వహ్వా రసం పూరి.. తింటారా మైమరచి! | Have you tasted Udupi Rasam Puri video goesl viral | Sakshi
Sakshi News home page

వహ్వా రసం పూరి.. తింటారా మైమరచి!

Sep 3 2024 12:37 PM | Updated on Sep 3 2024 2:52 PM

Have you tasted Udupi Rasam Puri video goesl viral

మీరెప్పుడైనా పానీ పూరి తిన్నారా? 
వాటిల్లో రకరకాల ఫ్లేవర్స్‌ రుచి చూశారా?
తినే ఉంటారు! మరి.. రసం పూరి?

దీన్ని తినాలంటే మాత్రం మీరు... కర్ణాటక రాష్ట్రంలోని ఉడుపికి వెళ్లాల్సిందే! ఎందుకంటే అక్కడి ‘విప్ర’ ఛాట్‌ హోమ్‌కు వెళ్లాల్సిందే! జూనియర్‌ ఎన్టీఆర్‌, కాంతార హీరో రిషభ్‌ శెట్టిలు ఇటీవల దర్శించుకున్న ప్రఖ్యాత  శ్రీకృష్ణ దేవాలయం మాత్రమే కాకుండా.. ఉడుపి టమోటా రసంకు చాలా ప్రసిద్ధి. శ్రీకృష్ణ మఠం నిత్యాన్నదాన కార్యక్రమంలో ఈ వంటకం ఓ స్పెషల్‌ అట్రాక‌్షన్‌. దీని రుచి, పరిమళం వేరే లెవల్‌ అని అంటారు అభిమానులు. 

ఇంతలా చాలామంది అభిమానం చూరగొన్న వంటకానికి మరింత ప్రచారం కల్పించాలని అనుకున్నారో ఏమో తెలియదు కానీ.. ‘విప్ర’ ఛాట్‌ హోమ్‌ వారు సాధారణ పానీ పూరి స్థానంలో రసం పూరిని ప్రవేశపెట్టారు. ఉడుపి రసంను పూరీల్లో పోసి ఇస్తారన్నమాట! ఈ సారి మీరేమైనా ఉడుపి వెళితే ఒకసారి ట్రై చేసి చూడండి మరి! మధుకర్‌ ఆర్‌. మయ్యా అనే వ్యక్తి ఎక్స్‌ వేదికగా ఈ సరికొత్త ఛాట్‌ వీడియో ఒకటి పోస్ట్‌ చేశారు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement