పుట్టినరోజు, పెళ్లి రోజు, నూతన సంవత్సరం, ఇలా వేడుక ఏదైనా కేక్ ఉండాల్సిందే. ఖరీదైనా సరే.. రెడ్ వెల్వెట్, బ్లాక్ ఫారెస్ట్ కేక్స్ ఉంటే ఇక ఆ సందర్భానికి మరింత జోష్. వీటిని అంటే అంతలా ఇష్టపడతారు. కానీ వీటిని ఆకర్షణీయంగా తయారు చేసేందుకు వాడే రంగులు కేన్సర్ కారకమవుతున్నాయని కర్ణాటక ఫుడ్ సేఫ్టీ అండ్ క్వాలిటీ డిపార్ట్‌మెంట్ షాకింగ్ న్యూస్ చెప్పింది. ఈ రెండు రకాలతోపాటు మరో 12 పాపులర్ కేక్స్ తయారీకి వాడే రంగులతో జాగ్రత్త అని హెచ్చరించింది.
అందం, ఆకర్షణ కోసం వంటకాల్లో రంగులు వాడటం కొత్త కాదు కానీ.. వీటిల్లో కొన్ని మరీ ముఖ్యంగా కృత్రిమంగా తయారు చేసిన రంగులు కేన్సర్‌ను కలుగజేస్తాయని శాస్త్రవేత్తలు చాలాకాలంగా హెచ్చరిస్తూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో కర్ణాటక ఫుడ్ సేఫ్టీ అండ్ క్వాలిటీ విభాగం బెంగళూరులోని బేకరీల్లోని కేక్స్‌పై పరీక్షలు నిర్వహించింది. అల్లురా రెడ్, సన్‌సెట్ ఎల్లో ఎఫ్‌సిఎఫ్, పోన్సో 4ఆర్, టార్ట్రాజైన్ ,కార్మోయిసిన్ వంటి హానికరమైన కృత్రిమ రంగుల వీటి తయారీకి వాడుతున్నట్లు గుర్తించింది. ఇవన్నీ కేన్సర్ ముప్పును పెంచేవేనని స్పష్టం చేసింది. శారీరక, మానసిక ఆరోగ్య సమస్యలకూ ఈ కృత్రిమ రంగులు కారణమవుతాయని తెలిపింది.
ఈ ఫలితాల దృష్ట్యా, కర్ణాటక ఆహార భద్రత, నాణ్యత విభాగం ఆహార భద్రతా నిబంధనలను పాటించాలని, వినియోగ యోగ్యమైన పదార్థాలనే ఉత్పత్తుల తయారీలో ఉపయోగించాలని బేకరీలను కోరింది. వినియోగదారులు కూడా కొనుగోలు చేసేటప్పుడు జాగ్రత్త వహించాలని సూచించింది. (శతాబ్దాల శాప భయం : చీర సింగారించుకుని మరీ పురుషుల గర్భా నృత్యం)
గోబీ మంచూరియా, కబాబ్‌లు, పానీ పూరీ లాంటి వాటిల్లోనూ కేన్సర్ కారక కృత్రిమ రంగులు వాడినట్లు కర్ణాటక ప్రభుత్వం గతంలోనే గుర్తించింది. అంతేకాకుండా.. రోడమైన్-బి లాంటి రంగులపై నిషేధం విధించింది కూడా. ఇలాంటి కృత్రిమ రంగుల వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది కూడా.
Comments
Please login to add a commentAdd a comment