srilakshmi
-
ఏపీలో ఐఏఎస్, ఐపీఎస్‌లపై కూటమి సర్కార్ కక్ష సాధింపు
-
19న అంబేడ్కర్ స్మృతివనం ప్రారంభోత్సవం
సాక్షి, అమరావతి: విజయవాడ స్వరాజ్ మైదానంలో ఏర్పాటు చేసిన అంబేడ్కర్ స్మృతివవాన్ని ఈ నెల 19న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రారంభిస్తారని రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వై.శ్రీలక్ష్మి తెలిపారు. స్మృతివనం పనులను శ్రీలక్ష్మి గురువారం వివిధ శాఖల అధికారులతో కలిసి పరిశీలించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ.. 18.81 ఎకరాల స్థలంలో రూ.400 కోట్లతో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న అంబేడ్కర్ స్మృతివనం, కాంస్య విగ్రహ నిర్మాణ పనులు తుది దశకు చేరుకున్నాయని చెప్పారు. అంబేడ్కర్ విగ్రహం ఎత్తు 125 అడుగులు కాగా, పాదపీఠం ఎత్తు 85 అడుగులు అని, దీంతో మొత్తం విగ్రహం ఎత్తు 210 అడుగులు ఉంటుందన్నారు. ప్రపంచంలో ఇదే అత్యంత ఎత్తయిన అంబేడ్కర్ విగ్రహం అని తెలిపారు. స్మృతివనంలోని అంబేడ్కర్ ఎక్స్పీరియన్స్ సెంటర్, కన్వెన్షన్ సెంటర్, మినీ థియేటర్, ఫుడ్ కోర్టు, చిన్నారులకు ప్లే ఏరియా, గార్డెన్లు, మ్యూజిక్ ఫౌంటెయిన్, వాటర్ ఫౌంటెయిన్లు కూడా సీఎం జగన్ ప్రారంభిస్తారని వివరించారు. స్మృతివనం ప్రారంభోత్సవాన్ని రాష్ట్ర పండుగలా నిర్వహిస్తామన్నారు. ప్రపంచంలోనే అద్భుతమైన కళాఖండం ప్రపంచంలోనే అద్భుతమైన కళాఖండంగా డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ స్మృతివనాన్ని తీర్చిదిద్దారని ఏపీ ఎస్సీ కమిషన్ చైర్మన్ మారుమూడి విక్టర్ ప్రసాద్ అన్నారు. అంబేడ్కర్ స్మృతివనాన్ని గురువారం ఆయన పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. విజయవాడకే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా నిలిచిన అంబేడ్కర్ విగ్రహ ప్రారం¿ోత్సవానికి రాష్ట్రం నలుమూలల నుంచి లక్షలాది మంది తరలివస్తారని చెప్పారు. -
సఫాయి కార్మికుల ఆరోగ్య పరిరక్షణకు చర్యలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని పారిశుద్ధ్య, సఫాయి కార్మికుల ఆరోగ్య పరిరక్షణకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతుందని, వారి సంక్షేమానికి ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నదని పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వై.శ్రీలక్ష్మి అన్నారు. గురువారం తాడేపల్లిలోని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కార్యాలయంలో పారిశుద్ధ్య కార్మికుల సంక్షేమం, అభివృద్ధిపై స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఆధ్వర్యంలో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. శ్రీలక్ష్మి మాట్లాడుతూ.. సమాజంలో సమానత్వాన్ని తీసుకురావడంతో పాటు కార్మికుల ఆత్మగౌరవం పెంచే దిశగా అడుగులు వేస్తున్నామని చెప్పారు. పారిశుద్ధ్య పనుల్లో ఇకపై యంత్రాల వినియోగానికి ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఎండీ గంధం చంద్రుడు మాట్లాడుతూ.. తమను కనీసం ముట్టుకోవడానికి ఇష్టపడని సమాజంలోనూ సఫాయి కార్మికులు అందిస్తున్న సేవలు ఎనలేనివని కొనియాడారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బి.రాజశేఖర్ మాట్లాడుతూ.. పారిశుద్ధ్య కార్మికులు లేకుంటే పర్యావరణమే మురికికూపంగా మారుతుందన్నారు. సాంఘిక సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి జయలక్ష్మి, పంచాయతీ, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ సూర్యకుమారి, ఎస్సీ కార్పొరేషన్ ఎం.డీ చిన్నరాముడు, సఫాయి కార్మిక ఆందోళన్ ప్రతినిధి విల్సన్ తదితరులు పాల్గొన్నారు. -
‘అంబేడ్కర్ స్మృతి వనం చిరస్థాయిగా నిలిచిపోతుంది’
సాక్షి, విజయవాడ: విజయవాడ స్వరాజ్య మైదానంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోన్న డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ స్మృతివనాన్ని నవంబర్ 26వ తేదీన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రారంభిస్తారన్నారు స్పెషల్ సీఎస్ శ్రీలక్ష్మి. ఈరోజు(గురువారం) ఉన్నతాధికారులతో కలిసి అంబేడ్కర్ విగ్రహ ఏర్పాట్లపై సీఎస్ సమీక్షించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. అంబేడ్కర్ స్మృతివనం విగ్రహం దేశ చరిత్రలోనే చిరస్థాయిగా నిలిచిపోతుందన్నారు. ప్రపంచ పర్యాటకులను ఆకర్షించేలా అంబేడ్కర్ స్మృతివనం విగ్రహం ఉంటుందన్నారు. -
రైలు కిందపడి చిన్నారి మృతి
మహబూబ్‌నగర్: హైదరాబాద్‌లో బంధువుల దగ్గరికి వెళ్తుండగా రైలు దిగుతున్న సమయంలో కాలు జారి చిన్నారి రైలుకింద పడి మృతి చెందిన ఘటన ఆదివారం చోటు చేసుకుంది. బాధితుల వివరాల ప్రకారం.. మండల పరిధిలోని వెంకట్‌రెడ్డిపల్లికి చెందిన పీ చంద్రారెడ్డికి ముగ్గురు కూతుళ్లు. మూడో కూతురు శ్రీలక్ష్మి (3) మహమ్మదాబాద్ ఎంజల్వ్యాలీ పాఠశాలలో నర్సరీ చదువుతోంది. ఆదివారం మధ్యాహ్నం హైదరాబాద్‌లోని చంద్రారెడ్డి అన్న ఇంటికి భార్యాభర్తలు పిల్లలతో కలిసి హైదరాబాద్‌లోని బుద్వేల్‌కు రైల్లో వెళ్లారు. రైలు దిగుతున్న సమయంలో చిన్నారి శ్రీలక్ష్మి ప్రమాదవశాత్తు జారి ట్రైన్ కిందపడి అక్కడికక్కడే మృతి చెందింది. చిన్న కూతురు మృతి చెందడంతో వారి కుటుంబంలో, గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. -
మెరుగుపడిన ఆరోగ్యం..‘విశ్వభారతి’ నుంచి శ్రీలక్షి డిశ్చార్జి
సాక్షి ప్రతినిధి కర్నూలు : ఎంపీ అవినాశ్‌రెడ్డి తల్లి శ్రీలక్ష్మి ఆరోగ్యం మెరుగుపడటంతో ఆమెను విశ్వభారతి ఆస్పత్రి నుంచి శుక్రవారం ఉదయం డిశ్చార్జ్ చేశారు. తదుపరి చికిత్స కోసం ఆమెను హైదరాబాద్‌కు తరలించారు. తల్లి వెంట అవినాశ్ కూడా హైదరాబాద్‌కు వెళ్లారు. ఆయనతో పాటు పలు వురు వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలు ఉన్నారు. ఆస్పత్రి నుంచి అవినాశ్ బయటకు రాగానే వైఎస్సార్సీపీ కార్యకర్తలు, నేతలు కలిసి ఆయనకు ధైర్యం చెప్పారు. మరోవైపు.. డిశ్చార్జ్ అయ్యే రోజు కూడా ఎల్లో మీడియా శుక్రవారం ఉదయం నుంచి అవినాశ్ లక్ష్యంగా తప్పుడు కథనాలే ప్రసారం చేసింది. శ్రీలక్ష్మి డిశ్చార్జ్ కాగానే సీబీఐ అధికారులు అవినాశ్‌ను అరెస్టుచేస్తారని బ్రేకింగ్‌లు, డిబేట్లు నిర్వహించింది. వారం రోజులుగా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న శ్రీలక్ష్మిపై, ఆమె బాగోగులు చూసుకుంటున్న అవినాశ్‌పై కనీస మానవత్వం లేకుండా చికిత్సపై, అవినాశ్ అరెస్టుపై ఇష్టారాజ్యంగా తప్పుడు కథనాలు ప్రసారం చేస్తూనే ఉంది. ఆస్పత్రి నుంచి బయటకు వచ్చిన అవినాశ్ అక్కడ కార్యకర్తలు, మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. ‘అమ్మ ఆరోగ్యం బాగుంది. గుండెలో రక్తనాళాలు బ్లాక్ కావడంతో తదుపరి చికిత్స కోసం హైదరాబాద్‌కు తీసుకెళ్తున్నాం. అమ్మను పరామర్శించేందుకు వచ్చిన అందరికీ ధన్యవాదాలు. మీడియాకు ఏదైనా ఇబ్బందులు జరిగి ఉంటే మనసులో పెట్టుకోవద్దు’.. అని ఆయన చెప్పారు. చేరిక నుంచి డిశ్చార్జ్ వరకూ తప్పుడు కథనాలే! అనారోగ్యంతో పులివెందుల ఆస్పత్రిలో చేరిన శ్రీలక్ష్మిని చూసేందుకు ఈ నెల 19న హైదరాబాద్ నుంచి అవినాశ్ పులివెందులకు బయల్దేరారు. పుల్లూరు టోల్గేట్ వద్ద సీబీఐ అధికారులు ఉన్నారని, అవినాశ్‌ను అరెస్టుచేయబోతున్నారని ‘పచ్చ’ చానళ్లు తప్పుడు కథనాలు ప్రసారం చేశాయి. నిజానికి ఆ రోజు సీబీఐ అధికారులే రాలేదు. 20న కూడా సీబీఐ అధికారులు అరెస్టు చేయబోతున్నారని ప్రచారం చేశారు. 22న సీబీఐ అధికారులు ఎస్పీని కలిశారని.. ఇక్కడి పోలీసుల సహకారం లేకపోవడంతో మధ్యాహ్నానికి కేంద్ర బలగాలు రానున్నాయని, కాసేపట్లో కర్నూలుకు చేరుకుంటాయని, అవినాశ్ అరెస్టు తప్పదని రోజంతా ఏబీఎన్, టీవీ5లో గంటల తరబడి డిబేట్లు నడిపించారు. కానీ, కేంద్ర బలగాలు కర్నూలుకు రాలేదు. అవినాశ్ ఆస్పత్రిలో ఉన్నన్ని రోజులూ ‘ఈరోజు అరెస్టు తప్పదు’ అనే కోణంలోనే ప్రసారం చేశారు. చివరకు శ్రీలక్ష్మి శుక్రవారం ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అవుతారని విశ్వభారతి వైద్యులు హెల్త్ బులిటెన్ విడుదల చేశారు. దీంతో సీబీఐ అధికారులు కర్నూలులో రహస్య ప్రాంతాల్లో ఉన్నారని, డిశ్చార్జ్ కాగానే అరెస్టుచేస్తారని కథనాలు ప్రసారం చేశారు. ఇలా వారం రోజులుగా ఎల్లో మీడియా చెప్పిన ఏ ఒక్కటి జరగలేదు. ఒక్క వార్తలోనూ వాస్తవంలేదు. దీంతో ఎల్లో మీడియా అవినాశ్ లక్ష్యంగా ఎలాంటి తప్పుడు వార్తలు రాసిందో ప్రజలకు స్పష్టమైంది. శ్రీలక్ష్మి ఆరోగ్యంపైనా తప్పుడు వార్తలే.. పులివెందులలో శ్రీలక్ష్మి ఇంట్లో బీపీ వచ్చి పడిపోవడంతో ఉన్నత వైద్యం కోసం ఆమెను హైదరాబాద్‌కు తరలించారు. మార్గమధ్యంలో ఆందోళనకరంగా ఉండటంతో కర్నూలులో విశ్వభారతి సూపర్‌స్పెషాలిటీ ఆస్పత్రిలో చేర్చారు. కార్డియాక్ ఎంజైమ్‌లో మార్పులు వచ్చాయని, ఈసీజీ తీశామని, రెండు రక్తనాళాలు కూడా బ్లాక్ అయ్యాయని డాక్టర్ హితేశ్‌రెడ్డి మీడియాకు చెప్పారు. కానీ, శ్రీలక్ష్మి ఆరోగ్యం బాగానే ఉందని, సీబీఐ నుంచి తప్పించుకునేందుకు అవినాశ్ తల్లిని పావుగా చేసుకున్నారనే కోణంలో కనీస మానవత్వం లేకుండా తప్పుడు వార్తలు ప్రసారం చేశారు. టీడీపీ వ్యక్తులు, మద్దతుదారులతో డిబేట్లు నడిపించారు. చివరకు.. ఆవిడకు బీపీ ఎక్కువై అయానోట్రోపిక్ సపోర్ట్‌తో ఉన్నారని వైద్యులు చెప్పినా తప్పుడు వార్తలకు ఫుల్స్టాప్ పెట్టలేదు. బుధవారం రాత్రి నుంచి శ్రీలక్ష్మి ఆరోగ్యం మెరుగవుతూ రావడంతో శుక్రవారం డిశ్చార్జ్ చేశారు. రెండు రక్తనాశాలు బ్లాక్ కావడంతో చికిత్స కోసం హైదరాబాద్‌కు తరలించారు. దీంతో పచ్చ చానళ్ల ప్రసారాల్లో ఏమాత్రం నిజంలేదని అందరికీ తేటతెల్లమైంది. -
ఎంపీ అవినాష్ రెడ్డి తల్లిదండ్రులిద్దరికీ అస్వస్థత
సాక్షి కర్నూలు/ హైదరాబాద్: ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి తల్లి శ్రీలక్ష్మి అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. దీంతో, వైఎస్ శ్రీలక్ష్మికి కర్నూలు ఆసుపత్రిలో ట్రీట్మెంట్ ఇచ్చారు. అయితే, మెరుగైన వైద్య సేవల కోసం శ్రీలక్ష్మిని హైదరాబాద్‌లోని ఏఐజీ తరలించారు కుటుంబ సభ్యులు. ప్రస్తుతం కార్డియాలజిస్ట్ డాక్టర్ ప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో ఆమెకు చికిత్స అందుతోంది. ఇక, ఎంపీ అవినాష్ రెడ్డి కూడా ఏఐజీ ఆసుపత్రిలోనే ఉన్నారు. మరోవైపు.. వైఎస్ వివేకానందరెడ్డి కేసులో వైఎస్ భాస్కర్ రెడ్డిని సీబీఐ అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అనంతరం, కోర్టు భాస్కర్ రెడ్డికి రిమాండ్ విధించడంతో చంచల్‌గూడ జైలులో రిమాండ్‌లో ఉన్నారు. ఈ క్రమంలో భాస్కర్ రెడ్డికి శుక్రవారం బీపీ పెరగడంతో జైలు అధికారులు వెంటనే ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. కాగా, ఉస్మానియా వైద్యుల సూచన మేరకు మెరుగైన వైద్యం కోసం భాస్కర్ రెడ్డిని రేపు నిమ్స్‌కు తరలించనున్నారు జైలు అధికారులు. ఇది కూడా చదవండి: మంచి చేసే ఉద్దేశం వాళ్లకు లేదు.. నారా చంద్రబాబును నమ్మొద్దు: సీఎం జగన్ -
ఆందోళనకరంగానే అవినాశ్‌రెడ్డి తల్లి శ్రీలక్ష్మి ఆరోగ్యం!
సాక్షి ప్రతినిధి కర్నూలు: ఎంపీ వైఎస్ అవినాశ్‌రెడ్డి మాతృమూర్తి శ్రీలక్ష్మి ఆరోగ్యం విషమంగానే ఉంది. కర్నూలులోని విశ్వభారతి ఆస్పత్రి వైద్యుల బృందం క్రిటికల్ కేర్ యూనిట్(సీసీయూ)లో ఆమె ఆరోగ్యాన్ని ప్రత్యేకంగా పర్యవేక్షిస్తోంది. ఎంపీ అవినాశ్ నిరంతరం అక్కడే ఉంటూ తల్లి బాగోగులు ఎప్పటికప్పుడు స్వయంగా చూసుకుంటున్నారు. వారిని పరామర్శించేందుకు రాయలసీమ జిల్లాల నుంచి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులు ఆస్పత్రికి పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. ఎంపీ అవినాశ్‌ను సీబీఐ అరెస్టు చేస్తోందంటూ తప్పుడు వార్తలకు తెర తీసిన ఎల్లో మీడియా తన విష ప్రచారాన్ని కొనసాగిస్తోంది. శ్రీలక్ష్మి ఆరోగ్యం ఆందోళనకరంగా ఉందని వైద్యులు బులెటిన్ విడుదల చేయడం, ఓ వర్గం మీడియా తప్పుడు వార్తల నేపథ్యంలో వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలు ఆస్పత్రి ఎదుట రోడ్డుపైనే సోమవారం రాత్రంతా గడిపారు. ముందు జాగ్రత్త చర్యగా పోలీసులు భారీగా బలగాలను తరలించారు. సీబీఐ అధికారులు ఆస్పత్రిలోకి వెళ్లారంటూ.. పోలీస్ గెస్ట్‌హౌస్‌లో ఉంటున్న సీబీఐ అధికారులు అక్కడి నుంచి ఎస్పీ కార్యాలయానికి మాత్రమే వెళ్లారు. అయితే ఎల్లో మీడియా మాత్రం సీబీఐ అధికారులు విశ్వభారతి ఆస్పత్రిలోకి వెళ్లారని, అక్కడ పరిస్థితి, శ్రీలక్ష్మి ఆరోగ్యం గురించి వాకబు చేశారని దుష్ప్రచారం చేస్తూ డిబేట్లు నిర్వహించింది. విశ్వభారతి ప్రాంగణం, గాయత్రి ఎస్టేట్‌లో ప్రశాంతంగా ఉన్న వాతావరణాన్ని చెదరగొట్టి ఉద్రిక్తతకు దారితీసేలా కథనాలు ప్రసారం చేసింది. రోప్ పార్టీ పోలీసులు భోజనం చేసేందుకు వెళుతుంటే వైఎస్సార్సీపీ కార్యకర్తలు వారిపై ఆందోళనకు దిగినట్లు ఎల్లో మీడియా తప్పుడు వార్తలకు తెగబడింది. తాజాగా సుప్రీంకోర్టు ఆదేశాల అనంతరం మంగళవారం సాయంత్రం వరకూ అంతా ప్రశాంతంగా ఉండటంతో ఇక రాత్రికి అవినాశ్‌ను అరెస్టు చేసే అవకాశం ఉందంటూ మళ్లీ ప్రచారానికి తెరతీసింది. శాంతియుతంగా నిరసన.. శ్రీలక్ష్మి, అవినాశ్‌ను పరామర్శించేందుకు ఎమ్మెల్యేలు రవీంద్రనాథ్‌రెడ్డి, సుధీర్‌రెడ్డి, శిల్పా చక్రపాణిరెడ్డి, ఎమ్మెల్సీలు రామసుబ్బారెడ్డి, రమేశ్, మేయర్లు సురేశ్‌బాబు, బీవై రామయ్య కడప, కర్నూలు కార్పొరేషన్ల కార్పొరేటర్లు ఆస్పత్రి వద్దకు వచ్చారు. ఎమ్మెల్యేలు కాటసాని రాంభూపాల్‌రెడ్డి, హఫీజ్‌ఖాన్, సుధాకర్, ఆర్థర్, మాజీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌రెడ్డి నాలుగు రోజులుగా రాత్రింబవళ్లు ఆస్పత్రి వద్దే ఉంటున్నారు. ఎల్లో మీడియా దుష్ప్రచారాలను నిరసిస్తూ ఎమ్మెల్యేలు, కార్యకర్తలు మంగళవారం రాత్రి 7 గంటలకు ఆస్పత్రి ఎదుట శాంతియుతంగా నిరసన తెలిపారు. తన తల్లి ఆరోగ్యం కుదుట పడగానే 27 తర్వాత తానే స్వయంగా వస్తానని ఎంపీ అవినాశ్‌రెడ్డి ప్రకటించారని, మానవత్వంతో వ్యవహరించాలని సీబీఐ అధికారులకు సూచించారు. -
కోవిడ్ నిబంధనలతో G-20 వర్కింగ్ గ్రూప్ మీటింగ్
-
లక్షలాది రూపాయలు వడ్డీకిచ్చి.. మనోవేదనతో
వేలూరు (చెన్నై) : వేలూరు జిల్లా గుడియాతం సమీపంలోని పుదుపేట గ్రామానికి చెందిన లారీ యజమాని ప్రభు, భార్య శ్రీలక్ష్మీ (37)కి రూపేష్, ధన్సిక ఇద్దరు పిల్లలు ఉన్నారు. భార్యభర్తలు బంధువులకు లక్షలాది రూపాయలు వడ్డీకి అప్పు ఇచ్చినట్లు తెలుస్తుంది. అప్పు తీసుకున్నవారిలో అనేకమంది వడ్డీ ఇవ్వకపోగా, కొందరు పూర్తి నగదును ఇవ్వలేదని తెలుస్తోంది. దీంతో శ్రీలక్ష్మీ అప్పు ఇచ్చిన వారిని నిలదీసింది. ఆ సమయంలో అసభ్యకరమైన పదజాలంతో మాట్లాడినట్లు తెలుస్తోంది. దీంతో మనోవేదనతో ఉన్న శ్రీలక్ష్మీ గురువారం సాయంత్రం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించి విచారణ చేస్తున్నారు. ఇదిలా ఉండగా శ్రీలక్ష్మీ ఆత్మహత్యకు ముందు నాలుగు పేజీలతో కూడిన లేఖను తెలుగులో రాసి పెట్టి మృతి చెందినట్లు పోలీసులు గుర్తించారు. అందులో ఎవరెవరికి ఎంత ఇచ్చారో పేర్లతో సహా ఉండడంతో పాటు తన ఆత్మహత్యకు గల కారణాలను వివరించారు. చదవండి: (కన్నీరు పెట్టిస్తున్న వినయ్ సూసైడ్ లేఖ.. ఆ 14 మందే కారకులు..) -
శ్రీలక్ష్మి కనకాల ఇకలేరు
బుల్లితెర నటి శ్రీలక్ష్మి కనకాల (40) మృతి చెందారు. గత రెండేళ్లుగా బ్రెస్ట్ క్యాన్సర్‌తో పోరాడుతున్న ఆమె సోమవారం సాయంత్రం హైదరాబాద్‌లోని తన ఇంట్లో కన్నుమూశారు. దివంగత దేవదాస్ కనకాల, లక్ష్మీదేవి కనకాల కుమార్తె, నటుడు రాజీవ్ కనకాల చెల్లెలు శ్రీలక్ష్మి. శ్రీ పెద్ది రామారావు భార్య అయిన శ్రీలక్ష్మి ఆయుర్వేద వైద్యురాలు కూడా. కొన్నాళ్లుగా టీవీ సీరియల్స్‌లో నటిస్తూ తల్లిదండ్రులకు తగ్గ తనయగా గుర్తింపు పొందారు. శ్రీలక్ష్మికి ఇద్దరు కుమార్తెలున్నారు. -
ఆరోగ్యశ్రీలక్ష్మి
‘ఎలా ఉన్నావ్..’ అని అడుగుతాం ఆత్మీయులు ఎదురైతే. శ్రీలక్షి అడగరు... చూస్తారు. ఎలా ఉన్నారో ఆమెకు తెలిసిపోతుంది! డాక్టర్లు స్టెతస్కోప్ పెట్టి కనిపెడతారు. డాక్టరు కాని శ్రీలక్ష్మి మనసు పెట్టి గ్రహిస్తారు. అభాగ్యులకు ఆరోగ్య భాగ్యాన్ని కలిగిస్తారు. అందుకే ఆమెకు శ్రీలక్ష్మి కాదు... ఆరోగ్యశ్రీలక్ష్మి అన్నదే తగిన పేరు. దాసరి శ్రీలక్ష్మీరెడ్డి పుట్టింది, పెరిగింది నెల్లూరు జిల్లా, ఆత్మకూరులో. పెళ్లితో ఖమ్మం జిల్లా కోడలయ్యారామె. పిల్లల చదువు కోసం 1997లో హైదరాబాద్‌కి రావడం ఆమె జీవితంలో పెద్ద టర్నింగ్ పాయింట్. అప్పటి వరకు ఆమె సాధారణమైన గృహిణి, రుద్రాక్షపల్లిలోని పెద్ద భూస్వామి కుటుంబం కోడలు. ఇదే ఆమె గుర్తింపు. భర్త, ముగ్గురు పిల్లలతో ఇల్లే ప్రపంచంగా గడిచిపోయింది. కుటుంబం హైదరాబాద్ రావడంతో ఆమెలో ఉన్న సోషల్ వర్కర్ బయటికొచ్చింది. హైదరాబాద్‌లోని రామకృష్ణ మఠం ఆమెను సమాజం కోసం పనిచేసేలా తీర్చిదిద్దింది. సామాజిక కార్యకర్తగా మలిచింది. పేదరికం కారణంగా ఎవరూ వైద్యానికి దూరం కాకూడదని నమ్ముతారామె. అనారోగ్యాలు మనిషి ఆర్థిక పరిస్థితులను చూసి ఆగిపోవు. డబ్బు ఖర్చు పెట్టి వైద్యం చేయించుకోలేరని... జబ్బులు దరిచేరకుండా ఉండవు. అందుకే ఆరోగ్యం అందించడానికి ఎక్కువగా కృషి చేశారు శ్రీలక్ష్మి. అన్ని అనారోగ్యాల కంటే కంటి చూపు దెబ్బతినడం నిజంగా శాపమే. అందుకే దృష్టిలోపం ఉన్న పేదవాళ్లకు మెరుగైన కంటి చికిత్సను అందించడం మొదలుపెట్టారు. అలా దోమల్‌గూడలోని సాధూరామ్ కంటి ఆసుపత్రి సేవను నిరుపేద కాలనీలకు చేర్చడానికి వారధి అయ్యారు శ్రీలక్ష్మి. డాక్టర్ల సహకారంతో వారాంతాల్లో కాలనీల్లో హెల్త్‌క్యాంపులు పెట్టించారు. పేషెంట్ మందులు, కళ్లద్దాలకు అయ్యే ఖర్చును ఇప్పటికీ ఆమే పెట్టుకుంటున్నారు. ఆపరేషన్ అవసరమైన వాళ్లను హాస్పిటల్‌కి తీసుకెళ్లి వైద్యం చేయించే వరకు ఆ పేషెంట్ బాధ్యత ఆమెదే. కాలనీలో మెడికల్ క్యాంపులో ఉచితంగా సర్వీస్ ఇవ్వడానికి డాక్టర్లు సంతోషంగా అంగీకరించేవారు, కానీ కాలనీవాసులను వైద్య పరీక్షకు తీసుకురావడమే పెద్ద సవాల్‌గా ఉండేదని అన్నారు శ్రీలక్ష్మి. నా గుర్తింపు నేనే ‘‘నన్ను నేను... ఫలానా ఇంటి ఆడపడుచుని, ఫలానా ఇంటి కోడలిని, ఫలానా లాయర్ భార్యని అని, కలెక్టర్ తల్లి, డాక్టర్ తల్లి... అని పరిచయం చేసుకోవడం సంతోషంగా ఉంటుంది. అలాగని ఆ గుర్తింపుల దగ్గరే ఆగిపోకూడదని కూడా అనుకున్నాను. నా గుర్తింపును నేనే అవాలని నా కోరిక. అందుకు రామకృష్ణ మఠం నాకు ఒక మార్గాన్ని చూపించింది. ఆ దారిలో నాకు చేతనైనంతగా సహాయం చేస్తున్నాను. దోమల్‌గూడ, మహబూబ్‌నగర్, కొడంగల్, కోస్గి, రావులపల్లి, కరీంనగర్‌లలో సర్వీస్ చేశాను. నేను కనిపించగానే ‘లక్ష్మక్కా!’ అని నోరారా పిలిచి వాళ్ల బాధలు చెప్పుకుంటారు. మొదట్లో వైద్య శిబిరాలకే పరిమితమయ్యాను. కానీ కాలనీల్లో తిరుగుతున్నప్పుడు వాళ్లు ఎదుర్కొనే అనేక సామాజిక సమస్యలు కూడా తెలిశాయి. అందుకోసమే నేను నడుపుతున్న ‘శ్రీలక్ష్మి స్కూల్ ఆఫ్ సోషల్ వర్క్’ ఆఫీస్‌లో న్యాయసలహా విభాగం కూడా ఏర్పాటు చేశాను. ‘మహిళా సమస్యలు, మహిళల రక్షణ కోసం ఉన్న చట్టాలు– చైతన్యం’ కూడా నా సర్వీస్‌లో భాగమయ్యాయి. ఖైదీలకు వైద్యం అల్పాదాయ వర్గాల కాలనీల్లో పని చేయడం ఒక ఎత్తయితే చంచల్‌గూడ జైలు ఖైదీలకు వైద్య సహాయం చేయడం మరో ఎత్తు. శిక్ష అనుభవిస్తున్న ఖైదీలకు వైద్యపరీక్షలు చేయించడానికి జైలు అధికారులు అనుమతిచ్చారు. డాక్టర్ల బృందంతో జైల్లో పరీక్షలు నిర్వహించాం. అయితే సమస్య అంతా... వాళ్లకు ఆపరేషన్లు చేయించడం దగ్గర మొదలైంది. అప్పటి వరకు పేదవాళ్లకు సాధూరామ్ హాస్పిటల్లో ఆపరేషన్ చేయించేదాన్ని. ఖైదీలను బయటి హాస్పిటల్‌కు తీసుకెళ్లడానికి వీల్లేదు, ప్రభుత్వ వైద్యశాలలోనే చేయించాలని తెలిసింది. ఖైదీలకు కంటి ఆపరేషన్లు చేయడానికి సరోజినీదేవి ప్రభుత్వ కంటి ఆసుపత్రి వైద్య అధికారులు తేదీలు ఖరారు చేశారు. అయితే వాళ్లను జైలు నుంచి బయటికి పంపించడానికి నిబంధనలు చాలా పటిష్టంగా ఉంటాయి. హోమ్ మంత్రిని కలిసి అనుమతి తీసుకోవాల్సి వచ్చింది. అది కూడా ‘ఆపరేషన్ తర్వాత జైలుకి తరలించే వరకు బాధ్యత వహిస్తానని, ఆ ఖైదీల్లో ఎవరైనా పారిపోతే నాదే పూచీకత్తు’ అని రాసి సంతకం చేసిన తర్వాత పంపించారు. ఖైదీలకు వైద్యం కోసం ఇంత రిస్క్ చేశానని తెలిసి ‘ముందు వెనుక ఆలోచించకుండా చేస్తూ పోవడమేనా’ అని మావాళ్లు కోప్పడ్డారు. మనమే దారి చూపించాలి హైదరాబాద్‌కి వచ్చిన తర్వాత దాదాపుగా కొత్త ప్రపంచాన్ని చూశాననే చెప్పాలి. ‘ట్రైనింగ్’ అనే ప్రకటన కనిపిస్తే చాలు.. వెళ్లిపోయేదాన్ని. ఫినాయిల్, సోప్ ఆయిల్, ఇతర క్లీనింగ్ మెటీరియల్ తయారీతోపాటు బ్యూటీషియన్ కోర్సు, చిప్స్ తయారీ, క్యాండిల్ మేకింగ్, కంప్యూటర్ కోర్సు కూడా చేశాను. నేను నేర్చుకున్నవన్నీ పేద మహిళలకు నేర్పిస్తున్నాను. భర్త తాగుడుకు బానిసయ్యి, పిల్లలను పోషించలేక ఆత్మహత్యకు పాల్పడే వాళ్లను చూసినప్పుడు మనసు పిండేసినట్లయ్యేది. ‘మనిషిలో జీవనోత్సాహం ఉండాలి. మరణం దేనికీ సమాధానం కాదు’... ఈ మాట చెప్పడానికే ‘వై వియ్ డై... హౌ వియ్ లివ్’ అని కౌన్సెలింగ్ కూడా మొదలు పెట్టాను. అయితే... చనిపోవాలనుకునే వాళ్లకు బతుకు మీద ఆశ కలిగించడంతో మన బాధ్యత తీరిపోదు, వాళ్లకు బతకడానికి ఒక దారి చూపించగలిగితేనే ఒక జీవితాన్ని కాపాడిన వాళ్లమవుతాం. నిజానికి బతకడానికి దారి తెలిస్తే ఎవరూ చనిపోవాలనుకోరు కూడా. అందుకే ఆ మహిళలకు నేను నేర్చుకున్న స్కిల్స్‌లో శిక్షణ ఇస్తున్నాను. కుటీర పరిశ్రమ ఏర్పాటు చేయించడంతోపాటు, ఆ మహిళలు తయారు చేసిన ఫినాయిల్, బ్లీచింగ్ పౌడర్ వంటి వాటిని మార్కెట్ చేయడానికి హాస్పిటళ్లతో మాట్లాడడం కూడా నేనే. నా భర్త స్నేహితుల్లో చాలామంది డాక్టర్లు ఉండడం నాకు బాగా ఉపయోగపడింది. మహిళా ఖైదీలకు కూడా కుటీర పరిశ్రమ నిర్వహణకు అవసమైన స్కిల్ ట్రైనింగ్ ఇచ్చాను. కార్పెంటరీ, స్వెటర్ అల్లకంలో కూడా శిక్షణ ఇప్పించాం. ఐఏఎస్ ఆఫీసర్ రామలక్ష్మిగారి సహాయంతో ఆ మహిళా ఖైదీలకు లోన్లు ఇప్పించాను. సమాజం కోసం చేసిన ప్రతి పనిలోనూ నేను ఆనందాన్ని ఆస్వాదించాను. అయితే బెగ్గర్స్ రీహాబిలిటేషన్ చేసేటప్పుడు ఒక్కోసారి సహనానికి పరీక్షగా ఉండేది. వాళ్లకు హోమ్‌లో షెల్టర్ ఇచ్చి తిండి, దుస్తులు ఇస్తుంటే... వాళ్లు మాత్రం గంజాయి ఇప్పించమని ఒకరు, సిగరెట్ లేకపోతే ఉండలేమని కొందరు సతాయించేవాళ్లు. నా కూతురు చెప్పిన మాట సోషల్ లైఫ్‌లో ఎదురయ్యే అనేకానేక పురస్కారాలు, తిరస్కారాల గురించి మా అమ్మాయి ఒకటే మాట చెప్తుండేది. ‘ఎవరైనా సరే... తమకు ప్రత్యేకంగా గుర్తింపు రావాలని కోరుకుంటే చాలదు. ఆ వ్యక్తి ఆ గౌరవానికి తగిన వ్యక్తి అని ఎదుటి వాళ్లకు అనిపించాలి. అదే అసలైన గుర్తింపు’ అని, డిజర్వ్కీ డిజైర్కీ మధ్య తేడా తెలుసుకోవాలని చెప్తుంటుంది. నేను పెంచిన పాపాయి.. ఇంత పరిణతితో మాట్లాడుతుంటే నా పెంపకంలో ఇంతటి సంస్కారంతో పెరిగిందా లేక తను నేర్చుకున్న మంచి భావాలతో తనే నన్ను తీర్చిదిద్దుతోందా అనిపిస్తుంటుంది. మనం వేదిక మీద ఒక పురస్కారాన్ని అందుకుంటున్నప్పుడు ప్రేక్షకులు మనసులో ‘‘అవును, ఈమె చాలా సేవ చేసింది. ఫలానా చోట ఫలానా సర్వీస్ చేయడం మాకు తెలుసు’’ అనుకోవాలి. అదే అసలైన గౌరవం. అవార్డులు అందుకుంటున్నప్పుడు నాకు మా అమ్మాయి చెప్పిన మాట గుర్తుకు వస్తుండేది. ప్రతి పురస్కారమూ ఎంతో కొంత సంతోషాన్నిచ్చి తీరుతుంది. ఆ జ్ఞాపికను చూసినప్పుడు దాని వెనుక ఉన్న నా శ్రమ గుర్తుకు వస్తుంటుంది. అన్నింటికంటే ఎక్కువ సంతోషాన్నిచ్చింది మాత్రం వైఎస్ఆర్ చేతుల మీద పురస్కారం అందుకోవడమే. అది కూడా ఎంత కాకతాళీయంగా జరిగిందంటే... రవీంద్రభారతిలో ఉగాది పురస్కారాల ప్రదానం జరుగుతోంది. నన్ను ఉత్తమ సోషల్ వర్క్ అవార్డుకు ఎంపిక చేశారు. నేను వెళ్లడం కొంచెం ఆలస్యమైంది. వైఎస్ఆర్ గారు రావడం కూడా ఆలస్యం కావడంతో కార్యక్రమం సమయానికి జరగాలనే ఉద్దేశంతో మంత్రుల చేతుల మీదుగా మొదలు పెట్టమని చెప్పార్ట వైఎస్ఆర్. నేను అవార్డు అందుకోవడానికి వేదిక మీదకు వెళ్లేటప్పటికి ఆయన కూడా వచ్చేశారు. ఆయనంటే నాకు పిచ్చి అభిమానం. ఆయన చేతుల మీద అవార్డు అందుకునే అదృష్టం ఉండడంతోనే నేను కార్యక్రమానికి ఆలస్యమైనట్లున్నాను. ఆయన నన్ను చూసి ‘ఇక్కడ కూడా ఉన్నావా. ఎప్పుడూ ఏదో ఒక పని చేస్తూనే ఉంటావా పిచ్చితల్లీ’ అని నవ్వారు. అంతకు ముందు నేను చాలాసార్లు భర్త చేతిలో మోసపోయిన అమ్మాయిలకు న్యాయం చేయమని ఆయన దగ్గరకు తీసుకెళ్లాను. వైఎస్ఆర్ ఆ మహిళలతో మాట్లాడి ‘కేసు డీల్ చేయమని సబితమ్మకు రాస్తున్నాను. వీళ్లను సబితమ్మ దగ్గరకు తీసుకెళ్లు’ అని పంపించేవారు. అందుకే ఆయన నన్ను అవార్డుల వేదిక మీద చూడగానే ఆ మాటన్నారు. అప్పుడు నేను ‘నాకు స్ఫూర్తి మీరే, మీరు చేసినంత చేయలేను, కానీ నేను చేయగలిగినంత చేస్తాను’ అని చెప్పాను. అప్పుడు తీసిన ఈ ఫొటో చూసుకుంటే ఆయన మాటలు ఇప్పుడు వింటున్నట్లే ఉంటుంది’’ అంటూ వైఎస్ఆర్ చేతుల మీదుగా అవార్డు అందుకుంటున్న ఫొటో చూపిస్తూ ఉద్వేగానికి లోనయ్యారు శ్రీలక్ష్మి. – వాకా మంజులారెడ్డి ఫొటోలు: కె. రమేశ్ బాబు అత్తగారి వర్ధంతికి పేదవారుండే కాలనీల్లో చీరల పంపిణీ, మామగారి పేరు మీద ఆయన వర్ధంతి రోజున సొంతూరు రుద్రాక్షపల్లిలో రాష్ట్ర స్థాయి ఆటల పోటీలు నిర్వహించడం శ్రీలక్ష్మికి ఇష్టమైన వ్యాపకాలు. ‘‘ఇన్నేళ్లుగా నేను ఇన్ని పనులు చేయగలుగుతున్నానంటే నాలో పని చేయాలనే తపన ఉండడం, ఇంత ఖర్చు ఎందుకు అనకుండా మా వారు డబ్బివ్వడమే’’ నంటారామె నవ్వుతూ. పెద్ద కొబ్బరి బోండాలు పండించినందుకు హార్టికల్చర్ శాఖ నుంచి ఉత్తమ వ్యవసాయదారుల అవార్డు భర్తతో కలిసి అందుకున్నారు శ్రీలక్ష్మి. వర్మీ కంపోస్టు తయారీ, వేస్ట్ వెల్త్ మేనేజ్మెంట్ ప్రోగ్రామ్‌లో సర్వీస్‌కి రాష్ట్రపతి అవార్డు, రామకృష్ణమఠం ఉత్తమ సోషల్ వర్కర్ అవార్డు, సిటీ సెంట్రల్ లైబ్రరీలో ముగ్గుకి ఫస్ట్ ప్రైజ్ (గాంధీ, నెహ్రూ, ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ ఫొటోలు, మధ్యలో వైఎస్ఆర్ ఫొటోతో వేసిన థీమ్ ముగ్గు) అందుకోవడం శ్రీలక్ష్మికి అమూల్యమైన సందర్భాలు. -
నటుడు జీవా, శ్రీలక్ష్మీ డ్యూయెట్
చింతనిప్పుల్లాంటి కళ్లు, రౌద్రంగా కనిపించే ముఖంతో ప్రతినాయకుడి వేషాల్లో జీవించే జీవ, హాస్యనటి శ్రీలక్ష్మితో కలిసి ఆడిపాడారు. బంతిపూల తోటలో ఇద్దరూ ఒక్కటిగా యుగళగీతం ఆలపించారు. ఈ సన్నివేశాలను స్థానికులు ఎగబడి చూశారు. గుంటూరు జిల్లా కొలకలూరు గ్రామం సమీపంలో నిన్న (మంగళవారం) పూలతోటలో ‘పండుగాడి ఫొటో స్టూడియో’ షూటింగ్లో నెలకొన్న సందడి ఇది. గుదిబండి వెంకట సాంబిరెడ్డి నిర్మాతగా, పెదరావూరు ఫిలిం స్టూడియో పతాకంపై ఆలీ, రిషిత హీరో హీరోయిన్లుగా దిలీప్‌రాజా దర్శకత్వంలో ఈ సినిమా రూపుదిద్దుకుంటోంది. గత రెండు నెలలుగా రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో చిత్రీకరణ జరపుకుంటోంది. పూర్తిగా ఆంధ్రప్రదేశ్‌లో తీసే సినిమాగా రిజిస్ట్రర్ అయిన తొలి సినిమాగా గుర్తింపుతో పాటు, ప్రభుత్వ అనుమతులను చిత్ర యూనిట్ పొందింది. ఇంకా ఈ చిత్రంలో సీనియర్ నటులు వినోద్ కుమార్, బాబూమోహన్, సుధ, దేవి తదితరలు నటిస్తున్నారు. -
మళ్లీ ‘శత’క్కొట్టిన మోమినుల్
చిట్టగాంగ్: మోమినుల్ హక్ (105; 5 ఫోర్లు, 2 సిక్స్‌లు) అద్భుత సెంచరీ సాయంతో... శ్రీలంకతో జరిగిన తొలి టెస్టును బంగ్లాదేశ్ ‘డ్రా’గా ముగించింది. ఓవర్‌నైట్ స్కోరు 81/3తో చివరి రోజు ఆదివారం రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన బంగ్లాదేశ్ ఆట ముగిసే సమయానికి 5 వికెట్ల నష్టానికి 307 పరుగులు చేసింది. తొలి ఇన్నింగ్స్‌లో భారీ శతకం బాదిన మోమినుల్ హక్ రెండో ఇన్నింగ్స్‌లోనూ సెంచరీతో చెలరేగడంతో శ్రీలంక విజయంపై ఆశలు వదులుకుంది. మోమినుల్తోపాటు లిటన్ దాస్ (94; 11 ఫోర్లు) కూడా బాధ్యతాయుత ఇన్నింగ్స్ ఆడారు. వీరిద్దరూ నాలుగో వికెట్‌కు 180 పరుగులు జోడించారు. మోమినుల్ హక్కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు దక్కింది. బంగ్లా తరఫున ఓ టెస్టు రెండు ఇన్నింగ్స్‌ల్లో సెంచరీలు నమోదు చేసిన తొలి ఆటగాడిగా మోమినుల్ హక్ రికార్డు సృష్టించాడు. -
ఊహాజనిత అంశాలతోనే నాపై కేసు
హైకోర్టుకు వై. శ్రీలక్ష్మి నివేదన సాక్షి, హైదరాబాద్: దాల్మియా సిమెంట్స్‌కు సున్నపురాయి లీజు మంజూరు వ్యవహారంలో ఊహాజనిత అంశాల ఆధారంగానే అప్పటి పరిశ్రమలశాఖ ముఖ్య కార్యదర్శి వై. శ్రీలక్ష్మిపై సీబీఐ కేసు నమోదు చేసిందని ఆమె తరఫు న్యాయవాది వై. శ్రీనివాసమూర్తి తెలిపారు. సున్నపురాయి లీజు మంజూరులో ఆమె నిబంధనల మేరకే నిర్ణయాలు తీసుకున్నారని ఆయన పేర్కొన్నారు. తనపై సీబీఐ అధికారులు నమోదు చేసిన కేసును కొట్టేయాలని శ్రీలక్ష్మి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యంపై గురువారం న్యాయమూర్తి జస్టిస్ శివశంకరరావు విచారణ జరిపారు. ఈ సందర్భంగా శ్రీలక్ష్మి తరఫు న్యాయవాది శ్రీనివాసమూర్తి తన వాదనలు వినిపిస్తూ, కింది స్థాయి అధికారులు క్షేత్రస్థాయి పరిశీలన చేసి ఇచ్చే నివేదికల ఆధారంగానే లీజు మంజూరు జరిగిందేగాని, ఇందులో శ్రీలక్ష్మి నిర్ణయాలు ఏమీ లేవన్నారు. ప్రభుత్వ నిర్ణయాల్లో భాగంగానే లీజు మంజూరు జరిగిందని వివరించారు. ప్రాస్పెక్టివ్ లీజు మొదట జయ మినరల్స్‌కు ఇచ్చారని, తర్వాత అది ఈశ్వర్ సిమెంట్స్‌కు బదిలీ అయిందన్నారు. ఈశ్వర్ సిమెంట్స్ ఆ తర్వాత దాల్మియా సిమెంట్స్‌లో విలీనం అయిందని వివరించారు. వాదనలు విన్న న్యాయమూర్తి తదుపరి విచారణను ఈ నెల 6కు వాయిదా వేశారు. -
సినీనటి మెడలో గొలుసు లాక్కెళ్లారు!
హైదరాబాద్: సినీ హాస్యనటి శ్రీలక్ష్మి మెడలోని బంగారు గొలుసును ఇద్దరు దుండగులు లాక్కొని పారిపోయారు. యూసఫ్‌గూడలో నివాసం ఉంటున్న శ్రీలక్ష్మి సమీపంలోని షాపుకు వెళ్లి తిరిగి వస్తుండగా ఈ చోరీ జరిగింది. ద్విచక్ర వాహనంపై వచ్చిన ఇద్దరు యువకులు ఆమె మెడలోని గొలుసు లాక్కొని వెళ్లిపోయారు. శ్రీలక్ష్మి ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ** -
'భోజనం చేస్తూ పళ్లసెట్ మింగేసింది'
నంద్యాల : ఓ మహిళ భోజనం చేస్తూ అనుకోకుండా పెట్టుడు పళ్ల సెట్‌ను మింగేసింది. వైద్యులు చాకచక్యంగా సర్జరీ చేసి దానిని బయటకు తీశారు. పట్టణానికి చెందిన శ్రీలక్ష్మి (45) గురువారం రాత్రి భోజనం చేస్తుండగా నోటిలో బిగించిన పళ్ల సెట్‌ను మింగేసింది. దీంతో బంధువులు ఆమెను హుటాహుటీనా గాంధీచౌక్‌లోని నెరవాటి హాస్పటల్లో చేర్పించారు. వైద్యులు వినోద్ కుమార్, మధుసూదన్ రెడ్డి, అరుణకుమారి ఎండోస్కోప్ ద్వారా 30 నిమిషాల సేపు సర్జరీ నిర్వహించి ఎలాంటి కోత, కుట్టు లేకుండా పళ్లసెట్‌ను బయటకు తీశారు. ఈ సందర్భంగా వైద్యుడు వినోద్ కుమార్ మాట్లాడుతూ పళ్లసెట్‌ను మింగటం ద్వారా రోగికి శ్వాస తీసుకోవడం ఇబ్బంది అవుతుందన్నారు. కడుపులో పేగుకు పళ్లసెట్ తీగ తగిలి రంధ్రం పడి ప్రాణాపాయ స్థితికి చేరుకునే ప్రమాదం ఉందని ఆయన పేర్కొన్నారు. -
వైద్య విద్యార్ధిని ఆత్మహత్య