ఆహారప్రియులకు దోస అంటే ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. దోసల్లో ఎన్నో రకాల వెరైటీలు చూసుంటారు. ఇటీవల పాకశాస్త్ర నిపుణులు కూడా తమ నైపుణ్యం అంతా వెలికి తీసి మరీ డిఫరెంట్ రుచులతో ఈ దోసలను అందిస్తున్నారు. అయితే ఇలాంటి దోస గురించి తెలిసే ఛాన్సే లేదు ఎందుకంటే..ఇది కర్ణాటకలోనే ఫేమస్. అంతేగాదు ఈ దోసకు ఎంతో చారిత్రక నేపథ్యం కూడా ఉంది. అదెంటో చూద్దామా..!.
ఈ దోసను కూడా మనం తినే సాధారణ దోస మాదిరిగానే తయారు చేస్తారు కాకపోతే అందులో వేసే దినుసుల్లోనే కొంచెం మార్పులు ఉంటాయి. దీన్ని తగినంత అటుకులు, మొంతులు తప్పనిసరిగా జోడించి తయారు చేస్తారు. అయితే మరి ఏంటి 'తుప్పా' అంటే..కర్ణాటకలో 'తుప్పా' అంటే నెయ్యి అందుకని దీన్ని తుప్పా దోస అని పిలుస్తారు. మనం Ghee Dosa దోస ఇమ్మని ఆర్డర్ చేస్తాం కదా అలాంటిదే కాకపోతే కొద్ది తేడా ఉంటుందంతే.
చారిత్రక నేపథ్యం..
కొంతమంది చరిత్రకారుల అభిప్రాయం ప్రకారం..ఈ తుప్పా దోస కర్ణాటకలోని ఉడిపి పట్టణంలో ఉద్భవించిందని చెబుతుంటారు. చాళుక్య రాజు సోమేశ్వరుడు- III తన మానసోల్లాస పుస్తకంలో తుప్పా దోస వంటకాన్ని దోసక అని పిలుస్తారని రాశారు. క్రీస్తు శకం నుంచి తమిళనాడు ఆహార సంస్కృతిలో ఈ దోస భాగమని ఆ పుస్తకం పేర్కొంది. ఆఖరికి తమిళనాడు సంగం సాహిత్యంలో కూడా దీని ప్రస్తావన ఉండటం విశేషం.
ఎలా చేస్తారంటే..
తయారీ విధానం..
ఇడ్లీ బియ్యం 2 కప్పులు
పోహా(అటుకులు): 1 కప్పు
ఉరద్ పప్పు: ½ కప్పు
ఉప్పు: 2 స్పూన్
మెంతులు: ½ స్పూన్
పైన చెప్పిన పదార్థాలన్నీ సుమారు 5 గంటల పాటు నానబెట్టాలి. ఆ తర్వాత మొత్తగా గ్రైండ్ చేసుకుని రాత్రంతా పులియబెట్టాలినివ్వాలి. ఆ తర్వాత దోసలుగా పెనం మీద వేసి.. బంగారు రంగు వచ్చే వరకు కాల్చాలి. అంతే తుప్పా దోస రెడీ..!. అయితే దీన్ని నెయ్యితో దోరగా కాలుస్తారు. ఇక 'చమ్మంతి పొడి' అంటే తమిళంలో కొబ్బరి పొడి అని అర్థం. మనం కొబ్బరి చట్నీతో తింటే వాళ్లు దీన్ని కొబ్బరి పొడితో ఇష్టంగా తింటారట.
(చదవండి: మనసుంటే మార్గం ఉంటుందంటే ఇదే..! వారానికి 90 గంటలు పనిచేస్తూ కూడా..)
Comments
Please login to add a commentAdd a comment