కాటన్ క్యాండీలు, గోబీ మంచూరియా ఫుడ్ కలరింగ్ ఏజెంట్లపై నిషేధం
నేరం రుజువైతే ఏడేళ్ల జైలు, రూ. 10 లక్షల జరిమానా
కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.అనేక ఆనారోగ్య సమస్యల కారణంగా కాటన్ క్యాండీలు, గోబీ మంచూరియన్‌లో వాడే ఫుడ్ కలరింగ్ ఏజెంట్లపై నిషేధం విధించింది. ఈ మేరకు కర్ణాటక ఆరోగ్య శాఖ మంత్రి దినేష్ గుండూరావు ఉత్తర్వులు జారీ చేశారు. గోబీ మంచూరియా, కాటన్ క్యాండీ శాంపిల్స్‌లో హానికరమైన రసాయనాలను వాడినట్లు గుర్తించడంతో ఈ ఉత్తర్వులు జారీ అయ్యాయి. అయితే గోబీ మంచూరియా, కాటన్ క్యాండీ విక్రయాలను పూర్తిగా నిషేధించే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. దీంతో ఫుడ్ కలరింగ్ ఏజెంట్లపై కొరడా ఝళిపించిన రాష్ట్రాల జాబితాలో తాజాగా కర్ణాటక చేరింది.
రోడమైన్-బి , కార్మోయిసిన్ వంటి కలరింగ్ ఏజెంట్ల వాడకం హానికరమైందని తెలిపింది. కృత్రిమ రంగులను ఉపయోగించి తయారు చేసే ఆహార పదార్థాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఈ మేరకు మంత్రి దినేష్ గుండూరావు ప్రకటించారు. హానికరమైన కలర్స్‌ను ఉపయోగిస్తున్నట్లు తేలితే, ఆహార భద్రతా చట్టం కింద వారిపై కఠిన చర్యలు తీసు కుంటామని ఆయన హెచ్చరించారు. నేరం రుజువైతే కనీసం ఏడేళ్ల జైలు శిక్ష, రూ.10 లక్షల జరిమానా విధించేలా ఉత్తర్వులు జారీ చేశారు.
రాష్ట్రవ్యాప్తంగా సేకరించిన 171 నమూనాలలో 107 టార్ట్రాజైన్, సన్‌సెట్ ఎల్లో, రోడమైన్-బీ, కార్మోయిసిన్ లాంటి హానికర రసాయనాలను ఉపయోగించి తయారు చేసినట్లు అధికారులు గర్తించారు. 64 సురక్షితంగా ఉన్నట్టు తేలింది. అలాగే 25 కాటన్ క్యాండీ నమూనాలను సేకరించగా, వాటిలో 10 సురక్షితమైనవిగానూ, 15 హానికరమైనవిగా తేలాయి.
Comments
Please login to add a commentAdd a comment