
బంగ్లాదేశ్‌తో టెస్టు సిరీస్‌పై టీమిండియా కన్నేసింది. సెప్టెంబర్ 27 నుంచి కాన్పూర్ వేదికగా ప్రారంభం కానున్న రెండో టెస్టులో బంగ్లాతో భారత్ తలపడనుంది. తొలి మ్యాచ్‌లో బంగ్లాను చిత్తు చేసిన టీమిండియా.. ఇప్పుడు రెండో టెస్టులో కూడా అదే జోరును కొనసాగించాలని భావిస్తోంది.
అయితే గ్రీన్ పార్క్ స్టేడియంలో జరగనున్న ఈ మ్యాచ్‌కు పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేశారు. బంగ్లాదేశ్‌లో హిందువులపై జరుగుతున్న అకృత్యాలను నిరసిస్తూ సోమవారం గ్రీన్ పార్క్ స్టేడియం ముందు అఖిలేష్ భారతీయ హిందూ మహాసభ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు.
దీంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మూడెంచెల భద్రతను ఏర్పాటు చేశారు. బంగ్లా జట్టు బస చేసే హోటల్ వద్ద భద్రతను భారీగా పెంచినట్లు కాన్పూర్ అదనపు పోలీసు కమిషనర్ హరీష్ చందర్ తెలిపారు.
యూపీ పోలీస్, రాష్ట్ర ఇంటెలిజెన్స్ ఏజెన్సీలతో సమన్వయం చేసుకుంటూ అదనపు భద్రతను ఏర్పాటు ఆయన వెల్లడించారు. అదే విధంగా మ్యాచ్ జరిగే సమయంలో సీనియర్ ర్యాంక్ స్ధాయి ఆధికారులు కూడా బందోబస్తులో ఉంటరాని హరీష్ చందర్ స్పష్టం చేశారు. కాగా రెండో టెస్టు కోసం ఇరు జట్లు మంగళవారం సాయంత్రం కాన్పూర్‌కు చేరుకోనున్నాయి.
చదవండి: IND vs BAN: అగార్కర్ కీలక నిర్ణయం.. జట్టు నుంచి స్టార్ ప్లేయర్ అవుట్?
Comments
Please login to add a commentAdd a comment