మరోసారి సల్మాన్‌ ఆగ్రహం, వీడియో వైరల్‌ | Watch Video, Salman Khan Loses Cool Snatches Fan Phone At Goa Airport | Sakshi
Sakshi News home page

మరోసారి సల్మాన్‌ ఆగ్రహం, వీడియో వైరల్‌

Published Tue, Jan 28 2020 4:54 PM | Last Updated on Thu, Mar 21 2024 7:59 PM

సాక్షి,ముంబై: బాలీవుడ్‌ స్టార్‌ హీరో సల్మాన్‌ఖాన్‌ మరోసారి ఫ్యాన్స్‌పై అసహనం ప్రకటించి వార్తల్లో నిలిచారు. తనతో సెల్ఫీ క్లిక్ చేయడానికి ప్రయత్నించిన అభిమాని పట్ల సల్మాన్‌ ప్రవర్తన ఆయన  పలువురిని దిగ్భ్రాంతికి గురి చేసింది. గోవా ఎయిర్‌పోర్ట్‌ నుంచి బయటికి నడిచి వస్తున్న  హీరో  సల్మాన్‌తో సెల్ఫీ తీసుకోవడానికి ప్రయత్నించాడు ఒక వ్యక్తి.  దీనిపై  కోపం తెచ్చుకున్న  సల్మాన్‌  ఈ వ్యక్తి నుండి మొబైల్‌ చటుక్కున లాక్కున్నా డు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. గోవా అంతర్జాతీయ విమానాశ్రయంలో మంగళవారం ఈ ఉదంతం చోటు చేసుకుంది.   

తరువాత అతను విమానయాన సంస్థలో పనిచేస్తున్న గ్రౌండ్ స్టాఫ్‌గా గుర్తించారు.  వీడియో వైరల్‌ అయిన తరువాత  ఈ సంఘటన గురించి విచారించి ఈ విషయాన్ని ధృవీకరించామని  విమానాశ్రయ సీనియర్ అధికారి  చెప్పారు. దీనిపై ఎలాంటి కేసు నమోదు కాలేదన్నారు.  కాగా సల్మాన్ ప్రస్తుతం రాధే చిత్రీకరణలో బిజీగా ఉన్నారు. ఈ ఏప్రిల్‌ నాటికి (ఈద్‌) సల్మాన్ రాధే మూవీ అక్షయ్ కుమార్  చిత్రం లక్ష్మీ బాంబ్ చిత్రంతో  పోటీ పడనుంది. అలాగు సాజిద్ నాడియాద్వాలాతో కభీ ఈద్ కభీ దీపావళి అనే సినిమాకు సైన్‌ చేసిన సంగతి తెలిసిందే.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement