శ్రీలక్ష్మీ
వేలూరు (చెన్నై) : వేలూరు జిల్లా గుడియాతం సమీపంలోని పుదుపేట గ్రామానికి చెందిన లారీ యజమాని ప్రభు, భార్య శ్రీలక్ష్మీ (37)కి రూపేష్, ధన్సిక ఇద్దరు పిల్లలు ఉన్నారు. భార్యభర్తలు బంధువులకు లక్షలాది రూపాయలు వడ్డీకి అప్పు ఇచ్చినట్లు తెలుస్తుంది. అప్పు తీసుకున్నవారిలో అనేకమంది వడ్డీ ఇవ్వకపోగా, కొందరు పూర్తి నగదును ఇవ్వలేదని తెలుస్తోంది. దీంతో శ్రీలక్ష్మీ అప్పు ఇచ్చిన వారిని నిలదీసింది.
ఆ సమయంలో అసభ్యకరమైన పదజాలంతో మాట్లాడినట్లు తెలుస్తోంది. దీంతో మనోవేదనతో ఉన్న శ్రీలక్ష్మీ గురువారం సాయంత్రం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించి విచారణ చేస్తున్నారు. ఇదిలా ఉండగా శ్రీలక్ష్మీ ఆత్మహత్యకు ముందు నాలుగు పేజీలతో కూడిన లేఖను తెలుగులో రాసి పెట్టి మృతి చెందినట్లు పోలీసులు గుర్తించారు. అందులో ఎవరెవరికి ఎంత ఇచ్చారో పేర్లతో సహా ఉండడంతో పాటు తన ఆత్మహత్యకు గల కారణాలను వివరించారు.
చదవండి: (కన్నీరు పెట్టిస్తున్న వినయ్ సూసైడ్ లేఖ.. ఆ 14 మందే కారకులు..)
Comments
Please login to add a commentAdd a comment