క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న భారత్-పాకిస్తాన్ మ్యాచ్‌కు సమయం అసన్నమైంది. ఆసియాకప్-2023లో భాగంగా సెప్టెంబర్ 2న కాండీ వేదికగా దాయాదుల పోరు జరగనుంది. అయితే ఈ బ్లాక్ బస్టర్ మ్యాచ్ జరిగేది అనుమానంగా మారింది. ఈ మ్యాచ్‌కు వర్షం ముప్పు పొంచి ఉంది. మ్యాచ్ జరిగే సమయంలో 90 శాతం వర్షం పడే అవకాశం ఉందని అక్కడి వాతవారణ శాఖ వెల్లడించింది.
ఇక హైవోల్టేజ్ మ్యాచ్ కోసం టిక్కెట్లు ఇప్పటికే అమ్ముడుపోయాయి కూడా. ఈ క్రమంలో మ్యాచ్ జరుగుతుందా లేదా అన్న ఆందోళన ఫ్యాన్స్‌లో నెలకొంది. కాగా గురువారం కాండే వేదికగా జరగనున్న బంగ్లాదేశ్-శ్రీలంక మ్యాచ్‌కు కూడా వరుణడు అటంకం కలిగించే ఛాన్స్ ఉంది. అంతే కాకుండా సెప్టెంబర్ 4న భారత్-నేపాల్ మధ్య మ్యాచుకు సైతం వర్షం అంతరాయం కలిగించే అవకాశం ఉంది.
కాగా ఏడాది ఆసియాకప్ శ్రీలంక, పాకిస్తాన్ వేదికలగా హైబ్రిడ్ మోడల్‌లో జరుగుతన్న సంగతి తెలిసిందే. ఈ టోర్నీలో మొత్తం 13 మ్యాచ్ లు జరుగుతాయి. ఇందులో 4 మ్యాచ్‌లు పాకిస్తాన్ వేదికగా .. మిగిలిన 9 మ్యాచ్ లు శ్రీలంక వేదికగా జరగనున్నాయి. ఇక ఈ మెగా ఈవెంట్‌ను పాకిస్తాన్ విజయంతో ఆరంభించింది. ముల్తాన్ వేదికగా నేపాల్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో 238 పరుగుల తేడాతో పాక్ విజయం సాధించింది.
ఆసియాకప్‌కు భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), హార్దిక్ పాండ్యా (వైస్ కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, రవీంద్ర జడేజా, ఇషాన్ కిషన్, జస్ప్రీత్ బుమ్రా, కుల్‌దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, మహ్మద్ షమి, శార్దూల్ ఠాకూర్, అక్షర్ పటేల్, ప్రసిద్ధ్ కృష్ణ
రిజర్వు ప్లేయర్: సంజూ శాంసన్
చదవండి: Asia Cup 2023: టీమిండియాతో మ్యాచ్.. పాకిస్తాన్‌కు బిగ్‌షాక్! ఇక అంతే సంగతి
Comments
Please login to add a commentAdd a comment