వారం మెనూలో దోసె ఉండాల్సిందే... దోసె కూడా బోర్ కొట్టేస్తుంటే ఏం చేద్దాం? పక్క రాష్ట్రాల వాళ్ల వంటింట్లోకి తొంగిచూద్దాం. కేరళ వాళ్లు మనదోనెనే కొద్దిగా మార్చి ఆపం చేస్తారు. కన్నడిగులు చిరుతీయటి నీర్‌దోసె వేస్తారు.
కన్నడ నీర్ దోసె..
కావలసినవి..
బియ్యం – 2 కప్పులు;
కొబ్బరి తురుము – కప్పు;
ఉప్పు – చిటికెడు;
నూనె – టేబుల్ స్పూన్;
తయారీ..
– బియ్యాన్ని నాలుగైదు గంటల సేపు లేదా రాత్రంతా నానబెట్టాలి.
– బియ్యం, కొబ్బరి తురుము, ఉప్పు కలిపి మిక్సీలో మరీ మెత్తగా ఉండాల్సిన అవసరం లేదు, కొంచెం గరుకుగా గ్రైండ్ చేయాలి.
– పిండిలో తగినంత నీటిని కలిపి గరిటె జారుడుగా ఉండాలి.
– పెనం వేడి చేసి దోసె వేసి కొద్దిగా నూనె వేయాలి. రెండువైపులా కాల్చి వేడిగా వడ్డించాలి.
గమనిక: కన్నడ నీర్ దోసెకు పిండిని పులియబెట్టాలిన అవసరం లేదు. రాత్రి నానబెట్టి ఉదయం గ్రైండ్ చేసి వెంటనే దోసెలు వేసుకోవచ్చు. దీనికి సాంబార్, ఆవకాయ– పెరుగు కలిపిన రైతా మంచి కాంబినేషన్.
కేరళ పాలాపం..
కావలసినవి..
బియ్యం– పావు కేజీ;
పచ్చి కొబ్బరి తురుము – యాభై గ్రాములు;
చక్కెర – అర స్పూన్;
ఉప్పు – అర స్పూన్;
బేకింగ్ సోడా – చిటికెడు.
తయారీ..
– బియ్యాన్ని కడిగి మంచినీటిలో ఐదు గంటల సేపు నానబెట్టాలి.
– మిక్సీలో బియ్యం, కొబ్బరి తురుము వేసి తగినంత నీటిని చేరుస్తూ మెత్తగా గ్రైండ్ చేయాలి.
– బాణలిలో నీటిని ΄ోసి, అందులో పై మిశ్రమాన్ని ఒక కప్పు వేసి గరిటెతో కలుపుతూ మరిగించి దించేయాలి.
– మిశ్రమం చల్లారిన తర్వాత ఆపం పిండిలో వేసి కలపాలి.
– ఈ పిండిని ఎనిమిది గంటల సేపు కదిలించకుండా ఉంచాలి.
– ఉదయం ఇందులో చక్కెర, ఉప్పు, బేకింగ్ సోడా వేసి గరిటెతో కలపాలి.
– మిశ్రమం గరిటె జారుడుగా ఉండాలి.
– ఆపం పెనం వేడి చేసి ఒక గరిటె పిండి వేసి పెనం అంచులు పట్టుకుని వలయాకారంగా తిప్పితే పిండి దోశెలాగ విస్తరిస్తుంది.
– మీడియం మంట మీద కాల్చాలి. కాలే కొద్దీ అంచులు పైకి లేస్తాయి.
– అట్లకాడతో తీసి ప్లేట్‌లో పెట్టాలి. దీనిని రెండవ వైపు కాల్చాల్సిన పని లేదు, కాబట్టి తిరగేయకూడదు.
– అంచులు ఎర్రగా కరకరలాడుతూ మధ్యలో దూదిలా మెత్తగా ఉంటుంది.
– ఇందులో నూనె వేయాల్సిన పని లేదు.
– ఆపం పెనం లేక΄ోతే దోశె పెనం (ఫ్లాట్‌గా కాకుండా కొంచెం గుంటగా ఉండే పెనం) మీద ప్రయత్నించవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment