avenge
-
ఓ రేంజ్లో రివేంజ్ తీర్చుకున్న మహిళ.. ఏకంగా 20 ఏళ్లు కాపుగాసి..
మనం ఎంతగానో ప్రేమించే భాగస్వామీ లేదా ప్రియమైన వాళ్లు దూరమైతేనే తట్టుకోలేం. అలాంటిది ఎవరి వల్లనో మనవాళ్లను పోగొట్టుకుంటే.. ఆ బాధ వర్ణనాతీతంగా ఉంటుంది. సినిమాల్లో హీరో లేదా హీరోయిన్ మాదిరి రివేంజ్ తీర్చుకోవడం అందరి వల్ల సాధ్య కాదు కూడా! కానీ కొందరూ మాత్రం చూస్తూ కూర్చోలేరు. ఏం చేసేందుకైనా తెగించి మరీ తమ రివేంజ్ తీర్చుకుంటారు. అచ్చం అలాంటి కోవకు చెందినదే కొలంబియాకు చెందిన మహిళ. వివరాల్లోకెళ్తే.. కొలంబియాకు చెందిన మహిళ భర్త.. పేరు మోసిన డ్రగ్ వ్యాపారి రుబెన్ డారియో విలోరియా బారియోస్ చేతిలో హతమయ్యాడు. దీన్ని జీర్ణించుకోలేని సదరు మహిళ ఎలాగైనా అతడిపై రివేంజ్ తీర్చుకోవాలని గట్టిగా నిర్ణయించుకుంది. అందుకోసం ఆ మహిళ.. డ్రగ్ వ్యాపారి కోసం గాలిస్తున్న ఇంటిలిజెన్స్ అధికారులతో చేతులు కలిపింది. ఆమె అనుకున్న ప్లాన్ ప్రకారమే..వలపు వల విసిరి మరీ అతడిని ప్రేమలోకి దించింది. అతడితో ప్రేమాయాణం సాగిస్తూనే అతడికి సంబంధించిన విషయాలన్నింటిని ఎప్పటికప్పుడూ ఇంటిలిజెన్స్ అధికారులకు చేరవేసింది. ఒక రోజు ఆ మహిళ తన ‘ప్రియుడి’కి మోంటారియా అనే వ్యక్తిని కలిసేలా ఏర్పాటు చేసింది. ముందుగానే అతడికోసం మాటువేసి ఉన్న ఇంటిలిజెన్స్ అధికారులు అతడిని తక్షణమే అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. ఆ వ్యక్తిని పట్టుకోవడం కోసం గత పదేళ్లుగా ఎదురుచూస్తున్నామని చెప్పారు. అతడిపై డ్రగ్స్, ఆయుధాల అక్రమ రవాణాకు సంబంధించి పలు కేసులు ఉన్నాయని ఇంటిలిజెన్స్ అధికారి కల్నల్ గాబ్రియేల్ గార్సియా అన్నారు. అతడిని జువాంచో అని కూడా పిలుస్తారని చెప్పారు. ఆ మహిళ సాయంతో పేరు మోసిన నిందితుడిని పట్టుకోగలిగామని అన్నారు. చివరికి బాధిత మహిళ తన భర్తను పొట్టనబెట్టుకున్న నిందితుడు రుబెన్ డారియోకి 22 ఏళ్లు జైలు శిక్ష పడేలా చేసి తన ప్రతీకారం తీర్చుకుంది. (చదవండి: అన్నంత పని చేస్తున్న కిమ్! 'ఆయుధాలను పెంచాలని పిలుపు') -
నడి రోడ్డు పై హత్య... సోదరుడిని చంపాడన్న కోపంతో...
న్యూఢిల్లీ: సోదరుడిని హత్య చేశారన్న కోపంతో ప్రతీకారం తీర్చుకునేందుకు వెళ్లిన ఒక వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన ఆగస్టు 13న ఢిల్లీలోని తిమార్పూర్ ప్రాంతంలో చోటుచేసుకుంది. బాధితుడు సునీల్ గున్నిగా పోలీసులు గుర్తించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ కావడంతో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన కథనం ప్రకారం....ఆగస్టు 12న సునీల్ సోదరుడుని కొంతమంది వ్యక్తులు చంపారని ఢిల్లీ పోలీస్ నార్త్ డిప్యూటి కమిషనర్ సాగర్ సింగ్ కల్సి తెలిపారు. ఆ తర్వాత రోజు సునీల్ తన సోదరుడిని చంపినందుకు ప్రతీకారం తీర్చుకోవడానికి వెళ్లి రాహుల్, అజయ్, ముఖేష్ అతని సహచరుల చేతిలో హత్యకు గురయ్యాడు. తొలుత సునీల్ రాహుల్, అజయ్, ముఖేష్ వారి సహచరుల మధ్య గొడవ జరిగిందని చెప్పారు. ఆ తర్వాత వారంతా సునీల్‌ని దారుణంగా కొట్టి పరారయ్యినట్లు తెలిపారు. తీవ్ర గాయాలపాలైన సునీల్‌ని ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందినట్లు పోలీసులు వెల్లడించారు. వాస్తవానికి సునీల్ తన సోదరుడిని చంపారన్న కోపంతో నిందితులపై దాడి చేసేందుకు కొడవలితో వెళ్లాడని అన్నారు. ఐతే వారంతా సునీల్ వద్ద నుంచి కొడవలిని లాక్కుని, కర్రలు, రాడ్లతో దాడి చేశారని పోలీసులు తెలిపారు. (చదవండి: స్కాట్లాండ్లో పలమనేరు విద్యార్థి మృతి) -
తాతపై పద్నాలుగేళ్లకిందటి పగతో మనవరాలిని..
కాన్పూర్: తన తాతపై పగతో ఓ పదేళ్ల మనవరాలిపై ఇద్దరు బాలురు(14, 15) లైంగిక దాడి చేశారు. వయసులో చిన్నవారే అయినా అత్యంత పాశవికంగా ఈ చర్యకు పాల్పడ్డారు. ఈ ఘటన చూసి పోలీసులు కూడా అవాక్కయ్యారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఫిరోజాబాద్ లో ఓ రెండు కుటుంబాలు ఉన్నాయి. వారి మధ్య పదేళ్ల కిందట నుంచే వైరం ఉంది. అది మర్చిపోయారనే చుట్టుపక్కలవారు అనుకున్నారు. బాలిక తరుపు తాతయ్య నిందితుల్లో ఒకరి తాతను తుపాకీతో కాల్చి చంపాడు. అది కూడా పద్నాలుగేళ్ల కిందట చోటుచేసుకుంది. అంటే దాదాపు ఈ చర్యకు పాల్పడిన బాలుడు ఇంకా జన్మించలేదు కూడా. ఆ విషయం ఇంట్లో వాళ్లు చెబితే మనసులో పెట్టుకున్నాడో.. లేక తనంతట తానే ఈచర్యకు పాల్పడ్డాడో మొత్తానికి ఓ దుశ్చర్యకు దిగాడు. బయటకు వెళ్లి వస్తున్న పదేళ్ల బాలికను తన స్నేహితుడితో కలిసి సమీపంలోని పొదల్లోకి ఈడ్చుకెళ్లి రేప్ చేశారు. బాలిక స్పృహ కోల్పోవడంతో పోలీసులు ఆగ్రా ఆస్పత్రికి తరలించారు. ఈ చర్యకు ఇంట్లో వారేమైనా పురికొల్పారా అనే కోణంలో కూడా దర్యాప్తు మొదలుపెట్టారు. ఇద్దరు మైనర్లను అరెస్టు చేసి జువెనైల్ కు తరలించారు.