రెండేళ్ల క్రితం వివాహం.. కన్నీరు మిగిల్చిన క్షణికావేశం | Chennai: Mother Kills Two Children, Hangs Herself | Sakshi
Sakshi News home page

రెండేళ్ల క్రితం వివాహం.. కన్నీరు మిగిల్చిన క్షణికావేశం

Published Sun, Jan 29 2023 9:02 AM | Last Updated on Sun, Jan 29 2023 1:42 PM

Chennai: Mother Kills Two Children, Hangs Herself - Sakshi

సాక్షి,చెన్నై: పెరంబలూరులో ఏడాది వయసున్న కవల పిల్లలను హతమార్చి ఓ తల్లి బలవన్మరణానికి పాల్పడింది. వివరాలు..  పెన్నకోనం గ్రామానికి చెందిన విజయ్‌(35) విదేశాల్లో ఉద్యోగం చేస్తున్నాడు. రెండేళ్ల క్రితం జయ(21)తో వివాహమైంది. వీరికి విసికా, రిసికా అనే ఇద్దరు కవల ఆడ పిల్లల ఉన్నారు. అత్త ,మామలతో కలిసి జయ పెన్నకోనం గ్రామంలో ఉండేది.

శనివారం గది నుంచి జయ బయటకు రాకపోవడంతో అత్త మామలు ఆందోళన చెందారు. ఇరుగు పొరుగు వారి సాయంతో తలుపులు పగుల కొట్టి చూడగా, గదిలో ఇద్దరు పిల్లలు నోటి నుంచి నురగలు వచ్చిన స్థితిలో పడి ఉండడం, జయ ఉరి వేసుకుని వేలాడుతుండడంతో స్థానిక పోలీసులకు సమా చారం ఇచ్చారు. విచారణలో కుటుంబ విభేదాలు వెలుగులోకి వచ్చాయి. ఈ పరిస్థితుల్లో ఇద్దరు పిల్లలకు విషం ఇచ్చి హతమార్చి, జయ ఉరి పోసుకుని ఆత్మహత్య చేసుకుని ఉండొచ్చని  పోలీసులు నిర్ధారించారు.

చదవండి: తమిళనాడులో విషాదం.. ఆలయ ఉత్సవాల్లో కుప్పకూలిన క్రేన్‌.. నలుగురి మృతి 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement