snatched
-
వాతావరణ కార్యకర్త ఫోన్ చోరీ...ఫేస్బుక్లో లైవ్ రికార్డు చేస్తుండగా....
నొయిడా: వాతావరణ కార్యకర్త లిసిప్రియ కంగుజం మొబైల్ ఫోన్‌ని గుర్తు తెలియని వ్యక్తులు రెప్పపాటులో లాక్కుని పరారయ్యారు. ఈ మేరకు 11 ఏళ్ల బాలిక లిసిప్రియ నొయిడాలో తన అనుచరులతో కలిసి ఫేస్బుక్ లైవ్ రికార్డు చేస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. ఆమె వాతావరణాన్ని కలుషితం కాకుండా ఉండేలా... కాకర్స్ కాల్చకుండా దీపావళి పండుగను ఎలా జరుపుకోవాలనే దానిపై ప్రత్యక్ష ప్రసారం చేస్తోంది. ఇంతలో వెనుక నుంచి బైక్‌పై వచ్చిన ఇద్దరు దుండగలు ఆమె ఫోన్‌ని లాక్కుకుని వెళ్లిపోయారు. దీంతో ఆమె పోలీస్టేషన్లో ఫిర్యాదు చేయడమే కాకుండా తనకు సహాయం చేయమంటూ ట్విట్టర్లో ఒక సందేశాన్ని కూడా పోస్ట్ చేసింది. ఈ మేరకు సెంట్రల్ నొయిడా అదనపు డీసీపీ సాద్మియాన్ కేసు నమోదు మొబైల్ స్నాచర్ కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు తెలిపారు. మణిపూర్‌కి చెందిన లిసిప్రియ కంగుజం వాతావరణ మార్పులపై పోరాటం చేస్తున్న పర్యావరణ కార్యకర్త. కీలకమైన వాతావరణ మార్పు సమస్యలపై పలువురు ప్రపంచ నేతలను కలిసింది కూడా. అంతేగాదు ఆ బాలిక కాప్ 25 వాతావరణ మార్పు సదస్సులో ప్రసంగించి అందరీ మన్ననలను పొందింది. ఇటీవల చత్తీస్‌గఢ్ బొగ్గు వ్యతిరేక నిరసనలో పాల్గొంది. అలాగే 2020లో వాషింగ్టన్లో ఎర్త్‌డేని పురస్కరించుకుని జరిగిన కార్యక్రమంలో కూడా పాల్గొంది. (చదవండి: మిరాకిల్ అంటే ఇదే...మీద నుంచి కారు వెళ్లిపోయింది ఐనా...) -
మరోసారి సల్మాన్ ఆగ్రహం, వీడియో వైరల్
సాక్షి,ముంబై: బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్‌ఖాన్ మరోసారి ఫ్యాన్స్‌పై అసహనం ప్రకటించి వార్తల్లో నిలిచారు. తనతో సెల్ఫీ క్లిక్ చేయడానికి ప్రయత్నించిన అభిమాని పట్ల సల్మాన్ ప్రవర్తన ఆయన పలువురిని దిగ్భ్రాంతికి గురి చేసింది. గోవా ఎయిర్పోర్ట్ నుంచి బయటికి నడిచి వస్తున్న హీరో సల్మాన్‌తో సెల్ఫీ తీసుకోవడానికి ప్రయత్నించాడు ఒక వ్యక్తి. దీనిపై కోపం తెచ్చుకున్న సల్మాన్ ఈ వ్యక్తి నుండి మొబైల్ చటుక్కున లాక్కున్నా డు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. గోవా అంతర్జాతీయ విమానాశ్రయంలో మంగళవారం ఈ ఉదంతం చోటు చేసుకుంది. తరువాత అతను విమానయాన సంస్థలో పనిచేస్తున్న గ్రౌండ్ స్టాఫ్‌గా గుర్తించారు. వీడియో వైరల్ అయిన తరువాత ఈ సంఘటన గురించి విచారించి ఈ విషయాన్ని ధృవీకరించామని విమానాశ్రయ సీనియర్ అధికారి చెప్పారు. దీనిపై ఎలాంటి కేసు నమోదు కాలేదన్నారు. కాగా సల్మాన్ ప్రస్తుతం రాధే చిత్రీకరణలో బిజీగా ఉన్నారు. ఈ ఏప్రిల్ నాటికి (ఈద్) సల్మాన్ రాధే మూవీ , అక్షయ్ కుమార్ చిత్రం లక్ష్మీ బాంబ్ చిత్రంతో పోటీ పడనుంది. దీంతో పాటు సాజిద్ నాడియా వాలాతో కభీ ఈద్ కభీ దీపావళి అనే సినిమాకు సైన్ చేసిన సంగతి తెలిసిందే. -
మరోసారి సల్మాన్ ఆగ్రహం, వీడియో వైరల్
-
కొట్టేసిన పర్సులో ఆ నోట్లు చూసి...
