ఆమెతో సెల్ఫీలు..ఆయనతో బేరాలు | illegal affair at tadepalli in guntur | Sakshi
Sakshi News home page

ఆమెతో సెల్ఫీలు..ఆయనతో బేరాలు

Published Tue, Jul 25 2017 12:54 PM | Last Updated on Fri, Aug 24 2018 2:36 PM

ఆమెతో సెల్ఫీలు..ఆయనతో బేరాలు - Sakshi

ఆమెతో సెల్ఫీలు..ఆయనతో బేరాలు

గుంటూరు‌: పట్టణ పరిధిలోని ఎదురింటి మొగుడు.. పక్కింటి పెళ్లాం మధ్య వివాహేతర సంబంధం ఏర్పడింది. దీంతో వారు సెల్ఫీలు దిగారు. అనంతరం ఆ ఫోటోలను ఫేస్‌బుక్, వాట్సప్‌లో అప్‌లోడ్‌ చేస్తానంటూ రెండు రోజులుగా ఆమె భర్తకు ఫోన్‌ చేసి బెదిరించడం మొదలెట్టాడు. దీంతో ఆ మహిళ భర్త తాడేపల్లి పోలీసుస్టేషన్‌లో కేసు పెట్టాడు.

వివరాల ప్రకారం.. నులకపేటలో నివాసముండే యువకుడికి నాలుగేళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఇద్దరు పిల్లలు. వీరి పక్కింట్లో నివాసముండే మరో వ్యక్తి, ఆ యువకుడి భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఈ విషయం ఆమె భర్తకు తెలియడంతో పోలీస్‌స్టేషన్‌ వరకు వెళ్లింది. అక్కడ పోలీసులు రాజీ చేసి పంపారు. అయితే 15 రోజులు తర్వాత మళ్లీ ఇద్దరూ కలిసి సెల్ఫీలు దిగారు. వాటిని ఆమె భర్తకు పంపించి డబ్బులిస్తావా లేకపోతే ఫేస్‌బుక్, వాట్సప్‌లలో అప్‌లోడ్‌ చేస్తానంటూ పక్కింటి వ్యక్తి బెదిరింపులకు పాల్పడ్డాడు. అతడిపై వెంటనే ఆ యువతి భర్త తాడేపల్లి పోలీస్‌స్టేషన్‌లో కేసు పెట్టాడు. పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement