
న్యూఢిల్లీ: సోదరుడిని హత్య చేశారన్న కోపంతో ప్రతీకారం తీర్చుకునేందుకు వెళ్లిన ఒక వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన ఆగస్టు 13న ఢిల్లీలోని తిమార్‌పూర్ ప్రాంతంలో చోటుచేసుకుంది. బాధితుడు సునీల్ గున్నిగా పోలీసులు గుర్తించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ కావడంతో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది.
పోలీసులు తెలిపిన కథనం ప్రకారం....ఆగస్టు 12న సునీల్ సోదరుడుని కొంతమంది వ్యక్తులు చంపారని ఢిల్లీ పోలీస్ నార్త్ డిప్యూటి కమిషనర్ సాగర్ సింగ్ కల్సి తెలిపారు. ఆ తర్వాత రోజు సునీల్ తన సోదరుడిని చంపినందుకు ప్రతీకారం తీర్చుకోవడానికి వెళ్లి రాహుల్, అజయ్, ముఖేష్ అతని సహచరుల చేతిలో హత్యకు గురయ్యాడు.
తొలుత సునీల్ రాహుల్, అజయ్, ముఖేష్ వారి సహచరుల మధ్య గొడవ జరిగిందని చెప్పారు. ఆ తర్వాత వారంతా సునీల్‌ని దారుణంగా కొట్టి పరారయ్యినట్లు తెలిపారు. తీవ్ర గాయాలపాలైన సునీల్‌ని ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందినట్లు పోలీసులు వెల్లడించారు. వాస్తవానికి సునీల్ తన సోదరుడిని చంపారన్న కోపంతో నిందితులపై దాడి చేసేందుకు కొడవలితో వెళ్లాడని అన్నారు. ఐతే వారంతా సునీల్ వద్ద నుంచి కొడవలిని లాక్కుని, కర్రలు, రాడ్లతో దాడి చేశారని పోలీసులు తెలిపారు.
(చదవండి: స్కాట్‌లాండ్‌లో పలమనేరు విద్యార్థి మృతి)
Comments
Please login to add a commentAdd a comment