ఫ్లఫ్ఫీ పూరీ.. వెజిటబుల్‌ కాజు సాగ్‌ కాంబినేషన్‌తో.. ఆరోగ్యం! | Heathy Diet With Fluffy Puri And Vegetable Kaju Saagu Combination | Sakshi
Sakshi News home page

ఫ్లఫ్ఫీ పూరీ.. వెజిటబుల్‌ కాజు సాగ్‌ కాంబినేషన్‌తో.. ఆరోగ్యం!

Published Thu, Aug 1 2024 10:22 AM | Last Updated on Thu, Aug 1 2024 10:30 AM

Heathy Diet With Fluffy Puri And Vegetable Kaju Saagu Combination

ఫ్లఫ్ఫీ పూరీ ఇందులోకి వెజిటబుల్‌ కాజు సాగ్‌ హెల్దీ కాంబినేషన్‌. దీనిని ఎలా చేయాలో చూద్దాం.

కావలసినవి..
గోధుమపిండి– కప్పు;
నీరు– పావు కప్పు లేదా అవసరాన్ని బట్టి;
చక్కెర – పావు టీ స్పూన్‌;
నెయ్యి– 2 టీ స్పూన్‌లు;
నూనె – వేయించడానికి తగినంత.

తయారీ..
– నూనె మినహా మిగిలిన పదార్థాలన్నింటినీ ఒక పాత్రలో వేసి పూరీల పిండిని కలిపి మూత పెట్టి పది నిమిషాల సేపు పక్కన పెట్టాలి.
– ఈ పిండిని ఎనిమిది భాగలుగా చేసి పూరీలు వత్తి ఫ్లవర్‌ మౌల్డ్‌తో వత్తాలి.
– బాణలిలో నూనె వేడి చేసి పూరీలను రెండు వైపులా కాల్చి తీస్తే ఫ్లఫ్ఫీ పూరీలు రెడీ.

వెజిటబుల్‌ కాజు సాగ్‌..
కావలసినవి..
జీడిపప్పు – 10;
పచ్చి కొబ్బరి తురుము– టేబుల్‌ స్పూన్‌;
కొత్తిమీర తరుగు– టీ స్పూన్‌;
పుదీన ఆకులు– 8;
ధనియాల సొడి– పావు టీ స్పూన్‌;
పచ్చిమిర్చి – అర కాయ;
ఉడికించిన కూరగాయలు – కప్పు (క్యారట్, బీన్స్, బంగాళదుంప, మొక్కజొన్న, పచ్చి బఠాణీలు కలిపి);
అల్లం తరుగు– అర టీ స్పూన్‌;
ఉల్లిపాయ ముక్కలు– 2 టేబుల్‌ స్పూన్‌లు;
ఉప్పు – పావు టీ స్పూన్‌ లేదా రుచిని బట్టి;
నిమ్మరసం– టీ స్పూన్‌; నూనె – టీ స్పూన్‌.

తయారీ..
కూరగాయ ముక్కలను ఉడికించి పక్కన పెట్టాలి. జీడిపప్పు, కొబ్బరితురుము, కొత్తిమీర, ధనియాల సొడి, అల్లం, పచ్చిమిర్చి కలిపి మెత్తని పేస్ట్‌ చేయాలి ∙బాణలిలో నూనె వేడి చేసి ఉల్లిపాయ ముక్కలు వేయించి అందులో జీడిపప్పుతోపాటు గ్రైండ్‌ చేసిన మిశ్రమాన్ని వేసి రెండు నిమిషాల పాటు వేయించాలి. ఇప్పుడు కూరగాయ ముక్కలు, కొద్దిగా నీటిని వేసి ఐదు నిమిషాల సేపు ఉడికిస్తే వెజిటబుల్‌ కాజు సాగ్‌ రెడీ.

పోషకాలు:  పూరీలో... ఫ్యాట్‌ – 9.8 గ్రాములు, ్రసొటీన్‌ – 2.3 గ్రాములు, కార్బొహైడ్రేట్‌లు – 12 గ్రాములు. కర్రీలో... ్రసొటీన్‌– 4 గ్రాములు, కార్బొహైడ్రేట్‌లు – 13 గ్రాములు, ఫైబర్‌– 5 గ్రాములు.


– డాక్టర్‌ కరుణ, న్యూట్రిషనిస్ట్‌ అండ్‌ వెల్‌నెస్‌ కోచ్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement