సాక్షి, న్యూఢిల్లీ : ఒకప్పుడు వినోదం, విహారం కోసం కొండ కోనల్లోకి వెళితే ఇప్పుడు సెల్ఫీల కోసం, ఫొటోల కోసం అలాటి చోట్లకు వెళ్లి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. టెక్సాస్‌లోని ఆస్టిన్‌కు చెందిన 20 ఏళ్ల ఎమలీ కొఫోర్డ్, తన తల్లి ఎరిన్ కొఫోర్డ్‌ను తీసుకొని ఇటీవల ఆరిజోనాలోని గ్రాండ్ కన్యన్ పర్వత శ్రేణుల్లోకి వెళ్లారు. నల్లటి చలి కోటు, మెడలో మఫ్లర్ ధరించిన తన తల్లి ఎరిన్ కొఫోర్డ్‌ను లోయ బ్యాక్ ట్రాప్‌లో అందంగా ఫొటో తీసేందుకు ఎమలీ కొఫొర్డ్ సిద్ధమైంది.
కెమేరా లెన్స్ పరిధిలోని నిలువెత్తు ఫొటో పూర్తిగా రావాలకొని ఎమలీ కెమేరా చేతిలో పట్టుకొనే రెండడుగలు వెనక్కి వేసింది. ఒక్క అడుగు వేయగానే ‘ఇంకో అడుగు వేయరాదు’ అని ఆమె తల్లి హెచ్చరించారట. అది వినని ఎమలీ రెండో అడుగు వెనక్కి వేయగానే కొండ అంచున చీలిన రాతి మధ్య కాలు స్లిప్పయింది. అదష్టవశాత్తు నిలదొక్కుకుందిగానీ ఏమాత్రం బ్యాలెన్స్ తప్పినా రాతి లోయలో పడి ఎమలీ పర లోకానికి వెళ్లిపోయేదే..! అనుకోకుండా అక్కడే ఉన్న ‘ఏబీసీ న్యూస్’ ఫొటో గ్రాఫర్ ఎమలీ స్లిప్పయిన దశ్యాన్ని వీడియో తీశారు. ఇప్పుడు దాన్ని ఆన్‌లైన్‌లో పోస్ట్ చేయగా అది వైరల్ అవుతోంది.