తాతపై పద్నాలుగేళ్లకిందటి పగతో మనవరాలిని.. | Two boys raped a 10-year-old girl to avenge a murder | Sakshi
Sakshi News home page

తాతపై పద్నాలుగేళ్లకిందటి పగతో మనవరాలిని..

Published Mon, Jul 4 2016 9:38 AM | Last Updated on Mon, Sep 4 2017 4:07 AM

తాతపై పద్నాలుగేళ్లకిందటి పగతో మనవరాలిని..

తాతపై పద్నాలుగేళ్లకిందటి పగతో మనవరాలిని..

కాన్పూర్: తన తాతపై పగతో ఓ పదేళ్ల మనవరాలిపై ఇద్దరు బాలురు(14, 15) లైంగిక దాడి చేశారు. వయసులో చిన్నవారే అయినా అత్యంత పాశవికంగా ఈ చర్యకు పాల్పడ్డారు. ఈ ఘటన చూసి పోలీసులు కూడా అవాక్కయ్యారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఫిరోజాబాద్ లో ఓ రెండు కుటుంబాలు ఉన్నాయి. వారి మధ్య పదేళ్ల కిందట నుంచే వైరం ఉంది. అది మర్చిపోయారనే చుట్టుపక్కలవారు అనుకున్నారు. బాలిక తరుపు తాతయ్య నిందితుల్లో ఒకరి తాతను తుపాకీతో కాల్చి చంపాడు.

అది కూడా పద్నాలుగేళ్ల కిందట చోటుచేసుకుంది. అంటే దాదాపు ఈ చర్యకు పాల్పడిన బాలుడు ఇంకా జన్మించలేదు కూడా. ఆ విషయం ఇంట్లో వాళ్లు చెబితే మనసులో పెట్టుకున్నాడో.. లేక తనంతట తానే ఈచర్యకు పాల్పడ్డాడో మొత్తానికి ఓ దుశ్చర్యకు దిగాడు. బయటకు వెళ్లి వస్తున్న పదేళ్ల బాలికను తన స్నేహితుడితో కలిసి సమీపంలోని పొదల్లోకి ఈడ్చుకెళ్లి రేప్ చేశారు. బాలిక స్పృహ కోల్పోవడంతో పోలీసులు ఆగ్రా ఆస్పత్రికి తరలించారు. ఈ చర్యకు ఇంట్లో వారేమైనా పురికొల్పారా అనే కోణంలో కూడా దర్యాప్తు మొదలుపెట్టారు. ఇద్దరు మైనర్లను అరెస్టు చేసి జువెనైల్ కు తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement