చెన్నై: చిన్నా పెద్ద తేడా లేకుండా అందరూ ఎంతగానో ఇష్టపడే కాటన్ క్యాండీ(పీచు మిఠాయిల)పై తమిళనాడు ప్రభుత్వం నిషేదం విధించింది. ఈ విషయాన్ని ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సుబ్రమణియన్ వెల్లడించారు. వీటిల్లో క్యాన్సర్ కారక రసాయనాలున్నందునే నిషేదం విధించినట్లు తెలిపారు.
రాజధాని నగరం చెన్నై వ్యాప్తంగా ఇటీవల ఫుడ్‌సేఫ్టీ అధికారులు పీచు మిఠాయిల నమూనాలను సేకరించారు. వీటిని పరిశీలించగా కాటన్ క్యాండీల్లో రోడమైన్-బి అనే రసాయనం ఉన్నట్లు గుర్తించారు. కృత్రిమ రంగుల కోసం దీన్ని పీచు మిఠాయిల్లో వినియోగించినట్లు తేలింది.
రోడమైన్-బిని ఇండస్ట్రియల్ డైగా పిలుస్తారు. దుస్తుల కలరింగ్, పేపర్ ప్రింటింగ్‌లో ఎక్కువగా వినియోగిస్తారు. ఆహారంలో రంగు కోసం దీన్ని వాడరు. దీనివల్ల దీర్ఘకాలంలో ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశముందని అధికారులు తెలిపారు. ఇది ఎక్కువ మొత్తంలో శరీరంలోకి వెళ్తే కిడ్నీ, లివర్ పనితీరుపై ప్రభావం చూపిస్తుందని, క్యాన్సర్‌కు కూడా దారితీసే ప్రమాదముందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment