కాన్పూర్ వేదికగా భారత్-బంగ్లాదేశ్ మధ్య జరుగుతున్న రెండో టెస్టును వరుణుడు వెంటాడుతూనే ఉన్నాడు. వర్షం కారణంగా మూడో రోజు ఆట కూడా ప్రారంభం కాలేదు. శనివారం రాత్రి కురిసిన భారీ వర్షానికి గ్రీన్ పార్క్ మైదానం ఔట్ ఫీల్డ్ చిత్తడిగా మారింది.
అయితే ప్రస్తుతం కాన్పూర్‌లో వర్షం కురవడం లేదు. దీంతో మైదానాన్ని సిద్దం చేసే పనిలో గ్రౌండ్ స్టాప్ పడ్డారు. గ్రీన్ పార్క్ స్టేడియంలో మెరుగైన డ్రైనజీ వ్యవస్ధ లేకపోవడంతో గ్రౌండ్‌ను రెడీ చేసేందుకు సిబ్బందికి కష్టతరం అవుతోంది. ఆదివారం మధ్యాహ్నం 12:00 గంటలకు అంపైర్‌లు పిచ్‌ను పరిశీలించనున్నారు.
కాగా ఇప్పటికే రెండో రోజు(శనివారం) ఆట కనీసం బంతి పడకుండానే రద్దు అయింది. ఇప్పుడు మూడో రోజు ఆటకు కూడా భారీ వర్షం ముప్పు పొంచి ఉంది. మళ్లీ వర్షం ఏమైనా తిరుగుముఖం పడితే మూడో రోజు ఆట కూడా రద్దు అయ్యే అవకాశముంది. కాగా బంగ్లా జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 3 వికెట్లు కోల్పోయి 107 పరుగులు చేసిన సంగతి తెలిసిందే.
భారత్ వర్సెస్ బంగ్లాదేశ్ రెండో టెస్టు తుదిజట్లు
టీమిండియా
యశస్వి జైస్వాల్, రోహిత్ శర్మ(కెప్టెన్), శుబ్‌మన్ గిల్, విరాట్ కోహ్లి, రిషభ్ పంత్(వికెట్ కీపర్), కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, ఆకాశ్ దీప్, జస్‌ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్
బంగ్లాదేశ్
షాద్‌మన్ ఇస్లాం, జకీర్ హసన్, నజ్ముల్ హొస్సేన్ శాంటో(కెప్టెన్), మోమినుల్ హక్, ముష్ఫికర్ రహీమ్, షకీబ్ అల్ హసన్, లిటన్ దాస్(వికెట్‌కీపర్), మెహిదీ హసన్ మిరాజ్, తైజుల్ ఇస్లాం, హసన్ మహమూద్, ఖలీద్ అహ్మద్.
Comments
Please login to add a commentAdd a comment