సినీ నటులకు గ్లామర్ ఎంతో ముఖ్యమో తెలిసిందే. అందుకోసం ఫుడ్ దగ్గర నుంచి ఫిట్‌నెస్ వరకు ప్రతి విషయంలోనూ పలు జాగ్రత్తలు తీసుకుంటారు. కొందరూ ప్రత్యేకంగా డైటిషన్లు, ఫిటెనెస్ శిక్షకుల సలహాలు, సూచనలు పాటిస్తారు. వాళ్ల లైఫ్‌స్టైలే చాలా డిఫెరెంట్‌గా ఉంటుంది. ఇక వాళ్లు మనలా ఇడ్లీ, దోసలాంటి బ్రేక్‌ఫాస్ట్‌ల జోలికిపోరు వెజ్ సలాడ్ లేదా ఫ్రూట్ సలాడ్స్, స్మూతీ వంటి వాటిని తీసుకుంటుంటారు. కానీ ఈ కోలీవడ్ నటుడు మాధవన్ మాత్ర మన పూర్వీకుల నాటి బ్రేక్‌ఫాస్ట్‌ని ఇష్టంగా తింటాడట. అదేంటంటే..
కేరళ రాష్ట్రమంతటా ఇష్టంగా ఆస్వాదించే 'పజంకంజి'నే మాదవ్ ఎంతో ఇష్టంగా తింటారటా. ఇదే తన అల్పాహారమని ఆయన చెబుతున్నారు. పజమ్‌కంజి అంటే మన పూర్వీకుల నాటి బ్రేక్‌ఫాస్ట్‌గా చెప్పొచ్చు. వాళ్లు పొద్దుపొద్దనే తినే రాత్రి భోజనం. తెలుగు నాట దీన్ని చద్దిన్నం అని పిలుస్తారు. కేరళలో దీన్ని 'పజంకంజి' అని పిలుస్తారు.
దీన్ని ఎలా తయారు చేస్తారంటే..రాత్రి మిగిలిపోయిన అన్నాన్ని గంజి నీటిలో పులియబెట్టి పొద్దునే కొద్దిగా పెరుగు, తగినన్ని పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు వేసుకుని తింటారు. ఇక్కడ మనం అన్నం వండగా వేరు చేసేదాన్ని గంజి అని అంటాం. దీన్నే కేరళలో కంజి అని పిలుస్తారు. ఇది శరీరానికి చలువ చేస్తుంది. చెప్పాలంటే సమ్మర్‌లో బెస్ట్ బ్రేక్‌ఫాస్ట ఇదే.
ఆరోగ్య ప్రయోజనాలు..
శరీరానికి తక్షణ శక్తిన అందిస్తుంది. ఇందులో 340 కేలరీలు ఉన్నాయి.
విటమిన్ బీ వంటి ముఖ్యమైన విటమిన్లు ఉన్నాయి.
నీరసం నుంచి త్వరితగతిన కోలుకోవడానకి ఉపయోగపడుతుంది.
అలసట, జీర్ణ సమస్యలకు సహాయపడుతుంది.
చర్మం ప్రకాశవంతంగా ఉంటుంది.
మలబద్ధకాన్ని నివారిస్తుంది.
ఈ పులియబెట్టిన గంజి అన్నాన్ని కేరళలో ఒకప్పుడూ చాలామంది ఇష్టంగా తినే వంటకంగా పేరుగాంచింది. రాను రాను దీనికి ఆదరణ కోల్పోయింది. అలాంటి పూర్వకాలం నాటి వంటకాన్ని నటుడు మాధవన్ ఇష్టంగా తింటానని చెప్పడం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది. అంతేగాదు ఇటీవల దీనిలో దాగున్న ఆరోగ్య ప్రయోజనాలను గుర్తించి పలు రెస్టారెంట్లు తమ మెనూలో దీన్ని కూడా చేర్చి సర్వ్ చేయడం ప్రారంభించాయి.
(చదవండి: రష్యన్ మోస్ట్ బ్యూటిఫుల్ బైకర్ మృతి..మరో రైడింగ్ గ్రూప్..!)
Comments
Please login to add a commentAdd a comment