![మీరు తీసుకున్న సెల్ఫీయే నచ్చుతోందా ? - Sakshi](/styles/webp/s3/article_images/2017/09/4/41463909682_625x300.jpg.webp?itok=YZXdM-d2)
మీరు తీసుకున్న సెల్ఫీయే నచ్చుతోందా ?
టొరెంటో: డియర్ సెల్ఫీ టేకర్స్.. ఇక పై సెల్ఫీలు తీసుకునేముందు ఈ మాటను గుర్తుపెట్టుకోండి. ఎక్కువగా సెల్ఫీలు తీసుకునేవాళ్లు తాము చాలా అందంగా కనిపిస్తున్నామనే భ్రమలో పడతారని యూనివర్సిటీ ఆఫ్ టొరెంటో పరిశోధకులు చెబుతున్నారు. దాదాపు 198 మంది కాలేజీ విద్యార్ధుల మీద జరిపిన పరిశోధనల్లో ఈ విషయం వెల్లడైందని తెలిపారు.
ఒక్కొక్కరిని తమంట తాము సెల్ఫీ తీసుకోవడం తర్వాత వేరే వ్యక్తితో ఫోటో తీయించి వీటిలో ఏ ఫోటో బాగుందో చెప్పమని అడిగామని 198లో 178 మంది తాము సొంతగా తీసుకున్న ఫోటోనే ఇష్టపడినట్లు వివరించారు. వీరందరూ తమ అందాన్ని ఎక్కువగా అంచనా వేసుకుంటున్నారని గుర్తించినట్లు తెలిపారు. ఇటువంటి లక్షణాలు ఉన్న వాళ్లు తొందరపడి తప్పిదాలు చేసే అవకాశం ఎక్కువగా ఉంటుందని చెప్పారు.