
శ్రీలక్ష్మి
హైదరాబాద్: సినీ హాస్యనటి శ్రీలక్ష్మి మెడలోని బంగారు గొలుసును ఇద్దరు దుండగులు లాక్కొని పారిపోయారు. యూసఫ్గూడలో నివాసం ఉంటున్న శ్రీలక్ష్మి సమీపంలోని షాపుకు వెళ్లి తిరిగి వస్తుండగా ఈ చోరీ జరిగింది.
ద్విచక్ర వాహనంపై వచ్చిన ఇద్దరు యువకులు ఆమె మెడలోని గొలుసు లాక్కొని వెళ్లిపోయారు. శ్రీలక్ష్మి ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
**