
ఢిల్లీ : సెల్ఫీతో చెలగాటం మనిషికి ప్రాణ సంకటం అన్నట్లుగా తయారైంది. రోజూ ఎక్కడో ఒక చోట సెల్ఫీ మరణాలు సంభవిస్తూనే ఉన్నాయి. ఇలాంటి ఘటనే ఢిల్లీలోని సరితా విహార్ ఏరియాలో చోటుచేసుకుంది. మైనర్ బాలుడు గన్నుతో సెల్ఫీ తీసుకుంటుండగా అది పేలి పక్కన ఉన్న వ్యక్తి శరీరంలోకి బుల్లెట్ దూసుకెళ్లడంతో అతను అక్కడిక్కడే మరణించాడు. వివరాల్లోకి వెళితే ఉత్తరప్రదేశ్‌కు చెందిన 23ఏళ్ల యువకుడు ఢిల్లీ సరితా విహార్ ఏరియాలోని తన బంధువు ఇంటిలో ఉంటున్నాడు.
అతని కజిన్ మైనర్ బాలుడు తండ్రి గన్నుతో సెల్ఫీ తీసుకుంటుండగా అది కాస్తా పేలింది. ప్రక్కనే ఉన్న యువకుడి శరీరంలోకి బుల్లెట్ దూసుకెళ్లింది. అస్పత్రికి తరలించేలోపే అతడు మరణించాడు. విషయం తెలుసుకున్న పోలీసులు మైనర్ బాలుడిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. మైనర్‌కు బుల్లెట్లతో నిండిన లైసెన్స్‌డ్ గన్ ఇచ్చినందుకు గానూ బాలుడి తండ్రిపై కూడా కేసు నమోదు చేశారు. అసలు ఈ ఘటన అనుకోకుండా జరిగిందా లేదా పథకం ప్రకారమే చేశారా అన్న విషయాలను దర్యాప్తు చేస్తున్నట్లు డిప్యూటీ కమీషనర్ ఆఫ్ పోలీస్ చిన్మయ్ బిస్వాల్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment