈ ఏడాది పత్తి కొనుగోలు సీజన్ లో నిర్మల్ మార్కెట్లో రికార్డు ధర నమోదైంది. శనివారం ఈ మార్కెట్లో క్వింటాల్ పత్తికి రూ.5,425 ధర పలికింది. వారం రోజుల కిందటి వరకు రూ.5,100 నుంచి రూ.5,200 పలుకగా రెండు రోజులుగా రూ.5,400 పైబడి వెచ్చించి ట్రేడర్స్ కొనుగోలు చేస్తుండడం గమనార్హం. భైంసా మార్కెట్లో శనివారం రూ.5,400 పలికింది. అంతర్జాతీయ మార్కెట్లో క్యాండీ(365 కిలోల దూది ఘటాన్ ), కాటన్ సీడ్ రేటు భారీగా పెరుగడంతోనే మార్కెట్లో పత్తి ధరలు పెరుగుతున్నాయని మార్కెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. రైతుల నుంచి చేజారిన తరువాత.. నిర్మల్ జిల్లా మార్కెట్లో పత్తి కొనుగోలు అధికారికంగా గతేడాది నవంబర్ 1వ తేదీన ప్రారంభమైనప్పటికీ అనధికారికంగా అక్టోబర్ నెలలో మధ్య నుంచే కొనుగోలు ప్రారంభమయ్యాయి. పత్తికి ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధర క్వింటాలుకు రూ.4,160 కాగా, భైంసా మార్కెట్లో ప్రారంభ ధర క్వింటాలుకు రూ.4,725 ఇచ్చారు. ఖరీఫ్ కొనుగోలు ప్రారంభమైనప్పటీ నుంచి ధర పడిపోవడం మాటేమో కానీ పైపెచ్చు ధర పెరుగుతూనే వచ్చింది. ప్రభుత్వ రంగ సంస్థ సీసీఐ కనీస మద్దతు ధరతోనే కొనుగోలు చేయాల్సి రావడంతో మార్కెట్ ధరకు వాణిజ్య కొనుగోలుకు ముందుకు రాలేదు. ఈ నేపథ్యంలో మొదటి నుంచి మార్కెట్లో ప్రైవేట్ వ్యాపారులే పత్తి కొనుగోలు చేస్తున్నారు. ఖరీఫ్‌లో 51 వేల 657 హెక్టార్లలో పత్తి సాగు కాగా 7 లక్షల 74 వేల 855 క్వింటాళ్లు దిగుబడి వస్తుందని అంచనా వేశారు. కాగా, ఇప్పటి వరకు మార్కెట్లో 4 లక్షల 50 వేల క్వింటాల పత్తి అమ్మకాలు జరిగినట్లు తెలుస్తోంది. ఈ లెక్కన రైతు చేతి నుంచి అత్యధికంగా పత్తి చేజారిపోయింది. ప్రస్తుత పరిస్థితుల్లో వారం రోజుల నుంచి పత్తి ధర సుమారు రూ.200 పైబడి పెరిగింది. పత్తిని అమ్ముకున్న రైతులకు ఇది నష్టం చేకూరుస్తుండగా, ఇంకా చేతిలో పత్తి ఉన్న రైతు మాత్రం ఇప్పుడే పత్తిని అమ్మేందుకు ముందుకు రావడం లేదు. మరింత ధర పెరుగుతుందని పత్తిని నిల్వ ఉంచుతున్నారు. పెరిగిన ధర మాత్రం వ్యాపారులకు ప్రయోజనం చేకూరుస్తుంది. పత్తిని కొనుగోలు చేసిన తరువాత జిన్నింగ్ అండ్ ప్రెస్సింగ్ చేస్తారు. జిన్నింగ్ చేసినప్పుడు పత్తి నుంచి గింజలు వేరై పక్కకు చేరుతాయి. ఆ తరువాత గింజ నుంచి వేరు చేసిన పత్తిని దూది అంటారు. దూదిని ప్రెస్సింగ్ చేయ డం ద్వారా బెల్, క్యాండీలుగా(దూది ఘటాన్లు) తయారు చేసి జాతీయం, అంతర్జాతీయంగా ఎగుమతి చేస్తారు. ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లో ఇటు క్యాండీ అటూ పత్తి గింజలు (సీడ్) ధరలు అమాంతం పెరగడంతో వ్యాపారులకు రెండు వి«ధాలుగా ప్రయోజనం చేకూరుతుంది. క్యాండీ : రూ.42 వేలు దేశీయ మార్కెట్లో ప్రస్తుతం క్యాండీ రేటు రూ.40 వేల నుంచి రూ.42వేలు పలుకుతున్నట్లు మార్కెట్ మిర్రర్ తెలియజేస్తోంది. పత్తి సీజన్ మొదట్లో రూ.37 వేలు క్యాండీ ధర పలుకగా ఇప్పుడు భారీగా పెరిగింది. అదే సమయంలో పత్తి గింజల ద్వారా 100 కిలోలకు రూ.2,450 నుంచి రూ.2,750 వరకు పలుకుతున్నట్లు తెలుపుతుంది. ఈ నేపథ్యంలో మార్కెట్లో పత్తి ధర ఇంకా పెరిగే అవకాశాలు విశ్లేషకుల ద్వారా తెలుస్తోంది. ఉత్తర భారతదేశంలో పత్తి ధర ప్రస్తుతం రూ.5,200 నుంచి రూ.5,750 పలుకుతుంది. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌లలో రూ.4,900 నుంచి రూ.5,500 వరకు, కర్ణాటకలో రూ.5,800 వరకు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో రూ.5,000 నుంచి రూ.5,900 వరకు పలుకుతున్నట్లు మిర్రర్ స్పష్టం చేస్తోంది. -
స్వీట్లకే మాటలొస్తే..!
ఫెస్టివల్ ఫీస్ట్ మిఠాయిలే పంచ్ డైలాగులు చెబితే! తమ స్వభావాన్ని విడమరచుకుంటూ ఉంటే!! మన తెలుగు హీరోల్లాగే అవీ సొంత డబ్బా కొట్టుకుంటూ ఉంటే!!! ఆ స్వీట్ల తీరుని బట్టి వాటి డైలాగుల హోరిది. ఫ్రూట్ పంచ్లాగే స్వీట్ ‘ఫన్’చ్లివి... సున్నుండ : ఎవ్వర్ని తింటే గబుక్కున నోరు తెరచి మాట్లాడటం చేత కాదో... వాడే రా ఉండ... సున్నుండ. కొబ్బరిలడ్డు: తురిమేసిన నన్ను నమిలేయాలని చూడకు. నేను గానీ నాలుకెక్కి తరమడం మొదలుపెడితే... మిగతా రుచులు తెలియడానికి ఎన్ని గంటలు పడుతుందో నాకే తెలియదు. పూతరేకు : ఒక్క కొరుకుతో ఎలాగోలా కంప్లీటవ్వడానికి నేను పంటికిందికి రాలేదు... పన్ను దిగుతూ ఉన్న కొద్దీ తెలుస్తుందిరా ఫన్నూ. పొంగల్ : ఎప్పుడొచ్చామని కాదన్నయ్యా. పండగకు మన పేరు పెట్టారా లేదా! విలన్: ‘‘ఎవడ్రానువ్వు?’’ సేమ్యాపాయసం: ‘‘పాయసమ్... ఒక్క నిమిషం టైమిస్తే వేగిపోతా... రెండు నిమిషాల్లో పాకం గిన్నెలో పడిపోతా. మూడో నిమిషానికి చెంచాలోంచి, నోట్లోకి స్మూత్‌గా దిగిపోతా. నాలాంటివాడితో ఇంతసేపు స్పెండ్ చేస్తే గిన్నెలో మిగలను కూడా మిగలను. నాలాంటివాడు ఎదురైతే ఎంత త్వరగా తినేయాలో అని చూడాల్రా. ఇంతసేపు టైమిస్తే చల్లబడి రుచితప్పుతా’’ కాజూ కట్లీ : ఎవరు కనబడితే ఠక్కున కొరికేస్తారో, ఎవరు చేతికొస్తే ఇతరులతో షేర్ చేసుకోడానికి వెనకాడతారో, ఎవ్వర్ని రుచిచూస్తే మళ్లీ మళ్లీ తినాలనిపిస్తుందో... అదేనమ్మా... కాజూ కట్లీ! కజ్జికాయ: ఇష్టమైతే తిను కష్టమైతే మానేయ్. అంతేగానీ కొబ్బరికోరు మాత్రం తిని, పూరీ పోర్షన్ వదిలెయ్యకు అత్తా. వదిలేయకు. బూందీలడ్డూ : దీనిక్కొంచెం టేస్టుంది. దాంతో మహా ఫీస్టుంది. జాంగ్రీ : ఒక్కొక్కసారి కాదు టేస్ట్బడ్! వంద సార్లు తిను. వంద మార్లు రుచి చూడు. ఒక్కసారైనా నా రుచిని నువ్వు నెమరేసుకోకపోతే నేను ‘శత అంచు రౌండ్ల’ వంశానికి చెందిన మిఠాయినే కాదు. - యాసీన్ బొమ్మలు: అన్వర్