IND vs BAN 2nd test live updates and highlights: టీమిండియా- బంగ్లాదేశ్ తొలి రోజు ఆట అర్ధంతరంగా ముగిసిపోయింది. వర్షం కారణంగా 35 ఓవర్లకే ఆగిపోయింది. దీంతో శుక్రవారం ఆట పూర్తయినట్లు భారత క్రికెట్ నియంత్రణ మండలి ప్రకటన విడుదల చేసింది. కాన్పూర్‌లో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన బంగ్లా 35 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 107 పరుగులు చేసింది.
ఆటంకం
టీమిండియా- బంగ్లాదేశ్ రెండో టెస్టు తొలి రోజు ఆటకు ఆటంకం కలిగింది. వెలుతురులేమి కారణంగా ఆటను తాత్కాలికంగా నిలిపివేశారు.
సెంచరీ మార్కు దాటిన బంగ్లాదేశ్
34 ఓవర్లలో బంగ్లాదేశ్ స్కోరు: 102-3.
మొమినుల్ హక్ 36, ముష్ఫికర్ రహీం 5 పరుగులతో ఆడుతున్నారు.
అశ్విన్ మ్యాజిక్.. బంగ్లా మూడో వికెట్ డౌన్
కెప్టెన్ నజ్ముల్ హొస్సేన్ శాంటో రూపంలో బంగ్లాదేశ్ మూడో వికెట్ కోల్పోయింది. 31 పరుగులు చేసిన శాంటో.. అశ్విన్ బౌలింగ్‌లో ఎల్బీగా వెనుదిరిగాడు. 30 ఓవర్లకు బంగ్లా స్కోర్: 80/3. క్రీజులోకి రహీం వచ్చాడు.
నిలకడగా ఆడుతున్న బంగ్లా
బంగ్లాదేశ్ నిలకడగా ఆడుతోంది. తొలి రోజు లంచ్ సమయానికి బంగ్లాదేశ్ 2 వికెట్ల నష్టానికి 74 పరుగులు చేసింది. క్రీజులో మమూనల్ హాక్(17), శాంటో(28) పరుగులతో ఉన్నారు. కాన్పూర్‌లో వర్షం కూడా మొదలైంది.
రెండో వికెట్ డౌన్..
షాద్‌మాన్ ఇస్లాం రూపంలో బంగ్లాదేశ్ రెండో వికెట్ కోల్పోయింది. 24 పరుగులు చేసిన షాద్‌మాన్.. ఆకాష్ దీప్ బౌలింగ్‌లో ఎల్బీగా వెనుదిరిగాడు. క్రీజులోకి కెప్టెన్ శాంటో వచ్చాడు. 13 ఓవర్లకు బంగ్లాదేశ్ స్కోర్: 37/2
తొలి వికెట్ కోల్పోయిన బంగ్లా
బంగ్లాదేశ్ తొలి వికెట్ కోల్పోయింది. పేసర్ ఆకాష్ దీప్ బంగ్లా ఓపెనర్ జకీర్ హసన్‌ను పెవిలియన్‌కు పంపాడు. జైశ్వాల్ స్లిప్‌లో అద్బుతమైన క్యాచ్ అందుకున్నాడు. క్రీజులోకి మమూనల్ హాక్ వచ్చాడు.
5 ఓవర్లకు బంగ్లా స్కోర్: 13/0
5 ఓవర్లు ముగిసే సరికి బంగ్లాదేశ్ వికెట్ నష్టపోకుండా 12 పరుగులు చేసింది. క్రీజులో షద్మాన్ ఇస్లాం(8), జకీర్ హసన్(0) ఉన్నారు.
బౌలింగ్ ఎంచుకున్నభారత్..
కాన్పూర్ వేదికగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో టాస్ గెలిచిన టీమిండియా తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌లో భారత్ ఎటువంటి మార్పులు లేకుండా బరిలోకి దిగగా.. బంగ్లా మాత్రం రెండు మార్పులు చేసింది.
జట్టులోకి టాస్కిన్ ఆహ్మద్, నహిద్ రాణా స్ధానంలో ఖాలీల్ ఆహ్మద్, తైజుల్ ఇస్లాం వచ్చారు. గ్రీన్ పార్క్ పిచ్ కాస్త స్పిన్కు అనుకూలించే ఛాన్స్ ఉన్నందన అదనపు స్పిన్నర్‌తో బంగ్లా ఆడుతోంది.
తుది జట్లు
బంగ్లాదేశ్: షద్మాన్ ఇస్లాం, జకీర్ హసన్, నజ్ముల్ హొస్సేన్ శాంటో(కెప్టెన్), మోమినుల్ హక్, ముష్ఫికర్ రహీమ్, షకీబ్ అల్ హసన్, లిట్టన్ దాస్(వికెట్‌కీపర్), మెహిదీ హసన్ మిరాజ్, తైజుల్ ఇస్లాం, హసన్ మహమూద్, ఖలీద్ అహ్మద్
భారత్: యశస్వి జైస్వాల్, రోహిత్ శర్మ(కెప్టెన్), శుభమన్ గిల్, విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్(వికెట్ కీపర్), కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, ఆకాష్ దీప్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్
టాస్ ఆలస్యం
కాన్పూర్ వేదికగా భారత్-బంగ్లాదేశ్ మధ్య ప్రారంభమవ్వాల్సిన రెండో టెస్టుకు వరుణుడు ఆడ్డంకిగా మారాడు. గురువారం రాత్రి కురిసిన భారీ వర్షానికి గ్రీన్ ఫీల్డ్ మైదానం ఔట్ ఫీల్డ్ చిత్తడిగా మారింది.
ప్రస్తుతం వర్షం ఆగడంతో గ్రౌండ్‌ను సిద్దం చేసే పనిలో సిబ్బంది పడ్డారు. దీంతో 9:00 గంటలకు పడాల్సిన టాస్ కాస్త ఆలస్యం కానుంది. మైదానాన్ని అంపైర్లు 9:30లకు పరిశీలించనున్నారు. ఇరు జట్ల ఆటగాళ్లు బయటకు వచ్చి సాధన చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment