చిన్న పిల్లలతో విమానయానం చేసే వారి కష్టాలు చూడాలి. పాపం అనిపిస్తుంది. మాటలు రాని వయసులో ఆకలి, బాధ వంటి వాటిని ఏడుపు ద్వారానే తెలియజేస్తారు చిన్నారులు. కానీ అర్థం చేసుకోలేని వారు ఏంటీ గోళ అని విసుక్కుంటారు. అంతటితో ఊరుకోక ప్రయాణం మధ్యలోనే దించేస్తారు. ఈ మధ్యకాలంలో ఇలాంటి వార్తలను చాలానే చూశాం. వీటి గురించి ‘లోకం తెలయని పిల్లలు.. కాస్తా ఓపిక పడితే ఏం పోతుంద’ని కొందరు.. ‘పిల్లలు ఏడుస్తూంటే ఇబ్బందిగా ఉండదా’ అని మరి కొందరు వాదించారు కూడా. ఏం చేస్తాం రెండు నిజమే. అయితే ఈ సమస్యను కాస్తా సృజనాత్మకంగా పరిష్కరించింది ఓ తల్లి. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన స్టోరి సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది.
ఓ మహిళ తన నాలుగు నెలల పసికందుతో కలిసి అమెరికా వెళ్తుంది. ఈ నేపథ్యంలో తన చిన్నారి వల్ల కలిగే ఇబ్బందిని పెద్ద మనసుతో అర్థం చేసుకోండంటూ కోరుతూ.. క్యాండీస్,ఇయర్‌ప్లగ్స్ ఉన్న ప్యాకెట్‌ను తోటి ప్రయాణికులకు పంచింది. ఇలా విమానంలోని దాదాపు 200 మంది ప్రయాణికులకు ఈ బ్యాగ్స్‌ను అందజేసింది. గిఫ్ట్ ప్యాక్‌ల కంటే కూడా వాటి మీద ఉన్న స్టోరి ప్రయాణికులకు తెగ నచ్చింది.
గిఫ్ట్ ప్యాక్ మీద ‘హలో.. నా పేను జున్వూ.. నా వయసు నాలుగు నెలలు. ఈ రోజు నేను మా అమ్మ, నానమ్మతో కలిసి మా ఆంటీని చూడ్డానికి అమెరికా వెళ్తున్నాను. ఇదే నా తొలి విమానయానం. అందువల్ల కాస్తా నెర్వస్‌గా, భయంగా ఫీలవుతున్నాను. సో నాకేమన్నా ఇబ్బందిగా అనిపించినప్పడు ఏడుస్తాను.. బాగా గొడవ చేస్తాను. వెంటనే ఏడుపు ఆపేస్తానని మీకు ప్రామిస్ చేయలేను. ముందు జాగ్రత్తగా మా అమ్మ ఈ గిఫ్ట్ ప్యాక్‌లను మీకు ఇస్తుందన్నమాట. నేను బాగా గొడవ చేసినప్పుడు మీకిచ్చిన ప్యాకెట్‌లో ఉన్న ఇయర్‌ప్లగ్స్‌ను వాడండే. మీ ప్రయాణం సంతోషంగా సాగాలని కోరుకుంటూ చిన్నారి జున్వూ’ అని ఉంది.
ఈ స్టోరిని ఫేస్‌బుక్‌లో షేర్ చేసిన డేవ్ కరోనా ఆ 200 మంది ప్రయాణికుల్లోఒకరు ఉన్నారు. ఈ తల్లి ప్రయత్నం నా హృదయాన్ని హత్తుకుందన్నారు కరోనా. అంతేకాక గిఫ్ట్ ప్యాక్‌ల మాట ఏమో కానీ.. జున్వూ రిక్వెస్ట్ మాత్రం ప్రయాణికులకు తెగ నచ్చేసిందని తెలిపారు. సోషల్ మీడియాలో తెగ వైరలవుతోన్న ఈ స్టోరి నెటిజన్ల హృదయాలను గెలుచుకుంది. ప్రస్తుతం జున్వూ సోషల్ మీడియాలో చిన్న సైజు హీరో అయ్యాడు. ‘చాలా మంచి ప్రయత్నం’.. ‘విమానంలో ప్రయాణించే వారు చిన్నారుల పట్ల కాస్త దయగా వ్యవహరిస్తే బాగుంటుందం’టూ కామెంట్ చేస్తున్నారు నెటిజన్లు.
Comments
Please login to add a commentAdd a comment