పని ఒత్తిడితో మహిళా ఉద్యోగి షాకింగ్ డెత్, స్పందించిన కేంద్రం | Kerala 26-Year-Old EY Employee dies with Work pressure Centre Probes | Sakshi
Sakshi News home page

పని ఒత్తిడితో మహిళా ఉద్యోగి షాకింగ్ డెత్, స్పందించిన కేంద్రం

Published Thu, Sep 19 2024 1:38 PM | Last Updated on Thu, Sep 19 2024 2:47 PM

Kerala 26-Year-Old EY Employee dies with Work pressure Centre Probes

ఎర్నెస్ట్ అండ్ యంగ్ ఇండియాకు చెందిన 26 ఏళ్ల చార్టర్డ్ అకౌంటెంట్, పని ఒత్తిడి కారణంగా చనిపోవడంపై  తీవ్ర ఆందోళన  వ్యక్త మైన నేపథ్యంలో కేంద్రం ‍ స్పందించింది.  కేరళకు చెందిన అన్నా సెబాస్టియన్ పెరయిల్ కంపెనీలో పని ఒత్తిడిని తట్టుకోలేకే చనిపోయిందన్న ఆరోపణల నేపథ్యంలో, కేంద్ర కార్మిక మంత్రిత్వ శాఖ ఫిర్యాదును స్వీకరించి, మరణానికి దారితీసిన పరిస్థితులపై దర్యాప్తు చేయనుంది.

కార్మిక మంత్రిత్వ శాఖ అధికారికంగా ఫిర్యాదును స్వీకరించిందని దర్యాప్తు జరుగుతోందని కేంద్ర వ్యవసాయం, రైతుల సంక్షేమ శాఖ సహాయ మంత్రి శోభా కరంద్లాజే ఎక్స్‌లోతెలిపారు. ఆ సందర్బంగా తల్లి అగస్టీన్‌కు జరిగిన నష్టంపై తీవ్ర విచారం వ్యక్తి చేశారు. రక్షణలేని  దోపిడీ పని  పరిస్థితుల ఆరోపణలపై సమగ్ర దర్యాప్తుతో  న్యాయం జరిగేందుకు కృషి చేస్తామని ట్వీట్‌ చేశారు. 

అన్నా మరణం చాలా బాధాకరమైందంటూ బీజేపీ నాయకుడు, మాజీ కేంద్ర  మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ పోస్ట్‌పై ఆమె స్పందించారు.

 

(ఇదీ చదవండి: నా బిడ్డ నూరేళ్ల కలల్ని చిదిమేశారు: టాప్‌ కంపెనీకి తల్లి కన్నీటి లేఖ)

కాగా ఎన్నో ఆశలతో ఉద్యోగంలో చేరిన తన కుమార్తె, కంపెనీలో పని భారాన్నిభరించలేక, ఎవరితోనూ చెప్పుకోలేక మానసిక క్షోభంతో చనిపోయిందంటూ కంపెనీ ఛైర్మన్‌ రాజీవ్‌ మెమానికి బాధితురాలి తల్లి అన్నాఅగస్టీన్‌ ఈమెయిల్‌ సమాచారం అందించింది. ఇప్పటికైనా చర్యలు తీసుకోవాలని కోరారు. కనీసం ఆమె అంత్యక్రియలకు కూడా ఎవరూ రాలేదంటూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఈ లేఖ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. పలు కార్పొరేట్‌ కంపెనీల్లో పనిపరిస్థితులపై  చర్చకు దారి తీసిన సంగతి తెలిసిందే. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement