రెస్టారెంట్లలోనూ, హోటల్స్‌లోనూ ఆహారం ఆకర్షణీయంగా ఫుడ్ కలర్స్ ఉపయోగిస్తుంటారు. మనం కూడా అలా కనిపిస్తే ఆవురావురామంటూ తినేస్తాం. కానీ దీని వల్ల పలు ఆరోగ్య సమస్యలు వస్తున్నాయంటూ వాటిపై నిషేధం విధించారు అధికారులు. ఒకవేళ ఈ నిబంధనలు ఉల్లంఘిస్తే ఏకంగా ఏడేళ్లు దాక జైలు శిక్ష పడుతుందట. ఈ నిషేధం ఎక్కడంటే..
శాకాహారం దగ్గర నుంచి నాన్‌వెజ్‌లలో చికెన్, ఫిష్ కబాబ్స్‌లపై కృత్రిమ రంగులు వాడుతుంటారు. తినేవాడికి నోరూరించేలా ఆకర్షణీయంగా కనిపించడం కోసం ఇలా చేస్తుంటారు. ముఖ్యంగా కబాబ్స్‌ల వంటి వాటికి ఎక్కువగా కృత్రిమ రంగులు వినయోగిస్తున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే కర్ణాట ప్రభుత్వం సోమవారం ఈ నిషేధం విధించింది. ఇది ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతోందని పేర్కొంది.
ఈ కృత్రిమ రంగులు శరీరానికి హానికరమని, ప్రతికూల ఆరోగ్య ప్రభావాలను కలిగిస్తాయని చెబుతోంది. ఈ విషయమై కర్ణాటక ఆహార భద్రత ప్రమాణాల విభాగానికి వివిధ ఫిర్యాదులు అందాయి. దీంతో కృత్రిమ రంగులను ఉపయోగించే 39 తినుబండరాల నమునాలను పరీక్షించగా వాటిలో సుమారు ఎనిమిది కృత్రిమ రంగుల ఉపయోగిస్తున్నారని,అవి సురక్షితం కాదని తేలింది.
ఈ నేపథ్యంలోనే కర్ణాటక రాష్ట్ర ఆరోగ్య మంత్రి దినేష్ గుండూరావు కృత్రిమ రంగులను ఉపయోగించే తినుబండారాలను బ్యాన్ చేస్తున్నట్లు ప్రకటించారు. అంతేగాదు ఈ విషయాన్ని సోషల్ మీడియా ఎక్స్ వేదికగా వెల్లడించడమే గాక ఈ నిబంధనలను ఉల్లంఘించిన ఆహార విక్రేతలపై పది లక్షల జరిమానా, ఏడేళ్లు జైలు శిక్షతో సహా పలు తీవ్రమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు.
(చదవండి: 90 ఏళ్ల వృద్దుడికి అరుదైన వ్యాధి..కడుపు ఛాతిలోకి చొచ్చుకుపోయి..)
Comments
Please login to add a commentAdd a comment