selfi
-
సెల్ఫీ ఆనందంలో సెల్‌నే విసిరి ఆ తర్వాత...: వీడియో వైరల్
స్మార్ట్ఫోన్లు ప్రజల జీవితంలో ఎంత పెద్ధ స్థానాన్ని ఆక్రమించాయో చెప్పనవసరం లేదు. ఫోన్ లేకపోతే మనుగడే లేదన్నంతగా వాటిపై ఆధారపడిపోయాడు. అంతేగాదు ఆ స్మార్ట్ఫోన్లతో ఏ చిన్న ఆనందాన్నైనా సెల్ఫీ అంటూ....వీడియోల్లో బంధించి ముచ్చటపడిపోతుంటాం. ఇటీవల కాలంలో ఈ సెల్ఫీల క్రేజ్ జనాల్లో మాములుగా లేదు. ఎంతలా ఉందంటే ప్రాణాంతకమైన ప్రదేశాల్లో సైతం సెల్ఫీలు దిగి ప్రాణాలు పైకి తెచ్చుకుంటున్నావారు కొందరైతే. మరికొందరూ సెల్ఫీ ఆనందంలో ఏం చేస్తున్నారో మరిచిపోయి విలువైన వస్తువులను పొగొట్టుకుంటున్నారు. అచ్చం అలానే ఇక్కడొక వ్యక్తి కూడా సెల్ఫీ తీసకుంటూ ఆ ఆనందంలో ఫోన్‌ని విసిరేసి...అబ్బా! అంటూ తలపట్టుకున్నాడు. అసలేం జరిగిందంటే...ఒక వ్యక్తి సరదాగా సముద్రంలో బోట్‌తో షికారు కొడుతుంటాడు. అతను బోట్లో నుంచుని ఒక చేతితో చేపను పట్టుకుని సెల్పీలు తీసుకుంటాడు. రకరకాల యాంగిల్స్‌లో.. వివిధ ఫోజులలో ఫోటోలు తీసుకున్నాడు. ఆ సెల్పీ ఆనందం అయిపోగానే చేపను పడవేయబోయి పొరపాటున ఫోన్‌ని సముద్రంలో విసిరేస్తాడు. దీంతో పాపం ఆ వ్యక్తి ఫోన్‌ని ఎలాగైనా పట్టుకోవాలని బోట్ వద్దకు వచ్చి వంగి తెగ ప్రయత్నిస్తాడు కూడా. కానీ దురదృష్టం అప్పటికే జరగాల్సినదంతా జరిగిపోతుంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఆన్లైన్లో తెగవైరల్ అవుతుంది. మీరు కూడా ఓ లుక్కేయండి 😂 pic.twitter.com/i9aFrSYeRg — Tansu YEĞEN (@TansuYegen) September 11, 2022 (చదవండి: శాస్త్రవేత్తలను సైతం కలవరపాటుకు గురిచేసిన విచిత్ర జీవి: వీడియో వైరల్) -
అనుకోకుండా అదృష్టం.. సెల్ఫీలతో కోటీశ్వరుడు అయ్యాడు
డబ్బులు సంపాదించడానికి మార్గాలు అనేకం. ఈ ఇన్స్టంట్ రోజుల్లో.. ఈజీగా మనీని, అదీ చిన్నవయసులో సంపాదించేవాళ్లను సైతం చూస్తున్నాం. వీళ్లలో చాలామంది కష్టంతో ఎదిగిన వాళ్లు ఉండొచ్చు!. కానీ, కష్టపడకుండా కేవలం ఫోటోలతో.. కోట్లు సంపాదించి మిలీయనీర్‌గా ఎదిగిన వ్యక్తి గురించి ఎప్పుడైనా మీరు విన్నారా!. సుల్తాన్ గుస్తాఫ్ అల్ ఘోజాలీ.. ఇండోనేషియా సెంట్రల్ సిటీ ఆఫ్ సెమరాంగ్ యూనివర్సిటీ కంప్యూటర్ సైన్స్ స్టూడెంట్. ఘోజాలి గత ఐదేళ్లుగా దాదాపు ప్రతిరోజూ తన కంప్యూటర్ ముందు కూర్చొని సెల్ఫీలు తీసుకునేవాడు. ఇలా అతను దాదాపు వెయ్యి సెల్ఫీలను తీసుకున్నాడు. పైగా తన గ్రాడ్యుయేషన్ డే కోసం టైమ్‌లాప్స్ వీడియోను కూడా రూపొందించాలని ప్లాన్ చేశాడు. ఈలోపు సరదాగా బ్లాక్‌చెయిన్ టెక్నాలజీ గురించి తెలుసుకుని.. అందులో తన సెల్ఫీలను ఆన్లైన్లో ఎన్ఎఫ్టీలుగా విక్రయించాలని నిర్ణయించుకున్నాడు. తన సెల్ఫీలను ఎవరు కొంటారో చూద్దాం అని తమషాగా చేశాడు. సెల్ఫీని కేవలం మూడు డాలర్లు(రూ.223)గా కోట్ చేశాడు. కానీ, అతను కూడా ఊహించని రేంజ్లో సెల్పీలకు డిమాండ్ పెరిగింది. మరోవైపు క్రిప్టోకరెన్సీ ‘ఈథర్’ ఎఫెక్ట్‌తో ఒక్కో సెల్ఫీ రూ 60 వేలు పలికింది. ఈ క్రమంలో ఒక ప్రముఖ సెలబ్రిటీ చెఫ్ తన సోషల్ మీడియా ఖాతాలో ఘోజాలీ సెల్ఫీని ప్రమోట్ చేశాడు. ఆ ప్రభావంతో ఘోజాలీ సెల్ఫీ అమ్మకాలు అమాంతం ఊపందుకున్నాయి. దీంతో ఘోజాలీ సుమారు రూ 7 కోట్లు పైనే సంపాదించగలిగాడు. ఏదిఏమైన సరదాగా తమాషాకి చేసిన పని అతన్ని కోటీశ్వరుడిగా చేయడం విశేషం. (చదవండి: ఆ పుర్రే పురాతన కాలం నాటి అడ్వాన్స్డ్ సర్జరీకి ప్రతీక!) -
కృత్రిమ మొసలి అనుకుని సెల్ఫీకి యత్నం... ఇక అంతే చివరికి
ఇటీవలకాలంలో ఈ స్మార్ట్ ఫోన్లు వచ్చాక ఈ సెల్ఫీ మోజు మాములుగా లేదు. వేగంగా వెళ్లుతున్న బస్సు లేక రైలు పక్కన సెల్ఫీలు దిగడం వంటివి చేస్తున్నారు. అయితే ఈ పిచ్చి ఎంత దారుణంగా ఉందంటే అత్యంత ప్రమాదకరమైన పరిస్థితుల్లో కూడా సెల్ఫీలు తీసుకుంటున్నారంటే ఏమని అనాలో కూడా అర్థంకాదు. అచ్చం అలానే ఇక్కడొక వ్యక్తి సెల్ఫీ మోజుతో ఎంత పిచ్చి పని చేశాడో చూడండి. (చదవండి: ఏడాదిగా షాప్‌కు వస్తున్న ప్రమాదకరమైన పక్షి!) అసలు విషయంలోకెళ్లితే...ఫిలిప్పీన్స్‌లోని నెహెమియాస్ చిపాడా అనే 60 ఏళ్ల వ్యక్తి తన కుటుంబంతో సహా కాగయన్ డి ఓరో సిటీలోని అమయా వ్యూ అమ్యూజ్మెంట్ పార్క్‌ను సందర్శించడానికి వెళ్లాడు. అయితే ఆ వ్యక్తి ఆ కొలనులో కృత్రిమ మొసళ్లు ఉంటాయనుకుని వాటితో సెల్ఫీకోసం అక్కడ ఉన్న థీమ్ పార్క్‌లోని కొలనులోనికి దిగిపోయాడు. ఇక అంతే అతను ఒక చేత్తో ఫోన్ పట్టుకుని మొసలితో సెల్ఫీ తీసేందుకు ప్రయత్నిస్తుండగా వెంటనే ఆ మొసలి అతని పై దాడి చేసి గట్టిగా ఎడమచేయి పట్టుకుని లాగుతుంది. అయితే చిపాడ పాపం ఏదోరకంగా ఆ చెయ్యిని విడిపించుకుని బయటపడతాడు. దీంతో చిప్పాడను అతని కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించడంతో డాక్టర్లు అతని ఎడమ చేతికి శస్త్రచికిత్స కూడా చేశారు. ప్రస్తుతం అతను బాగానే కోలుకుంటున్నాడు. అంతేకాదు అతను కుటుంబసభ్యులు ఆ కొలనులోని దిగవద్దని హెచ్చరిక బోర్డులు లేవు అందువల్ల అతను దిగాడంటూ ఆ పార్క్వాళ్లపై ఆరోపణలు చేయడం మొదలుపెట్టారు . ఈ మేరకు అమయా వ్యూ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ కాండీ ఉనాబియా ఈ ఆరోపణలను ఖండించారు. అంతేకాదు మొసలి కూడా కృత్రిమమైనదని వారు భావించడం వల్లే ఇలా జరిగిందని అన్నారు. పైగా తాము తమ పార్క్ టూర్ గైడ్లో ముందుగానే ఆ ప్రాంతాన్ని పరిమితులకు లోబడే సందర్శించాలనే విషయాలను పర్యాటకులకు చెబుతామని అన్నారు. అయితే చివరికి అమయా వ్యూ పార్క్ అధికారులు చిపడా వైద్యా ఖర్చుల నిమిత్తం ఆర్థిక సహాయం చేస్తామని చెప్పడం గమనార్హం. (చదవండి: ఘోర బస్సు ప్రమాదం...19 మంది దుర్మరణం) -
‘పులికి ఉన్న జ్ఞానం కూడా లేదు’
జంగిల్ సఫారీలో ఎంత స్వేచ్ఛ తీసుకోవాలో అంతే తీసుకోవాలి. ఎక్స్ట్రా చేస్తే ఎముకల్లో సున్నం లేకుండా పోతుంది. ఇటీవల ఒక జంగిల్ సఫారిలో జరిగిన సంఘటన ఇది. ఒక పులిరాజు తన మానాన తాను రాజసంగా గోడ మీద నడుచుకుంటూ వెళుతోంది. ఇట్టి దృశ్యాన్ని టూరిస్టు బృందాలు చూసి, జోబుల్లో నుంచి ఇస్మార్ట్ ఫోన్లు తీసి అటు నుంచి ఇటు నుంచి సెల్ఫీలు మొదలు పెట్టాయి. ఆ పులి ఏ మూడ్‌లో ఉందో తెలియదు గానీ వీరి వైపు చూడలేదు. ‘ఏమిటి నాన్సెన్స్’ అని పులి అనుకొని ఉంటే సీన్ వేరే విధంగా ఉండేది. 15 సెకండ్ల ఈ వీడియో క్లిప్‌ను ట్విట్టర్లో పోస్ట్ చేసి ‘ఇడియట్స్’ అని తిట్టాడు ఫారెస్ట్ అధికారి నందా. ‘పులికి ఉన్న జ్ఞానం కూడా వీరికి లేదు’ అని కూడా అన్నాడు. మనం మరో రెండు తిట్లు జోడించడం తప్ప ఏం చేయగలం! -
బిహార్ ఎన్నికలు: మాకు 50 శాతం సీట్లు ఇవ్వండి
‘మేము పాలిచ్చి పెంచినవారే మమ్మల్ని విభజించి పాలిస్తున్నారు’ అని ఒక తెలుగుకవయిత్రి రాసింది.స్త్రీలను పాలితులుగా ఉంచడానికే మగ ప్రపంచం ఎప్పుడూ ప్రయత్నిస్తూ ఉంది.లోక్‌సభలో అడుగుపెట్టని ‘మహిళా రిజర్వేషన్ బిల్’ ఇందుకు సాక్ష్యం. అక్టోబర్‌లో జరగనున్న అసెంబ్లీ ఎలక్షన్లలోనైనా మాకు 50 శాతం సీట్లు ఇవ్వండి అని బిహార్‌లో ‘శక్తి’ అనే స్త్రీ సంఘటన ఆధ్వర్యంలో మహిళా సర్పంచ్‌లు, చేతనాపరులు భారీగా ‘సెల్ఫీ కాంపెయిన్’ నిర్వహిస్తున్నారు. అన్నీ సక్రమంగా కుదిరితే బిహార్‌లో అక్టోబర్–నవంబర్ మాసాలలో అసెంబ్లీ ఎలక్షన్లు జరుగుతాయి. ఈ కరోనా కాలంలో ఒక పెద్ద రాష్ట్రంలో జరగనున్న ఎలక్షన్లు కచ్చితంగా ఆసక్తి కలిగించేవే. మున్ముందు ఎన్నో ఎలక్షన్ వార్తలు ఈ రాష్ట్రం నుంచి వింటాము. అయితే ముందుగా వింటున్నది మాత్రం అక్కడి ‘శక్తి’ అనే స్త్రీ సంఘటన మొదలెట్టిన ‘హాష్‌ట్యాగ్ 50 పర్సెంట్ ఉమీద్వార్’ అనే సెల్ఫీ కాంపెయిన్ గురించే. బిహార్‌లో జరగనున్న ఎన్నికలలో యాభై శాతం సీట్లు స్త్రీలకు కేటాయించాలని కోరుతూ ఇప్పటికే అక్కడ ముఖియాలుగా, సర్పంచ్‌లుగా ఉన్న మహిళలతో, మహిళా ఎం.ఎల్.ఏలతో, ప్రజా సంఘాల ప్రతినిధులతో ఈ సెల్ఫీ కాంపెయిన్ నిర్వహిస్తున్నారు. ‘ఆధా హమ్ ఆధా హమారా’ (సగం మేము సగం మాది) అనేది ఈ కాంపెయిన్ నినాదం. బిహార్‌లోని 120 ప్రజా సంఘాలు ఈ ప్రచారంలో పాల్గొంటున్నాయి. కేవలం 9 శాతమే బిహార్‌లో స్థానిక సంస్థల ఎన్నికలలో స్త్రీలకు 50 శాతం సీట్లు కేటాయిస్తూ 2006లో బిల్ తెచ్చారు. దీనివల్ల అక్కడ దాదాపు రెండు లక్షల మంది మహిళలకు అవకాశం దక్కింది. అయితే అసెంబ్లీ ఎన్నికలలో కేవలం 9 శాతం మందికే సీట్లు దక్కుతున్నాయి. రాష్ట్రస్థాయి పార్టీలుగాని, జాతీయ స్థాయి పార్టీలుగాని ప్రతిసారి కేవలం తొమ్మిది, పది శాతానికి స్త్రీ అభ్యర్థుల సంఖ్యను పరిమితం చేస్తున్నాయి. 2015 ఎన్నికలలో 243 సీట్లకుగాను కేవలం 28 మంది మహిళా అభ్యర్థులే అక్కడ అసెంబ్లీకి వెళ్లగలిగారు. బిహార్ ఓటర్లలో ఇప్పుడు 60 శాతం మహిళలు అయితే 40 శాతం పురుషులు. ‘అయినా సరే మాకెందుకు ఇంత అన్యాయం’ అని అక్కడి మహిళా చేతనాపరులు ప్రశ్నిస్తున్నారు. పురుష అడ్డంకులు మహిళా ఎం.ఎల్.ఏలు గెలిచినా వారు తమ పాలనను విజయవంతంగా చేయడానికి వీల్లేని అడ్డంకులు పురుషులు కల్పిస్తుంటారని ‘శక్తి’ సభ్యులొకరు వ్యాఖ్యానించారు. పురుష అధికారులుగాని, ఎం.ఎల్.ఏల భర్తలుగాని, ఆ ఎం.ఎల్.ఏలకు ఏర్పాటైన పురుష పి.ఏలుగాని సదరు మహిళా ఎం.ఎల్.ఏకు ప్రజలకు మధ్య అడ్డుగోడగా నిలుస్తుంటారని ‘శక్తి’ పరిశీలన. దీనివల్ల మహిళలు శాసన సభ్యులుగా విఫలమైతే అది సాకుగా చూపించి మహిళలకు తక్కువ సీట్లు కేటాయించడం ఒక ‘గేమ్’గా సాగిస్తున్నారని కూడా ఆ సంస్థ సభ్యులు వ్యాఖ్యానిస్తున్నారు. భర్తలకు గత్యంతరం లేనప్పుడే భార్యలకు ఎలక్షన్లలో చోటు కల్పించే ఘటనలు ఉన్నాయి. లాలూ ప్రసాద్ యాదవ్ భార్య రబ్రీ దేవి ఏ పరిస్థితుల్లో బిహార్ సి.ఎం. అయ్యారో అందరికీ తెలుసు. అందరూ ఒక్కటై ‘స్త్రీల సమస్యలు స్త్రీలకే మరింతగా తెలుస్తాయి. శాసనాధికారంలో మహిళలు లేనప్పుడు వారికి న్యాయం జరగడం సాధ్యం కాదు. అందుకే వారికి సమాన సీట్లు దక్కాలి’ అని ‘శక్తి’ ప్రతినిధి తెలిపారు. స్త్రీలకు సగం సీట్లు కేటాయించే విషయంలో వొత్తిడి తేవడానికి అక్కడ మహిళా, మైనారిటీ, విద్యార్థి, ఆదివాసి సంఘాలు ఏకతాటిపైకి వచ్చాయి. ఆయా పార్టీల పెద్దలను కలిసి మాట్లాడుతున్నాయి. వినతి చేస్తున్నాయి. వీరి వొత్తిడి ఏ స్థాయి ఫలితాన్నిస్తుందో చూడాలి. – సాక్షి ఫ్యామిలీ -
ఉరి వేసుకుంటున్నట్లు నాటకమాడి..
సాక్షి, చెన్నై: ఉరి వేసుకుంటున్నట్టు నాటకమాడి సెల్ఫీతో రక్తికట్టించిన ఓ యువకుడు చివరకు ప్రాణాలు పోగొట్టుకున్నాడు. తేని జిల్లా బొమ్మినాయకన్ పట్టికి చెందిన ద్రవ్యం(23) శివగంగైలోని ఓ బోర్వెల్ సంస్థలో పనిచేస్తున్నాడు. పనులు ముగించుకుని ఇంటికి వచ్చిన ఇతగాడు బంధువులు, మిత్రుల్ని బెదిరించేందుకు ఓ నాటకం ఆడాడు. ఇంటి దూలానికి ఉరి వేసుకుంటున్నట్టు సెల్ఫీ తీశాడు. దానిని మిత్రులు, బంధువులకు పంపించాడు. రెండుసార్లు సెల్ఫీ తీసి పంపించిన ద్రవ్యం మూడో ప్రయత్నం బెడిసి కొట్టింది. ( లవ్ ఫెయిల్: బీటెక్ విద్యార్థి ఆత్మహత్య ) హఠాత్తుగా కిందున్న కుర్చీజారడంతో తాడు గొంతుకు బిగుసుకుంది. దీంతో ఊపిరాడక ప్రాణాలు విడిచాడు. ఆదివారం ఉదయం అతడి గదికి వెళ్లిన సహచరులు ఉరిపోసుకుని వేలాడుతున్న ద్రవ్యంను చూసి ఆందోళన చెందారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. విచారణలో సెల్ఫీ మోజు అతగాడి ప్రాణం తీసినట్టు తేలింది. -
మూగజీవిని చితకబాది సెల్ఫీలు తీసుకున్న యువకులు
-
మరోసారి సల్మాన్ ఆగ్రహం, వీడియో వైరల్
-
ఆమె ఇంకాస్త కాలు జారుంటే అంతే..!
-
వారి జీవితాన్నే మార్చేసిన ‘ఓ సెల్ఫీ’
సాక్షి, న్యూఢిల్లీ : ‘ఒక ఐడియా ఓ జీవితాన్నే మార్చేసింది’ అన్నట్లుగా ‘ఓ సెల్ఫీ’ కూడా వారి జీవితాన్నే మార్చేసింది. లండన్‌లోని మిల్టన్ కేన్స్ నగరానికి చెందిన లీ థాంప్సన్ (37), రాధా వ్యాస్ (39)లు ‘మ్యాచ్ డాట్ కామ్’ ద్వారా ఓ రోజు కలుసుకున్నారు. వారి కనులు కనులు కలిశాయి. తొలిచూపులోనే ప్రేమతో పెనవేసుకున్నారు. ఊసులాడుకున్నారు. దేశ, విదేశాలు పర్యటించడమంటే ఇరువురికీ ఇష్టమని తెలుసుకున్నారు. ఇంకేముంది, పెళ్లి చేసుకొని జీవితంలో స్థిరపడాలని కోరుకున్నారు. అందుకు ఉపాధి సంపాదించడం ఎలా ? అన్న ఆలోచన వారిలో సుడులు తిరిగింది. ‘పర్యాటకం అంటే మన ఇద్దరికి ఇష్టం కనుక. మన ఇద్దరి మోజు తీర్చుకున్నట్లు ఉంటుంది, వ్యాపారం చేసినట్లూ ఉంటుంది. ఒంటరి పర్యాటకుల కోసం ప్రత్యేకంగా ఓ ట్రావెల్ ఏజెన్సీ పెడదాం’ అని రాధా వ్యాస్ అప్పుడే తన కాబోయే భర్తకు సూచించింది. అప్పటి వరకు వారిద్దరు ఒంటరి పర్యాటకులే కనుక ‘ఒంటరి పర్యాటకుల కోసం’ అన్న ఆలోచన వచ్చింది. వారు 15 వేల పౌండ్లతో (దాదాపు 13.3 లక్షల రూపాయలు) ‘ఫ్లాష్ ప్యాక్’ పేరుతో ఓ ట్రావెల్ ఏజెన్సీని ఏర్పాటు చేశారు. అంతకుముందే తాము పర్యటించిన ప్రాంతాల ఫొటోలతోపాటు తమ అనుభవాలను కూడా వారు ట్రావెల్ వెబ్సైట్లో వివరించారు. ఇది 2012లో జరగ్గా రెండేళ్లు గడిచినా వారి వెబ్‌సైట్‌కు ఆదరణ దక్కలేదు. బ్రెజిల్లో 2014లో జరిగిన ‘ఫిఫా’ వరల్ట్ కప్ సందర్భంగా రియో డీ జెనీరియోలోని చారిత్రాత్మక ‘ది క్రైస్ట్ ది రిడీమర్ స్టాట్యూ’కు మరమ్మతులు చేస్తున్నారని థాంప్సన్ దంపతులు విన్నారు. వారికొక ఆలోచన వచ్చింది. ఇరువురు కలిసి ఆ విగ్రహం వద్దకు వెళ్లారు. థాంప్సన్ కష్టపడి ఆ విగ్రహం శిఖరాగ్రానికి చేరుకొని అక్కడి నుంచి కింద నగరం కనిపించేలా ఒక్కడే సెల్ఫీ దిగారు. ఆ సెల్ఫీని థాంప్సన్ దంపతులు ‘ఫ్లాష్ ప్యాక్’లో పోస్ట్ చేయగా, రెండు రోజుల్లోనే 14 లక్షల మంది వీక్షించారు. అంతే, ఆ నాటితో వారి ట్రావెల్ ఏజెన్సీ జాతకమే మారిపోయింది. అప్పటి వరకు వారు కలిసే ఉన్నా ఆ తర్వాత వారు పెళ్లి చేసుకున్నారు. వారికి ప్రస్తుతం ఆరు నెలల పాప. ఈ ఐదేళ్లలో వారి వ్యాపారం రెండు కోట్ల పౌండ్లకు (175 కోట్ల రూపాయలకు) చేరుకుంది. చిన్నప్పటి నుంచే తనకు పర్యాటకం అంటే ఎంతో ప్రాణమని ‘ఫిమేల్’ పత్రికకు ఇప్పుడు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆమె వెల్లడించారు. తాను ఆరేళ్ల వయస్సులో ఉన్నప్పుడే కెన్యాలో ఉంటున్న తన బంధువులను కలుసుకోవడానికి ఒంటరిగా వెళ్లానని, ఆ పర్యటన తనకు అపరిమిత ఆనందాన్ని ఇవ్వడంతో పర్యటించడమే తాను హాబీగా పెట్టుకున్నానని ఆమె వివరించారు. -
ఆత్మహత్య చేసుకుంటానంటూ సెల్ఫీ వీడియో
-
గన్‌తో బాలుడి సెల్ఫీ.. దూసుకుపోయిన బుల్లెట్
ఢిల్లీ : సెల్ఫీతో చెలగాటం మనిషికి ప్రాణ సంకటం అన్నట్లుగా తయారైంది. రోజూ ఎక్కడో ఒక చోట సెల్ఫీ మరణాలు సంభవిస్తూనే ఉన్నాయి. ఇలాంటి ఘటనే ఢిల్లీలోని సరితా విహార్ ఏరియాలో చోటుచేసుకుంది. మైనర్ బాలుడు గన్నుతో సెల్ఫీ తీసుకుంటుండగా అది పేలి పక్కన ఉన్న వ్యక్తి శరీరంలోకి బుల్లెట్ దూసుకెళ్లడంతో అతను అక్కడిక్కడే మరణించాడు. వివరాల్లోకి వెళితే ఉత్తరప్రదేశ్‌కు చెందిన 23ఏళ్ల యువకుడు ఢిల్లీ సరితా విహార్ ఏరియాలోని తన బంధువు ఇంటిలో ఉంటున్నాడు. అతని కజిన్ మైనర్ బాలుడు తండ్రి గన్నుతో సెల్ఫీ తీసుకుంటుండగా అది కాస్తా పేలింది. ప్రక్కనే ఉన్న యువకుడి శరీరంలోకి బుల్లెట్ దూసుకెళ్లింది. అస్పత్రికి తరలించేలోపే అతడు మరణించాడు. విషయం తెలుసుకున్న పోలీసులు మైనర్ బాలుడిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. మైనర్‌కు బుల్లెట్లతో నిండిన లైసెన్స్డ్ గన్ ఇచ్చినందుకు గానూ బాలుడి తండ్రిపై కూడా కేసు నమోదు చేశారు. అసలు ఈ ఘటన అనుకోకుండా జరిగిందా లేదా పథకం ప్రకారమే చేశారా అన్న విషయాలను దర్యాప్తు చేస్తున్నట్లు డిప్యూటీ కమీషనర్ ఆఫ్ పోలీస్ చిన్మయ్ బిస్వాల్ తెలిపారు. -
సెల్ఫీ పిచ్చితో బుక్కయ్యాడు..
సాక్షి, టీ.నగర్: సోషల్ మీడియా నేటి యువతపై బాగానే ప్రభావం చూపుతుంది. ఓ యువకుడు సైనిక దస్తులు ధరించి, చేతిలో తుపాకీతో దిగిన ఫొటోలు ఫేస్బుక్లో పోస్టు చేశాడు. ప్రస్తుతం ఆ యువకుని వద్ద పోలీసులు విచారణ జరుపుతున్నారు. సేలం జిల్లా, మేచ్చేరికి చెందిన ప్రభు(35) ట్రావెల్స్ నడుపుతున్నాడు. ఇతను కొన్ని రోజుల కిందట తన ఫేస్బుక్, వాట్సాప్‌లో చేతిలో నాటు తుపాకీతో దిగిన ఫొటోలను పోస్టు చేశాడు. మరో ఫొటోలో సేనిక దుస్తులు ధరించి, ఎకే-47 తుపాకీతో కనిపించాడు. అంతేకాక తన ఫోన్ నంబర్లు అందులో పేర్కొన్నాడు. ఈ ఫొటోలను చూసిన అటవీశాఖ అధికారులు మేచ్చేరికి వెళ్లి ప్రభును అదుపులోకి తీసుకున్నారు. అధికారుల విచారణలో ప్రభు కొన్ని విషయాలను వెల్లడించారు. బోర్వెల్ సంస్థలో మేనేజర్‌గా ఉన్నప్పుడు కర్ణాటక రాష్ట్రంలో బస చేశానన్నాడు. ఆ సమయంలో అక్కడున్న స్నేహితుడి వద్ద తుపాకీ తీసుకుని ఫొటోకు ఫోజిచ్చినట్లు తెలిపాడు. అలాగే మరో స్నేహితుని వద్ద సైనిక దుస్తులు ధరించి ఫొటో దిగినట్లు తెలిపాడు. ఈ ఫొటోలు తీసుకుని రెండేళ్లవున్నట్లు ప్రభు పేర్కొన్నాడు. అటవీ శాఖ అధికారులు శుక్రవారం అతన్ని మేచ్చేరి పోలీసులకు అప్పగించారు. ప్రభుతో పోలీసులు విచారణ జరుపుతున్నారు. -
ఆమెతో సెల్ఫీలు..ఆయనతో బేరాలు
గుంటూరు: పట్టణ పరిధిలోని ఎదురింటి మొగుడు.. పక్కింటి పెళ్లాం మధ్య వివాహేతర సంబంధం ఏర్పడింది. దీంతో వారు సెల్ఫీలు దిగారు. అనంతరం ఆ ఫోటోలను ఫేస్బుక్, వాట్సప్‌లో అప్లోడ్ చేస్తానంటూ రెండు రోజులుగా ఆమె భర్తకు ఫోన్ చేసి బెదిరించడం మొదలెట్టాడు. దీంతో ఆ మహిళ భర్త తాడేపల్లి పోలీసుస్టేషన్లో కేసు పెట్టాడు. వివరాల ప్రకారం.. నులకపేటలో నివాసముండే యువకుడికి నాలుగేళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఇద్దరు పిల్లలు. వీరి పక్కింట్లో నివాసముండే మరో వ్యక్తి, ఆ యువకుడి భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఈ విషయం ఆమె భర్తకు తెలియడంతో పోలీస్‌స్టేషన్ వరకు వెళ్లింది. అక్కడ పోలీసులు రాజీ చేసి పంపారు. అయితే 15 రోజులు తర్వాత మళ్లీ ఇద్దరూ కలిసి సెల్ఫీలు దిగారు. వాటిని ఆమె భర్తకు పంపించి డబ్బులిస్తావా లేకపోతే ఫేస్బుక్, వాట్సప్‌లలో అప్లోడ్ చేస్తానంటూ పక్కింటి వ్యక్తి బెదిరింపులకు పాల్పడ్డాడు. అతడిపై వెంటనే ఆ యువతి భర్త తాడేపల్లి పోలీస్‌స్టేషన్‌లో కేసు పెట్టాడు. పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. -
చార్మినార్‌పై సెల్ఫీ.. వ్యక్తి అరెస్టు
-
చార్మినార్‌పై సెల్ఫీ.. వ్యక్తి అరెస్టు
చారిత్రక కట్టడమైన చార్మినార్ వద్ద సోమవారం గందరగోళం సృష్టించిన ఓ వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. చార్మినార్‌పై భాగంలోని ఓ నిషిద్ధ ప్రాంతంలో సెల్ఫీ తీసుకోవడానికి నవీన్ ఒ షా యత్నించినట్లు చార్మినార్ భద్రతా ఇన్చార్జ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు నిందితుడిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
మీరు తీసుకున్న సెల్ఫీయే నచ్చుతోందా ?
టొరెంటో: డియర్ సెల్ఫీ టేకర్స్.. ఇక పై సెల్ఫీలు తీసుకునేముందు ఈ మాటను గుర్తుపెట్టుకోండి. ఎక్కువగా సెల్ఫీలు తీసుకునేవాళ్లు తాము చాలా అందంగా కనిపిస్తున్నామనే భ్రమలో పడతారని యూనివర్సిటీ ఆఫ్ టొరెంటో పరిశోధకులు చెబుతున్నారు. దాదాపు 198 మంది కాలేజీ విద్యార్ధుల మీద జరిపిన పరిశోధనల్లో ఈ విషయం వెల్లడైందని తెలిపారు. ఒక్కొక్కరిని తమంట తాము సెల్ఫీ తీసుకోవడం తర్వాత వేరే వ్యక్తితో ఫోటో తీయించి వీటిలో ఏ ఫోటో బాగుందో చెప్పమని అడిగామని 198లో 178 మంది తాము సొంతగా తీసుకున్న ఫోటోనే ఇష్టపడినట్లు వివరించారు. వీరందరూ తమ అందాన్ని ఎక్కువగా అంచనా వేసుకుంటున్నారని గుర్తించినట్లు తెలిపారు. ఇటువంటి లక్షణాలు ఉన్న వాళ్లు తొందరపడి తప్పిదాలు చేసే అవకాశం ఎక్కువగా ఉంటుందని చెప్పారు. -
రోజుకో ఫొటో...
ఇప్పుడంటే ఫొటో తీయడం చాలా సులువు. సెల్ ఫోన్ ఉంటే చాలు సెల్ఫీల వర్షం కురిపించొచ్చు. కానీ ఇవేవీ పెద్దగా అందుబాటులో లేని రోజుల్లో మాత్రం ఫొటో తీసుకోవాలంటే చాలా కష్టమైన పని. సెల్ ఫోన్లు, సెల్ఫీ లేని రోజుల్లో జామీ లివింగ్ స్టన్ అనే వ్యక్తి గత 30 ఏళ్లుగా రోజుకో ఫొటో తీసుకున్నాడు. ఈ పని ఆయన చనిపోయే రోజు వరకూ చేశాడు. ఇందుకోసం పాతకాలం నాటి పోలరాయిడ్ కెమెరా ఆయన ఉపయోగించాడు. న్యూయార్క్‌కి చెందిన ఈ ఫొటోగ్రాఫర్ తన ఫొటోలన్నిటినీ జాగత్తగా భద్రపరచి ఉంచుకున్నాడు. బ్రెయిన్ ట్యూమర్‌తో ఈ మధ్యే జామీ చనిపోయాడు. అతని మిత్రులు హ్యూ క్రాఫోర్డ్, బెట్సీ రీడ్‌లు ఈ ఫొటోలన్నిటినీ ప్రదర్శనగా ఉంచారు. జామీ జీవితంలోని వివిధ ఘట్టాలను, మిత్రులతో, బంధువులతో గడిపిన క్షణాలను మరోసారి రీప్లే చేయించింది ఈ ప్రదర్శన. -
'సెల్ఫీ' సూసైడ్
బెంగళూరు: ఆత్మహత్యకు పాల్పడే ముందు ఓ వ్యక్తి తన చావుకు దారితీసిన కారణాలను మొబైల్లో 'సెల్ఫీ' రూపంలో రికార్డుచేశాడు. ఈ ఘటనలో సదరు వ్యక్తి భార్యపై హత్యాయత్నం చేయటం గమనార్హం. ఆలస్యంగా వెలుగు చేసిన సంఘటన వివరాలు.. బెంగళూరు సమీపంలోని మాదనాయకనహళ్లికి చెందిన వెంకటేశ్, విజయలక్ష్మికి ఐదేళ్ల క్రితం వివాహమైంది. విజయలక్ష్మి తన కుమారుడిని వైద్యుడి వద్దకు తీసుకెళ్లిన సమయంలో శివు అనే వ్యక్తి పరిచయమయ్యాడు. అప్పటి నుంచి వారి మధ్య వివాహేతర సంబంధం ఏర్పడింది. విషయం తెలిసిన వెంకటేశ్ భార్యను మందలించాడు. అయినా, ఆమె తీరు మార్చుకోలేదు. దీంతో భార్యను హత్య చేయాలని పథకం వేశాడు. నవంబరు 26న భార్య విజయలక్ష్మిపై దాడిచేసి ఊపిరాడకుండా చేయటంతో స్పృహతప్పి పడిపోయింది. ఆమె చనిపోయిందని భావించిన వెంకటేశ్ తన మొబైల్లో వీడియో రికార్డు ఆన్‌చేసి చీరతో అదే గదిలో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కొద్ది సేపు అనంతరం తెలివితెచ్చుకున్న విజయలక్ష్మి ఎదురుగా భర్త వేలాడుతుండటం చూసి మృతదేహాన్ని కిందకు దించింది. పిల్లలతో కలిసి పుట్టింటికి వెళ్లి భర్త ఆత్మహత్య సంగతిని వారికి తెలియజేసింది. ఈఘటనకు సంబంధించి వెంకటేశ్ సోదరుడు మాదనాయకనహళ్లి పోలీస్‌స్టేషన్‌లో ఐదు రోజుల క్రితం ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విజయలక్ష్మి, ప్రియుడు శివును గురువారం అరెస్ట్ చేశారు. -
సెల్ఫీ తీసుకోవాలా.. ఇవి పాటించండి..
మాస్కో: ప్రస్తుతం ప్రపంచాన్ని ఊపేస్తోన్న ట్రెండ్ ‘సెల్ఫీ’. యువతలో అయితే దీనికున్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సెల్ఫీ తీసుకోవడం, సోషల్ నెట్వర్కింగ్ సైట్లలో అప్లోడ్ చేయడం.. తర్వాత వాటికి వచ్చే లైక్‌లు, కామెంట్ల కోసం ఎదురుచూసే ట్రెండ్ విపరీతంగా పెరిగిపోయింది. అందరిలా మామూలుగా సెల్ఫీలు తీసుకుంటే కిక్ ఏముంది అనుకొని కొందరు తమ ప్రత్యేకత చాటుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రమాదకర, వింత ప్రదేశాల్లో విభిన్న రీతిలో సెల్ఫీలు తీసుకోవాలని కొందరు ప్రయత్నిస్తున్నారు. ఈ ప్రయత్నంలో అనేక మంది గాయపడుతున్నారు. మరి కొందరు ప్రాణాలు పోగొట్టుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. ఈ సెల్ఫీ జాడ్యం వల్ల సమస్యలు కొనితెచ్చుకుంటున్న వారు ఎందరో ఉన్నారు. రష్యాలో సెల్ఫీల మోజులో పడి అక్కడి యువత ఎక్కువగా గాయాలు పాలవుతోంది. ఇలా సెల్ఫీ ప్రమాదాలు పెరిగిపోతుండడంతో అక్కడి ప్రభుత్వం సెల్ఫీలు తీసుకోవడంపై ప్రజలకు ఇటీవల కొన్ని సూచనలు చేసింది. ఈ నేపథ్యంలో సేఫ్ సెల్ఫీల కోసం నిపుణులు కొన్ని సూచనలు చేశారు. అవి. సెల్ఫీ తీసుకునే ప్రదేశం సురక్షితమైనదో కాదో చూడాలి. ఎత్తై ప్రదేశాలు, భవనాల అంచులకు వెళ్లి సెల్ఫీ తీసుకునేందుకు యత్నించకూడదు. జంతుప్రదర్శన శాలలకు వెళ్లినప్పుడు అక్కడి జంతువులతో కలిసి సెల్ఫీలు తీసుకోవడం చేయొద్దు. ఆ సమయంలో జంతువులు దాడి చేసే అవకాశముంది. రోడ్డు మధ్యలో, రైలు పట్టాల మధ్యలో నిలబడి వెనుక వాహనాలు, రైలు వస్తున్నప్పుడు సెల్ఫీ కోసం ప్రయత్నించొద్దు. ఇది ప్రమాదకరం. కదులుతున్న వాహనాలపై నిలబడి కూడా సెల్ఫీ తీసుకోవద్దు. అలాగే విద్యుత్ వైర్లు తగిలే ప్రదేశాల విషయంలో కూడా అప్రమత్తంగా ఉండాలి. ప్రమాదకర ఆయుధాలు చేతబట్టి వాటితో సరదాగా సెల్ఫీలు తీసుకోవడం కూడా ఎక్కువైంది. అయితే ఈ సమయంలో కొన్ని సార్లు పొరపాట్ల వల్ల గాయాలపాలవుతున్నారు. అందుకే ఇలాంటి సెల్ఫీలకు ప్రయత్నించకూడదు. జలపాతాల దిగువన, నదుల మధ్యలో సెల్ఫీలు తీసుకోవడం ప్రమాదకరం. -
సెల్ఫీలు మన గురించి చెప్పేస్తాయి!
సెల్ఫీలంటే సరదాగా తీసుకునే స్వీయ చిత్రాలు మాత్రమే కాదు. అవి మన వ్యక్తిత్వాన్ని గురించి మనకు చెబుతాయి అంటోంది తాజా అధ్యయనం ఒకటి. మనలోని అంతర్ముఖత్వం, అంకితభావం, స్వార్థం, నిస్వార్థం, ధైర్యం, పిరికితనం...ఇలా ఎన్నో లక్షణాలను సెల్ఫీలు చెబుతాయి. ‘‘ఫోటో మాత్రమే అనుకుంటాంగానీ అది మన వ్యక్తిత్వంలోని ఎన్నో కోణాలను మనకు చెబుతుంది’’ అంటున్నారు సింగపూర్‌లోని నన్యాంగ్ టెక్నాలజికల్ యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు. సెల్ఫీ కోసం ఎంచుకున్న ప్రదేశం, భంగిమ, కెమెరాకు సంబంధించిన సాంకేతిక అంశాలు... మొదలైనవి మన వ్యక్తిత్వాన్ని పట్టిస్తాయట. ఇతర వ్యక్తులు తీసే ఫోటోల కంటే సెల్ఫీలే వ్యక్తిత్వాన్ని అంచనా వేయడంలో సూచికలుగా పనిచేస్తాయంటున్నారు పరిశోధకులు. పుస్తకాలుగా వచ్చిన ప్రముఖుల సెల్ఫీలను కూడా తమ అధ్యయనానికి పరిశోధకులు ఉపయోగించుకున్నారు. రెండు ఉదాహరణలు సంతోషంగా, నవ్వు ముఖంతో కనిపించడం అనేది సిగ్నేచర్ సెల్ఫీ లుక్! ఇలాంటి సెల్పీలు మనలోని సానుకూల దృక్పథాన్ని చాటడంతో పాటు ఇతరులకు సహాయం చేసే మనస్తత్వాన్ని తెలియజేస్తాయట. ముఖం కింది నుంచి సెల్ఫీ తీసుకోవవడం పట్టు విడుపులు లేని ధోరణిని, సరికొత్త ప్రయోగ దృక్పథాన్ని తెలియజేస్తుందట. ప్రైవేటు ప్లేస్‌లలో సెల్ఫీలు తీసుకోకవపోవడం అనేది మనస్సాక్షి విలువనిచ్చే వైఖరికి అద్దం పడుతుంది. ఇవి మచ్చుకు కొన్ని మాత్రమే.