పెద్ద నోట్ల రద్దు ఎఫెక్ట్ ఎంతలా ఉందంటే... దొంగలు కూడా ఆ నోట్ల దొంగతనానికి వెనక్కి తగ్గుతున్నారు. గ్రేటర్ నోయిడాలో ఓ ఆశ్చర్యకరమైన సంఘటన చోటుచేసుకుంది. దొంగతనం చేసిన దొంగలు అసలు పట్టుబడకుండా తప్పించుకుని పారిపోతారు. కానీ గ్రేటర్ నోయిడాలో దొంగలు మాత్రం, కొట్టేసిన పర్సును వెనక్కి తీసుకొచ్చి ఇచ్చేశారు. దీనికి ప్రధాన కారణమేమిటో తెలుసా? ఆ పర్సులో అన్నీ ఐదు వందల రూపాయల నోట్లు ఉండటమే. వికాస్ కుమార్...గ్రేటర్ నోయిడా కన్స్ట్రక్షన్ సైట్లో కూలీగా పనిచేస్తున్నాడు. పని అయిపోయిన తర్వాత రాత్రి 11 గంటల సమయంలో ఇంటికి నడుచుకుంటూ వెళ్తున్నాడు. కరెక్ట్‌గా బస్ స్టాండు సమీపంలోకి రాగానే, ఓ ఇద్దరు దొంగలు అతని పర్సును కొట్టేసి, పరిగెత్తుకుని పారిపోయారు. అయితే అతని పర్సులో ఉన్న మూడు నోట్లు ఐదువందల రూపాయలవే ఉన్నాయి. పర్సును అపహరించుకుపోయిన దొంగలను పట్టుకోవడానికి ఎవరైనా సహాయం చేస్తారేమోనని వికాస్ వెతుకుతుండగానే.. ఆశ్చర్యంగా ఆ దొంగలే అతని ముందు ప్రత్యక్షమయ్యారు. వారిని చూసి వికాస్ ఒక్కసారిగా షాకయ్యాడు. పర్సులో అన్నీ ఐదువందల నోట్లే ఉన్నాయి... రూ.100 నోట్లు ఎందుకు పెట్టుకోలేదంటూ ఆ దొంగలు వికాస్‌పై దాడికి పాల్పడి పర్సును వెనక్కి ఇచ్చేశారు. అయితే ఈ సంఘటనపై ఇప్పటి వరకు తమవద్ద ఎలాంటి ఫిర్యాదు నమోదుకాలేదని, ఒకవేళ బాధితుడు తమల్ని ఆశ్రయిస్తే, దీనిపై విచారణ చేపడతామని కస్నా పోలీసు స్టేషన్ ఎస్హెచ్ఓ సుధీర్ కుమార్ త్యాగి తెలిపారు. కాగ, బ్లాక్‌మనీపై ఉక్కుపాదంగా, నకిలీ కరెన్సీని నిర్మూలించడానికి ప్రధానమంత్రి నరేంద్రమోదీ 500, 1000 రూపాయల నోట్లను రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు. పటిష్టమైన భద్రతా ఫీచర్లతో 500, 2000 కొత్త నోట్లను నేటి నుంచి జారీచేయడం ప్రారంభించారు. -
సింహపురి ఎక్స్‌ప్రెస్‌లో దోపిడీ దొంగల బీభత్సం
-
నటి శ్రీలక్ష్మి కేసులో సీసీ కెమెరాల ఫుటేజ్ పరిశీలన
హైదరాబాద్ : సినీనటి శ్రీలక్ష్మి నగలను స్నాచింగ్ చేసిన నిందితులను పట్టుకునేందుకు ఎస్ఆర్ నగర్ పోలీసులు ప్రయత్నిస్తున్నారు. బుధవారం మధ్యాహ్నం శ్రీలక్ష్మి యూసఫ్‌గూడలోని అయ్యంగార్ బేకరీకి వచ్చి వెళ్తుండగా దుండగలు ఆమె మెడలోని 8 తులాల బంగారు నగలను తెంచుకెళ్లిన విషయం తెలిసిందే. కారు వద్దకు ఆమె ఒంటరిగా వస్తున్నట్లు గమనించి దుండగులు స్నాచింగ్‌కు పాల్పడి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. అయితే శ్రీలక్ష్మిని ఎక్కడి నుంచి వెంబడించారన్న దానిపై విచారణ జరుపుతున్నారు. శ్రీనగర్ కాలనీలోని శ్రీలక్ష్మి నివాసం నుంచి యూసుఫ్‌గూడలోని బేకరీ వరకు ఉన్న సీసీ కెమెరాల ఫుటేజ్‌లను పోలీసులు పరిశీలిస్తున్నారు. గురువారం సాయంత్రం పోలీస్ స్టేషన్‌కు వచ్చిన శ్రీలక్ష్మికి ...ఈ కేసుకు సంబంధించిన ఎఫ్ఐఆర్ కాపీని అందచేశామని, నిందితులను త్వరలోనే పట్టుకుంటామని డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ శంకర్ తెలిపారు. -
సినీనటి మెడలో గొలుసు లాక్కెళ్లారు!
హైదరాబాద్: సినీ హాస్యనటి శ్రీలక్ష్మి మెడలోని బంగారు గొలుసును ఇద్దరు దుండగులు లాక్కొని పారిపోయారు. యూసఫ్‌గూడలో నివాసం ఉంటున్న శ్రీలక్ష్మి సమీపంలోని షాపుకు వెళ్లి తిరిగి వస్తుండగా ఈ చోరీ జరిగింది. ద్విచక్ర వాహనంపై వచ్చిన ఇద్దరు యువకులు ఆమె మెడలోని గొలుసు లాక్కొని వెళ్లిపోయారు. శ్రీలక్ష్మి ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. **