కృత్రిమ మొసలి అనుకుని సెల్ఫీకి యత్నం... ఇక అంతే చివరికి | Clicking Some Pictures With The 12 Foot Reptile Went Wrong And Injured | Sakshi
Sakshi News home page

కృత్రిమ మొసలి అనుకుని సెల్ఫీకి యత్నం... ఇక అంతే చివరికి

Published Sat, Nov 27 2021 5:39 PM | Last Updated on Sat, Nov 27 2021 5:55 PM

Clicking Some Pictures With The 12 Foot Reptile Went Wrong And Injured - Sakshi

ఇటీవలకాలంలో ఈ స్మార్ట్‌ ఫోన్‌లు వచ్చాక ఈ సెల్ఫీ మోజు మాములుగా లేదు. వేగంగా వెళ్లుతున్న బస్సు లేక రైలు పక్కన సెల్ఫీలు దిగడం వంటివి చేస్తున్నారు. అయితే ఈ పిచ్చి ఎంత దారుణంగా ఉందంటే అత్యంత ప్రమాదకరమైన పరిస్థితుల్లో కూడా సెల్ఫీలు తీసుకుంటున్నారంటే ఏమని అనాలో కూడా అర్థంకాదు. అచ్చం అలానే ఇక్కడొక వ్యక్తి సెల్ఫీ మోజుతో ఎంత పిచ్చి పని చేశాడో చూడండి.

(చదవండి: ఏడాదిగా షాప్‌కు వస్తున్న ప్రమాదకరమైన పక్షి!)

అసలు విషయంలోకెళ్లితే...ఫిలిప్పీన్స్‌లోని  నెహెమియాస్ చిపాడా అనే 60 ఏళ్ల వ్యక్తి తన కుటుంబంతో సహా కాగయన్ డి ఓరో సిటీలోని అమయా వ్యూ అమ్యూజ్‌మెంట్ పార్క్‌ను సందర్శించడానికి వెళ్లాడు. అయితే ఆ వ్యక్తి ఆ కొలనులో కృత్రిమ మొసళ్లు ఉంటాయనుకుని వాటితో సెల్ఫీకోసం అక్కడ ఉన్న థీమ్‌ పార్క్‌లోని కొలనులోనికి దిగిపోయాడు. ఇక అంతే అతను ఒక చేత్తో ఫోన్‌  పట్టుకుని మొసలితో సెల్ఫీ తీసేందుకు ప్రయత్నిస్తుండగా వెంటనే ఆ మొసలి అతని పై దాడి చేసి గట్టిగా ఎడమచేయి పట్టుకుని లాగుతుంది. అయితే చిపాడ పాపం ఏదోరకంగా ఆ చెయ్యిని విడిపించుకుని బయటపడతాడు.

దీంతో చిప్పాడను అతని కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించడంతో డాక్టర్లు అతని ఎడమ చేతికి శస్త్రచికిత్స కూడా చేశారు. ప్రస్తుతం అతను బాగానే కోలుకుంటున్నాడు. అంతేకాదు అతను కుటుంబసభ్యులు ఆ కొలనులోని దిగవద్దని హెచ్చరిక బోర్డులు లేవు అందువల్ల అతను దిగాడంటూ ఆ పార్క్‌వాళ్లపై ఆరోపణలు చేయడం మొదలుపెట్టారు .

ఈ మేరకు అమయా వ్యూ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ కాండీ ఉనాబియా ఈ ఆరోపణలను ఖండించారు. అంతేకాదు మొసలి కూడా కృత్రిమమైనదని వారు భావించడం వల్లే ఇలా జరిగిందని అన్నారు. పైగా తాము తమ పార్క్‌ టూర్ గైడ్‌లో ముందుగానే ఆ ప్రాంతాన్ని పరిమితులకు లోబడే సందర్శించాలనే  విషయాలను పర్యాటకులకు చెబుతామని అన్నారు. అయితే చివరికి అమయా వ్యూ పార్క్‌ అధికారులు చిపడా వైద్యా ఖర్చుల నిమిత్తం ఆర్థిక సహాయం చేస్తామని చెప్పడం గమనార్హం.

(చదవండి: ఘోర బస్సు ప్రమాదం...19 మంది దుర్మరణం)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement