చెన్నై: ఇటీవల ఎర్నెస్ట్ అండ్ యంగ్ ఇండియాకు చెందిన 26 ఏళ్ల ఉద్యోగిని పని ఒత్తిడితో మృతిచెందిన ఘటన మరవక ముందే మరొకటి వెలుగులోకి వచ్చింది. తీవ్రమైన డిప్రెషన్‌తో బాధపడుతున్న 38 ఏళ్ల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ చెన్నైలోని తన ఇంట్లో ఆత్మహత్యకు చేసుకున్నాడు. పని ఒత్తిడి కారణంగానే తన భర్త ఆత్మ హత్య చేసుకొని ఉంటాడని అతని భార్య అనుమానం వ్యక్తం చేసినట్లు పోలిసులు తెలిపారు.
పోలీసుల వివరాల ప్రకారం.. తమిళనాడులోని తేని జిల్లాకు చెందిన కార్తికేయన్ తన భార్య, ఇద్దరు పిల్లలతో చెన్నైలో నివసిస్తున్నారు. గత 15 ఏళ్లుగా ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీలో కార్తికేయ టెక్కీగా పని చేస్తున్నారు. ఇక.. కార్తికేయ తీవ్రమైన పని ఒత్తిడి కారణంగా ఇబ్బంది పడుతున్నారు. రెండు నెలలుగా ఆయన డిప్రెషన్‌కు చికిత్స పొందుతున్నాడు.
ఘటన సమయంలో కార్తికేయ ఇంట్లో ఒంటరిగా ఉన్నాడు. సోమవారం ఆయన భార్య కె జయరాణి.. పిల్లలను తన తల్లి వద్దకు దింపి, చెన్నైకి 300 కిలోమీటర్ల దూరంలోని తిరునల్లూరు ఆలయానికి వెళ్లారు. గురువారం రాత్రి తిరిగి వచ్చి తలుపు కొట్టగా.. ఇంట్లో నుంచి ఎటువంటి స్పందన లేదు. ఇంట్లోకి ప్రవేశించడానికి స్పేర్ కీని ఉపయోగించి లోపలికి వెళ్లగా.. కార్తికేయ కరెంట్ తీగకు చుట్టుకొని విగతజీవిగా పడిఉన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి.. అసహజ మరణంగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇదికూడా చదవండి: పని ఒత్తిడితో మహిళా ఉద్యోగి షాకింగ్ డెత్, స్పందించిన కేంద్రం
Comments
Please login to add a commentAdd a comment