భారత్-బంగ్లాదేశ్ రెండో టెస్టుకు సమయం అసన్నమైంది. కాన్పూర్ వేదికగా సెప్టెంబర్ 27 నుంచి ఇరు జట్ల మధ్య రెండో టెస్టు ప్రారంభం కానుంది. ఇప్పటికే తొలి టెస్టులో బంగ్లాను చిత్తు చేసిన టీమిండియా.. ఇప్పడు రెండో టెస్టులో కూడా అదే జోరును కొనసాగించి సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేయాలని ఉవ్విళ్లూరుతోంది. మరోవైపు తొలి టెస్టులో విఫలమైన బంగ్లాదేశ్ కనీసం కాన్పూర్ టెస్టులోనైనా గెలిచి పరువు నిలుపుకోవాలని భావిస్తోంది.
మూడేళ్ల తర్వాత..
కాగా కాన్పూర్‌లోని గ్రీన్ పార్క్ స్టేడియం ఆతిథ్యమివ్వనుండడం మూడేళ్ల తర్వాత ఇదే తొలిసారి. చివరగా 2021లో న్యూజిలాండ్‌తో భారత్ తలపడింది. ఆఖరి సెషన్ వరకు ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్ డ్రాగా ముగిసింది. ఆ మ్యాచ్‌లో కివీస్ అసాధారణ పోరాటం కనబరిచింది. ఈమ్యాచ్‌తోనే రచిన్ రవీంద్ర కివీస్ తరపున టెస్టు క్రికెట్‌లోకకి అడుగుపెట్టాడు.
బంగ్లాకు స్పిన్ ఉచ్చు..
ఇక రెండో టెస్టుకు ముందు భారత జట్టు మెనెజ్‌మెంట్ ఓ కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఈఎస్‌పీఎన్ క్రిక్ఇన్ఫో ప్రకారం.. ఈ మ్యాచ్ కోసం గ్రీన్ పార్క్ మైదానంలో బ్లాక్ సోయిల్ పిచ్‌ను తాయారు చేస్తున్నట్లు తెలుస్తోంది. హెడ్ కోచ్ గౌతం గంభీర్ దగ్గరుండి పిచ్‌ను తాయారు చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. బ్లాక్ సోయిల్ పిచ్ బౌన్స్ తక్కువగా ఉండి, టర్న్ ఎక్కువగా ఉంటుంది.
మ్యాచ్ కొనసాగే కొద్దీ వికెట్ స్లో కానుంది. దీంతో ఈ ట్రాక్‌పై స్పిన్నర్లు పండుగ చేసుకుంటారు. ఈ క్రమంలో భారత స్పిన్ జోడీ రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా మరోసారి బంగ్లా బెండు తీసే అవకాశముంది. మరోవైపు బంగ్లాలో కూడా షకీబ్, మెహదీ హసన్ వంటి క్వాలిటీ స్పిన్నర్లు ఉన్నారు.
కాగా చెపాక్ వేదికగా జరిగిన తొలి టెస్టులో రెడ్ సాయిల్ పిచ్‌ను ఉపయోగించిన సంగతి తెలిసిందే. ఈ వికెట్ పేస్ బౌలింగ్‌తో పాటు బ్యాటింగ్, స్పిన్‌కు సహకరించింది. కానీ నల్లమట్టి పిచ్ మాత్రం ఇందుకు భిన్నంగా ఉంటుంది. ఈ క్రమంలో కాన్పూర్ టెస్టులో భారత్ ముగ్గురు స్పిన్నర్లతో ఆడే అవకాశం ఉంది. కుల్దీప్ యాదవ్ తుది జట్టులోకి వచ్చే ఛాన్స్ ఉంది.
చదవండి: IT 2024: జట్టును ప్రకటించిన బీసీసీఐ.. కెప్టెన్‌గా రుతురాజ్! సంజూకు నో ఛాన్స్
Comments
Please login to add a commentAdd a comment