Jungle Safari Tourists Taking Pics Of Tiger, Video Goes Viral On Social Media - Sakshi
Sakshi News home page

‘ఇడియట్స్‌.. పులికి ఉన్న జ్ఞానం కూడా లేదు’

Published Sat, Jan 30 2021 10:25 AM | Last Updated on Sat, Jan 30 2021 12:30 PM

Tourists Trying To Take Pics Of A Tiger - Sakshi

జంగిల్‌ సఫారీలో ఎంత స్వేచ్ఛ తీసుకోవాలో అంతే తీసుకోవాలి. ఎక్స్‌ట్రా చేస్తే ఎముకల్లో సున్నం లేకుండా పోతుంది. ఇటీవల ఒక జంగిల్‌ సఫారిలో జరిగిన సంఘటన ఇది. ఒక పులిరాజు తన మానాన తాను రాజసంగా గోడ మీద నడుచుకుంటూ వెళుతోంది. ఇట్టి దృశ్యాన్ని టూరిస్టు బృందాలు చూసి, జోబుల్లో నుంచి ఇస్మార్ట్‌ ఫోన్‌లు తీసి అటు నుంచి ఇటు నుంచి సెల్ఫీలు మొదలు పెట్టాయి.

ఆ పులి ఏ మూడ్‌లో ఉందో తెలియదు గానీ వీరి వైపు చూడలేదు. ‘ఏమిటి నాన్‌సెన్స్‌’ అని పులి అనుకొని ఉంటే సీన్‌ వేరే విధంగా ఉండేది. 15 సెకండ్ల ఈ వీడియో క్లిప్‌ను ట్విట్టర్‌లో పోస్ట్‌ చేసి ‘ఇడియట్స్‌’ అని తిట్టాడు ఫారెస్ట్‌ అధికారి నందా. ‘పులికి ఉన్న జ్ఞానం కూడా వీరికి లేదు’ అని కూడా అన్నాడు. మనం మరో రెండు తిట్లు జోడించడం తప్ప ఏం చేయగలం!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement