దేశంలో చదువుకున్న ప్రతీ ఒక్కరికీ ఉద్యోగం దొరకడం అనేది సాధ్యమయ్యే పనికాదు. అలా ఉద్యోగాలు దొరకనివారిలో చాలామంది ఉపాధి మార్గాలను అన్వేషిస్తున్నారు. వీరిలో కొందరు సక్సెస్ అవుతున్నారు. అలాంటివారిని చూసి, ఇతరులు స్ఫూర్తి పొందుతున్నారు. ఈ జాబితాలోకే వస్తారు యూపీకి చెందిన ఎంఏ చాయ్‌వాలా. వివరాల్లోకి వెళితే..
చదువుకు ఫుల్‌స్టాప్ పెట్టి..
ఉత్తరప్రదేశ్‌లోని గోండా జిల్లాకు చెందిన ఓ యువకుడు టీ వ్యాపారం ప్రారంభించి, ఇప్పుడు ఏటా లక్షల్లో టర్నోవర్ చేస్తున్నాడు. అతని పేరు రాజ్ జైస్వాల్. అతను మీడియాతో మాట్లాడి తన వ్యాపారానికి సంబంధించిన వివరాలను తెలియజేశాడు. అవి అతని మాటల్లోనే.. ‘నేను ఎంఏ చదివేందుకు అడ్మిషన్ తీసుకున్నాను. అయితే ఇంటి ఆర్థిక పరిస్థితి బాగోకపోవడంతో మధ్యలోనే చదువు మానేయవలసి వచ్చింది. అటువంటి పరిస్థితుల్లోనే గోండాలోని ఎల్‌బీఎస్ చౌరస్తాలో ఒక టీ దుకాణాన్ని ప్రారంభించాను. దానికి ఎంఏ చాయ్‌వాలా అని పేరు పెట్టాను’ అని తెలిపారు.
తల్లి ఇచ్చిన డబ్బుతో..
రాజ్ జైస్వాల్ బీఏ పూర్తి చేశాక ఎంఏ చదువుకుందామనుకున్నాడు. ఆర్థిక పరిస్థుతుల కారణంగా అతని కల నెరవేరలేదు. చిన్న చిన్న ఉద్యోగాలు చేసినా, అవేవీ అతనికి సంతృప్తి నివ్వలేదు. దీంతో టీ దుకాణం తెరవాలని అనుకుని ఎంఏ చాయ్ వాలా పేరుతో దుకాణం ప్రారంభించాడు. అయితే ఈ పని అతని తండ్రికి అస్సలు నచ్చలేదు. తల్లి మాత్రం రాజ్ జైస్వాల్‌కు అండగా నిలిచింది. ఆమె తన తగ్గరున్న డబ్బు ఇచ్చి, టీ దుకాణం తెరవాలని ప్రోత్సహించింది.
రోజుకు 300 టీల విక్రయం
అందరూ ఇంట్లో తయారుచేసుకునే టీలకు భిన్నంగా తాము కొన్ని మసాలాలను టీ తయారీకి ఉపయోగిస్తామని, దీంతో తమ దగ్గర టీ మరింత రుచిగా ఉంటుందని రాజ్ జైస్వాల్ తెలిపాడు. కాగా ఇక్కడి టీ రుచి చాలా బాగుంటుందని, అందుకే ఇక్కడికి రోజూ వచ్చి టీ తాగుతామని పలువురు వినియోగదారులు మీడియాకు తెలిపారు. ఇక్కడ రూ.10 నుంచి రూ.40 ధరతో అనేక రకాల టీలు లభ్యమవుతాయి. ప్రతిరోజూ రాజ్ 250 నుంచి 300 కప్పుల టీ విక్రయిస్తుంటాడు. ఈ లెక్కన రాజ్ ప్రతీనెలా టీ విక్రయాలతో కొన్ని లక్షల రూపాయలు సంపాదిస్తున్నాడని అర్థం చేసుకోవవచ్చు.
ఇది కూడా చదవండి: 14 ఏళ్ల పాటు వైద్యం అందించిన డాక్టర్‌కు రూ. 10 లక్షల జరిమానా
Comments
Please login to add a commentAdd a comment