బెల్లం ఇడ్లీని.. ఎప్పుడైనా తిన్నరా! ఆ టేస్టే వేరు.. | Ginger Bread Idli, Rice Chicken Cutlets Recipes | Sakshi
Sakshi News home page

బెల్లం ఇడ్లీని.. ఎప్పుడైనా తిన్నరా! ఆ టేస్టే వేరు..

Published Sun, Jul 21 2024 7:19 AM | Last Updated on Sun, Jul 21 2024 7:19 AM

Ginger Bread Idli, Rice Chicken Cutlets Recipes

ఎప్పుడైనా ఈ వంటకాలను తిని చూశారా..!? తిన్నారంటే వాహ్.. అనాల్సిందే..! ఇంకెందుకు ఆలస్యం.. వాటి తయారీ విధానాలను చూద్దాం..

బెల్లం ఇడ్లీ..
కావలసినవి:
ఇడ్లీ బియ్యం – 2 కప్పులు,
మెంతులు – పావు టీ స్పూన్,
మినప్పప్పు – పావు కప్పు,
బెల్లం – ఒకటిన్నర కప్పులు
ఉప్పు – తగినంత,
శనగపప్పు,
కొబ్బరి ముక్కలు – 4 టేబుల్‌ స్పూన్ల చొప్పున,
ఏలకుల పొడి – 1 టేబుల్‌ స్పూన్,
నెయ్యి – కొద్దిగా

తయారీ..
– ముందురోజు రాత్రి ఇడ్లీ బియ్యం, మెంతులు ఒక బౌల్‌లో, మినప్పప్పు ఒక బౌల్‌లో నానబెట్టి.. వేరువేరుగా మిక్సీ పట్టి.. ఒక బౌల్‌లోకి వేసుకోవాలి.
– ఇప్పుడు రెండు మిశ్రమాలను ఒక పెద్ద బౌల్‌లో వేసుకుని.. బాగా కలిపి 8 గంటల పాటు పక్కనపెట్టుకోవాలి.
– మరునాడు ఉదయాన్నే ఇడ్లీ పెట్టుకునే గంట ముందు శనగపప్పు నానబెట్టుకోవాలి.
– ఈలోపు బెల్లంలో 1 టేబుల్‌ స్పూన్‌ నీళ్లు పోసి.. పాకం పట్టుకుని ఉంచుకోవాలి.
– అనంతరం మినప్పప్పు – ఇడ్లీ పిండి మిశ్రమాన్ని మరోసారి బాగా కలిపి.. తగినంత ఉప్పు, ఏలకుల పొడి వేసుకుని గరిటెతో బాగా తిప్పాలి.
– అనంతరం వడకట్టు అడ్డం పెట్టుకుని.. బెల్లం పాకం అందులో వేసుకుని బాగా కలుపుకోవాలి.
– తర్వాత ఇడ్లీ రేకులకు నెయ్యి రాసి, కొంత శనగపప్పు, కొన్ని కొబ్బరి ముక్కలను ప్రతి గుంతలో వేసుకుంటూ.. దానిపైన కొద్ది కొద్దిగా ఇడ్లీ పిండిని వేసుకుని ఆవిరిపై ఉడికించుకోవాలి.
– వేడివేడి ఆ ఇడ్లీలపై నెయ్యి వేసుకుని తింటే భలే రుచిగా ఉంటాయి.

రైస్‌ చికెన్‌ కట్లెట్స్‌..
కావలసినవి:
బోన్‌లెస్‌ చికెన్‌ – పావు కేజీ (మెత్తగా ఉడికించుకుని, చల్లారాక తురుములా చేసుకోవాలి)
కొబ్బరి పాలు – అర కప్పు,
గుడ్లు – 4,
బియ్యం – ముప్పావు కప్పు (పిండిలా చేసుకోవాలి),
పండు మిర్చి – 2 (పేస్ట్‌లా చేసుకోవచ్చు),
కొత్తిమీర – 2 రెమ్మలు (పేస్ట్‌లా చేసుకోవాలి),
పంచదార – 1 టేబుల్‌ స్పూన్‌ (అభిరుచిని బట్టి)
టొమాటో గుజ్జు – 4 టేబుల్‌ స్పూన్లు,
ఉప్పు – తగినంత,
నూనె – సరిపడా

తయారీ..
– ముందుగా ఒక బౌల్‌ తీసుకుని అందులో కొబ్బరి పాలు, గుడ్లు వేసుకుని బాగా కలుపుకోవాలి.
– తర్వాత అందులో బియ్యప్పిండి, ఉడికించిన చికెన్‌ తురుము వేసుకుని మరోసారి కలుపుకోవాలి.
– ఆ మిశ్రమంలో పండు మిర్చి పేస్ట్, టొమాటో గుజ్జు, పంచదార, ఉప్పు, కొత్తిమీర పేస్ట్‌ వేసుకుని.. బాగా కలుపుకుని ముద్దలా చేసుకోవాలి.
– ఇప్పుడు ఆ మిశ్రమాన్ని చిన్నచిన్న కట్లెట్స్‌లా చేసుకుని.. బ్రష్‌తో.. ఇరువైపులా నూనె రాసుకుని ఓవెన్‌లో బేక్‌ చేసుకోవాలి. లేదా – – నూనెలో దోరగా వేయించుకోవచ్చు. నచ్చినవిధంగా గార్నిష్‌ చేసుకుని.. నచ్చిన చట్నీతో వేడివేడిగా తింటే భలే రుచిగా ఉంటాయివి.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement