మిఠాయిలను ఇష్టపడనివారు ఎవరూ ఉండరు. స్వీట్స్‌ను చూడగానే పిల్లల నుంచి పెద్దల వరకూ అందరికీ నోరూరుతుంది. మరి ఇలాంటి మిఠాయిల గొప్పదనాన్ని గుర్తు చేసుకునేందుకు ఒక రోజు ఉందని మీకు తెలుసా? ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
ప్రతి సంవత్సరం నవంబర్ 4న జాతీయ మిఠాయి దినోత్సవం జరుపుకుంటారు. ఇది తీపిని ఇష్టపడేవారు తియ్యని వేడుక చేసుకునే రోజు. ఈ రోజు ఉద్దేశ్యం స్వీట్లను ఆస్వాదిస్తూ, చిన్ననాటి జ్ఞాపకాలను నెమరు వేసుకుంటూ, తీపి పదార్థాలపై మనకున్న ప్రేమను వ్యక్తపరడచడం. ఈ రోజున వివిధ రకాల క్యాండీలను రుచి చూడటమే కాకుండా కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలసి వేడుక చేసుకుంటుంటారు.
మిఠాయి కథ భారతదేశంలోనే మొదలయ్యింది. ప్రాచీన భారతీయులు చెరకు రసాన్ని ఉడికించి, అచ్చులుగా పోసేవారు. వీటిని ముక్కలుగా చేసి దానిని ‘ఖండ’ అని పిలిచేవారు. దీనినే చరిత్రకారులు తొలి మిఠాయిగా అభివర్ణించారు. పురాతన చైనా, మధ్యప్రాచ్యం, ఈజిప్ట్, గ్రీస్, రోమ్‌లలో తేనెతో మిఠాయిలు తయారు చేసేవారు. పారిశ్రామిక విప్లవానికి ముందు మిఠాయిని జీర్ణవ్యవస్థను మెరుగుపరడచానికి, గొంతు సమస్యల నుంచి ఉపశమనం కలిగించడానికి ఔషధంగా ఉపయోగించేవారు.
18వ శతాబ్దంలో క్యాండీ.. ఫ్రాన్స్ బ్రిటన్ నుంచి అమెరికాకు వచ్చింది. వంటలలో నైపుణ్యం కలిగినవారు చక్కెరతో మిఠాయిలు చేసేవారు. 1830వ దశకంలో పారిశ్రామిక విప్లవం కొనసాగుతున్న సమయంలో మిఠాయి సంపన్నులకే కాకుండా అందరికీ అందుబాటులోకి వచ్చింది. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా వివిధ రకాల క్యాండీలు అందుబాటులో ఉన్నాయి. మనదేశంలో చాలామంది ఏదైనా మంచి పనిని ప్రారంభించే ముందు మిఠాయి తింటుంటారు. ఇలా చేయడం వలన తాము అనుకున్న పనులు సఫలమవుతాయని భావిస్తుంటారు.
ఇది కూడా చదవండి: 2025.. ప్రపంచం అంతానికి ఆరంభం: బాబా వంగా కాలజ్ఞానం
Comments
Please login to add a commentAdd a comment