భారత్-బంగ్లాదేశ్ రెండో టెస్టుకు కాన్పూర్‌లోని గ్రీన్ పార్క్ స్టేడియం ఆతిథ్యమివ్వనున్న సంగతి తెలిసిందే. సెప్టెంబర్ 27 నుంచి ఇరు జట్ల మధ్య సెకెండ్ టెస్టు ప్రారంభం కానుంది. భారత్ క్లీన్ స్వీప్‌పై కన్నేయగా.. మరోవైపు బంగ్లా ఈ మ్యాచ్‌లో గెలిచి పరువు నిలబెట్టుకోవాలని భావిస్తోంది.
అయితే ఈ మ్యాచ్‌కు వర్షం ముప్పు పొంచి ఉంది. ఆట తొలి రెండు రోజుల పాటు కాన్పూర్‌లో భారీ వర్షం కురిసే అవకాశన్నట్లు తెలుస్తోంది. సెప్టెంబర్ 27(శుక్రవారం), శనివారం నాడు 90 శాతానికి పైగా వర్షం కురిసే అవకాశం ఉందని ఆక్యూ వెదర్ రిపోర్ట్ చెబుతోంది. ఆదివారం కూడా వర్షం కురవడానికి 50 శాతం ఆస్కారం ఉందని ఆక్యూ వెదర్ రిపోర్ట్ తెలుపుతుంది.
ఆఖరి రెండు రోజులకు ఎటువంటి వర్షం ముప్పులేనిట్లు సమాచారం. అయితే భారీ వర్ష సూచన నేపథ్యంలో ఉత్తరప్రదేశ్ క్రికెట్ అసోషియేషన్ ఆప్రమత్తమైంది. ఢిల్లీ క్రికెట్ అసోషియేషన్ నుంచి అదనపు కవర్లను తెప్పించేందుకు యూపీసీఎ సిద్దమైంది. ముందు జాగ్రత్తగా మైదానం మొత్తం కవర్లతో కప్పి ఉంచాలని యూపీసీఎ అధికారులు భావిస్తున్నారు.
అయితే కాన్పూర్ గ్రౌండ్‌లో మెరుగైన డ్రైనేజీ వ్యవస్థ కూడా లేదు. దీంతో చిన్నపాటి వర్షం పడిన కూడా మ్యాచ్‌కు తీవ్ర అంతరాయం కలిగే చాన్స్ ఉంది. మరోవైపు బంగ్లాదేశ్‌లో హిందువులపై దాడులకు నిరసనగా ఈ సిరీస్‌ను అడ్డుకోవాలని హిందూ మహాసభ నిరసనలు చేపట్టాలని నిర్ణయించుకున్న విషయం తెలిసిందే. దీంతో కాన్పూర్ స్టేడియం వద్ద భారీ భద్రత ఏర్పాటు చేశారు. ఇక ఇరు జట్లు ఇప్పటికే కాన్పూర్‌కు చేరుకున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment