Chartered Accountants
-
ఆమెకు మరణశాసనం రాసింది ఎవరు?
-
పని ఒత్తిడితో మహిళా ఉద్యోగి షాకింగ్ డెత్, స్పందించిన కేంద్రం
ఎర్నెస్ట్ అండ్ యంగ్ ఇండియాకు చెందిన 26 ఏళ్ల చార్టర్డ్ అకౌంటెంట్, పని ఒత్తిడి కారణంగా చనిపోవడంపై తీవ్ర ఆందోళన వ్యక్త మైన నేపథ్యంలో కేంద్రం స్పందించింది. కేరళకు చెందిన అన్నా సెబాస్టియన్ పెరయిల్ కంపెనీలో పని ఒత్తిడిని తట్టుకోలేకే చనిపోయిందన్న ఆరోపణల నేపథ్యంలో, కేంద్ర కార్మిక మంత్రిత్వ శాఖ ఫిర్యాదును స్వీకరించి, మరణానికి దారితీసిన పరిస్థితులపై దర్యాప్తు చేయనుంది.కార్మిక మంత్రిత్వ శాఖ అధికారికంగా ఫిర్యాదును స్వీకరించిందని దర్యాప్తు జరుగుతోందని కేంద్ర వ్యవసాయం, రైతుల సంక్షేమ శాఖ సహాయ మంత్రి శోభా కరంద్లాజే ఎక్స్లోతెలిపారు. ఆ సందర్బంగా తల్లి అగస్టీన్‌కు జరిగిన నష్టంపై తీవ్ర విచారం వ్యక్తి చేశారు. రక్షణలేని దోపిడీ పని పరిస్థితుల ఆరోపణలపై సమగ్ర దర్యాప్తుతో న్యాయం జరిగేందుకు కృషి చేస్తామని ట్వీట్ చేశారు. Deeply saddened by the tragic loss of Anna Sebastian Perayil. A thorough investigation into the allegations of an unsafe and exploitative work environment is underway. We are committed to ensuring justice & @LabourMinistry has officially taken up the complaint.@mansukhmandviya https://t.co/1apsOm594d— Shobha Karandlaje (@ShobhaBJP) September 19, 2024అన్నా మరణం చాలా బాధాకరమైందంటూ బీజేపీ నాయకుడు, మాజీ కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ పోస్ట్‌పై ఆమె స్పందించారు. (ఇదీ చదవండి: నా బిడ్డ నూరేళ్ల కలల్ని చిదిమేశారు: టాప్ కంపెనీకి తల్లి కన్నీటి లేఖ)కాగా ఎన్నో ఆశలతో ఉద్యోగంలో చేరిన తన కుమార్తె, కంపెనీలో పని భారాన్నిభరించలేక, ఎవరితోనూ చెప్పుకోలేక మానసిక క్షోభంతో చనిపోయిందంటూ కంపెనీ ఛైర్మన్ రాజీవ్ మెమానికి బాధితురాలి తల్లి అన్నాఅగస్టీన్ ఈమెయిల్ సమాచారం అందించింది. ఇప్పటికైనా చర్యలు తీసుకోవాలని కోరారు. కనీసం ఆమె అంత్యక్రియలకు కూడా ఎవరూ రాలేదంటూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఈ లేఖ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పలు కార్పొరేట్ కంపెనీల్లో పనిపరిస్థితులపై చర్చకు దారి తీసిన సంగతి తెలిసిందే. -
నా బిడ్డ నూరేళ్ల కలల్ని చిదిమేశారు: టాప్ కంపెనీకి తల్లి కన్నీటి లేఖ
కష్టపడి చదవి, మంచి ఉద్యోగం సంపాదించి తల్లిదండ్రులను ఎంతో బాగా చూసుకోవాలని ఆశపడింది కలలు కనింది 26 ఏళ్ల యువతి. కానీ ఆశలన్నీ ఆవిరై తన తల్లిదండ్రులకే తీరని శోకాన్ని మిగల్చబోతున్నానని కలలో కూడా ఊహించి ఉండదు. ఎన్నో ఆశలతో ఒక పెద్ద కంపెనీలో ఉద్యోగంలో చేరిన నాలుగు నెలలకే తమ బిడ్డ జీవితం అర్థాంతరంగా ముగిసిపోవడంతో యువతి తల్లి తీరని విషాదంలో మునిగిపోయింది. పని ఒత్తిడితో, తన బిడ్డ కలల్ని, జీవితాన్ని నాశనం చేశారు, తనలాగా మరే తల్లికి ఇలాంట దుర్గతి పట్టుకూడదంటూ కంపెనీ చైర్మన్‌కి పంపిన ఈమెయిల్లో ఆవేదన వ్యక్తం చేశారు. పూర్తి వివరాలు..కేరళకు చెందిన చార్టర్డ్ అకౌంటెంట్ అన్నా సెబాస్టియన్ పెరైల్ బహుళజాతి సంస్థ ఎర్నెస్ట్ & యంగ్, EYలో ఉద్యోగంలో చేరింది. తొలి ఉద్యోగం కావడంతో చాలా కష్టపడి చేసింది. ఎలాగైనా తనను తాను నిరూపించుకోవాలని రాత్రింబవళ్లు పనిచేసి తన టార్గెట్‌ను పూర్తి చేసింది. అయినా ఆమె మేనేజర్ చేసిన ఒత్తిడిని ఆమె గుండె తట్టుకోలేకపోయింది. ఉద్యోగంలో చేరిన నాలుగు నెలలకే 26 ఏళ్ల వయసులోనే కన్నుమూసింది. తన బిడ్డ విషాదాంతానికి కారణం పని ఒత్తిడే అంటూ అన్నా తల్లి, అనితా అగస్టిన్ ఆ కపెంనీ ఛైర్మన్ ఇండియా చీఫ్ రాజీవ్ మెమనికి ఇమెయిల్ రాశారు. తన కుమార్తె మరణానికి దారితీసిన పరిస్థితులపై తన బాధను వ్యక్తం చేశారు. దీంతో కంపెనీలో ఉద్యోగుల పనిపరిస్థితులపై చర్చకు దారి తీసింది. ఆసియా దేశాల్లోఅంతే,టాక్సిక్‌కల్చర్, దుర్మార్గం అంటూ సోషల్ మీడియా యూజర్లు మండి పడుతున్నారు. ఈమెయిల్ అన్నా తల్లి బరువెక్కిన గుండెలతో రాసిన ఈమెయిల్ సమాచారంలో అందించిన వివరాల ప్రకారం అన్నా సెబాస్టియన్ పెరైల్ బాల్యం నుంచీ చాలా తెలివైనది. చిన్నప్పటి నుంచీ చదువులో,ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్‌లో రాణించింది. స్కూల్ టాపర్, కాలేజీ టాపర్. అంతేకాదు సీఏ పరీక్షలలో అత్యుత్తమ ఫలితాలు సాధించింది. ‘‘నా బంగారు తల్లిని పొగొట్టుకున్నాను. నేను ఇంకొంచెం జాగ్రత్త పడి ఉండాల్సింది. ఆరోగ్యం, జీవితం కన్నా, ఏదీ ఎక్కువ కాదని ఆమెకు నచ్చజెప్పి, బిడ్డను కాపాడుకోవలసింది. ఈ బాధతోనే ఈ లేఖ రాస్తున్నా.. ఆమె గురించి రాస్తోంటే.. నా గుండె బద్దలవుతోంది. నా శోకం, బాధ మరే కుటుంబానికి రాకూడదనే ఇది రాస్తున్నాను.2023 నవంబరులో సీఏ పాస్ అయింది. 2024 మార్చి19న పూణేలో ఉద్యోగంలో చేరింది. అంత గొప్ప కంపెనీలో ఉద్యోగం వచ్చినందుకు పొంగిపోయింది. ఉద్యోగంలో చేరిన కంపెనీ కోసం అవిశ్రాంతంగా పనిచేసింది. పగలూ, రాత్రి, చివరికి ఆదివారాలు కూడా పని చేసేంది. ఉద్యోగం, ఊరు, భాష అన్నీ కొత్త అయినా సర్దుకుపోవడానికి ఆమె చాలా ప్రయత్నించింది.పడుకున్నా, కూర్చున్నా పనిధ్యాసే. సరిగా తిండి లేదు. నిద్ర లేదు. అంతులేని ఒత్తిడిని భరించింది. శారీరకంగా, మానసికంగా అలిసిపోయినా, కష్టపడి పనిచేయడం, పట్టుదల విజయానికి కీలకమని నమ్ముతూ నెట్టుకుంటూ వచ్చింది. ఊపిరి పీల్చుకునే అవకాశం కూడా లేకుండా, వారాంతాల్లో కూడా అర్థరాత్రి వరకు పని చేసి, చేసి చివరికి ఆ ఒత్తిడితోనే నాలుగు నెలల తర్వాత, జూలై 20 శాశ్వతంగా నాకు దూరమైపోయిందన్న వార్త విన్నాక నా ప్రపంచం కుప్పకూలింది. 26 ఏళ్లకే నా బిడ్డకు నూరేళ్లు నిండిపోయాయి. కనీసం ఆమె అంత్యక్రియలకు కంపెనీ తరపునుంచి ఒక్కరుకూడా రాలేదు. ఇదింకా నన్ను బాధించింది.జూలై 6వ తేదీన నేను, నాభర్త సీఏ కాన్వకేషన్ కోసం పూణే వచ్చాం. అప్పుడే గుండెల్లో ఏదో భారంగా ఉందని చెప్పింది అన్నా. డాక్టర్ దగ్గరికెళ్లేందుకు ఆమె సమయం దొరకలేదు. కానీ బలవంతంగా ఆసుపత్రికి వెళ్లాం. అన్నీ నార్మల్‌గానే ఉన్నాయినీ, ఆందోళన అవసరం లేదని కార్డియాలజిస్ట్ చెప్పారు. కానీ తిండి, నిద్ర సమయానికి తీసుకోవడం లేదని, విశ్రాంతి తీసుకోవాలని, జాగ్రత్త అని చెప్పారు. కానీ ఇంత ప్రమాదం ముంచుకొస్తుందని గమనించలేదు. జూలై 7, ఆమె కాన్వకేషన్ రోజు అపుడు కూడా ఆమెకు సెలవు దొరకలేదు. ఆ రోజు కూడా మధ్యాహ్నందాకా వర్క్ ఫ్రం హోం చేసింది. దీంతో కాన్వకేషన్‌కు లేట్‌గా వెళ్లాం. కష్టపడి సంపాదించిన డబ్బుతో తన తల్లిదండ్రులను తన కాన్వకేషన్‌కు తీసుకెళ్లాలనేది నా కుమార్తె గొప్ప కల. ఆమె మా విమాన టిక్కెట్లు బుక్ చేసి మమ్మల్ని తీసుకువెళ్లింది. మా బిడ్డతో చివరిగా గడిపిన ఆ రెండు రోజులు కూడా పని ఒత్తిడి కారణంగానే మాతో ప్రశాంతంగా ఉండలేకపోయింది. ఇది తలుచుకుంటేనే నా గుండె పగిలిపోతుంది. తరచుగా క్రికెట్ మ్యాచ్‌ల సమయంలో మీటింగ్‌లను రీషెడ్యూల్ చేసేదట ఆమె టీమ్ మేనేజర్. చివరి నిమిషంలో పని ఒత్తిడి పెంచేదట. ఆమె కింద పనిచేయడం నీ బ్యాడ్ లక్ అని ఒక ఆఫీస్ పార్టీలో, ఒక సీనియర్ లీడర్ చెప్పాడట అన్నాతో. అయినాదురదృష్టవశాత్తూ, తప్పించుకోలేకపోయింది. ధిక పని భారం కారణంగా చాలామంది ఉద్యోగులు రాజీనామా చేశారని కూడా తెలిపింది. దయచేసి ఇలాంటి పరిస్థితి మరో ఉద్యోగికి రాకుండా జాగ్రత్తపడండి. ఇంత పెద్ద కంపెనీలో కనీస మానవహక్కులను పట్టించుకోకపోతే ఎలా? మీ హెచ్ఆర్ కాపీ మొత్తం చదివాను.ఇది నా కుమార్తె గురించి మాత్రమే కాదు, ఎన్నో ఆశలు, కలలతో మీ కంపెనీలో చేరి ప్రతి యువ నిపుణుడి గురించి కూడా. అన్నా మరణం మీ కంపెనీకి ఒక హెచ్చరిక లాంటిది.మీ సంస్థలోని పని సంస్కృతిని ప్రతిబింబించే సమయం ఇది, ఆచరణ సాధ్యంకాని అంచనాలతో వారిపై ఒత్తిడి పెంచకండి.మీ ఉద్యోగుల ఆరోగ్యం, సంక్షేమానికి ప్రాధాన్యత ఇచ్చేలా తగిన చర్యలు తీసుకోండి.నాబిడ్డ అనుభవం నిజమైన మార్పుకు దారితీస్తుందని, అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను. ఇలాంటి దుఃఖం ఏ ఇతర కుటుంబమూ రాకుండా చూడండి. నా అన్న ఇప్పుడు మాతో లేదు. కానీ ఆమె గాథ మార్పుకు నాంది కావాలి..’’ అంటూ రాసుకొచ్చారు అనితా అగస్టిన్. అయితే దీనిపై కంపెనీనుంచి ఇంకా ఎలాంటి స్పందన రాలేదు.అలాగే అన్నా మరణానికి అసలైన కారణాలు ఏమిటి అనేదానిపై స్పష్టత లేదు. -
‘మూర్తి సార్.. మీ ఇన్ఫోసిస్ వాళ్లకు చెప్పండి’
ఆదాయపు పన్ను శాఖ పోర్టల్‌లో సాంకేతిక సమస్యలపై ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తికి సున్నితమైన కౌంటర్ ఇచ్చారు ఓ చార్టెర్డ్ అకౌంటెంట్. ఐటీ రిటర్న్స్ దాఖలుకు గడువు సమీపిస్తున్న తరుణంలో ఐటీ శాఖ పోర్టల్‌లో సమస్యలు తలెత్తడం మీద దాన్ని అభివృద్ధి చేసిన ఇన్ఫోసిస్‌పై బెంగళూరుకు చెందిన సీఏ ఒకరు సోషల్ మీడియా వేదికగా అంతృప్తి వ్యక్తం చేశారు.సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ‘ఎక్స్’లో బసు (@Basappamv) అనే సీఏ ఓ పోస్టు పెట్టారు. దేశాన్ని నిర్మించడానికి యువ నిపుణులు వారానికి 70 గంటలు పని చేయాలని ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి ఇచ్చిన సలహాను హాస్యాస్పదంగా ప్రస్తావించారు. "నారాయణ మూర్తి సార్, మీ సలహా మేరకు, మేము పన్ను నిపుణులం వారానికి 70 గంటలకు పైగా పని చేయడం ప్రారంభించాం. ఆదాయపు పన్ను పోర్టల్‌ను సజావుగా నడపడానికి మీ ఇన్ఫోసిస్ బృందాన్ని వారానికి కనీసం ఒక గంట పని చేయమని అడగండి" అంటూ రాసుకొచ్చారు.ఐటీ రిటర్న్స్ దాఖలు చేయడంలో కీలకమైన వార్షిక సమాచార ప్రకటన (AIS), పన్ను సమాచార ప్రకటన (TIS) డౌన్లోడ్ చేయడంలో సమస్యలను పేర్కొంటూ చాలా మంది సీఏలు బసు మనోభావాలను ప్రతిధ్వనించారు. ట్యాక్స్‌ఆరామ్ ఇండియా వ్యవస్థాపక డైరెక్టర్, భాగస్వామి మయాంక్ మొహంకా, "ఈ సంవత్సరం ఐటీ రిటర్న్స్ దాఖలు చేయడంలో సాధారణ జాప్యం జరుగుతోంది" అని పేర్కొన్నారు.మనీకంట్రోల్ నివేదిక ప్రకారం, పోర్టల్‌లోని సాంకేతిక సమస్యలతో జరిగిన ఆలస్యం కారణంగా చాలా మంది క్లయింట్ల కోసం ఏఐఎస్, టీఐఎస్‌లను పొందడంలో చాలా మంది చార్టెర్డ్ అకౌంటెంట్లు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పన్ను చెల్లింపుదారులను, సీఏలను ప్రభావితం చేస్తున్న పోర్టల్ సమస్యలపై అటు ఆర్థిక మంత్రిత్వ శాఖ గానీ, ఇటు ఇన్ఫోసిస్ గానీ స్పందించలేదు. -
సీఏ పరీక్షలు ఇకపై ఏటా మూడుసార్లు
న్యూఢిల్లీ: ఏటా రెండుసార్లు జరిగే చార్టర్డ్ అకౌంటెన్సీ(సీఏ) పరీక్షలను ఇకపై ఏటా మూడు సార్లు జరపాలని ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టెర్డ్ అకౌంటెన్సీ ఆఫ్ ఇండియా నిర్ణయించింది. 2024–25 విద్యా సంవత్సరం నుంచి ఏటా మూడు సార్లు పరీక్షలు జరుగబోతున్నాయి. జనవరి, మే/జూన్, సెపె్టంబర్ నెలల్లో ఇవి జరుగుతాయి. -
భారత్‌లో యూకే, కెనడా సీఏల ప్రాక్టీస్
న్యూఢిల్లీ: భారత్‌లో విదేశీ సీఏలను ప్రాక్టీస్‌కు అనుమతించే అంశం భారతీయ చార్టర్డ్ అకౌంటెంట్లకు కూడా ప్రయోజనకరంగా ఉండాలని ఇనిస్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ఐసీఏఐ) తెలిపింది. యూకే, కెనడా దేశాలు తమ దగ్గర భారత సీఏలు ప్రాక్టీస్ చేసుకునేందుకు అనుమతిస్తేనే ఆయా దేశాల సీఏలు కూడా ఇక్కడ కార్యకలాపాలు నిర్వహించేందుకు (రెసిప్రొకల్) అనుమతించవచ్చని పేర్కొంది. యునైటెడ్ కింగ్డం (యూకే), కెనడాతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలపై (ఎఫ్‌టీఏ) జరుగుతున్న చర్చల్లో ఈ అంశం కూడా పరిశీలనలో ఉంది. ఒకవేళ ఇది సాకారమైతే తొలిసారిగా భారత్‌లో విదేశీ చార్టర్డ్ అకౌంటెంట్లు కూడా ప్రాక్టీసు చేసేందుకు వీలవుతుంది. ఆస్ట్రేలియాతో కూడా ఈ తరహా ఒప్పందంపై చర్చలు జరుగుతున్నట్లు ఐసీఏఐ కొత్త ప్రెసిడెంట్ రంజిత్ కుమార్ అగర్వాల్ తెలిపారు. రెసిప్రోకల్ సిస్టమ్ అమల్లోకి వచ్చాక విదేశీ సీఏలు భారత్‌లో కార్యకలాపాల నిర్వహణ కోసం ఐసీఏఐలో నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. యూకే, కెనడా, ఆ్రస్టేలియా మొదలైనవి అభివృద్ధి చెందిన దేశాలని, అక్కడి వారిని ఇక్కడ అనుమతిస్తే, ఇక్కడి సీఏలు కూడా అక్కడికి వెళ్లడానికి వీలుంటుందని అగర్వాల్ పేర్కొన్నారు. వర్ధమాన దేశమైన భారత్ సీఏలు అభివృద్ధి చెందిన దేశాలకు వెళ్లే అవకాశం లభించడం వల్ల మనవారికి ప్రయోజనకరంగా ఉండగలదని చెప్పా రు. సామర్థ్యాలు, అనుభవం కారణంగా భారతీయ సీఏలకు విదేశాల్లో గణనీయంగా డిమాండ్ ఉందన్నారు. మరోవైపు, స్థూల దేశీయోత్పత్తిలో పన్ను వాటాల నిష్పత్తిని మెరుగుపర్చేందుకు కేంద్రానికి సిఫార్సులు చేయనున్నట్లు అగర్వాల్ తెలిపారు. అటు కృత్రిమ మేథ (ఏఐ) వినియోగంతో సీఏలకు గణనీయంగా సమయం ఆదా కాగలదని చెప్పారు. ప్రస్తుతం 42,000 మంది పైచిలుకు భారతీయ సీఏలు విదేశాల్లో పని చేస్తున్నారు. ఐసీఏఐ అంచనా ప్రకారం వచ్చే 20–25 ఏళ్లలో 30 లక్షల మంది పైగా చార్టర్డ్ అకౌంటెంట్లు అవసరమవుతారు. ఐసీఏఐలో ప్రస్తుతం 4 లక్షల మంది సభ్యులు, 8.5 లక్షల మంది విద్యార్థులు ఉన్నారు. -
అదరగొట్టిన ముంబై ట్విన్ సిస్టర్స్: శృతి, సంస్కృతి
చార్టర్డ్ ఎకౌంటెంట్స్ (సీఏ) ఫైనల్ ఎగ్జామినేషన్‌లో ఇరవై రెండు సంవత్సరాల ముంబై ట్విన్స్ సంస్కృతి, శ్రుతి ఆల్–ఇండియా టాప్ టెన్ ర్యాంకుల జాబితాలో చోటు సాధించారు. సంస్కృతి రెండో ర్యాంక్, శ్రుతి ఎనిమిదో ర్యాంకు సాధించింది. పరీక్షలు వస్తున్నాయంటే సాధారణంగా చాలామందిలో ఉండే భయం ఈ ట్విన్ సిస్టర్స్‌లో ఉండేది కాదు. పరీక్షలంటే వారికి పండగతో సమానం. ఆ ఇష్టమే వారిని ఎప్పుడూ విజేతలుగా నలుగురిలో గుర్తింపు తెస్తోంది. ఇద్దరికీ కొరియన్ సినిమాలు చూడడం, బ్యాడ్మింటన్ ఆడడం అంటే ఇష్టం. ఈ ట్విన్ స్టిసర్స్ కుటుంబాన్ని ‘ఫ్యామిలీ ఆఫ్ సీఏ’ అని పిలుస్తున్నారు. ఎందుకంటే నాన్న, అన్నయ్య, వదిన కూడా సీఏ చేశారు. ‘పరీక్షల కోసం నేను శ్రుతి కలిసి చదువుకున్నాం. ఏ డౌట్ వచ్చినా నాన్న, అన్నయ్య అందుబాటులో ఉండేవాళ్లు. కఠినమైన ΄ పోటీ పరీక్షలు ఎదుర్కోవడానికి ఈ రకమైన సపోర్టింగ్ సిస్టమ్ అవసరం’ అంటుంది సంస్కృతి. జైపూర్‌కు చెందిన మధుర్ జైన్ ఆల్ ఇండియా టాపర్‌గా నిలిచాడు. మూడో ర్యాంక్‌ను జైపూర్‌కు చెందిన తికేంద్ర కుమార్ సింఘాల్ , రిషి మల్హోత్రా మళ్లీ పంచుకున్నారు. -
సత్యం కుంభకోణం.. ఇద్దరు సీఏల సభ్యత్వం రద్దు
సాక్షి, న్యూఢిల్లీ : సత్యం కుంభకోణంతో సంబంధం ఉన్న ఇద్దరు చార్టెడ్ అకౌంటెంట్ల సభ్యత్వాన్ని ద ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టెడ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ఐసీఏఐ) రద్దు చేసింది. హైదరాబాద్‌కు చెందిన పులవర్తి శివప్రసాద్, సీహెచ్ రవీంద్రనాథ్‌లు ఐసీఏఐ నిబంధనలు మీరి వృత్తిపరమైన అవకతవకలకు పాల్పడ్డారని వారి సభ్యత్వం రద్దుతోపాటు చెరో రూ.5లక్షల జరిమానా విధిస్తూ క్రమశిక్షణ కమిటీ సిఫార్సు చేసింది. దీనిపై వారిద్దరూ అప్పీలేట్ ట్రిబ్యునల్‌కు వెళ్లగా కమిటీ సిఫార్సును సమర్థించింది. దీంతో వారిద్దరూ రూ.5లక్షలు జరిమానా ఐసీఏఐకి చెల్లించి ఢిల్లీ కోర్టును ఆశ్రయించారు. ఇటీవల ఢిల్లీ కోర్టు వారిద్దరి పిటిషన్లు కొట్టివేయడంతో ఐసీఏఐ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. పులవర్తి శివప్రసాద్ (సభ్యతం–204076) , సీహెచ్ రవీంద్రనాధ్ (సభ్యత్వం–204494)ల పేరు సభ్యుల రిజిస్టర్ నుంచి తొలగిస్తున్నామని, ఇది డిసెంబరు 27, 2023 నుంచి అమలులోకి వస్తుందని ఐసీఏఐ బుధవారం పేర్కొంది. ఈ మేరకు సంస్థ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. -
సీఏ మిస్‌కావడంతో ఫలితాలకు బ్రేక్
ముంబై: చార్టెడ్ అకౌంటెంట్ కనిపించకుండాపోవడంతో ఆర్థిక ఫలితాలను ప్రకటించలేకపోతున్నట్లు ఆఫీస్ ఫర్నీచర్ తయారీ కంపెనీ మైల్స్టోన్ ఫర్నీచర్ తాజాగా బీఎస్ఈకి తెలియజేసింది. సీఏ ఫోన్‌కాల్‌లో సైతం అందుబాటులోకి రావడంలేదని పేర్కొంది. మే 25న నిర్వహించిన సమావేశంలో కంపెనీ సీఏ భూపేంద్ర గాంధీ కనిపించకుండాపోవడం, ఫోన్ కాల్స్‌కు సమాధానం ఇవ్వకపోవడంతో ఆర్థిక ఫలితాలు పెండింగ్‌లో పడినట్లు చైర్మన్ వెల్లడించినట్లు మైల్స్టోన్ బీఎస్ఈకి తెలియజేసింది. అయితే ఈ సమస్యకు వీలైనంత త్వరగా పరిష్కారాన్ని కనుక్కోనున్నట్లు తెలియజేసింది. తద్వారా సాధ్యమైనంత త్వరగా బీఎస్ఈ, ఆర్వోసీ నిబంధనలు పాటించనున్నట్లు పేర్కొంది. కంపెనీ 2018లో బీఎస్ఈ ఎస్ఎంఈ ప్లాట్‌ఫామ్ ద్వారా లిస్టయ్యింది. కాగా.. 2022 సెప్టెంబర్‌తో ముగిసిన ఆరు నెలల కాలానికి కంపెనీ ఎలాంటి ఆదాయం ప్రకటించకపోగా.. రూ. 2.6 కోట్ల నికర నష్టం నమోదైంది. -
కొత్త చట్టం పట్ల సీఏల్లో ఆందోళన
న్యూఢిల్లీ: చార్టర్ట్ అకౌంటెంట్లను నల్లధనం నిరోధక చట్టం (పీఎంఎల్ఏ) పరిధిలోకి తీసుకొస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం విదేశీ పెట్టుబడుల పై, వ్యాపార సులభతర నిర్వహణపై ప్రభావం చూపిస్తుందన్న ఆందోళన పరిశ్రమ వర్గాల నుంచి వ్యక్తమవుతోంది. సీఏలతోపాటు, కాస్ట్ అకౌంటెంట్లు, కంపెనీ సెక్రటరీలను పీఎంఎల్ఏ పరిధిలోకి తీసుకొస్తూ కేంద్ర సర్కారు ఇటీవలే ఆదేశాలు జారీ చేయడం గమనార్హం. నిధుల దుర్వినియోగాన్ని అరికట్టేందుకు కేంద్రం ఈ చర్య తీసుకుంది. సీఏలు, కంపెనీ సెక్రటరీలు భారత్‌లో విదేశీ కంపెనీల ఏర్పాటుకు సహకారం అందిస్తుంటారని, తొలి దశలో విదేశీ కంపెనీల తరఫున తమ సొంత చిరునామా ఇస్తుంటారని పరిశ్రమ వర్గాలు వెల్లడించా యి. విదేశీ కంపెనీకి రెసిడెంట్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తూ, ఇక్కడ కార్యాలయం ఏర్పాటుకు సాయం అందిస్తుంటారని.. తమ క్లయింట్ల తరఫున బ్యాంకు ఖాతాలను నిర్వహిస్తుంటారని తెలిపాయి. విదేశీ క్లయింట్ భారత్‌కు తీసుకొచ్చే పెట్టుబడి సొంతమా లేక నల్లధనమా, వాటి మూలం తెలుసుకునే అవ కాశం సీఏలు, కంపెనీ సెక్రటరీలు లేదని పేర్కొన్నా యి. ప్రాపర్టీల కొనుగోలు, విక్రయం, బ్యాంకు ఖాతాలు లేదా ఆస్తుల నిర్వహణ, లిమిటెడ్ లయబి లిటీ పార్ట్నర్షిప్ లేదా ట్రస్ట్‌ల నిర్వహణ వ్యవహారాలన్నీ పీఎంఎల్ఏ పరిధిలోకి రానున్నాయి. ఫార్మే షన్ ఏజెంట్లు లేదా డైరెక్టర్/సెక్రటరీ/పార్ట్నర్గా వ్యవహరించే వారినీ పీఎంఎల్ఏ పరిధిలోకి తీసుకొ స్తూ కేంద్ర ఆర్థిక శాఖ ఆదేశాలు జారీ చేయడం గమనార్హం. -
మనీ లాండరింగ్ పరిధిలోకి సీఏలు
న్యూఢిల్లీ: నల్ల ధనం చలామణీ, మనీ లాండరింగ్ కార్యకలాపాలను నిరోధించడంపై ప్రత్యేకంగా దృష్టి పెట్టిన కేంద్రం ఆ దిశగా మరో కీలక చర్య తీసుకుంది. బ్లాక్ మనీ చలామణీకి ఆస్కారం ఉండే అయిదు రకాల ఆర్థిక లావాదేవీలను, వాటిని క్లయింట్ల తరఫున నిర్వహించే చార్టర్డ్ అకౌంటెంట్లు, కాస్ట్ అకౌంటెంట్లు, కంపెనీ సెక్రటరీలను మనీ–లాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్ఏ) పరిధిలోకి చేర్చింది. దీంతో ఇకపై సదరు లావాదేవీలను నిర్వహించే సీఏలు, సీఎస్‌లు కూడా విచారణ ఎదుర్కొనాల్సి రానుంది. దీనికి సంబంధించి కేంద్ర ఆర్థిక శాఖ మే 3న నోటిఫికేషన్ విడుదల చేసింది. స్థిరాస్తుల కొనుగోలు, విక్రయం; క్లయింట్ల డబ్బు, సెక్యూరిటీలు లేదా ఇతర ఆస్తుల నిర్వహణ; బ్యాంక్, సేవింగ్స్ లేదా సెక్యూరిటీస్ అకౌంట్ల నిర్వహణ; కంపెనీల ఏర్పాటు, నిర్వహణ కోసం నిధులు సమీకరించడంలో తోడ్పాటు; వ్యాపార సంస్థల కొనుగోళ్లు, విక్రయం.. మొదలైన అయిదు రకాల ఆర్థిక లావాదేవీలు ఇందులో ఉన్నాయి. పీఎంఎల్ఏ చట్టం 2002ను ప్రయోగించాల్సి వస్తే క్లయింట్ల స్థాయిలోనే సీఏలు కూడా జరిమానా, విచారణ ఎదుర్కొనాల్సి వస్తుందని సంబంధిత వర్గాలు తెలిపాయి. ‘పీఎంఎల్ఏ నిబంధనలను అమలు చేస్తే క్లయింట్లతో సమానంగా సీఏలు కూడా బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఒకవేళ నిబంధనలకు విరుద్ధంగా ఏదైనా లావాదేవీ జరిగినట్లుగా భావిస్తే ఆ విషయాన్ని సీఏలు వెంటనే నియంత్రణా సంస్థకు తెలియజేయాలి‘ అని వివరించాయి. రిపోర్టింగ్ అధికారులుగా సీఏలు.. ఆయా లావాదేవీల విషయంలో సీఏలు ఇకపై నియంత్రణ సంస్థలకు తెలియజేయాల్సిన రిపోర్టింగ్ అధికారులుగా వ్యవహరించాల్సి ఉంటుందని ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ఐసీఏఐ) పేర్కొంది. సదరు లావాదేవీలు నిర్వహించే క్లయింట్లందరి వివరాలను సేకరించి (కేవైసీ), రికార్డులను నిర్వహించాల్సిన బాధ్యత వారిపై ఉంటుందని తెలిపింది. క్లయింట్ల తరఫున ఏయే ఆర్థిక లావాదేవీలు జరపకుండా నిషేధం ఉందనే దాని గురించి తమ సభ్యుల్లో అవగాహన కల్పించేందుకు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ఐసీఏఐ వివరించింది. కొత్త మార్పులు సరైన కోణంలో అమలయ్యేలా చూసేందుకు, వృత్తి నిపుణులు పోషించగలిగే పాత్ర అర్థమయ్యేలా వివరించేందుకు నియంత్రణ సంస్థలు, అధికారులతో కలిసి పనిచేయనున్నట్లు ఐసీఏఐ తెలిపింది. నల్లధనం కట్టడికి కేంద్ర ప్రభుత్వం ఇటీవల పీఎంఎల్ఏ నిబంధనలను కఠినతరం చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా బ్యాంకులు, ఆర్థిక సంస్థలు .. రాజకీయాలతో ప్రమేయమున్న వ్యక్తుల (పీఈపీ) ఆర్థిక లావాదేవీలను రికార్డు చేయడాన్ని తప్పనిసరి చేసింది. అలాగే లాభాపేక్ష రహిత సంస్థల ఆర్థిక లావాదేవీల సమాచారాన్ని కూడా ఆర్థిక సంస్థలు, రిపోర్టింగ్ ఏజెన్సీలు సేకరించాల్సి ఉంటోంది. ఇక వర్చువల్ అసెట్స్ లావాదేవీలు నిర్వహించే క్రిప్టో ఎక్సే్చంజీలు, మధ్యవర్తిత్వ సంస్థలు తమ ప్లాట్‌ఫామ్‌లను ఉపయోగించే యూజర్ల వివరాలను సేకరించడాన్ని ప్రభుత్వం తప్పనిసరి చేసింది. -
‘మార్గదర్శి’ అక్రమాల కేసులో కీలక అరెస్ట్.. సంచలన విషయాలు వెలుగులోకి..
సాక్షి, విజయవాడ: మార్గదర్శి చిట్స్ అక్రమాల కేసులో మార్గదర్శి చిట్స్ చార్టెడ్ అకౌంటెంట్ కూడరవల్లి శ్రవణ్‌ను సీఐడీ అరెస్ట్ చేసింది. మార్గదర్శి చిట్ ఫండ్ అక్రమాలు, మోసాలు, నిధుల మళ్లింపు కేసులో ఆయనను సీఐడీ అదుపులోకి తీసుకుంది. ల్యాప్‌టాప్, పలు రికార్డులను సీఐడీ పోలీసులు సీజ్ చేశారు. మార్గదర్శి చిట్స్ ఆడిటింగ్ నిర్వహించే బ్రహ్మయ్య అండ్ కో లో అఫీషియల్ పార్టనర్‌గా కూడరవల్లి శ్రవణ్ ఉన్నారు. విజయవాడ 3వ మెట్రో పొలిటన్ కోర్టు మేజిస్ట్రేట్.. శ్రవణ్‌కి 14 రోజులు రిమాండ్ విధించింది. మార్గదర్శి మోసాలపై సంచలన విషయాలను శ్రవణ్ బయటపెట్టారు. వందల కోట్లకు డిపాజిట్లకు సంబంధించిన వివరాలను శ్రవణ్ వెల్లడించలేకపోయారు. మార్గదర్శి చిట్స్ బ్యాంక్ బ్యాలన్స్ల ఆడిటింగ్‌లో నిబంధనలు ఉల్లంఘించినట్టు శ్రవణ్ అంగీకరించారు. మార్గదర్శి చిట్ ఫండ్ ఖాతాల ఆడిటింగ్‌లో నిబంధనలు పాటించలేదని సీఐడీ వద్ద శ్రవణ్ అంగీకరించారు. చదవండి: ‘అందులో ఈనాడు రామోజీరావు పాత్ర ఉంది’ -
సత్యం స్కాం:హెచ్డీఎఫ్సీ చైర్మన్ సంచలన వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: సత్యం స్కామ్ చార్టర్డ్ అకౌంటెంట్ల వైఫల్యమేనని హెచ్డీఎఫ్సీ చైర్మన్ దీపక్ పరేఖ్ కీలక వ్యాఖ్యలు చేశారు. కంపెనీ అకౌంట్ పుస్తకాలను ఆడిట్ చేసిన చార్టర్డ్ అకౌంటెంట్లు వ్యత్యాసాలను గుర్తించడంలో విఫలమైనట్టు చెప్పారు. బుధవారం ఢిల్లీలో సీఐఐ నిర్వహించిన పుస్తకావిష్కరణ కార్యక్రమానికి హాజరైన సందర్భంగా పరేఖ్ ఈ అంశాన్ని ప్రస్తావించారు. సత్యం కంప్యూటర్ సర్వీసెస్ బోర్డులోని స్వతంత్ర డైరెక్టర్లు అందరూ అప్పటి చైర్మన్ బి.రామలింగరాజుకు రబ్బర్ స్టాంప్ మాదిరిగా పనిచేసినట్టు విమర్శించారు. 2009 జనవరిలో రూ.7,800 కోట్ల రూపాయల సత్యం స్కామ్ వెలుగులోకి రావడం తెలిసిందే. (బీఓబీ ఖాతాదారులకు గుడ్‌న్యూస్) అనంతరం జరిగిన పరిణామాల్లో సత్యంను టెక్ మహీంద్రా సొంతం చేసుకుని, తనలో విలీనం చేసుకుంది. చాలా ఏళ్లపాటు లేని లాభాలను చూపిస్తూ వచ్చినట్టు రామలింగరాజు స్వయంగా అంగీకరించారు. ఏ కంపెనీ సీఈవో అయినా వాటాదారుల కోసం పనిచేస్తున్నట్టు అర్థం చేసుకోవాలని పరేఖ్ సూచించారు. విఫలమవుతున్న కంపెనీల సంఖ్య పెరుగుతోందంటూ, కొందరి అత్యాశ కారణంగా ప్రజలు డబ్బును, విశ్వాసాన్ని కోల్పోతున్నట్టు చెప్పారు. (కొనసాగుతున్న కొలువుల కోత.. ఉద్యోగుల్లో కలవరం) ఇదే కార్యక్రమంలో పాల్గొన్న ప్రణాళికా సంఘం మాజీ డిప్యూటీ చైర్మన్ మాంటెక్‌సింగ్ అహ్లువాలియా స్పందిస్తూ.. నాటి సత్యం కంప్యూటర్ స్కామ్ సమయంలో బోర్డును ప్రభుత్వం రద్దు చేసి, ప్రైవేటు రంగంలో నిపుణులతో భర్తీ చేసినట్టు చెప్పారు. నాడు నిపుణులతో ఏర్పాటు చేసిన సత్యం బోర్డులో పరేఖ్‌కు సైతం స్థానం కల్పించడం గమనార్హం. (Amazon Layoffs అమెజాన్ కొత్త ఎత్తుగడ, కేంద్రం భారీ షాక్!) ఇదీ చదవండి: ఆకట్టుకునేలా స్పోర్టీ లుక్‌లో పల్సర్ పీ 150: ధర ఎంతంటే? -
ఢిల్లీ లిక్కర్ స్కాం: సీబీఐ విచారణకు సీఏ బుచ్చిబాబు
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్, ఢిల్లీ రాజకీయాల్లో లిక్కర్ స్కాంలో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ), కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ)లు దూకుడు పెంచాయి. లిక్కర్ పాలసీ ముడుపుల వ్యవహారంలో సీబీఐ కీలక ఆధారాలు సేకరించింది. ఇప్పటికే పలువురిని అరెస్ట్ చేయగా మరికొందరికి నోటీసులు పంపించాయి. ఈ కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియాను సోమవారం విచారించింది ఈడీ. ఇదే కేసులో హైదరాబాద్ వాసి అరుణ్ రామచంద్ర పిళ్లైని సీబీఐ విచారిస్తోంది. ఈ క్రమంలోనే హైదరాబాద్ చార్టెడ్ అకౌంటెంట్ గోరంట్ల బుచ్చిబాబుకు నోటీసులు పంపించగా.. ఈరోజు(మంగళవారం) సీబీఐ ముందు హాజరుకానున్నారు సీఏ బుచ్చిబాబు. రాబిన్ డిస్టిలరీస్‌తో పాటు ఈ కేసులో నిందితులుగా ఉన్న పలువురికి చార్టర్డ్ అకౌంటెంట్‌గా పని చేశారు బుచ్చిబాబు. ఇప్పటికే ఢిల్లీలో ఇండో స్పిరిట్ యజమాని సమీర్ మహేంద్రు, సిసోడియా అనుచరుడు విజయ్ నాయర్‌ను ఈడీ అరెస్ట్ చేసి విచారిస్తోంది. ఇదీ చదవండి: Delhi Liquor Scam: అభిషేక్ ఇచ్చిన సమాచారంతో అతడి విచారణ.. మరిన్ని అరెస్టులకు ఛాన్స్! -
దేశానికి బ్రాండ్ అంబాసిడర్లుగా ఉండాలి
శాన్ ఫ్రాన్సిస్కో: ’బ్రాండ్ ఇండియా’కు ప్రచారకర్తలుగా వ్యవహరించాలని భారతీయ చార్టర్డ్ అకౌంటెంట్లకు (సీఏ) కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పియుష్ గోయల్ సూచించారు. దేశంలోకి పెట్టుబడులు వచ్చేలా కృషి చేయాలని, దేశ ఆర్థిక వృద్ధికి తోడ్పాటు అందించాలని ఆయన పేర్కొన్నారు. ఇనిస్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ఐసీఏఐ) కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా మంత్రి ఈ విషయాలు తెలిపారు. ప్రస్తుతం 3.3 ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా ఉన్న భారత్ వచ్చే 30 ఏళ్లలో 30 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఎదగబోతోందని గోయల్ చెప్పారు. ‘భారత్‌లో పెట్టుబడుల అవకాశాల గురించి మీరు అంతర్జాతీయ క్లయింట్లకు వివరించండి. ఆ విధంగా అమెరికాలోను ఇతర ప్రాంతాల్లోను ఉన్న భారతీయ సీఏలు ఆయా దేశాలకు, భారత్‌కు మధ్య వారధిగా నిల్చినవారవుతారు‘ అని ఆయన పేర్కొన్నారు. అలాగే అత్యంత నాణ్యమైన ఉత్పత్తులు, సేవలను భారత్ అందుబాటు ధరల్లోనే అందిస్తున్న విషయాన్ని కూడా ఇతర దేశాలకు తెలియజేయాలని గోయల్ సూచించారు. ఐసీఏఐ సభ్యులు పండుగలు మొదలైన సందర్భాల్లో బహుమతులు ఇచ్చేందుకు మేడిన్ ఇండియా ఉత్పత్తులకు ప్రాధాన్యం ఇవ్వాలని ఆయన కోరారు. దేశీ సీఏ సంస్థలు అంతర్జాతీయ స్థాయి దిగ్గజాలుగా ఎదిగే లక్ష్యంతో పనిచేయాలని సూచించారు. -
చైనా కంపెనీల సీఏలపై నియంత్రణ సంస్థల కన్ను
న్యూఢిల్లీ: నిర్దిష్ట చైనా కంపెనీలు, వాటి అనుబంధ సంస్థలు భారత్‌లో నమోదు చేసుకోవడంలో జరిగిన ఉల్లంఘనలపై నియంత్రణ సంస్థలు దృష్టి పెట్టాయి. ఇందుకు సహకరించిన అనేక మంది చార్టర్డ్ అకౌంటెంట్లు, కంపెనీ సెక్రటరీలు, కాస్ట్ అకౌంటెంట్లకు చర్యలకు ఉపక్రమించాయి. దీనికి సంబంధించి ఇనిస్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ఐసీఏఐ), ఇనిస్టిట్యూట్ ఆఫ్ కంపెనీ సెక్రటరీస్ ఆఫ్ ఇండియా (ఐసీఎస్ఐ)కి కార్పొరేట్ వ్యవహారాల శాఖ నుంచి 400 పైచిలుకు ఫిర్యాదులు వచ్చినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఉల్లంఘనలకు పాల్పడిన సభ్యుల వివరాలను ఆయా సంస్థలకు కేంద్రం ఇచ్చిందని, తగు చర్యలు తీసుకోవాలని సూచించిందని పేర్కొన్నాయి. దీంతో ఐసీఏఐ, ఐసీఎస్ఐలతో పాటు ఇనిస్టిట్యూట్ ఆఫ్ కాస్ట్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా కూడా తమ తమ సభ్యులకు షోకాజ్ నోటీసులు జారీ చేశాయి. కంపెనీల చట్టం నిబంధనలను వారు ఉల్లంఘించారని నిర్ధారణ అయిన పక్షంలో వారిపై తగు క్రమశిక్షణ చర్యలు ఉంటాయని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఇప్పటివరకూ తమకు 200 కేసుల వివరాలు వచ్చినట్లు ఐసీఏఐ ప్రెసిడెంట్ దేబాషీస్ మిత్రా తెలిపారు. ఆయా సంస్థలు నిబంధనల ప్రకారమే రిజిస్టర్ అయ్యాయా, చిరునామాలను సరిగ్గానే ధృవీకరించుకున్నారా లేదా వంటి అంశాలు వీటిలో ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. ఐసీఏఐలో 3.50 లక్షల మంది పైగా, ఐసీఎస్ఐలో 68,000 మంది, ఇనిస్టిట్యూట్ ఆఫ్ కాస్ట్ అకౌంటెంట్స్‌లో 90,000 పైచిలుకు సభ్యులు ఉన్నారు. ఈ మూడు సంస్థలు కార్పొరేట్ వ్యవహారాల శాఖ పరిధిలో పనిచేస్తాయి. ఇటీవలి కాలంలో భారత్‌లో అక్రమంగా కార్యకలాపాలు సాగిస్తున్న చైనా కంపెనీలపై చర్యలు తీసుకుంటున్న నేపథ్యంలో తాజా పరిణామం ప్రాధాన్యం సంతరించుకుంది. -
కేంద్రం కీలక నిర్ణయం, అకౌంటెన్సీ వ్యవస్థ పునర్వ్యవస్థీకరణ!
న్యూఢిల్లీ: చార్టర్డ్ అకౌంటెంట్లు, కాస్ట్ అకౌంటెంట్లు, కంపెనీ సెక్రటరీల ఇన్స్టిట్యూట్ల పనితీరును పునరుద్ధరించే– అకౌంటెన్సీ బిల్లుకు లోక్‌సభ బుధవారం ఆమోద ముద్ర వేసింది. ఈ మార్పులు ఆయా సంస్థల స్వయంప్రతిపత్తిపై ప్రభావం చూపబోవని ఈ సందర్భంగా కేంద్ర ఆర్థిక, కార్పొరేట్ శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఉద్ఘాటించారు. పైగా ఇది ఆడిట్ నాణ్యతా ప్రమాణాలను పెంచుతుందని, దేశ పెట్టుబడి వాతావరణం మెరుగుపరుస్తుందని తెలిపారు. సభ ఆమోదం పొందిన చార్టర్డ్ అకౌంటెంట్స్, కాస్ట్ అండ్ వర్క్స్ అకౌంటెంట్స్, కంపెనీ సెక్రటరీస్ (సవరణ) బిల్లు... సంబంధిత ఇన్స్టిట్యూట్ల (ఐసీఏఐ– ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా, ఐసీఏఐ–ఇన్స్టిట్యూట్ ఆఫ్ కాస్ట్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా, ఐసీఎస్ఐ– ఇన్స్టిట్యూట్ ఆఫ్ కంపెనీ సెక్రటరీస్ ఆఫ్ ఇండియా) క్రమశిక్షణా కమిటీలకు ప్రిసైడింగ్ ఆఫీసర్‌గా నాన్–చార్టర్డ్ అకౌంటెంట్ (సీఏ), నాన్–కాస్ట్ అకౌంటెంట్, నాన్–కంపెనీ సెక్రటరీని నియమించాలని నిర్దేశిస్తోంది. జవాబుదారీ తనాన్ని పెంచుతాయి... ఈ సవరణలు ఇన్స్టిట్యూట్లను మరింత బాధ్యతాయుతంగా, జవాబుదారీగా మార్చుతాయని ఆర్థిక మంత్రి ఈ సందర్భంగా పేర్కొన్నారు. ప్రపంచ స్థాయి అత్యుత్తమ ప్రమాణాలను అనుసరించేలా ఇన్స్టిట్యూట్లను ప్రోత్సహిస్తాయని అన్నారు. ఆడిట్ స్టేట్మెంట్లపై వీటికి సంబంధించిన వారికందరికీ అత్యధిక భరోసా కల్పించడం బిల్లు ధ్యేయమని తెలిపారు. చార్టర్డ్ అకౌంటెంట్స్ యాక్ట్, 1949, కాస్ట్ అండ్ వర్క్స్ అకౌంటెంట్స్ యాక్ట్, 1959, కంపెనీ సెక్రటరీస్ యాక్ట్, 1980లను సవరించడానికి సంబంధించిన ఈ బిల్లుకు ప్రతిపక్ష సభ్యులు చేసిన సవరణలను సభ తొలుత తిరస్కరించింది. సమన్వయ కమిటీ ఏర్పాటు... కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ కార్యదర్శి నేతృత్వంలో సమన్వయ కమిటీని ఏర్పాటు చేయడానికి బిల్లు వీలు కల్పిస్తుంది. సమన్వయ కమిటీలో మూడు ఇన్స్టిట్యూట్లకు ప్రాతినిధ్యం ఉంటుంది. గతంలో మూడు సంస్థలు సమన్వయ కమిటీ ఏర్పాటుకు ఒక అవగాహనా ఒప్పందంపై (ఎంఓయూ) సంతకాలు చేశాయని, అయితే ఆ ప్రతిపాదన ముందుకు సాగలేదని ఆర్థికమంత్రి తన ప్రసంగంలో పేర్కొన్నారు. ఇన్స్టిట్యూట్ల వనరుల నిర్వహణలో ఈ కమిటీ సాయపడుతుందని ఆర్థిక మంత్రి పేర్కొంటూ, ఐఐఎంలు, ఐఐటీలకు కూడా సమన్వయ కమిటీలు ఉన్నాయని పేర్కొన్నారు. అవకతవకలకు పాల్పడిన భాగస్వాములు, సంస్థలకు విధించే జరిమానాల పరిమాణాన్ని పెంచాలని కూడా బిల్లు సూచిస్తోందని పేర్కొన్నారు. కాగా, ‘మీరు ఐఐటీలు, ఐఐఎంల ఉదాహరణలను ఇచ్చారు. అయితే ఈ ఇన్స్టిట్యూట్లకు ప్రభుత్వం నిధులు సమకూరుస్తుంది. అకౌంటెన్సీ ఇన్స్టిట్యూట్లకు ఈ పరిస్థితి లేదు. అందువల్ల రెండింటికీ పోలిక సరికాదు. సమన్వయ కమిటీ వల్ల అకౌంటెన్సీ ఇన్స్టిట్యూట్ల స్వయంప్రతిపత్తి దెబ్బతింటుంది’ అని ఎన్సీపీ నాయకురాలు సుప్రియా సూలే విమర్శించారు. -
డబ్బు లెక్క... ఓ కొలిక్కి వస్తోంది
ఇటీవల ఒక సర్వేలో వెల్లడైన నిజాలు ఆశ్చర్యం కలిగించాయి. ఈ డిజిటల్ యుగంలో కూడా మహిళ బ్యాంకు పోపుల డబ్బానే! ఆర్థిక వ్యవహారాలకు మహిళలు దూరంగానే ఉంటున్నారు. ఉద్యోగం చేసే మహిళల ఏటీఎమ్ కార్డుల నిర్వహణ భర్తదే! అందుకే... ఫైనాన్షియల్ లిటరసీ అవసరం అంటారు శుభ్రా మహేశ్వరి. ‘‘చాలామంది మహిళలకు ఆర్థిక వ్యవహారాల పట్ల ఏ మాత్రం అవగాహన ఉండడం లేదు. ఇది గ్రామీణ మహిళలు, నిరక్షరాస్యులైన మహిళల విషయం కాదు. బాగా చదువుకున్న వాళ్లు కూడా కనీస అవగాహన లేకుండా జీవితాన్ని గడిపేస్తున్నారు. నగరంలో ఇంటిని నిర్వహించే గృహిణి నెల ఖర్చులకు ముప్పై – నలభై వేల వరకు ఆమె చేతుల మీదుగా ఖర్చు చేస్తుంటుంది. కానీ ఒక లక్ష రూపాయలు ఇచ్చి ఇన్వెస్ట్ చేయమంటే చేయలేదు. మన దగ్గర ఉన్న డబ్బును బ్యాంకులో దాస్తే డబ్బే డబ్బును రెట్టింపు చేస్తుందనే చిన్న లాజిక్‌ని మిస్ అవుతున్నారు. ఇది వెల్త్ క్రియేషన్‌లో వెనుకబాటుతనమేనంటారు శుభ్ర. అక్షరాలు వచ్చు! లెక్క తేలదు!! ఒక చిన్న ఉదాహరణ తీసుకుంటే... పెద్ద చదువులు చదువుకున్న మహిళలు కూడా బంగారాన్ని ఆభరణం రూపంలో కొని బీరువాలోనో, బ్యాంకు లాకర్లోనో దాచుకుంటున్నారే తప్ప గోల్డ్‌బాండ్ కొనుగోలు చేయాలనే ఆలోచన చేయడం లేదు. బాండ్ రూపంలో ఉన్న బంగారం విలువను అర్థం చేసుకోవడంలో నిరక్షరాస్యతలో ఉన్నారనే చెప్పాలి. బ్యాంకులు గ్రామాల్లోకి కూడా విస్తరించాయి. కానీ చిన్న మొత్తమైనా సరే బ్యాంకులో దాచుకుని బ్యాంకు ద్వారా కానీ యాప్ ద్వారా కానీ లావాదేవీ నిర్వహించడం నేర్చుకోవడంలో బాగా వెనుకబడి ఉన్నారు. కాలేజీల్లో కూడా విద్యార్థులకు డబ్బు సంపాదించడం గురించి మాత్రమే నేర్పిస్తారు. డబ్బును ఎలా నిర్వహించాలో నేర్పించడం మీద దృష్టి వెళ్లడం లేదు. ‘‘పరిశ్రమలు స్థాపించిన మహిళలు, చిన్న చిన్న వ్యాపారాలు మొదలు పెట్టిన మహిళలు శ్రమించడంలో ఏ మాత్రం అలసత్వం ఉండదు. నూటికి నూరు శాతం ఎఫర్ట్ పెడుతున్నారు. కానీ మనీ మేనేజ్మెంట్ తెలియకపోవడం వల్లనే లాభాల బాట పట్టాల్సిన పరిశ్రమలు పట్టాలు తప్పుతున్నాయి. ఒక చార్టెడ్ అకౌంటెంట్‌గా నేను గమనించింది ఒక్కటే. పరిశ్రమలు, వ్యాపారాలు ప్రారంభించిన మహిళలు అంకితభావంతో పని చేస్తున్నప్పటికీ వారికి సరైన మార్గదర్శనం చేసే వారు లేకపోవడంతో ఆ మహిళల శ్రమ వృథా అవుతోంది. వర్క్‌లో డెడికేషన్ ఎంత ముఖ్యమో, రైట్ డైరెక్షన్లో చేయడం కూడా అంతే ముఖ్యం. అందుకే నా వంతు సామాజిక బాధ్యతగా మహిళల్లో ఆర్థిక చైతన్యం తీసుకురావడానికి ఫైనాన్షియల్ లిటరసీ ప్రోగ్రామ్‌లు నిర్వహిస్తున్నాను. ఇటీవల మనదేశంలో మహిళా పారిశ్రామికవేత్తలు గణనీయంగా పెరిగారు. ఈ దశలో ఈ చైతన్యం చాలా అవసరం. ఇందుకోసం గ్రామాలు, పట్టణాలు, నగరాల్లో వర్క్ షాపులు చేపడుతున్నాం. భారీ సమావేశాలకు బదులు చిన్న చిన్న క్యాంపులు నిర్వహిస్తున్నాం. ఇంత పెద్ద విషయాన్ని సరళంగా వివరించడానికి స్థానిక బ్యాంకులతో కలిసి పని చేస్తున్నాం. సమావేశంలోనే బ్యాంకు అకౌంట్ ఓపెన్ చేయించడం కూడా జరుగుతుంది’’ అన్నారు శుభ్రా మహేశ్వరి. కలను దర్శించాలి! ఫిక్కీ లేడీస్ ఆర్గనైజేషన్ చైర్ పర్సన్‌గా ఆమె మహిళను మానసికంగా శక్తిమంతం చేయడానికి ‘స్ట్రాంగర్ షీ’ అనే కార్యక్రమం రూపొందించారు. అందులో భాగంగా ఈ ఏడాది చేపట్టిన అంశం ‘ఫైనాన్షియల్ లిటరసీ’. దేశంలోని గ్రామీణ, పేద మహిళ నుంచి మధ్య తరగతి మహిళలు, వైట్ కాలర్ జాబ్‌లో ఉన్న మహిళలను కూడా కలుసుకుంటారు. డబ్బు సంపాదించడం మాత్రమే తెలిస్తే సరిపోదు, డబ్బును ఎలా ఇన్వెస్ట్ చేయాలో కూడా నేర్పించడం, డబ్బుతో డబ్బును ఎలా పెంపొందించుకోవాలో తెలియచేయడం ఇందులో ప్రధాన ఉద్దేశం. ‘‘భూమ్మీద నీకంటూ ఒక స్థానం ఉంది. ఆకాశంలోనూ నీ కంటూ కొంత భాగం ఉంది. ఈ రెండింటినీ కలుపుతూ ఎదగడానికి నీకంటూ ఒక కల ఉండాలి. నీ జ్ఞానంతో ఆ కలను దర్శించగలగాలి. ఆ కలను నిజం చేసుకోవడానికి నీ శ్రమను అనుసంధానం చేసుకోవాలి. నీ కలను నిజం చేసుకోవాల్సిన బాధ్యత పూర్తిగా నీదే. కుటుంబ సభ్యులు, స్నేహితులు సహాయంగా ఉండే వారే, ఫలితం పూర్తిగా నీదే. అది విజయం అయినా అపజయం అయినా పూర్తి బాధ్యత నీదేననే విషయాన్ని మర్చిపోకూడదు’’ మహిళలకు నా సందేశం ఇదేనన్నారు శుభ్రా మహేశ్వరి. రోజూ తెల్లకాగితమే! శుభ్రా మహేశ్వరి పుట్టింది, పెరిగింది ఢిల్లీలోనే. తండ్రి పారిశ్రామికవేత్త. ఆమె మాత్రం చార్టెడ్ అకౌంటింగ్ వైపు ఆసక్తి చూపించింది. పెళ్లి తర్వాత ఇరవై ఏళ్ల కిందట భర్తతో హైదరాబాద్ వచ్చి స్థిరపడ్డారు. బ్లూ స్టోన్స్ గ్రూప్ ఆఫ్ కంపెనీల డైరెక్టర్‌గా విధులు నిర్వహణతోపాటు చార్టెడ్ అకౌంటెంట్‌గా తిరుమల తిరుపతి దేవస్థానమ్, ఆరోగ్య శ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్, నేషనల్ హైవేస్తోపాటు దాదాపుగా మూడు వందల కార్పొరేట్ కంపెనీలకు ఆడిటర్‌గా సేవలందించిన, అందిస్తున్న అనుభవం ఆమెది. ‘‘మన జీవితంలో ప్రతి రోజూ ఒక కొత్త రోజే. డైరీలో కొత్త పేజీనే. ఏమీ రాయని తెల్లకాగితమే. జీవితంలో విజయం సాధించాలంటే ప్రతి కాగితాన్నీ మంచి విషయంతో నింపాలి. అదే అందమైన కథ అవుతుంది. అంటే ఏ ఒక్క రోజునూ నిరుపయోగంగా గడపవద్దు. ప్రయోజనకరంగా గడపాలి’’ అంటారు శుభ్రా మహేశ్వరి. – వాకా మంజులారెడ్డి -
ట్యాక్స్ పేయర్స్‌కు అలర్ట్.. వెంటనే ఈ డాక్యుమెంట్స్ ఫైల్ చేయండి..!
ఆదాయపు పన్ను చెల్లింపుదారులు, చార్టర్డ్ అకౌంటెంట్లకు ఇన్కమ్ ట్యాక్స్ ఆఫ్ ఇండియా అలర్ట్ చేసింది. గతంలో పొడిగించిన గడువు తేదీ ఫిబ్రవరి 15 నాటికి ఆదాయపు పన్ను చెల్లింపుదారులు, చార్టర్డ్ అకౌంటెంట్లు ముఖ్యమైన ఆదాయపు పన్ను సంబంధిత పత్రాలను దాఖలు చేయాలి అని ట్విటర్ వేదికగా పేర్కొంది. "ప్రియమైన పన్ను చెల్లింపుదారులారా, ఫారం 3 సీఏ-సీడీ/3 సీబీ-3 సీడీ దాఖలు చేయడానికి పొడగించిన గడువు తేదీ ఫిబ్రవరి 15, 2022. పీఎల్ ఫైల్ ట్యాక్స్ ఆడిట్ రిపోర్ట్‌లను, స్టేట్ మెంట్లను సెక్షన్ 44ఏబి కింద సాధ్యమైనంత త్వరగా సబ్మిట్ చేయండి" అని ఆదాయపు పన్ను శాఖ ట్వీట్ చేసింది. అలాగే, "ఆదాయపు పన్ను చట్టం, 1961లోని సెక్షన్ 115జెసీ కింద ఫారం 29సీ దాఖలు చేయడానికి పొడగించిన గడువు తేదీ ఫిబ్రవరి 15, 2022. చివరి రోజు వరకు వేచి ఉండవద్దు. ఇప్పుడు ఫైల్ చేయండి!" అని ఆదాయపు పన్ను శాఖ ట్వీట్ చేసింది. ఇక అది అలా ఉంటే దేశవ్యాప్తంగా ఐటీ రిటర్నులు దాఖలు చేసేవారి సంఖ్య క్రమ క్రమంగా పెరుగుతున్నది. అసెస్మెంట్ ఏడాది 2021-22(2020-21 ఆర్థిక సంవత్సరం)కిగాను 6.17 కోట్ల మంది ఐటీ రిటర్నులు దాఖలు చేశారని, వీరిలో 19 లక్షల మంద ట్యాక్స్ ఆడిట్ రిపోర్ట్‌లను నూతన ఐటీ ఈ-ఫైలింగ్ పొర్టల్ కింద దాఖలు చేసినట్లు సీబీడీటీ తాజాగా వెల్లడించింది. Dear Taxpayers, The extended due date for filing Form 3CA-3CD/3CB-3CD is 15th February, 2022. Pl file Tax Audit Report & submit statement of particulars under section 44AB at the earliest. Pl visit https://t.co/GYvO3mStKf #FileNow #eFiling pic.twitter.com/fnjEkyh0Yd — Income Tax India (@IncomeTaxIndia) February 8, 2022 The extended due date for filing Form 29C is 15th February, 2022 for furnishing the report under section 115JC of Income-tax Act, 1961. Let’s not wait till the last day. File Now! Pl visit https://t.co/GYvO3mStKf#FileNow #eFiling pic.twitter.com/K9bkjlep1Q — Income Tax India (@IncomeTaxIndia) February 7, 2022 (చదవండి: హైటెక్ బిచ్చగాడు.. వీడు మాములోడు కాదు) -
ఐటీ ‘రిటర్న్స్’ విషయంలో జర జాగ్రత్త..!
సాక్షి, హైదరాబాద్: ఆదాయపన్ను శాఖ నుంచి పన్ను చెల్లింపుదారులకు తిరిగి రావాల్సిన మొత్తాలను సైబర్ నేరగాళ్లు స్వాహా చేశారు. నగరానికి చెందిన ఓ చార్టెడ్ అకౌంటెంట్(సీఏ) గురువారం సిటీ సైబర్ క్రైమ్ ఏసీపీ కేవీఎం ప్రసాద్‌కు ఫిర్యాదు చేయడంతో మోసం వెలుగుచూసింది.(చదవండి: WhatsApp: ఎడిట్ ఫొటోల్ని, జిఫ్ ఫైల్స్‌ను పంపుతున్నారా?) సిటీ కేంద్రంగా ఓ సంస్థను ఏర్పాటు చేసుకున్న చార్టెడ్ అకౌంటెంట్‌కు దేశ వ్యాప్తంగా క్లయింట్స్ ఉన్నారు. వారిద్వారా మహారాష్ట్ర పుణేకు చెందిన ప్రవాస భారతీయుడు(ఎన్నారై) పరిచయమయ్యారు. కాలిఫోర్నియాలో ఉండే ఆయన తన ఐటీ రిటర్న్స్ ఫైల్ చేయాలనడంతో సీఏ అంగీకరించారు. ఎన్నారైకి ఆదాయపు పన్ను శాఖ నుంచి రావాల్సిన రూ. 21 లక్షలను పుణేలో ఉన్న ఐసీఐసీఐ బ్యాంకు ఖాతాలోకి పంపాలంటూ వాటిలో పొందుపరిచారు. సదరు ఖాతా నంబర్ ఐటీ రికార్డుల్లోనూ ఉంది. నిర్ణీత గడువు ముగిసినా తనకు రావాల్సిన డబ్బు రాలేదని సీఏ దృష్టికి ఎన్నారై తీసుకెళ్లారు. సీఏ ఆదాయపు పన్ను శాఖకు ఫిర్యాదు చేశారు. పరిశీలించిన అధికారులు సదరు ఎన్నారైకి రావాల్సిన రూ. 21 లక్షలను కొన్ని నెలల క్రితమే చెల్లించామంటూ సమాధానం ఇచ్చారు. అవాక్కైన సీఏ ఆ డబ్బు పంపిన ఖాతా వివరాలు తెలపాల్సిందిగా ఐటీ కాల్ సెంటర్‌ను సంప్రదించారు. వారందించిన వివరాల మేరకు విశాఖ పట్నం ద్వారకానగర్‌లోని ఇండస్ ఇండ్ బ్యాంకును సీఏ సంప్రదించారు. ఆ ఖాతాలోకి ఆదాయపు పన్ను శాఖ నుంచి రూ. 21 లక్షలు జమయ్యాయని, ఆ మొత్తాన్ని ఖాతాదారుడు డ్రా చేసేసినట్లు బ్యాంకర్లు వెల్లడించారు. ఆ ఖాతాను సైబర్ నేరగాళ్లు కాలిఫోర్నియాలో ఎన్నారై పేరు, వివరాలతోనే ఓపెన్ చేసి.. ఆదాయపు పన్ను శాఖ రికార్డుల్లోకీ జొప్పించారు. ఫలితంగానే రిటర్న్స్‌కు సంబంధించిన మొత్తాన్ని ఐటీ శాఖ అందులోకి బదిలీ చేసింది. ‘చార్టెడ్ అకౌంటెంట్ ఈ సైబర్ నేరానికి సంబంధించిన ప్రాథమిక వివరాలు అందిస్తూ ఫిర్యాదు చేశారు. ఆయన నుంచి మరిన్ని వివరాలు లిఖిత పూర్వకంగా కోరాం’ అని ఏసీపీ కేవీఎం ప్రసాద్ వివరించారు. -
ఐటీ ‘రిటర్న్స్’నూ మళ్లించేశారు..!
సాక్షి, హైదరాబాద్: ఆదాయపు పన్ను శాఖ నుంచి పన్ను చెల్లింపుదారులకు తిరిగి రావాల్సిన మొత్తాలను సైబర్ నేరగాళ్లు స్వాహా చేశారు. నగరానికి చెందిన ఓ చార్టెడ్ అకౌంటెంట్ (సీఏ) గురువారం సిటీ సైబర్ క్రైమ్ ఏసీపీ కేవీఎం ప్రసాద్‌కు ఫిర్యాదు చేయడంతో మోసం వెలుగుచూసింది. సిటీ కేంద్రంగా ఓ సంస్థను ఏర్పాటు చేసుకున్న చార్టెడ్ అకౌంటెంట్‌కు దేశ వ్యాప్తంగా క్లైంట్స్ ఉన్నారు. వారిద్వారా మహారాష్ట్ర పుణేకు చెందిన ప్రవాస భారతీయుడు (ఎన్నారై) పరిచయమయ్యారు. కాలిఫోర్నియాలో ఉండే ఆయన తన ఐటీ రిటర్న్స్ ఫైల్ చేయాలనడంతో సీఏ అంగీకరించారు. ఎన్నారైకి ఆదాయపు పన్ను శాఖ నుంచి రావాల్సిన రూ. 21 లక్షలను పుణేలో ఉన్న ఐసీఐసీఐ బ్యాంకు ఖాతాలోకి పంపాలంటూ వాటిలో పొందుపరిచారు. సదరు ఖాతా నంబర్ ఐటీ రికార్డుల్లోనూ ఉంది. నిర్ణీత గడువు ముగిసినా తనకు రావాల్సిన డబ్బు రాలేదని సీఏ దృష్టికి ఎన్నారై తీసుకెళ్లారు. సీఏ ఆదాయపు పన్ను శాఖకు ఫిర్యాదు చేశారు. పరిశీలించిన అధికారులు సదరు ఎన్నారైకి రావాల్సిన రూ. 21 లక్షలను కొన్ని నెలల క్రితమే చెల్లించామంటూ సమాధానం ఇచ్చారు. అవాక్కైన సీఏ ఆ డబ్బు పంపిన ఖాతా వివరాలు తెలపాల్సిందిగా ఐటీ కాల్ సెంటర్‌ను సంప్రదించారు. వారందించిన వివరాల మేరకు విశాఖపట్నం ద్వారకానగర్‌లోని ఇండస్ ఇండ్ బ్యాంకును సీఏ సంప్రదించారు. ఆ ఖాతాలోకి ఆదాయపు పన్ను శాఖ నుంచి రూ. 21 లక్షలు జమయ్యాయని, ఆ మొత్తాన్ని ఖాతాదారు డ్రా చేసేసినట్లు బ్యాంకర్లు వెల్లడించారు. ఆ ఖాతాను సైబర్ నేరగాళ్లు కాలిఫోర్నియాలో ఎన్నారై పేరు, వివరాలతోనే ఓపెన్ చేసి.. ఆదాయపు పన్ను శాఖ రికార్డుల్లోకీ జొప్పించారు. ఫలితంగానే రిటర్న్స్‌కు సంబంధించిన మొత్తాన్ని ఐటీ శాఖ అందులోకి బదిలీ చేసింది.‘చార్టెడ్ అకౌంటెంట్ ఈ సైబర్ నేరానికి సంబంధించిన ప్రాథమిక వివరాలు అందిçస్తూ ఫిర్యాదు చేశారు. ఆయన నుంచి మరిన్ని వివరాలు లిఖిత పూర్వకంగా కోరాం’ అని ఏసీపీ కేవీఎం ప్రసాద్ వివరించారు. -
సింధు మృతి కేసులో నిందితుడి అరెస్టు
గుణదల (విజయవాడ తూర్పు): సీఏ విద్యార్థిని సింధు అనుమానాస్పద స్థితిలో మృతిచెందిన కేసులో నిందితుడు ప్రసేన్‌ను విజయవాడలోని మాచవరం పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. ప్రేమ పేరుతో సింధును లోబరుచుకుని మోసం చేయడంతో ఆమె మనస్తాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. మరో అమ్మాయితో సంబంధం పెట్టుకున్న ప్రసేన్.. సింధును వదిలించుకోవాలన్న దురాలోచనతో ఆమెను ఆత్మహత్యకు ప్రేరేపించినట్లు పోలీసులు వెల్లడించారు. మృతురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు వివరాలు సేకరించిన పోలీసులు 306 సెక్షన్ కింద ప్రసేన్‌ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపించారు. చదవండి: చార్టర్డ్ అకౌంటెంట్ సింధు అనుమానాస్పద మృతి -
చార్టర్డ్ అకౌంటెంట్ సింధు అనుమానాస్పద మృతి
సాక్షి, విజయవాడ: కృష్ణా జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ఓ యువ చార్టెడ్ అకౌంటెంట్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. ఈ ఘటన మాచవరం పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. మృతి చెందిన చెరుకూరి సింధు కొద్ది రోజులుగా ప్రసేన్ అనే వ్యక్తితో సన్నిహితంగా ఉంటున్నారు. ఆ వ్యక్తి ఇంట్లోనే సింధు ఉరి వేసుకొని కనిపించారు. అదీ కాకుండా సింధు ముఖంగాపై గాయాలు కనిపించడంతో.. తమ కూతురిది ఆత్మహత్య కాదని ఆమె తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. సింధుతో సన్నిహితంగా ఉంటున్న ప్రసేన్ కుమార్ తమ కుమార్తెను హత్య చేశాడని ఆరోపిస్తున్నారు. ఈ ఘటనకు ప్రేమ వ్యవహారం కారణమని సమాచారం. అయితే సింధు,ప్రసేన్‌ల ప్రేమ వివాహానికి పెద్దలు అంగీకరించలేదని తెలుస్తోంది. దీంతో లాక్డౌన్ అనంతరం సింధు.. ప్రసేన్ ఇంట్లోనే ఉంటునట్లు సమాచారం. -
చార్టర్డ్ అకౌంటెన్సీ, ఎంబీఏ.. ఏది బెటర్
జాబ్ మార్కెట్ వేగంగా మారిపోతోంది. కంపెనీల అవసరాలకు అనుగుణంగా ఉన్నత విద్య కోర్సులను ఎంచుకోవాల్సిన పరిస్థితి. ముఖ్యంగా చార్టర్డ్ అకౌంటెన్సీ(సీఏ), మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ (ఎంబీఏ)ల్లో.. ఏది బెటర్ అనే విషయంలో విద్యార్థులు త్వరగా ఒక నిర్ణయానికి రాలేకపోతున్నారు. ఈ కోర్సులకున్న క్రేజ్‌ను దృష్టిలో పెట్టుకొని.. కొందరు చార్టర్డ్ అకౌంటెన్సీలో చేరుతుండగా.. మరికొందరు ఎంబీఏను ఎంచుకుంటున్నారు. సీఏ, ఎంబీఏల ప్రత్యేకతపై అవగాహన పెంచుకోవడం ద్వారా విద్యార్థులు తమకు నప్పే కోర్సులో చేరొచ్చు!! ఇంటర్ లేదా గ్రాడ్యుయేషన్ తర్వాత విద్యార్థులు ఉన్నత విద్య కోర్సులకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుత పోటీ ప్రపంచంలో ప్రొఫెషనల్ కోర్సులకు జాబ్ మార్కెట్లో అధిక ప్రాధాన్యం ఉన్న సంగతి తెలిసిందే. సీఏ, ఎంబీఏ వంటి కోర్సులు పూర్తిచేసుకుంటే.. అవకాశాలకు కొదవలేదు. మేనేజ్మెంట్, అనాలసిస్, బిజినెస్ స్ట్రాటజీ పరిజ్ఞానంతో ఎంబీఏలు కార్పొరేట్ రంగంలో ఉజ్వల కెరీర్ సొంతం చేసుకోవచ్చు. మరోవైపు సీఏ కోర్సుతో అకౌంటింగ్, ఫైనాన్స్ రంగాల్లో దూసుకుపోవచ్చు. సీఏ చార్టర్డ్ అకౌంటెన్సీ అనేది అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన ప్రొఫెషనల్ కోర్సు. సీఏ కోర్సు ప్రధాన లక్ష్యం.. ఫైనాన్షియల్ అండ్ అకౌంటింగ్ విభాగాలకు అవసరమైన నిపుణులను అందించడం. మన దేశంలో ఈ కోర్సును ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా(ఐసీఏఐ) నిర్వహిస్తోంది. సీఏ పరీక్షలు ఉత్తీర్ణులైన వారికి ప్రొషెషనల్ సీఏగా గుర్తింపు లభిస్తుంది. ఈ కోర్సులో చేరేందుకు కనీస అర్హత 10+2/ఇంటర్మీడియట్. ఇంటర్ తర్వాత.. ‘కామన్ ప్రొఫిషియెన్సీ టెస్ట్’(సీపీటీ)కు హాజరు కావాలి. బ్యాచిలర్ డిగ్రీ తర్వాత ‘ఇంటిగ్రేటెడ్ ప్రొఫెషనల్ కాంపిటెన్సీ కోర్సు’ కోసం రిజిస్టర్ చేసుకోవచ్చు. ఎంబీఏ మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్.. సంక్షిప్తంగా ఎంబీఏ. ఇది కూడా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ. ఐఐఎంలు వంటి ప్రముఖ బిజినెస్ స్కూల్స్‌లో ఎంబీఏ చేసినవారికి అవకాశాలు విస్తృతం. సైన్స్/హ్యూమానిటీస్/కామర్స్/ఇంజనీరింగ్.. ఇలా ఏదైనా విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసిన వారు ఎంబీఏలో చేరొచ్చు. డిగ్రీ తర్వాత క్యాట్/మ్యాట్/ఎక్స్‌ఏటీ వంటి జాతీయ స్థాయి ఎంట్రన్స్ టెస్ట్‌లు; ఐసెట్ వంటి రాష్ట్ర స్థాయి పరీక్షల్లో ర్యాంక్ సాధించాల్సి ఉంటుంది. ఎంబీఏ కోర్సు ప్రధాన లక్ష్యం.. కంపెనీలు, వ్యాపారాల నిర్వహణకు అవసరమైన మార్కెటింగ్, హ్యూమన్ రిసోర్స్, ఫైనాన్స్, ఇంటర్నేషనల్ బిజినెస్ మొదలైన విభిన్న నైపుణ్యాలు అందించడం. కోర్సుల వ్యవధి సీఏ కోర్సులో..ఇంటర్మీడియట్ అర్హతతో చేరి.. నాలుగేళ్లలో పూర్తిచేసుకోవచ్చు. ఇందులో సీపీటీ, ఐపీసీసీ, సీఏ ఫైనల్ ఉంటాయి. ఎంబీఏ కోర్సు వ్యవధి రెండేళ్లు. నాలుగు సెమిస్టర్లుగా ఉంటుంది. సీఏతో కెరీర్ సీఏ ఉత్తీర్ణులైన వారికి ఆడిటర్, ఫైనాన్స్ మేనేజర్ వంటి ఉద్యోగాలు ఉంటాయి. సీఏ కోర్సు పూర్తి చేసినవారు ప్రభుత్వ, ప్రైవేట్ రంగ కంపెనీల్లో అవకాశాలు అందుకోవచ్చు. సొంతంగా ప్రాక్టీస్ చేసే అవకాశం సైతం ఉంటుంది. ఆడిటింగ్ ఫర్మ్స్, ట్యాక్సేషన్, మేనేజింగ్ కన్సల్టెన్సీ సర్వీసెస్, కార్పొరేట్ లా కంపెనీల్లో కొలువుతోపాటు సీఏగా సొంతంగా ప్రాక్టీస్ ప్రారంభించొచ్చు. ఎంబీఏతో ఉద్యోగాలు ఎంబీఏ చేసిన అభ్యర్థులకు వివిధ కార్పొరేట్ కంపెనీల్లో మేనేజర్స్, టీమ్ లీడర్స్, హెచ్ఆర్ హెడ్ వంటి కొలువులు లభిస్తాయి. పేరున్న బీస్కూల్స్‌లో ఎంబీఏ ఉత్తీర్ణులైన వారికి దేశ విదేశాల్లో కార్పొరేట్ రంగంలో మంచి డిమాండ్ ఉంటుంది. ముఖ్యంగా మార్కెటింగ్ మేనేజర్/కన్సల్టెంట్స్, ఫైనాన్షియల్ అడ్వైజర్, హెచ్ఆర్ మేనేజర్, ఐటీ/ఆపరేషన్స్ మేనేజర్, అనలిస్ట్, అడ్మినిస్ట్రేటివ్ మేనేజర్, ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్‌తోపాటు మరెన్నో విభాగాల్లో అవకాశాలు సొంతం చేసుకోవచ్చు. నైపుణ్యాలు ► చార్టర్డ్ అకౌంటెంట్‌గా రాణించాలంటే.. అకౌంటింగ్ అండ్ ఆడిటింగ్‌పై పట్టు అవసరం. దీంతోపాటు మంచి కమ్యూనికేషన్ స్కిల్స్, సామాజిక, ఆర్థిక పరిస్థితులపై అవగాహన ఉండాలి. ► ఎంబీఏలకు నిర్వహణ నైపుణ్యాలు, నాయకత్వ లక్షణాలు, టైమ్ మేనేజ్మెంట్, బిజినెస్ స్కిల్స్ తప్పనిసరి. దేనికదే ప్రత్యేకం ► వాస్తవానికి సీఎ, ఎంబీఏ దేనికదే ప్రత్యేకమైనవి. కాని ఎక్కువ మంది ఈ రెండు కోర్సులను పోలుస్తుంటారు. ఏ కోర్సుతో మంచి అవకాశాలు లాభిస్తాయో తెలుసుకునే ప్రయత్నం చేస్తుంటారు. సీఏ.. అకౌంటెన్సీకి సంబంధించిన కోర్సు. కాగా, ఎంబీఏ వ్యాపార నిర్వహణ విభాగానికి చెందిన ప్రోగ్రామ్. ఎంబీఏలో.. హెచ్ఆర్, ఫైనాన్స్, మార్కెటింగ్ వంటి పలు స్పెషలైజేషన్స్ ఎంచుకోవచ్చు. డ్యూయల్ స్పెషలైజేషన్స్ చేసే అవకాశం కూడా ఉంది. ► ఎంబీఏతో పోలిస్తే సీఏ కోర్సు పూర్తిచేసుకునేందుకు అయ్యే ఖర్చు తక్కువ. కాని సీఏ కోర్సు కొంత కఠినమైందనే అభిప్రాయం ఉంది. ఒకసారి ఎంబీఏలో చేరితే.. రెండేళ్లు పూర్తయ్యేసరికి పట్టా చేతికొస్తుంది. కాని సీఏ కోర్సులో చేరే విద్యార్థుల్లో మూడు నుంచి ఐదు శాతం మంది మాత్రమే నిర్దిష్ట సమయంలోపు కోర్సు ఉత్తీర్ణులవుతున్నారు. ► ఎంబీఏను.. ఐఐఎంలు, ఐఎస్బీ తదితర టాప్ బీ స్కూల్స్‌లో పూర్తిచేయాలంటే.. చాలా వ్యయం అవుతుంది. రూ.లక్షల్లో ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఈ కోర్సులో చేరినవారిలో దాదాపు 80 శాతం మంది మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధిస్తున్నారు. టాప్ బీ స్కూల్స్‌లో ఎంబీఏ ఉత్తీర్ణులైన అభ్యర్థులకు క్యాంపస్ ప్లేస్మెంట్స్లోనే ఆకర్షణీయ వేతనాలతో కొలువులు ఖాయం అవుతున్నాయి. -
కొత్త ఐటీ పోర్టల్‌ను వీడని సమస్యలు.
న్యూఢిల్లీ: ఆదాయ పన్ను శాఖ ఆర్భాటంగా ప్రారంభించిన కొత్త ఐటీ ఫైలింగ్ పోర్టల్‌కు సాంకేతిక సమస్యలు కొనసాగుతున్నాయి. లాగిన్ కావడానికి సుదీర్ఘ కాలం పట్టేస్తుండటంతో పాటు కొన్ని ఫీచర్లు ఇంకా అందుబాటులోకే రాలేదు. కొత్త పోర్టల్‌ను ప్రారంభించినప్పట్నుంచీ సాంకేతిక లోపాలు తలెత్తుతూనే ఉన్నాయని, ఇప్పటికీ వాటిని పూర్తిగా సరిచేయలేదని చార్టర్డ్ అకౌంటెంట్లు తెలిపారు. పన్ను చెల్లింపుదారులు తాము గతంలో ఈ–ఫైలింగ్ చేసిన రిటర్నులను చూసుకోవడానికి కుదరడం లేదని, ఇంకా చాలామటుకు ఫీచర్లకు ’కమింగ్ సూన్ (త్వరలో అందుబాటులోకి వస్తాయి)’ అంటూ పోర్టల్ చూపిస్తోందని వారు పేర్కొన్నారు. లాగిన్ మొదలుకుని ఈ–ప్రొసీడింగ్స్ వంటి కీలకమైన ఫీచర్ల దాకా ఇలాంటి పరిస్థితే ఎదుర్కొనాల్సి వస్తోందని నాంగియా అండ్ కో పార్ట్నర్ శైలేష్ కుమార్ చెప్పారు. దీంతో నిబంధనల ఉల్లంఘన నోటీసులు అందుకుంటున్న వారు వివరణ ఇచ్చేందుకు తగినంత వ్యవధి దొరక్క ఆందోళన చెందుతున్నారని ఆయన తెలిపారు. ‘పన్ను చెల్లింపుదారులు తమ నియంత్రణలో లేని అంశాల కారణంగా పెనాల్టీ పరిణామాలను ఎదుర్కొనాల్సి వచ్చే అవకాశం ఉంది. అంతే కాకుండా ఫారం 15సీఏ/సీబీ లేకపోవడం వల్ల విదేశాలకు నిధులు పంపించే వారు సమస్యలు ఎదుర్కొంటున్నారు‘ అని కుమార్ తెలిపారు. మరోవైపు, ఇటు ట్యాక్స్‌పేయర్లు అటు ట్యాక్స్ నిపుణులకు తీవ్ర అసౌకర్యం కలుగుతున్న నేపథ్యంలో కొత్త పోర్టల్‌ను సత్వరం సరిచేయాల్సిన అవసరం ఉందని ఏఎంఆర్‌జీ అండ్ అసోసియేట్స్ సీనియర్ పార్ట్నర్ రజత్ మోహన్ పేర్కొన్నారు. కొత్త పోర్టల్‌పై అంతా భారీ అంచనాలు పెట్టుకోగా.. చాలా మందకొడిగా పనిచేస్తోందని, యూజ ర్లు చాలా సమస్యలు ఎదుర్కొనాల్సి వస్తోందని డెలాయిట్ ఇండియా పార్ట్నర్ ఆర్తి తెలిపారు. మ్యాన్యువల్‌గా రెమిటెన్స్ ఫారంల ఫైలింగ్.. పోర్టల్‌లో సాంకేతిక సమస్యల నేపథ్యంలో కొన్ని ఫారంలను మ్యాన్యువల్‌గా ఫైలింగ్ చేసేందుకు అనుమతించాలని ఐటీ విభాగం నిర్ణయించింది. విదేశీ రెమిటెన్సులకు అవసరమైన ఫారం 15సీఏ/సీబీని జూన్ 30 దాకా బ్యాంకులకు మాన్యువల్‌గా సమర్పించవచ్చని తెలిపింది. వీటిని తర్వాత ఈ–ఫైలింగ్ పోర్టల్‌లో అప్లోడ్ చేస్తారని ఐటీ విభాగం వివరించింది. -
సీఏ, సీఎస్, సీఎంఏలకు పీజీ హోదాతో ప్రయోజనాలెన్నో!
చార్టర్డ్ అకౌంటెన్సీ(సీఏ), కంపెనీ సెక్రటరీ (సీఎస్), కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటెన్సీ(సీఎంఏ).. ఈ మూడు కోర్సులకు.. కామర్స్ ప్రొఫెషనల్ కోర్సులుగా ప్రత్యేకమైన గుర్తింపు ఉంది! కెరీర్ పరంగా.. ఎంబీఏకు దీటుగా ఉద్యోగావకాశాలు అందుకోవచ్చు! ఇప్పుడు ఈ కోర్సులు పూర్తి చేసుకున్న వారికి.. మరో ప్రధానమైన గుర్తింపు లభించింది! అదే.. సీఏ, సీఎస్, సీఎంఏలను.. పోస్ట్ గ్రాడ్యుయేషన్ తత్సమాన కోర్సులుగా యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్(యూజీసీ) ప్రకటించింది! అంటే.. ఇకపై ఈ కోర్సులు పూర్తిచేసుకున్న విద్యార్థులు.. నేరుగా పీజీ అర్హతతో లభించే ఉన్నత విద్య, ఉపాధి అవకాశాలు సొంతం చేసుకోవచ్చు. సీఏ, సీఎస్, సీఎంఏలకు పీజీ స్థాయి హోదాతో విద్యార్థులకు కలిగే ప్రయోజనాలపై ప్రత్యేక కథనం... వాస్తవానికి సీఏ, సీఎస్, సీఎంఏ కోర్సులకు పీజీ హోదా కల్పించాలని.. ఆయా కోర్సుల నిర్వాహక సంస్థలు ఐసీఏఐ, ఐసీఎస్ఐ, ద ఇన్స్టిట్యూట్ ఆఫ్ కాస్ట్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా.. కొన్ని నెలల క్రితమే యూజీసీకి విజ్ఞప్తి చేశాయి. దాంతో యూజీసీ ఈ కోర్సులకు పీజీ హోదా కల్పించే విషయంపై అధ్యయనం చేసేందుకు ప్రత్యేకంగా నిపుణుల కమిటీని నియమించింది. ఆ కమిటీ ఈ కోర్సుల స్వరూపాన్ని,శిక్షణను క్షుణ్నంగా పరిశీలించింది. వీటికి పోస్ట్ గ్రాడ్యుయేషన్ హోదా కల్పిం చొచ్చని యూజీసీకి సిఫార్సు చేసింది. ఆ సిఫార్సుకు అనుగుణంగా ఇటీవల యూజీసీ అధికారిక ప్రకటన విడు దల చేసింది. ఈ కోర్సులను పీజీ కోర్సులకు తత్సమాన కోర్సులుగా భావించాలని దేశ వ్యాప్తంగా ఉన్న ఇన్స్టిట్యూట్లకు లేఖ రాసింది. పరిశోధనలకు ఊతం యూజీసీ నిర్ణయంతో సీఏ, సీఎస్, సీఎంఏ ఉత్తీర్ణులకు ఉన్నత విద్య,పరిశోధనల దిశగా అడుగులు వేసేందుకు అవకాశం లభిస్తుంది. ఈ కోర్సులు పూర్తిచేసిన అభ్యర్థులు యూజీసీ–నెట్లో అర్హత సాధించి.. తమకు ఆసక్తి ఉన్న విభాగాల్లో పరిశోధనలు చేసే అవకాశం దక్కుతుంది. అంతేకాకుండా వీరు కామర్స్, మేనేజ్మెంట్, అకౌంటింగ్, ఫైనాన్స్ తదితర విభాగాల్లో ఎంఫిల్, పీహెచ్‌డీల్లో చేరొచ్చు. పీజీ అర్హతగా ప్రవేశాలు కల్పించే ఇతర కోర్సుల్లోనూ అవకాశం లభించనుంది. అంతర్జాతీయంగా అవకాశాలు సీఏ, సీఎస్, సీఎంఏలకు పీజీ హోదా కల్పిస్తూ నిర్ణయం తీసుకోవడంతో.. వీటి ఉత్తీర్ణులకు అంతర్జాతీయంగానూ కెరీర్, ఉన్నత విద్య పరంగా అవకాశాలు విస్తృతం కాను న్నాయి. ముఖ్యంగా విదేశాల్లో ఉద్యోగాలు సొంతం చేసుకోవడానికి తాజా నిర్ణయం దోహదపడుతుంది. యూకే, యూఎస్, ఆస్ట్రేలియా, కెనడా వంటి దేశాల్లో పీజీ ఫైనాన్స్ స్పెషలైజేషన్ అర్హతగా ఉద్యోగాలు కల్పించే సంస్థల్లో వీరు అడుగు పెట్టేందుకు అవకాశం లభించనుంది. ఇప్పటికే ఒప్పందాలు వాస్తవానికి ఇప్పటికే ఐసీఏఐ,ఐసీఎస్ఐ, ద ఇన్స్టిట్యూట్ ఆఫ్ కాస్ట్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా.. పలు దేశాలతో ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. ఫలితంగా దాదాపు 80 దేశాల్లో ఈ కోర్సుల ఉత్తీర్ణులకు అవకాశాలు స్వాగతం పలుకుతున్నాయి. తాజా నిర్ణయంతో ఇది మరింత విస్తృతం అవుతుంది. అంటే.. ఇకపై వీరు ప్రపంచంలో ఎక్కడైనా పీజీ అర్హతతో లభించే ఉన్నత విద్య, ఉపాధి అవకాశాలను అందుకునేందుకు మార్గం ఏర్పడింది. కార్పొరేట్‌కు హాట్ కేక్ సీఏ, సీఎస్, సీఎంఏ ఉత్తీర్ణులు.. స్వదేశంలోనే కార్పొ రేట్ సంస్థలకు హాట్ కేక్‌లుగా మారుతున్నారు. ప్రధానంగా అకౌంటింగ్, ఫైనాన్స్, కార్పొరేట్ గవర్నెన్స్ విభాగాల్లో కీలకమైన హోదాల్లో వీరిని నియమించుకునేందుకు సంస్థలు సిద్ధంగా ఉంటున్నాయి. సదరు ఇన్‌సిట్యూట్‌లతో కలిసి క్యాంపస్ డ్రైవ్స్ నిర్వహిస్తున్నాయి. అంతేకాకుండా రూ.లక్షల వార్షిక ప్యాకేజీలతో ఆఫర్లు ఇస్తున్నాయి. ప్రధానంగా బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్, కన్సల్టింగ్ సంస్థలు.. సీఏ, సీఎస్,సీఎంఏ ఉత్తీర్ణులకు పెద్దపీట వేస్తు న్నాయి. ఐఐఎంలలో మేనేజ్మెంట్ పీజీ చేసిన వారికి దీటుగా అవకాశాలు, ప్యాకేజీలు అందిస్తున్నాయి. సర్కారీ కొలువులూ యూజీసీ తాజా నిర్ణయంతో.. ప్రభుత్వ విభాగాల్లో పీజీ అర్హతతో భర్తీ చేసే పోస్ట్‌లకు కూడా సీఏ, సీఎస్, సీఎంఏ అభ్యర్థులకు అర్హత లభిస్తుంది. ముఖ్యంగా బ్యాం కింగ్ రంగంలో ఆర్బీఐ, ఇతర బ్యాంకులు పీజీ అర్హతగా భర్తీ చేసే స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్ పోస్ట్‌లకు పోటీ పడే అవకాశం కలగనుంది. అదే విధంగా ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్, వరల్డ్ బ్యాంక్ రీజనల్ సెంటర్లు, యూఎన్ఓ అనుబంధ విభాగాల్లో.. పీజీ స్థాయి అర్హతతో నియామకాలు జరిపే పోస్ట్‌లకు కూడా వీరు దరఖాస్తు చేసుకునే వీలుంటుంది. అధ్యాపక వృత్తిలోకి సీఏ, సీఎస్, సీఎంఏ ఉత్తీర్ణులకు పీజీ హోదా కల్పించడం వల్ల యూజీసీ నెట్‌కు హాజరయ్యే అవకాశం లభిస్తుంది. ఫలితంగా.. వారు పీహెచ్‌డీతోపాటు యూనివర్సిటీలు, ఇతర అకడమిక్ ఇన్స్టిట్యూట్లలో అధ్యాపక వృత్తిలోకి కూడా ప్రవేశం పొందొచ్చు. దీనిద్వారా యూజీసీ స్కేల్ ప్రకారం– నెలకు రూ.60వేలకు పైగా వేతనం పొందే అవకాశం కలగనుంది. ఫెలో ప్రోగ్రామ్‌లకు మార్గం సీఏ, సీఎస్, సీఎంఏలకు పీజీ హోదాతో..ప్రతిష్టాత్మక మేనేజ్మెంట్ ఇన్‌స్టిట్యూట్‌లైన ఐఐఎంల్లో ఫెలో ప్రో గ్రామ్‌లలో ప్రవేశించేందుకు అర్హత లభించినట్లేనని చెప్పొ చ్చు. వాస్తవానికి ఇప్పటికే దేశంలోని అన్ని ఐఐఎంలు పీజీ ప్రోగ్రామ్‌లలో ప్రవేశాల పరంగా సీఏ, సీఎస్, సీఎంఏ ఉత్తీర్ణులకు కూడా అవకాశం కల్పిస్తున్నాయి. వీరు క్యాట్‌కు హాజరయ్యేందుకు కూడా అర్హత లభిస్తోంది. తాజా నిర్ణ యంతో పీజీ ప్రోగ్రామ్‌లే కాకుండా.. ఆపై స్థాయిలో బోధిం చే ఫెలో ప్రోగ్రామ్‌ల్లో సైతం ప్రవేశం పొందే అవకాశం లభించనుంది. ఈ విషయంపై ఐఐఎం వర్గాల నుంచి ఇంకా స్పష్టత రావాల్సి ఉందని నిపుణులు చెబుతున్నారు. 102 యూనివర్సిటీలు.. పీజీగా గుర్తింపు ఇప్పటికే దేశంలోని 102 యూనివర్సిటీలు సీఏ, సీఎస్ కోర్సులను పీజీ స్థాయికోర్సులుగా గుర్తిస్తున్నాయి. అవి అందించే పీహెచ్డీ కోర్సుల్లో ప్రవేశానికి వీరికి అర్హత కల్పిస్తున్నాయి. అదే విధంగా జాతీయ స్థాయిలో మరో వందకు పైగా అకడమిక్ ఇన్స్టిట్యూట్లు, ఆరు ఐఐఎంలు, రెండు ఐఐటీలు.. సీఏ, సీఎస్ కోర్సులను పీజీకి సమానంగా గుర్తిస్తూ.. పీహెచ్డీ కోర్సుల్లో ప్రవేశం కల్పిస్తున్నాయి. తాజా నిర్ణయంతో దేశంలోని అన్ని యూనివర్సిటీలు వీటిని పీజీ కోర్సులకు సమానంగా గుర్తించి.. పీహెచ్‌డీలో చేర్చుకోవాల్సి ఉంటుందని నిపుణులు పేర్కొంటున్నారు. నిత్యం అప్డేట్ చేస్తూ సీఏ, సీఎస్, సీఎంఏ కోర్సుల నిర్వాహక ఇన్స్టిట్యూట్లు నిరంతరం తమ కోర్సులను అప్డేట్ చేస్తూ.. ఇండస్ట్రీ అవసరాలకు అనుగుణంగా విద్యార్థులకు బోధన, శిక్షణ ఇస్తుండటం వల్లే వాటికి పీజీ హోదాను యూజీసీ ప్రకటించిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఫ్రెషర్స్ నుంచి ప్రాక్టీసింగ్ సీఏల వరకు అందరికీ.. ఇండస్ట్రీలోని తాజా మార్పులపై ఓరియెంటేషన్ ప్రోగ్రామ్స్ నిర్వహి స్తున్నాయి. అదే విధంగా ఇటీవల కాలంలో ప్రాధాన్యం సంతరించుకున్న డేటా అనలిటిక్స్, డేటాసైన్స్ వంటి అంశాల్లోనూ విద్యార్థులకు నైపుణ్యాలు అందేలా చర్యలు తీసుకుంటున్నాయి. ఇలా ఇండస్ట్రీ రెడీగా విద్యార్థులను తీర్చిదిద్దుతుండటం వల్లే సీఏ, సీఎస్, సీఎంఏ కోర్సులకు పీజీ స్థాయి హోదా లభించిందనే భావన నెలకొంది. ప్రయోజనం యూజీసీ తాజా నిర్ణయంతో ఈ మూడు కామర్స్ ప్రొఫె షనల్ కోర్సులు చదువుతున్న లక్ష మంది విద్యార్థులకు ఉన్నత విద్య, ఉపాధి పరంగా విస్తృత ప్రయోజనం చేకూరనుంది. సీఏ ఫైనల్ పరీక్షకు దాదాపు 25వేల నుంచి 30వేల మంది హాజరవుతుంటారు. సీఎస్, సీఎంఏ విద్యార్థుల సంఖ్య కూడా దాదాపు అంతే ఉంటుంది. ఉత్తీర్ణ త శాతం కొంత తక్కువగా ఉంటున్నప్పటికీ.. ఒకసారి విజయం సాధించలేని విద్యార్థులు మరోసారి పరీక్షల్లో పాస్‌అవుతున్నారు. మొత్తంగా చూస్తే యూజీసీ తాజా నిర్ణయంతో సీఏ, సీఎస్, సీఎంఏ ఉత్తీర్ణులకు అకడమిక్‌గా, కెరీర్ పరంగా మరింత ప్రోత్సాహం లభించినట్లేననే అభిప్రాయం వ్యక్తమవుతోంది. సీఏ, సీఎస్, సీఎంఏలకు పీజీ హోదా.. ముఖ్యాంశాలు ► ఈ కోర్సులు పూర్తి చేసుకుంటే పీజీ డిగ్రీతో సమానం. ► దాని ఆధారంగా నెట్‌తోపాటు ఎంఫిల్, పీహెచ్‌డీలో చేరే అవకాశం. ► విదేశీ ఉద్యోగావకాశాలు విస్తృతమయ్యే ఛాన్స్. ► పీజీ అర్హతతో ఉండే ఉద్యోగాలకు పోటీ పడే వీలు. ► ఆర్బీఐ, ఐఐఎంలు, ఇతర ప్రముఖ ఇన్స్టిట్యూట్లలో ఫెలోషిప్‌నకు మార్గం. ► దాదాపు లక్ష మంది విద్యార్థులకు ప్రయోజనకరంగా యూజీసీ నిర్ణయం. విద్యార్థులకు ఎంతో మేలు యూజీసీ తాజా నిర్ణయం సీఏ, సీఎస్, సీఎంఏ కోర్సులు చదువుతున్న ఎందరో విద్యార్థులకు ప్రయోజన కరంగా నిలుస్తుంది. వారు నెట్ ద్వారా పరిశోధనలో పాల్గొనే అవకాశాలు పొందడమే కాకుండా.. విభిన్న కెరీర్స్ అందుబాటులోకి వస్తాయి. పీజీ హోదాతో విద్యార్థులు కూడా ఆయా కోర్సులు పూర్తి చేసేందుకు మరింత చురుగ్గా, కష్టపడి చదువుతారు. నిబద్ధతతో తక్కువ వయసులోనే ఉన్నత అవకాశాలు అందిపుచ్చుకునే దిశగా అడుగులు వేసే వీలుంది. – అభిషేక్ మురళి, సెక్రటరీ, ఐసీఏఐ–ఎస్‌ఐఆర్‌సీ -
‘సీఏ’ పరీక్షలు వాయిదా
సాక్షి, గుంటూరు: కరోనా వైరస్ కారణంగా దేశంలో లాక్డౌన్ నేపథ్యంలో మేలో జరగాల్సిన సీఏ కోర్సులకు సంబంధించిన వివిధ పరీక్షలు వాయిదాపడ్డాయి. మే 2వ తేదీ నుంచి 18 వరకూ జరగాల్సిన పరీక్షలను రీ–షెడ్యూల్ చేస్తున్నట్టు న్యూఢిల్లీలోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా(ఐసీఏఐ) శుక్రవారం ప్రకటించింది. న్యూఢిల్లీలోని ఐసీఏఐ ప్రకటించిన రీ–షెడ్యూల్ తేదీలు.. జూన్ 27, 29, జూలై 1, 3వ తేదీల్లో సీఏ ఫౌండేషన్ కోర్సులో పాత విధానం ప్రకారం పరీక్షలు జరగనున్నాయి. ఇంటర్మీడియెట్ (ఐపీసీ) కోర్సు పాత విధానాన్ని అనుసరించి గ్రూప్–1 విభాగంలో జూన్ 20, 22, 24, 26వ తేదీల్లోనూ, గ్రూప్–2 విభాగంలో జూన్ 28, 30, జూలై 2వ తేదీల్లో జరగనున్నాయి. కొత్త విధానాన్ని అనుసరించి గ్రూప్–1 విభాగంలో జూన్ 20, 22, 24, 26వ తేదీలు, గ్రూప్–2 విభాగంలో జూన్ 28, 30, జూలై 2వ, 4వ తేదీల్లో జరగనున్నాయి. సీఏ–ఫైనల్ కోర్సు పరీక్షలు పాత విధానం.. గ్రూప్–1 విభాగంలో జూన్ 19, 21, 23, 25వ తేదీల్లోనూ, గ్రూప్–2 విభాగంలో జూన్ 27, 30, జూలై 2వ, 4వ తేదీల్లో జరగనున్నాయి. సీఏ–ఫైనల్ కొత్త విధానంలో పరీక్షలు గ్రూప్–1 విభాగంలో జూన్ 19, 21, 23, 25 తేదీల్లో, గ్రూప్–2 విభాగ పరీక్షలు జూన్ 27, 29, జూలై 1, 3వ తేదీల్లో జరగనున్నాయి. ఇంటర్నేషనల్ ట్రేడ్ లా అండ్ వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ పార్ట్–1 పరీక్షలు గ్రూప్–ఏ విభాగంలో జూన్ 20, 22, గ్రూప్–బి విభాగంలో జూన్ 24, 26వ తేదీల్లో జరగనున్నాయి. ఇంటర్నేషనల్ ట్యాక్సేషన్ – అసెస్మెంట్ టెస్ట్ పరీక్ష జూన్ 27, 29వ తేదీల్లో జరుగుతాయి. దేశ వ్యాప్తంగా 207 ప్రధాన నగరాలు, పట్టణాల్లో జరగనున్న సీఏ పరీక్షలకు దాదాపు నాలుగు లక్షల మంది విద్యార్థులు హాజరవుతారు. -
కృష్ణ ప్రణీత్‌ను అభినందించిన సీఎం జగన్
సాక్షి, తాడేపల్లి: చార్టర్డ్ అకౌంటెంట్ (సీఏ) ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకర్ జి.కృష్ణ ప్రణీత్‌ను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అభినందించారు. కృష్ణ ప్రణీత్‌తో పాటు జాతీయస్థాయిలో 46వ ర్యాంకు సాధించిన వి.ఆంజనేయ వరప్రసాద్ శుక్రవారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను సీఎం క్యాంప్ కార్యాలయంలో కలిశారు. కెరీర్లో మరిన్ని విజయాలు సాధించాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు. -
డీహెచ్ఎఫ్ఎల్ స్కామ్‌పై ప్రభుత్వ దర్యాప్తు
న్యూఢిల్లీ: డీహెచ్ఎఫ్ఎల్ సంస్థ, రూ.31,000 కోట్ల కుంభకోణానికి పాల్పడిందని కోబ్రాపోస్ట్ వెల్లడించిన ఉదంతంపై కేంద్ర ప్రభుత్వం దర్యాప్తు ప్రారంభించింది. మరోవైపు ఈ విషయమై దర్యాప్తు చేయడానికి ఒక స్వతంత్ర చార్టర్డ్ అకౌంటెంట్ సంస్థను డీహెచ్ఎఫ్ఎల్ సంస్థ నియమించింది. గురువారం జరిగిన కంపెనీ సమావేశంలో డీహెచ్ఎఫ్ఎల్ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. అవసరమైతే తనిఖీలు చేస్తాం... డీహెచ్ఎఫ్ఎల్ కంపెనీ ప్రభుత్వ రంగ బ్యాంక్‌ల నుంచి రూ.97,000 కోట్లు సమీకరించిందని, కానీ వీటిల్లో 31,000 కోట్ల మేర నిధులను డొల్ల కంపెనీల ద్వారా దారి మళ్లించిందని ఆన్లైన్న్యూస్ పోర్టల్, కోబ్రాపోస్ట్ వెల్లడించిన విషయం తెలిసిందే. ఈ విషయమై కంపెనీ వ్యవహారాల మంత్రి శాఖ దర్యాప్తును ప్రారంభించింది. ఈ దర్యాప్తులో భాగంగా కంపెనీల రిజిష్ట్రార్(ముంబై)...డొల్ల కంపెనీలుగా చెప్పబడుతున్న కొన్ని సంస్థలను గుర్తించడానికి ప్రయత్నించింది. రికార్డుల్లో ఉన్న చిరునామాల్లో సదరు కంపెనీలు లేవని సంబంధిత ఉన్నతాధికారొకరు చెప్పారు. అవసరమైతే డీహెచ్ఎఫ్ఎల్ నుంచి సమాచారం కోరతామని పేర్కొన్నారు. ఈ విషయమై దర్యాప్తు ప్రస్తుతం ప్రాథమిక దశలోనే ఉందని, దర్యాప్తులో వెల్లడయ్యే విషయాలను పట్టి తనిఖీలు కూడా చేపడతామని వివరించారు. కాగా కంపెనీ వ్యవహారాల శాఖ నుంచి తమకు ఎలాంటి సమాచారం అందలేదని డీహెచ్ఎఫ్ఎల్ తెలిపింది. డీహెచ్ఎఫ్ఎల్.. నాలుగేళ్ల కనిష్టానికి ఈ వార్తల కారణంగా డీహెచ్ఎఫ్ఎల్ షేర్ 16% పతనమై రూ.136 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో 20 % నష్టపోయి నాలుగేళ్ల కనిష్ట స్థాయి, రూ.130ను తాకింది. ఈ షేర్ వరుసగా 4 రోజూ నష్టపోయింది. ఈ షేర్ గత నాలుగు రోజుల్లో 35 శాతం, గత ఐదు నెలల్లో 80 శాతం చొప్పున పతనమైంది. -
సీఏలను ఫైనాన్స్ అడ్వైజర్లుగా పిలవాలి
హైదరాబాద్: చార్టెడ్ అకౌంటెంట్ల(సీఏ)ను అకౌంటెంట్లుగా కాదు ఫైనాన్స్ అడ్వైజర్లుగా పిలవాలని, అందుకు అవసరమైతే చట్టంలో మార్పులు చేయాల్సిన అవసరం ఉందని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సి.వి.నాగార్జునరెడ్డి అన్నారు. ఆదివారం హైదరాబాద్‌లోని నానక్‌రాంగూడ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ప్రాంతంలోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టెడ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా ఎక్స్‌లెన్స్ సెంటర్లో ఐసీఏఐ 2018–19 స్నాతకోత్సవాన్ని ఆయన ప్రారంభించారు. అనంతరం సీఏ కోర్సులు పూర్తి చేసిన 1,026 మంది విద్యార్థులకు సర్టిఫికెట్లను ప్రదానం చేశారు. ఈ సందర్భంగా నాగార్జునరెడ్డి మాట్లాడుతూ.. 1949 చట్టంలోని సెక్షన్ 7లో సీఏలను ఫైనాన్షియల్ అడ్వైజర్లుగా మార్చేందుకు ఐసీఏఐ కృషి చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. విలువలు, చట్టానికి అనుబంధం ఉంటుందని, విలువలతో కూడిన వృత్తిలో కొనసాగాలని విద్యార్థులకు సూచించారు. కష్టపడేతత్వం అలవర్చుకుని ముందుకు సాగితే ఎలాంటి విజయాన్ని అయినా సాధించగలరని చెప్పారు. దేశహితం, భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకొని సూచనలు, సలహాలు సీఏలు ఇవ్వాల్సిన అవసరాన్ని గుర్తించాలన్నారు. ఐసీఏఐ మాజీ అధ్యక్షుడు ఎం.దేవరాజ్‌రెడ్డి మాట్లాడుతూ ప్రతీ సీఏ 50 శాతం విలువలకు ప్రాధాన్యత ఇస్తూ, మరో 50 శాతం నైపుణ్యాన్ని అప్డేట్ చేసుకుంటేనే బంగారు భవిష్యత్ ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఐఆర్‌సీ మాజీ అధ్యక్షుడు వెంకటేశ్వరరావు, ఫల్గుణకుమార్, సీఎస్.శ్రీనివాస్, ఐసీఏఐ ప్రతినిధులు చెంగల్‌రెడ్డి, మస్తాన్, లక్ష్మీనాథ్ శర్మ, రితేష్, రాంచంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
వృత్తి సీఏ... ప్రవృత్తి దొంగతనాలు!
సాక్షి, హైదరాబాద్: అతడి వృత్తి చార్టెడ్ అకౌంటెంట్.. స్వస్థలం మధ్యప్రదేశ్‌లోని ఇండోర్.. ఉన్నత చదువు చదువుకున్న అతగాడు దోపిడీ దొంగగా మారాడు.. మహారాష్ట్ర, తెలంగాణతోపాటు 5 రాష్ట్రాల్లో పంజా విసురుతున్నాడు.. తన ‘స్నేహితురాలు’, అనుచరునితో కారులో సంచరిస్తూ సుదూర కాలనీల్లోని ఒంట రి ఇళ్లను టార్గెట్ చేశాడు.. ఇలా ఏడాది కాలంలో ఈ గ్యాంగ్ ఐదు రాష్ట్రాల్లో 50కి పైగా నేరాలు చేసి 20 కేజీల బంగారం ఎత్తుకుపోయినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ గ్యాంగ్‌ను రాచకొండ పోలీసులు అత్యంత చాకచక్యంగా అదుపులోకి తీసుకున్నారు. నాగ్‌పూర్ ‘సిమ్’లతో ప్రారంభం.. ఇండోర్‌కు చెందిన ఈ ఘరానా దొంగ చార్టెడ్ అకౌంటెంట్ అని పోలీసులు అనుమానిస్తున్నారు. ఇండోర్ లో కాక వేరే ప్రాంతంలో ఓ కారును అద్దెకు తీసుకుం టాడు. తన ‘స్నేహితురాలి’తో పాటు డ్రైవర్‌గా వ్యవహరించే అనుచరుడితో కలసి బయలుదేరతాడు. ఈ గ్యాంగ్ స్వరాష్ట్రమైన మధ్యప్రదేశ్‌లో ఎలాంటి నేరం చేయదు. తొలుత ఈ బృందం మహారాష్ట్రలోని నాగ్ పూర్ చేరుకుంటుంది. అక్కడే 2 సిమ్‌లు, ఫోన్లు ఖరీ దు చేసి వినియోగిస్తారు. నాగ్‌పూర్‌లో చోరీతో ప్రారంభించి రాష్ట్రంలోకి ప్రవేశిస్తారు. ఇక్కడ వరుసగా చోరీలు చేస్తూ ఏపీ, తమిళనాడు, కర్ణాటక వెళ్తారు. పగటిపూటే చోరీలు.. కారులో సంచరించే ఈ గ్యాంగ్ పగటిపూటే చోరీలు చేస్తుంది. ప్రధాన, జాతీయ రహదారులకు సమీపంలోని కాలనీలను ఎంచుకుంటుంది. ఖరీదైన ఇంటిని గుర్తించి.. దానికి తాళం వేసి ఉంటే క్షణాల్లో పని ముగించేస్తుంది. ప్రధాన చోరుడు తాళం పగులకొట్టి ఇంట్లోకి ప్రవేశించగా.. అనుచరుడు బయట ఉండి ఫోన్ ద్వారా సమాచారం ఇస్తుంటాడు. ఆ సమీపంలో నిలిపి ఉంచిన కారులో ‘స్నేహితురాలు’ఉంటుంది. చోరీ చేస్తున్నంత సేపూ ప్రధాన చోరుడు, అనుచరుడు ఫోన్లో కనెక్ట్ అయ్యే ఉంటారు. నగరంలోని తిరుమలగిరి, ఆదిభట్ల తదితర ప్రాంతాల్లో ఈ గ్యాంగ్ పంజా విసిరింది. నగరంలో మధ్యాహ్నం 12 నుంచి రాత్రి 9 గంటల మధ్య చోరీలకు పాల్పడింది. ఇండోర్ చేరుకోవడానికి ముందే ఆధారాలు లేకుండా సిమ్‌లు, ఫోన్లను ధ్వంసం చేస్తుంది. చాకచక్యంగా పట్టుకున్న పోలీసులు.. చోరీ కోసం ప్రధాన చోరుడు ఓ ఇంట్లోకి వెళ్లగా.. సమీపంలో నిలిపిన కారులో ఓ మహిళ కూర్చుని ఉండటం, సమీపంలో మరో వ్యక్తి సెల్ఫోన్లో మాట్లాడుతుండటంతో అనుమానించిన అధికారులు వారిని నిలదీశారు. సరైన సమాధానం చెప్పకపోవడంతో ఇరువురినీ అదుపులోకి తీసుకున్నారు. అయితే అనుచరుడి ఫోన్ ప్రధాన చోరుడి ఫోన్‌తో కనెక్ట్ అయి ఉండటంతో ఇదంతా విన్న అతడు ఆ ఇంటి వెనుక వైపు నుంచి జారుకున్నాడు. చాకచక్యంగా వ్యవహరించి ప్రధాన చోరుడిని అదుపులోకి తీసుకున్నారు. వీరిని విచారించిన రాచకొండ పోలీసులు గ్యాంగ్‌లో మరికొందరు ఉన్నట్లు గుర్తించారు. ప్రస్తుతం ఈ ముఠాను ఓ రహస్య ప్రాంతంలో విచారిస్తున్నారు. బంగారం రికవరీపైనా దృష్టి పెట్టారు. ముప్పుతిప్పలు పెట్టిన ముఠా.. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీసుల్ని ఈ ముఠా ముప్పుతిప్పలు పెట్టింది. 6 నెలల కాలంలో దఫదఫాలుగా పంజా విసిరింది. అనేక ఘటనాస్థలాలకు దగ్గరలో ఉన్న సీసీ కెమెరాల్లో వీరు వినియోగించిన కారు, కదలికలు రికా ర్డు అయినప్పటికీ చాలాకాలం వరకు 3 కమిషనరేట్ల అధికారులు పట్టుకోలేకపోయారు. కొన్ని రోజుల క్రితం మరోసారి ఈ గ్యాంగ్ సిటీకి వచ్చింది. రాచకొండ కమిషనరేట్ పరిధిలో సంచరిస్తున్నట్లు గుర్తించిన పోలీసులు.. సాంకేతిక పరిజ్ఞా నం వినియోగించి ఆ ప్రాంతానికి చేరుకున్నారు. -
ఆర్థిక ఆరోగ్యానికి సీఏలు కీలకం
న్యూఢిల్లీ: ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ఐసీఏఐ) సంస్థ నిర్వహించిన ఒక కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉత్తేజ పూరిత ప్రసంగం చేశారు. జూలై ఒకటి నుంచి చారిత్రక జీఎస్టీ చట్టాన్నిఅమలు చేయడం గర్వకారణమన్నారు. అలాగే దేశ ఆర్థిక పరిరక్షణలో సీఏల మూల స్థంభాలాంటి వారని చెప్పారు. శనివారం ఢిల్లీలో నిర్వహించిన ఐసీఏఐ వ్యవస్థాపక దినోత్సవంలో పాల్గొన్న ప్రధానమంత్రి ఛార్టెడ్ అకౌంటెంట్లను ఉద్దేశించి ప్రసంగం చేశారు. ఆర్థిక రంగం బలంగా ఉండేందుకు సీఏలు కృషి చేయాలని పిలుపునిచ్చారు. భారత ఆర్థిక వ్యవస్థను నిలబెట్టే అవకాశం సీఏలకు ఉందని అన్నారు. వైద్యులు రోగుల వ్యాధులను నయం చేస్తారని, ఛార్టెడ్ అకౌంటెంట్లు ఆర్థికపరమైన జబ్బులను నయం చేయాలని అన్నారు. ఐజిఎఐ ఫౌండేషన్ డే సందర్భఃగా మోదీ కొత్త సీఏ కోర్సును ప్రారంభించారు. ఈ వృత్తిలో చేరిన వారికి ఆర్థిక నైపుణ్యాలను కొత్త కోర్సు పెంచుతుందని తాను ఆశాజనకంగా ఉన్నాననీ, అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా సాంకేతిక ఆవిష్కరణలను తీసుకురావాలని వారిని కోరారు. ఆర్థికపరంగా జరుగుతున్న తప్పులను గుర్తించి అది తప్పు అని చెప్పే ధైర్యం సీఏలకే ఉందని అన్నారు. ప్రపంచ వ్యాప్తంగా భారత ఛార్టెడ్ అకౌంటెంట్లకు మంచి డిమాండ్ ఉందని చెప్పారు. తప్పుడు ఆడిట్లు చేయకుండా ఖాతాదారులను సరైన మార్గంలో నడిపించే బాధ్యత సీఏలపై ఉందన్నారు. స్వచ్ఛత భారత్ లో కార్యక్రమంలో భాగంగా భారతీయ ఆర్థిక వ్యవస్థను తాము ప్రక్షాళన చేస్తున్నట్టుగా నల్ల కుబేరులు గుట్టు వెలికి తీయాల్సి అవసరం ఉందన్నారు. తమ ప్రభుత్వం దాదాపు 37వేల షెల్ కంపెనీల లైసెన్సులను, లక్షకుపైగా అక్రమ కంపెనీల రిజిస్ట్రేషన్లను రద్దు చేశామని చెప్పారు. దేశాన్ని దోచుకున్న వారి పట్ల తమ ప్రభుత్వం కఠిన వైఖరి అవలంభిస్తోందని అన్నారు. ఏ దేశంలో ఆర్థికపరమైన దోపిడీ జరుగుతోందో ఆ దేశం అభివృద్ధిలో ముందుకు దూసుకుపోలేదని అన్నారు. అటువంటి దోపిడీని తాము అరికడుతున్నామని అన్నారు. పెద్దనోట్ల రద్దు వంటి నిర్ణయంతో తమ ప్రభుత్వం ఆర్థికదోపిడీ చేసే వారి గుండెల్లో భయం పుట్టించిందని అన్నారు. జీఎస్టీ అమలు దేశ చరిత్రలో ఒక నూతన అధ్యాయమని, చారిత్రక అవసరమని చెప్పారు. -
లాలు కూతురికి కష్టాలు.. సీఏ అరెస్టు
-
లాలు కూతురికి కష్టాలు.. సీఏ అరెస్టు
బిహార్ మాజీ ముఖ్యమంత్రి లాలు ప్రసాద్ కుమార్తె మీసాభారతికి కష్టాలు ముంచుకొచ్చాయి. ఆమె దగ్గర చార్టర్డ్ అకౌంటెంటుగా పనిచేస్తున్న రాజేశ్ అగర్వాల్‌ను మనీలాండరింగ్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ అధికారులు అరెస్టుచేసి ఢిల్లీలోని ఒక కోర్టులో ప్రవేశపెట్టారు. న్యూఢిల్లీలోని బిజ్వసాన్ ప్రాంతంలోని ఒక ఫాంహౌస్ కొనుగోలు చేయడానికి ఒక షెల్ కంపెనీ ద్వారా మీసాభారతి మనీలాండరింగ్‌కు పాల్పడ్డారని బీజేపీ నాయకుడు సుశీల్ కుమార్ మోదీ గత వారం ఆరోపించారు. ఆ కంపెనీ షేర్ల అమ్మకాలు, కొనుగోళ్ల పేరు మీద మీసాభారతి తన దగ్గర ఉన్న నల్లధనాన్ని తెల్లగా మార్చుకున్నారని ఆయన చెప్పారు. 2002 సంవత్సరంలో కేవలం లక్ష రూపాయల పెట్టుబడితో మిషాలి ప్యాకర్స్ అండ్ ప్రింటర్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీని పెట్టారని, దానికి చిరునామాను కూడా నాటి లాలు అధికార నివాసం అయిన నెం.25, తుగ్లక్‌రోడ్ బంగ్లాను చూపించారని, ఆ తర్వాత 2005-06లో ఆ కంపెనీ మూసేశారని మోదీ తెలిపారు. రూ. 10 ముఖవిలువ గల తన కంపెనీ షేర్లను షాలిని హోల్డింగ్స్ యజమాని వీరేంద్ర జైన్‌కు రూ. 100 చొపఉపన 2008 అక్టోబర్ నెలలో మీసాభారతి అమ్మారు. తద్వారా రూ. 1.20 కోట్లను అక్రమంగా కూడబెట్టారన్నది ప్రధాన ఆరోపణ. 11 నెలల తర్వాత ఆమె మళ్లీ జైన్ నుంచి అవే షేర్లను రూ. 10 చొప్పున కొన్నారని చెప్పిన మోదీ.. దానికి సంబంధించిన పత్రాలను కూడా చూపించారు. 2008-09 సంవత్సరంలో ఆమె ఢిల్లీలో రూ. 1.41 కోట్లతో ఫాంహౌస్ కొన్నారని, దాని ప్రస్తుత విలువ సుమారు రూ. 50 కోట్లు ఉంటుందని వివరించారు. కేవలం లక్ష రూపాయల పెట్టుబడితో రూ. 50 కోట్లు సంపాదించడం ఇంకెవరికైనా సాధ్యమా అని ఆయన అడిగారు. మోదీ ఆరోపణల నేపథ్యంలోనే మీసాభారతి చార్టర్డ్ అకౌంటెంట్ రాజేశ్ అగర్వాల్‌ను పట్టుకున్నారా, మరేవైనా ఇతర ఆధారాలున్నాయా అన్న విషయం ఇంకా తేలాల్సి ఉంది. -
బ్యాంకుల్లో మోసాలపై ఐబీఏ దృష్టి
ఫోరెన్సిక్ ఆడిట్‌కు సీఏల నియామకంపై కసరత్తు న్యూఢిల్లీ: బ్యాంకింగ్ రంగంలో మోసాల ఉదంతాలు పెరుగుతుండటంపై ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ (ఐబీఏ) దృష్టి సారించింది. మోసాలను అరికట్టేందుకు, పోయిన నిధులను రాబట్టేందుకు బ్యాంకుల్లో ఫోరెన్సిక్ ఆడిట్ నిర్వహణ కోసం ప్రముఖ చార్టర్డ్ అకౌంటెన్సీ సంస్థలను నియమించుకోవడంపై కసరత్తు చేస్తోంది. ఫోరెన్సిక్ ఆడిట్ కోసం ఎంపికైన సీఏ సంస్థలు.. రుణాల విశ్లేషణ, విదేశీ వాణిజ్య పత్రాల పరిశీలన, విదేశీ వాణిజ్యానికి సంబంధించిన వ్యవస్థ పనితీరు పరిశీలన, రుణాల మదింపు మొదలైనవి చేయాల్సి ఉంటుంది. అలాగే లై డిటెక్టింగ్ మెషిన్, మొబైల్ కాల్ ఇంటర్ప్రిటర్, బిగ్ డేటా విశ్లేషణ సాధనాల్లాంటివి కూడా వినియోగించాల్సి ఉంటుంది. సీబీఐ, సెబీ, ఎస్ఎఫ్ఐవో, ఐబీఏ తదితర ఏజెన్సీల్లో సభ్యత్వం కలిగి ఉన్న వాటికి ఎంపికలో ప్రాధాన్యం లభిస్తుందని ఐబీఏ ఒక ప్రకటనలో పేర్కొంది. బ్యాంకింగ్ పరిశ్రమలో రూ.50 కోట్ల దాకా, అంతకు పైగా మొత్తాలకు సంబంధించి జరిగే మోసాలపై ఫోరెన్సిక్ ఆడిట్ నిర్వహణ కోసం సీఏ సంస్థల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు తెలియజేసింది. ఐబీఏకి దరఖాస్తులు చేరడానికి ఏప్రిల్ 25 ఆఖరు తేది. నిబంధనల ప్రకారం రూ. 50 కోట్ల పైబడిన మోసాలపై ఆడిట్ నిర్వహించే సంస్థలకు ఆ విభాగంలో కనీసం 10 సంవత్సరాల అనుభవం ఉండాలి. మొండిబాకీలు రాబట్టేందుకు తోడ్పాటు: పేరుకుపోతున్న మొండిబాకీలను రాబట్టే దిశగా బ్యాంకులు తగు సలహాలు పొందేందుకు... కొత్తగా ఏర్పాటయ్యే ఆడిటర్ల ప్యానెల్ ఉపకరించగలదని బ్యాంకింగ్ రంగానికి చెందిన సీనియర్ అధికారి ఒకరు వ్యాఖ్యానించారు. మోసాల ఉదంతాలు అన్ని బ్యాంకుల్లోనూ చోటు చేసుకుంటున్న నేపథ్యంలో ఫోరెన్సిక్ ఆడిట్ నిర్వహణకు చర్యలు అవసరమన్నారు. కొన్నాళ్ల క్రితం బ్యాంక్ ఆఫ్ బరోడాలో రూ. 6,000 కోట్లపైగా విదేశాలకు రెమిటెన్సులకు సంబంధించిన అవకతవకలపై ఫోరెన్సిక్ ఆడిట్ జరిగిన సంగతి తెలిసిందే. -
సీఏ ఫైనల్ ఫలితాలు విడుదల
న్యూఢిల్లీ: చార్టెడ్ అకౌంట్స్ ఫైనల్ పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. ఈ ఫలితాలను ఇనిస్టిట్యూట్ ఆఫ్ చార్టెడ్ అకౌంట్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు సీఏఎం దేవరాజ రెడ్డి మంగళవారం ఢిల్లీలో విడుదల చేశారు. సీఏ ఫైనల్ గ్రూప్–1లో 37 వేల మంది పరీక్షకు హాజరైతే 2,655 మంది (7 శాతం) , గ్రూప్–2లో 36 వేల మందికి గాను 4,545 (12 శాతం) మంది, రెండు గ్రూప్‌లకు కలిపి 36 వేల మందికి 4,256 (11 శాతం) మంది ఉత్తీర్ణులైనట్టు ఆయన తెలిపారు. లక్నోకు చెందిన ఈతి అగర్వాల్, భివాండికు చెందిన పియూష్ రమేష్ లోహి, అహ్మదాబాద్‌కు చెందిన జ్యోతి ముఖేష్ భాయ్ మొదటి మూడు ర్యాంకులు సాధించారు. డిసెంబర్లో జరిగిన సీపీటీ పరీక్షలకు 70 వేల మంది విద్యార్థులు హాజరైతే అందులో 46 శాతం ఉత్తీర్ణతతో 32,658 మంది అర్హత సాధించారు. -
సీఏలు దేశాభివృద్ధికి తోడ్పడాలి
సీఏల ముగింపు సదస్సులో రాష్ట్ర ఎన్నికల అధికారి రమేశ్‌కుమార్ తిరుపతి: చార్టర్డ్ అకౌంటెంట్లు దేశాభివృద్దికి తోడ్పడాలని రాష్ట్ర ఎన్నికల అధికారి ఎన్.రమేశ్‌కుమార్ పేర్కొన్నారు. సమాజంలో నిరంతర మార్పులు అవసరమని చెప్పారు. బుధవారం తిరుపతి వెటర్నరీ యూనివర్సిటీ మైదానంలో ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ఐసీఏఐ) ఆధ్వర్యంలో జరిగిన సదరన్ ఇండియా రీజనల్ కౌన్సిల్ (ఎస్‌ఐఆర్‌సీ) 48వ వార్షిక సదస్సు ముగింపు సమా వేశంలో ఆయన మాట్లాడారు. దక్షిణభారత దేశంలో వివిధ రాష్ట్రాలకు చెందిన 2,500 మంది సీఏలు హాజరయ్యారు. రమేశ్‌కుమార్ మాట్లాడుతూ సీఏ వృత్తి ఎంతో గొప్పదని, ప్రతి వ్యక్తి, సంస్థ ఆడిటర్ల సలహాలను తీసుకొని వ్యక్తిగతం గానూ అభివృద్ది సాధించాలని సూచించా రు. ఐసీఏఐ చైర్మన్ ఎం.దేవరాజారెడ్డి మాట్లాడుతూ సీఏ కోర్సు నిర్వహణలో అనేక మార్పులు తెస్తున్నామని, కొత్త సిలబస్ అందుబాటులోకి తెస్తున్నామని, దీని వల్ల సీఏ కోర్సుకు అంతర్జాతీయ స్థారుులో గుర్తింపు లభిస్తుందన్నారు. చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి ప్రసంగిస్తూ దేశంలో పెద్దనోట్ల రద్దువల్ల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. కార్యక్రమంలో ఐసీఏఐ వైస్ చైర్మన్ నీలేశ్ శివ్జీ వికమ్‌సే, ఐస్ఐఆర్సీ చైర్మన్ ఫల్గుణకుమార్ తదితరులు పాల్గొన్నారు. -
జీఎస్టీ అమల్లో సీఏలు కీలకం
► ఐసీఏఐ అంతర్జాతీయ సదస్సులో వెంకయ్య నాయుడు హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: అత్యంత ముఖ్యమైన సంస్కరణల్లో ఒకటైన వస్తు, సేవల పన్నుల (జీఎస్టీ) విధానం సజావుగా అమలయ్యేలా చూడటంలో చార్టర్డ్ అకౌంటెంట్లు కీలక పాత్ర పోషించాల్సి ఉంటుందని కేంద్ర పట్టణాభివృద్ధి మంత్రి వెంకయ్యనాయుడు చెప్పారు.జీఎస్టీఅమల్లో సవాళ్లతో పాటు అవకాశాలు కూడా ఉన్నాయన్నారు. దేశ ఆర్థికాభివృద్ధికి తమ వంతు తోడ్పాటు అందించేందుకు సీఏలు అవకాశాలను అందిపుచ్చుకోవాలని సూచించారు. ది ఇనిస్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ (ఐసీఏఐ) ఆధ్వర్యంలో అంతర్జాతీయ సదస్సు ‘జ్ఞాన యజ్ఞ’ను శనివారమిక్కడ ప్రారంభించి ప్రసంగించారు. ‘జీఎస్టీ సజావుగా అమలయ్యేలా చూసేందుకు అకౌంటింగ్ నిపుణులు సన్నద్ధం కావాలి. దేశ పురోగతిలో భాగస్వాములయ్యేందుకు ఇది మీకు ఒక మంచి అవకాశం’ అని సీఏలకు సూచించారు. ధనార్జనే ధ్యేయం కాకుండా ప్రమాణాలకు, నైతికతకు పెద్ద పీట వేయాలని పేర్కొన్నారు.అంతర్జాతీయ అకౌంటింగ్ ప్రమాణాలను అందుకునే క్రమంలో ఐసీఏఐ గట్టి కృషి చేస్తోందని ప్రశంసించారు. వృద్ధి బాటలో భారత్ ..:ప్రపంచ దేశాలన్నీ మందగమనంలో ఉన్న ప్రస్తుత తరుణంలో వేగంగా ఎదుగుతున్న ఏకైక దేశం భారత్ మాత్రమేనని, తద్వారా పెట్టుబడులకు ఆకర్షణీయ దేశంగా నిలుస్తోందని వెంకయ్య చెప్పారు. ప్రభుత్వం చేపడుతున్న సంస్కరణలతో రాబోయే రోజుల్లో ఆర్థిక వృద్ధి మరింత పుంజుకోగలదన్నారు. అవినీతికి తావులేకుండా వ్యవస్థలను పటిష్టం చేస్తున్నామన్నారు. ఇందులో భాగంగా జన ధన యోచన, ఆధార్, మొబైల్ మొదలైనవి సమర్ధంగా వినియోగించే ప్రయత్నాల్లో ఉన్నామని వెంకయ్య నాయుడు తెలిపారు. కాగా, అంతర్జాతీయంగా అకౌంటింగ్ విధానాలు, దేశీ ప్రమాణాలను మెరుగుపర్చుకోవడం మొదలైన అంశాలపై ఈ సదస్సులో చర్చించనున్నట్లు ఐసీఏఐ ప్రెసిడెంట్ ఎం. దేవరాజ రెడ్డి తెలిపారు. కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆసియన్ అండ్ పసిఫిక్ అకౌంటెంట్స్ (సీఏపీఏ) ప్రెసిడెంట్ జాకీ పొయీర్, వైస్ ప్రెసిడెంట్ మనోజ్ ఫడ్నిస్, ఐసీఏఐ వైస్ ప్రెసిడెంట్ నీలేష్ వికమ్‌సే తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రెండు రోజుల ఈ సదస్సులో దేశవిదేశాల నుంచిమూడున్నరవేల మంది ప్రతినిధులు హాజరవుతున్నారు. -
డాలర్ బలహీనతే పసిడికి బలం..
న్యూఢిల్లీ/న్యూయార్క్: డాలర్ బలహీనపడే అవకాశాలు పసిడి ధర పెరుగుదలకు బలంగా కనిపిస్తున్నాయని చార్టెడ్ మార్కెట్ టెక్నీషియన్, మార్కెట్ టెక్నీషియన్స్ అసోసియేషన్ సభ్యుడు జోర్టాన్ రాయ్-బయార్న్ విశ్లేషించారు. కరెన్సీ విలువలు ప్రత్యేకించి డాలర్ బలహీనత పలు సందర్భాల్లో పసిడి పటిష్టతకు కారణమయ్యిందని పేర్కొన్న ఆయన, ఇప్పు డూ దాదాపు అదే పరిస్థితి కనబడుతోందన్నారు. గత కొద్ది కాలంలో పలు మెటల్స్తోపాటు, పసిడి కూడా ఇటీవలి గరిష్ట స్థాయిల నుంచి వెనక్కు తగ్గినా.. ఆర్థిక అనిశ్చితుల వల్ల కొనుగోళ్ల అవకాశం మున్ముందూ కొనసాగుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. సమీక్షా వారంలో... కాగా గత శుక్రవారంతో ముగిసిన వారంలో పసిడి అంతర్జాతీయ మార్కెట్ నెమైక్స్‌లో ఔన్స్ (31.1గ్రా)కు అంతక్రితం వారం ఉన్న స్థాయి 1,341 డాలర్ల వద్ద ముగిసింది. ఇక దేశీయంగా ప్రధాన బులియన్ మార్కెట్ ముంబైలో ధర 99.9 స్వచ్ఛత, 99.5 స్వచ్ఛత ధరలు స్వల్పంగా రూ.90 తగ్గాయి. వరుసగా రూ.31,370, రూ.31,220 వద్ద ముగిశాయి. ఇక వెండి కేజీ ధర వారం వారీగా రూ.670 తగ్గి, రూ. 47,040 వద్ద ముగిసింది. -
తెలుగుజాతి రుణం తీర్చుకుంటా
హైదరాబాద్: సమాజానికి చార్టెర్డ్ అకౌంటెంట్లు(సీఏలు) ప్రశంసనీయమైన సేవలు అందజేస్తున్నారని రాజ్యసభ సభ్యుడు, వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి వి.విజయసాయిరెడ్డి అన్నారు. సీఏల సమస్యలను చట్టసభలో ప్రస్తావించి పరిష్కారానికి కృషి చేస్తానని చెప్పారు. తెలంగాణ సీఎం కేసీఆర్‌తో మాట్లాడి హైదారాబాద్‌లో సీఏ సంఘం భవనానికి భూమి కేటాయించేలా కృషి చేస్తామని పేర్కొన్నారు. శుక్రవారం అంతర్జాతీయ చార్టెర్డ్ అకౌంటెంట్స్‌డే సందర్భంగా హైదరాబాద్‌లోని ద ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టెర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ఐసీఏఐ) ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. 67 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సంఘానికి అభినందనలు తెలిపారు. తాను గతంలో వ్యక్తిగతంగా, కార్పొరేట్ స్థాయిలో వివిధ హోదా ల్లో పనిచేశానని, ఇప్పుడు రాజ్యసభ సభ్యుడి హోదాలో రాష్ట్రం ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని, కన్నతల్లి, తెలుగుజాతి రుణం తీర్చుకుంటానన్నారు. తెలుగు జాతి ప్రయోజనాలు కాపాడుతామన్నారు. రైల్వే మంత్రి సురేష్‌ప్రభు, తాను ఇద్దరం సీఏలమేనని, ఏపీ నుంచి ఇద్దరం ఒకేసారి రాజ్యసభ సభ్యులుగా ప్రమాణం చేశామని చెప్పారు. సీఏ వృత్తి అంటే కేవలం లాభనష్టాల లెక్కలు మాత్రమే కాదని దేశ ప్రగతి, సమాజ అభ్యున్నతిలో వారి పాత్ర అత్యంత కీలకమన్నారు. అనంతరం ఆయన్ను సంఘం సభ్యులు ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో సీఏగా పనిచేస్తూ ఇటీవలే సివిల్స్‌కు ఎంపికైన స్నేహజతో పాటు పలువురు సీఏలు, సంఘం పూర్వ సభ్యులను సత్కరించారు. సంఘం హైదరాబాద్ బ్రాంచ్ చైర్మన్ రామచంద్రారెడ్డి, వైస్ చైర్మన్ చెంగల్‌రెడ్డి, కార్యదర్శి మండవ సునీల్‌కుమార్, ట్రెజరర్ భానునారాయణరావు తదితరులు పాల్గొన్నారు. -
అకౌంటింగ్ వ్యవస్ధ మెరుగుకు సలహాలివ్వండి
ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఛార్టడ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా కార్యక్రమంలో మనోహర్ పారికర్ సాక్షి, న్యూఢిల్లీ: ఏ వ్యాపారానికైనా ఛార్టడ్ అకౌంటెంట్లు ఉత్తమ సలహాదారులని, ఏ సంస్ధకైనా పటిస్ఠ ఆర్ధిక వ్యవస్తకు వారు వెన్నెముక్క లాంటివారని కేంద్ర రక్షణ శాఖా మంత్రి మనోహర్ పారికర్ పేర్కొన్నారు. శుక్రవారం ఢిల్లీలో ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఛార్టడ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా( ఐసిఎఐ) 67 సంవత్సరాల వృత్తి ప్రావీణ్యతను పూర్తి చేసుకున్న సందర్భంగా ఏర్పాటైన కార్యక్రమానికి మనోహర్ పారికర్ ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి 1500 మంది నిపుణులు హాజరయ్యారు. రక్షణ మంత్రిత్వ శాఖలో అకౌంటింగ్ వ్యవస్ధ పనితీరును మరింత మెరుగు పర్చడానికి ఐసిఎఐ తగు సలహాలివ్వాలని రక్షణ శాఖా మంత్రి మనోహర్ పారికర్ కోరారు. కార్యక్రమానికి అధ్యక్షత వహించిన ఐసిఎఐ అధ్యక్షుడు ఎం. దేవరాజా రెడ్డి మాట్లాడుతూ గత 67 సంవత్సరాలుగా ఐసిఎఐ ప్రామాణికతలను పెంచి పోషిస్తూ, తటస్ధ నియంత్రకంగా, అకౌంటెన్సీ వృత్తికి మార్గదర్శకంగా పని చేస్తోందని చెప్పారు. ప్రభుత్వ మొదటి చొరవ అయిన ఆదాయపు డిక్లరేషన్ పధకం, 2016 విజయం సాధించడానికి అనువుగా ఐసిఎఐ పాల్గొంటుందని దేవరాజా రెడ్డి చెప్పారు. శనివారం నుంచి ఈ పధకం పై దేశ వ్యాప్తంగా ఉన్న ఐసిఎఐ 154 శాఖలలో అవగాహనా కార్యక్రమాలను ప్రారంభిస్తారని తెలిపారు. -
నిశ్చల్.. యువ సంచలనం
అతి చిన్న వయసులో సీఏగా రికార్డు * అద్భుత జ్ఞాపకశక్తితో గిన్నిస్ రికార్డులు * 15 ఏళ్లకే కంపెనీ స్థాపించి విద్యా సేవ సాక్షి, హైదరాబాద్: తొమ్మిదేళ్ల వయసులోనే తన తండ్రి కంపెనీ బ్యాలెన్స్ షీట్లో లోపాలను గుర్తించాడు. 19 ఏళ్లకే చార్టెడ్ అకౌంటెన్సీ (సీఏ) పూర్తి చేసి, అతి పిన్న వయసులో ఈ ఘనత సాధించి రికార్డు సృష్టించాడు. అద్భుత జ్ఞాపకశక్తితో డబుల్ గిన్నిస్ రికార్డు సొంతం చేసుకున్నాడు. ‘యంగెస్ట్ వరల్డ్ మెమరీ చాంపియన్’గా నిలిచాడు. ఇవేగాకుండా మరెన్నో రికార్డులు సాధించి, రివార్డులు అందుకున్న ఆ యువకుడు హైదరాబాద్ చెందిన నిశ్చల్ నారాయణమ్. పారిశ్రామికవేత్త ఎన్ .నాగేశ్వరరావు, పద్మావతి దంపతుల కుమారుడైన నిశ్చల్‌కు గణితంపై చిన్నప్పటి నుంచే ఎంతో మక్కువ. అమ్మ సంస్కృతంలో పీెహ చ్‌డీ చేయడంతో చిన్నప్పుడే సంస్కృతంపైనా పట్టు సాధించాడు. అంకెలపై అతని మక్కువ చూసి వేదిక్ గణితం, చైనా అబకస్, జర్మన్, రష్యన్ గణిత మెథడాలజీల్లో తల్లిదండ్రులు శిక్షణ ఇప్పించారు. ఈ క్రమంలో తొమిదేళ్లకే గణితావధానం, దశావధానం చేశాడు నిశ్చల్. ఈ ఘనత సాధించిన పిన్న వయస్కుడిగా నిలిచాడు. మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం, పూర్వ గవర్నర్ సుశీల్‌కుమార్ షిండే, దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి, మాజీ సీఎం, గవర్నర్ రోశయ్య తదితర ప్రముఖుల ప్రశంసలు, సత్కారాలు అందుకున్నాడు. ‘‘వైఎస్సార్ నన్నెంతగానో ప్రోత్సహించారు. ప్రత్యేక గుర్తింపునూ ఇచ్చారు. నా రెండో గిన్నిస్ రికార్డును ఆయనకే అంకితం చేశా’’ అంటారు నిశ్చల్. మిగతా ఫ్రొఫెషనల్ కోర్సులతో పోల్చితే సీఏ చాలా కఠినమే గాక చాలెంజింగ్ కూడానని చెప్పారాయన. ‘‘అందుకే తుది స్థాయిలో రోజుకు 12 గంటల దాకా చదివాను. డెలాయిట్ కంపెనీలో ఆర్టికల్‌షిప్ చేస్తున్నప్పుడు రెండింటినీ బాలెన్స్ చేయడం కాస్త కష్టమైంది. అయితే, ఇతర పనులు చేసుకుంటూ సీఏ చేయడం కష్టమన్న భావన మాత్రం నా దృష్టిలో తప్పు. సమయాన్ని ప్రణాళికాబద్ధంగా వాడుకోవడమే విజయరహస్యం. నేను చిన్న వయసులోనే సీఏ పూర్తి చేయడం వెనక రహస్యం అదే’’ అని గుర్తు చేసుకున్నారు. 15 ఏళ్లకే కంపెనీ.. స్కూళ్లను ప్రయోగశాలలుగా మార్చే లక్ష్యంతో 15 ఏళ్లకే ‘నిశ్చల్ స్మార్ట్ లెర్నింగ్ సొల్యూషన్’ కంపెనీని స్థాపించారు నిశ్చల్. ఈ కంపెనీ ద్వారా గణిత లేబొరేటరీని రూపొందించారు. బాల్యంలోనే సృజనాత్మకతను పెంచే బోధన, అభ్యసన పద్ధతులు, చార్టులను రూపొందించి పాఠశాలలకు అందజేశారు. లక్ష స్కూళ్లలో బోధనలో ఈ విధానాన్ని పాటిస్తున్నారు. దీన్ని మహారాష్ట్ర ప్రభుత్వం పాఠ్య ప్రణాళికలోనూ చేర్చింది. త్వరలో తెలంగాణలోనూ ప్రవేశపెట్టేందుకు ఏర్పాట్లు చేస్తున్నారని నిశ్చల్ చెప్పారు. నిశ్చల్ పేరుతో ఫౌండేషన్ స్థాపించి పేద పిల్లలకు ఆయన సేవలందిస్తున్నారు. సమ్మర్ క్యాంపుల్లో అన్ని సబ్జెక్టుల్లో ఉచిత శిక్షణ ఇస్తున్నారు. నిశ్చల్ రికార్డులు, వచ్చిన గుర్తింపులు... * పదేళ్లకే గణిత మెథడాలజీ పుస్తకాల రచన, ప్రపంచంలోకెల్లా అతి పిన్న వయస్కుడైన * మెమరీ చాంపియన్‌గా అవతరణ (2007) * 11 ఏళ్లకు 225 వస్తువుల పేర్లు విని ఏ నంబర్లో ఏ వస్తువు ఉందో చెప్పడం ద్వారా గిన్నిస్ వరల్డ్ రికార్డ్ * 2009లో 13 ఏళ్ల వయసులోనే ఇంటర్నేషనల్ జనరల్ సర్టిఫికెట్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (ఈజీసీఎస్ఈ - కేంబ్రిడ్జి) బోర్డ్ ద్వారా 12వ తరగతి పూర్తి. బీకాంలో ఉస్మానియా టాపర్ * వైఎస్సార్ చేతుల మీదుగా స్టేట్ చైల్డ్ అవార్డ్ ప్రదానం. ఉగాది పురస్కారం * అప్పటి రాష్ట్రపతి అబ్దుల్ కలాం చేతుల మీదుగా నేషనల్ చైల్డ్ అవార్డ్ (గోల్డ్ మెడల్) * 132 వస్తువులు ఏ నంబరులో ఉన్నాయో గమనించి.. ఒక నిమిషంలో చెప్పడం ద్వారా రెండో సారి గిన్నిస్ రికార్డ్ * నేషనల్ జియోగ్రాఫిక్ చానల్ ద్వారా ‘సెవెన్ బ్రిలియంట్ బ్రెయిన్స్ ఆఫ్ ద వరల్డ్’ అవార్డు -
చిన్నవయసులో రెండు పీజీలుఆయన సొంతం
-
దేశంలో చట్టాలను నిర్లక్ష్యం చేస్తున్నారు
లోకాయుక్త జస్టిస్ సుభాషణ్‌రెడ్డి హైదరాబాద్: పాశ్చాత్య దేశాల్లో చట్టాలను గౌరవిస్తుంటే, మన దేశంలో మాత్రం చట్టాలను నిర్లక్ష్యం చేస్తున్నారని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల లోకాయుక్త జస్టిస్ సుభాషణ్‌రెడ్డి అన్నారు. గాదలె లక్ష్మీభాయి కృష్ణారావు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో బేగంపేట్ ఫార్చూన్ మనోహర్ హోటల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సుభాషణ్‌రెడ్డి మాట్లాడారు. దే శంలో ఎన్నో చట్టాలు కేవలం పేరుకే ఉన్నాయని, వాటిని అమలు చేయడం లేదని అన్నారు. 2009 లో విద్యాహక్కు చట్టం తీసుకొచ్చినా ఇంకా బడిలో చేరని పిల్లల సంఖ్య పెరుగుతూనే ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. వైద్యం కోసం రోగులు తమ ఆస్తులను కూడా అమ్ముకోవాల్సిన పరిస్థితులు దేశంలో ఇంకా ఉన్నాయన్నారు. డాక్టర్లు, లాయర్లు, ఇంజనీర్లు అందరూ తమ రంగాల్లో సేవాభావాన్ని జోడించి సమాజ హితానికి ముందుకురావాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా చార్టర్డ్ అకౌంటెంట్ జి.కల్యాణ్ దాస్ జీవిత చరిత్ర పుస్తకం ‘ఏ రివర్ త్రూ హిల్లాక్స్’ ను జస్టిస్ విలాస్ అఫ్జల్‌పుర్కర్ ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఇనిస్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్ ఆఫ్ ఇండియా ప్రెసిడెంట్ సీఏ మనోజ్ ఫడ్నీస్, శక్తి గ్రూప్ ఆఫ్ కంపెనీస్ చైర్మన్ నారాయణరావు, డాల్ఫిన్ మార్డ్ ప్రైవేట్ లిమిటెడ్ చైర్మన్ కేవీ రావు తదితరులు పాల్గొన్నారు. -
చార్టర్డ్ అకౌంటెంట్.. ఎవర్గ్రీన్ కెరీర్!
ఏ సంస్థలోనైనా ఆర్థిక కార్యకలాపాల నిర్వహణలో చార్టర్డ్ అకౌంటెంట్(సీఏ)ది ప్రధాన పాత్ర. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక, వ్యాపార, వాణిజ్య రంగాల్లో వేగంగా వస్తున్న మార్పులకు అనుగుణంగా సీఏ నిపుణులకు డిమాండ్ ఏర్పడింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పారిశ్రామికీకరణ, సేవ, ఉత్పత్తి రంగాలకు అత్యంత ప్రాధాన్యతనిస్తుండడంతో సీఏ నిపుణులకూ విస్తృత అవకాశాలు అందుబాటులో ఉన్నాయి. చిన్న వయసులోనే సమాజంలో హోదా, గౌరవంతోపాటు మంచి వేతనం అందుకోవచ్చు. సీఏ కోర్సు విధానం: సీఏ కోర్సును ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టెర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా(ఐసీఏఐ) నిర్వహిస్తోంది. ఇందులో కామన్ ప్రొఫిషియెన్సీ టెస్ట్(సీపీటీ), ఇంటిగ్రేటెడ్ ప్రొఫెషనల్ కాంపిటెన్‌స కోర్సు (ఐపీసీసీ), ఫైనల్ దశలుంటాయి. ఈ కోర్సు మొత్తం పూర్తి చేయడానికి ఇంటర్మీడియెట్ తర్వాత కనీసం 4 ఏళ్లు పడుతుంది. సీఏ అభ్యసించాలంటే రిజిస్ట్రేషన్ తప్పనిసరి. సీపీటీ: ఇంటర్మీడియెట్ తర్వాత విద్యార్థి సీపీటీ పరీక్ష రాయాలి. ఏటా జూన్, డిసెంబర్‌ల్లో దేశవ్యాప్తంగా ఉమ్మడి ప్రవేశ పరీక్షను నిర్వహిస్తారు. ఇందులో అకౌంట్స్ 60 మార్కులకు, మర్కంటైల్ లా 40 మార్కులకు, ఎకనమిక్స్ 50 మార్కులకు, మ్యాథమెటిక్స్, స్టాటిస్టిక్స్ కలిపి 50 మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు. ప్రతి సబ్జెక్టులో కనీసం 30 శాతం మార్కులు సాధిస్తూ నాలుగు సబ్జెక్టులు కలిపి కనీసం 50శాతం మార్కులు అంటే 100కి పైగా మార్కులు సాధించాలి. సీపీటీ పూర్తి చేసిన విద్యార్థులు 9 నెలల తర్వాత ఐపీసీసీ పరీక్ష రాయాలి. డిగ్రీ, పీజీ అర్హతతో సీపీటీ రాయకుండానే నేరుగా ఐపీసీసీలో ప్రవేశించొచ్చు. ఐపీసీసీ: ఏటా మే, నవంబర్‌ల్లో ఐపీసీసీ పరీక్షలు నిర్వహిస్తారు. ఈ కోర్సు రెండు గ్రూపులుగా ఉంటుంది. గ్రూప్-1లో అకౌంట్స్ 100 మార్కులు, లా, ఎథిక్స్ అండ్ కమ్యూనికేషన్ 100మార్కులు, ఇన్కమ్ టాక్స్, సర్వీస్ టాక్స్, వ్యాట్ 100మార్కులు, కాస్టింగ్ అండ్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ 100 మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు. గ్రూప్-2లో అడ్వాన్స్డ్ అకౌంటింగ్ 100 మార్కులు, ఆడిటింగ్ 100 మార్కులు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, స్ట్రాటజిక్ మేనేజ్మెంట్ 100 మార్కులకు పరీక్ష జరుగుతుంది. ప్రతి గ్రూపులో ప్రతి సబ్జెక్టులో కనీసం 40 మార్కులు సాధించాలి. అలాగే గ్రూపు మొత్తం మీద 50 శాతం మార్కులు అంటే కనీసం 150 మార్కులు సాధించాలి. అభ్యర్థులు తమ వీలును బట్టి రెండు గ్రూపులను ఒకేసారి లేదా విడివిడిగా ఒక్కో గ్రూపు 6 నెలల వ్యత్యాసంతో రాయొచ్చు. తర్వాత ఓరియెంటేషన్ కోర్సు, 100 గంటలపాటు సాగే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కోర్సులోనూ ఉత్తీర్ణత సాధించాలి. ఆర్టికల్‌షిప్‌తో స్టైపెండ్: ఐపీసీసీ కోర్సులోని గ్రూప్-1 లేదా 2 గ్రూప్స్ పూర్తిచేసిన విద్యార్థులు ప్రొఫెషనల్ చార్టర్డ్ అకౌంటెంట్ వద్ద మూడు సంవత్సరాల ఆర్టికల్స్ పూర్తిచేయాలి. ఈ సమయంలో విద్యార్థులకు ప్రతి నెల స్టైపెండ్ లభిస్తుంది. ఆర్టికల్‌షిప్ పూర్తవడానికి ఆర్నెల్ల ముందు సీఏ ఫైనల్ పరీక్ష రాయాలి. ఫైనల్: సీఏ ఫైనల్ కూడా గ్రూప్-1, గ్రూప్-2లుగా ఉంటుంది. ప్రతి ఏటా మే, నవంబర్‌ల్లో సీఏ ఫైనల్ పరీక్షలు జరుగుతాయి. గ్రూప్-1లో ఫైనాన్షియల్ రిపోర్టింగ్ 100 మార్కులకు, స్ట్రాటజిక్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ 100 మార్కులకు, అడ్వాన్స్డ్ ఆడిటింగ్ అండ్ ప్రొఫెషనల్ ఎథిక్స్ 100 మార్కులకు, కార్పొరేట్ అండ్ ఎలైడ్ లాస్ 100 మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు. గ్రూప్-2లో అడ్వాన్స్డ్ మేనేజ్మెంట్ అకౌంటింగ్ 100 మార్కులకు, ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ కంట్రోల్ అండ్ ఆడిట్ 100 మార్కులకు, డెరైక్ట్ టాక్స్ 100 మార్కులకు, ఇన్‌డెరైక్ట్ టాక్స్ 100 మార్కులకు ఉంటాయి. ఫైనల్ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించాలంటే ప్రతి సబ్జెక్టులోనూ 40 మార్కులు, ప్రతి గ్రూప్‌లో లేదా రెండు గ్రూపులు కలిపి 50 శాతం మార్కులు సాధించాలి. విస్తృత అవకాశాలు! టెలికమ్యూనికేషన్స్, బ్యాంకింగ్, ఇన్సూరెన్స్, సాఫ్ట్‌వేర్‌తో పాటు వివిధ పరిశ్రమలు, ప్రభుత్వ, ప్రభుత్వేతర రంగాలతోపాటు సీఏ కోర్సునభ్యసించిన వారికి దేశ, విదేశాల్లోనూ అవకాశాలున్నాయి. సొంతంగా ప్రాక్టీస్ పెట్టుకునే అవకాశం కూడా ఉంది. ప్రతిభ, అనుభవం ఆధారంగా అధిక వేతనాలు అందుకోవచ్చు. అకౌంటింగ్ టెక్నీషియన్ కోర్సు: సీపీటీ పాసైన విద్యార్థి సీఏ పూర్తి చేయలేను అని భావిస్తే ఐపీసీసీలోని గ్రూప్-1 పూర్తిచేసి, ఏడాదిపాటు సీఏ దగ్గర ఆర్టికల్ షిప్ చేస్తే అకౌంటింగ్ టెక్నీషియన్ సర్టిఫికెట్ లభిస్తుంది. దాంతో ప్రభుత్వ/ప్రభుత్వేతర సంస్థల్లో అకౌంటెంట్‌గా చేరి నెలకు కనీసం రూ.30వేలు సంపాదించొచ్చు. ఉద్యోగం చేస్తూనే ఐపీసీసీ 2వ గ్రూపులో కూడా ఉత్తీర్ణత సాధించి చార్టర్ట్ అకౌంటెంట్ హోదాను పొందొచ్చు. 2016 కొత్త సిలబస్‌లో ముఖ్య మార్పులు సీఏ కోర్సులోని ఐపీసీసీని విద్యార్థులు కష్టంగా భావిస్తున్నారు కాబట్టి విద్యార్థులపై ఒత్తిడి తగ్గించాలనే ఉద్దేశంతో ఐసీఏఐ 9నెలలు ఉన్న ఐపీసీసీ కోర్సు కాలవ్యవధిని 12నెలలకు పెంచింది.సీఏ కోర్సులోని ప్రతిదశలో కమ్యూనికేషన్ స్కిల్స్‌కు పెద్దపీట వేశారు.విద్యార్థులు ఎక్కువ మంది ఫెయిల్ అవుతున్న ఐపీసీసీలోని ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, స్ట్రాటజిక్ మేనేజ్మెంట్ అనే పేర్లను పూర్తిగా తొలగించారు. పాత సిలబస్‌లో సీఏ-ఐపీసీసీలోని కాస్టింగ్ అండ్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ రెండు సబ్జెక్ట్‌ల సిలబస్ కేవలం 100 మార్కులకే కేటాయించడం వల్ల స్టూడెంట్స్ ఒత్తిడిని ఎదుర్కొనేవారు. కానీ కొత్త సిలబస్ ప్రకారం వీటిని 200 మార్కులకు పెంచారు. అలాగే డెరైక్ట్ టాక్సెస్ అండ్ ఇండెరైక్ట్ టాక్సెస్ రెండు సబ్జెక్టుల మార్కులను 100 నుంచి 200 మార్కులకు పెంచారు. సీఏ ఫైనల్లో ఇంటర్నేషనల్ టాక్సేషన్ అనే సబ్జెక్టును ప్రవేశపెట్టారు. తద్వారా సీఏ పూర్తిచేసిన అభ్యర్థులకు విదేశాల్లోనూ ఉద్యోగాలు ఎక్కువగా లభించే అవకాశం ఏర్పడుతుంది.సీఏ కోర్సులోని మొదటి దశ సీఏ-సీపీటీ ఇప్పటివరకు కేవలం ఆబ్జెక్టివ్ విధానంలో జరుగుతుంది. ఇకపై 50 శాతం డిస్క్రిప్టివ్, 50శాతం ఆబ్జెక్టివ్ విధానంలో నిర్వహిస్తారు. ఇది విద్యార్థుల్లో కాన్సెప్ట్ అర్థం చేసుకుని పరీక్ష రాసే అలవాటు పెంపొందించుకుంటారు. అంతేకాకుండా డిస్క్రిప్టివ్ విధానంలో జరిగే ఐపీసీసీ, ఫైనల్ పరీక్షలకు మరింత మెరుగ్గా సన్నద్ధం అయ్యేందుకు తోడ్పడుతుంది. సీఏ కోర్సులోని సీపీటీ, ఐపీసీసీ దశల పేర్లను వరుసగా ఫౌండేషన్, ఇంటర్మీడియెట్లుగా మార్చారు. కొత్త సిలబస్‌ను ఐసీఏఐ అమల్లోకి తీసుకురాలేదు. త్వరలోనే దీనికి సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశం ఉంది. -
సీఏలపై ఉన్న అపోహను తొలగించుకోవాలి
సఏలకు కేఎం మణి సూచన న్యూఢిల్లీ: ప్రభుత్వానికి ఉన్న పన్ను బకాయిలను తక్షణం చెల్లించడానికి తమ క్లయింట్లను చార్టెడ్ అకౌంటెంట్లు (సీఏ) సంసిద్ధం చేయాలని రాష్ట్ర ఆర్థిక మంత్రుల సాధికార కమిటీ చైర్మన్ కేఎం మణి శుక్రవారం పేర్కొన్నారు. పన్నులను ఎలా తప్పించుకోవాలో చెప్పడమే సీఏల పనని కొందరిలో అపోహ ఉందని ఆయన పేర్కొంటూ... ఈ అపోహను తొలగించుకోవాల్సిన బాధ్యత వారిదే (సీఏ)నని కూడా మణి పేర్కొన్నారు. వస్తువులు సేవల పన్ను (జీఎస్టీ), పరోక్ష పన్నులపై ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టెడ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ఐసీఏఐ) పరోక్ష పన్నుల కమిటీ ఇక్కడ ఒక జాతీయ సదస్సు నిర్వహించింది. ఈ సదస్సులో మణి మాట్లాడుతూ, తమ సభ్యుల్లో నైతిక ప్రమాణాలు పటిష్ట స్థాయిలో ఉండేలా ఐసీఏఐ చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా సూచించారు. -
చార్టర్డ్ అకౌంటెన్సీ (సీఏ)
ఒక సంస్థలో ప్రధాన విభాగాలు అకౌంటింగ్, ఆడిటింగ్, టాక్సేషన్. వీటి గురించి వివరించేదే చార్టర్డ్ అకౌంటెన్సీ. కంపెనీలు, వ్యక్తుల పన్ను ప్రణాళికల విషయుంలో చార్టర్డ్ అకౌంటెంట్ (సీఏ) అవసరం తప్పనిసరి. అంతేకాకుండా పెట్టుబడులు, వాటి ప్లానింగ్, సంస్థాగత అభివృద్ధి, కొత్త ప్రాజెక్టుల రూపకల్పన, నిర్వహణలో సాధ్యాసాధ్యాలు, ఆర్థిక వనరుల సమీకరణ, జారుుంట్ వెంచర్స్, విదేశీ భాగస్వావ్యూలు, విస్తరణ, విలీనాల్లోనూ, ఉత్పత్తుల ధరలు మొదలైన వాటిలో సీఏలు కీలక పాత్ర పోషిస్తారు. మూడు దశలు: సీఏ కోర్సును ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా(ఐసీఏఐ) నిర్వహిస్తోంది. ఇందులో కామన్ ప్రొఫిషియెన్సీ టెస్ట్(సీపీటీ), ఇంటిగ్రేటెడ్ ప్రొఫెషనల్ కాంపిటెన్‌స కోర్సు (ఐపీసీసీ), ఫైనల్ దశలుంటాయి. పదో తరగతి పూర్తిచేసిన వారు సీపీటీకి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. సీపీటీ ఏటా జూన్, డిసెంబర్లలో జరుగుతుంది. ఈ పరీక్ష రాయడానికి ఇంటర్ ఆపై కోర్సులు పూర్తిచేసిన వారు అర్హులు. సీపీటీ పరీక్షను ఆబ్జెక్టివ్ విధానంలో నిర్వహిస్తారు. ఐపీసీసీ: సీపీటీలో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులు.. ఐపీసీసీ కోసం రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. ఈ కోర్సు రెండు గ్రూపులుగా ఉంటుంది. అభ్యర్థులు తమ ఆసక్తికి అనుగుణంగా ఏదైనా ఒక గ్రూప్ లేదా ఒకేసారి రెండు గ్రూప్‌లకు పేరు నమోదు చేసుకోవచ్చు. ఇలా నమోదు చేసుకున్న తర్వాత తొమ్మిది నెలల స్టడీ కోర్సును పూర్తిచేయాలి. దీంతోపాటు ఓరియెంటేషన్ కోర్సు, 100 గంటలపాటు సాగే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కోర్సును పూర్తి చేయాలి. ఏటా మే, నవంబర్‌లో ఐపీసీసీ పరీక్షలు జరుగుతాయి. ఆర్టికల్స్: ఐపీసీసీ కోర్సులోని గ్రూప్-1 గాని లేదా రెండు గ్రూప్స్ పూర్తిచేసిన వారు మూడు సంవత్సరాల ఆర్టికల్స్ పూర్తిచేయాల్సి ఉంటుంది. ఐసీఏఐ గుర్తింపు ఉన్న చార్టర్డ్ అకౌంటెంట్ దగ్గర ఆర్టికల్‌షిప్ చేయాల్సి ఉంటుంది. ఈ సమయంలో స్టైపెండ్ కూడా సంపాదించుకోవచ్చు. ఫైనల్: ఐపీసీసీలో ఉత్తీర్ణత సాధించిన వారు ఫైనల్‌కు రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. రెండున్నరేళ్ల ఆర్టికల్స్ పూర్తిచేసిన తర్వాత ఫైనల్ పరీక్షకు అర్హత లభిస్తుంది. ఇందులోని ప్రతి గ్రూపులో నాలుగు పేపర్లు ఉంటాయి. కెరీర్: సీఏ కోర్సు పూర్తిచేసిన వారికి సేవా రంగం, టెలికం, బ్యాంకింగ్, బీమా, సాఫ్ట్వేర్, మైనింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్, లీగల్ హౌసెస్ వంటివి ఉన్నత అవకాశాలు కల్పిస్తున్నాయి. స్టాట్యుటరీ అండ్ ఇంటర్నల్ ఆడిటింగ్, అకౌంటింగ్, డెరైక్ట్-ఇన్‌డెరైక్ట్ ట్యాక్స్; ట్యాక్స్ ప్లానింగ్, టెక్నికల్ అనాలసిస్, రిస్క్ అసెసర్స్, సర్వేయర్స్, మర్చంట్ బ్యాంకర్స్, అకౌంట్స్ అండ్ ఫైనాన్స్, కన్సల్టెన్సీ సర్వీసెస్, ప్రాజెక్ట్ మేనేజ్మెంట్, మెర్జర్స్ అండ్ ఎక్విజిషన్స్ వంటి ఆధునిక విభాగాల్లోనూ అవకాశాలు లభిస్తున్నాయి. స్వయం ఉపాధి కోరుకునే వారు సొంతంగా ఆడిటర్‌గా కూడా ప్రాక్టీస్ ప్రారంభించొచ్చు. వేతనాలు: సీఏ ఉత్తీర్ణులకు ఆకర్షణీయమైన వేతనాలు అందుతున్నాయి. కెరీర్ ప్రారంభంలో ఫ్రెషర్‌కు నెలకు కనీసం రూ.35,000 వేతనం లభిస్తుంది. తర్వాత ప్రతిభ, అనుభవం ఆధారంగా దాదాపు అధిక వేతనాలు అందుకోవచ్చు. 2014 ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్‌లో ఐసీఏఐ నిర్వహించిన క్యాంపస్ రిక్రూట్మెంట్లో 1019 మందికి ఉద్యోగావకాశాలు రాగా, వారిలో 201 మందికి రూ.9 లక్షలు, ఆపై వార్షిక వేతనంతో ఆఫర్లు వచ్చాయి. డిమాండ్-సప్లయ్ వ్యత్యాసం వేలల్లోనే..! దేశంలో అకౌంటెన్సీ విభాగంలో మానవ వనరుల అవసరం కోణంలో డిమాండ్-సప్లయ్ వ్యత్యాసం వేలల్లో ఉంది. మ్యాథమెటికల్ స్కిల్స్, కంప్యూటేషనల్ స్కిల్స్ ఉన్న ఔత్సాహికులకు సరితూగే కోర్సు సీఏ. వాణిజ్య, వ్యాపార రంగాలు, అకౌంటింగ్ కార్యకలాపాలపై సహజ ఆసక్తితో ఈ సీఏ కోర్సును పూర్తి చేయడం సులభమే. ఈ కోర్సు అంటే సుదీర్ఘ కాలం సాగే ప్రక్రియ అనేది అపోహ మాత్ర మే. విద్యార్థులు బ్యాచిలర్ డిగ్రీ చేస్తూనే ప్రొఫెషనల్ సర్టిఫికెట్ సొంతం చేసుకునే అవకాశం అందించే కోర్సు ఇది. సమయాన్ని సద్వినియోగం చేసుకుంటే డిగ్రీ పూర్తయ్యే నాటికి ఐపీసీసీ దశ దాటుకుని ఫైనల్‌కు చేరుకోవచ్చు. - ఆర్.చెంగలరెడ్డి, సెక్రటరీ, ఎస్‌ఐఆర్‌సీ, హైదరాబాద్ బ్రాంచ్. కంపెనీ సెక్రటరీషిప్ (సీఎస్) కంపెనీ సెక్రటరీషిప్(సీఎస్) కోర్సును ద ఇన్స్టిట్యూట్ ఆఫ్ కంపెనీ సెక్రటరీస్ ఆఫ్ ఇండియా(ఐసీఎస్ఐ) నిర్వహిస్తోంది. ఒక కంపెనీలోని బోర్డ్ మీటింగ్‌ల నిర్వహణ, ఎజెండా, మినిట్స్ రూపకల్పన, వాటి ఆచరణపై పర్యవేక్షణ వంటి ఎన్నో ఉన్నత స్థాయి బాధ్యతలు నిర్వర్తించేది కంపెనీ సెక్రటరీలే. ఆ స్థాయికి చేరుకోవాలంటే ఇన్స్టిట్యూట్ ఆఫ్ కంపెనీ సెక్రటరీస్ ఆఫ్ ఇండియాలో మెంబర్షిప్ సొంతం చేసుకోవాలి. కంపెనీ సెక్రటరీషిప్ కోర్సు మొత్తం మూడు దశలుగా ఉంటుంది. అవి.. ఫౌండేషన్ ప్రోగ్రాం; ఎగ్జిక్యూటివ్ ప్రోగ్రాం; ప్రొఫెషనల్ ప్రోగ్రాం. ఇంటర్‌తోనే ‘ఫౌండేషన్’: ఐసీఎస్ఐ.. సీఎస్ కోర్సులోని తొలిదశ ఫౌండేషన్ ప్రోగ్రాం. దీనికి అర్హత ఇంటర్మీడియెట్ ఉత్తీర్ణతతో పేరు నమోదు చేసుకోవాలి.. ఈ ప్రోగ్రాం కోసం పరీక్ష ఏటా రెండుసార్లు జూన్, డిసెంబర్లలో జరుగుతుంది. ఏడాది మొత్తం పేరు నమోదు చేసుకునే అవకాశం ఉన్నప్పటికీ.. పేరు నమోదు చేసుకున్న తేదీకి, తొలిసారి పరీక్షకు హాజరయ్యే తేదీకి మధ్య కనీసం 8 నెలల వ్యవధి తప్పనిసరి. ఈ ప్రోగ్రాంలో మొత్తం నాలుగు పేపర్లలో పరీక్షకు హాజరుకావాల్సి ఉంటుంది. రెండో దశ.. ఎగ్జిక్యూటివ్ ప్రోగ్రాం: ఫౌండేషన్ ప్రోగ్రాంలోని అన్ని పేపర్లలో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులు కంపెనీ సెక్రటరీషిప్ ప్రోగ్రాంలోని రెండో దశ ‘ఎగ్జిక్యూటివ్ ప్రోగ్రాం’కు తమ పేరు నమోదు చేసుకోవాలి. ఈ ఎగ్జిక్యూటివ్ ప్రోగ్రాం రెండు మాడ్యూల్స్‌లో ఉంటుంది. ఒక్కో మాడ్యూల్లో మూడు పేపర్లు ఉంటాయి. ఈ పరీక్షలు ఏటా రెండుసార్లు జూన్, డిసెంబర్లలో జరుగుతాయి. ప్రొఫెషనల్ ప్రోగ్రాం టు సెటిల్ ఇన్ ప్రొఫెషన్: ఎగ్జిక్యూటివ్ ప్రోగ్రాంలో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులు.. సీఎస్ ప్రొఫెషన్లో సెటిలయ్యేందుకు చివరి దశ ప్రొఫెషనల్ ప్రోగ్రాంలో పేరు నమోదు చేసుకోవాలి. ప్రొఫెషనల్ ప్రోగ్రాంను మొత్తం నాలుగు మాడ్యూల్స్‌గా విభజించారు. ఒక్కో మాడ్యూల్లో రెండు పేపర్లు ఉంటాయి. 15 నెలల ప్రాక్టికల్ ట్రైనింగ్: ఎగ్జిక్యూటివ్ ప్రోగ్రాంలో ఉత్తీర్ణత సాధించి ప్రొఫెషనల్ ప్రోగ్రాంలో పేరు నమోదు చేసుకున్న అభ్యర్థులు ఫ్రొఫెషనల్ ప్రోగ్రాం పరీక్ష రాసే సమయానికి తప్పనిసరిగా 15 నెలల ప్రాక్టికల్ ట్రైనింగ్ పూర్తి చేసుకోవాలి. అవకాశాలు: 1956 కంపెనీల చట్టం ప్రకారం రూ.5 కోట్ల అధీకృత మూలధనం ఉన్న ప్రతి సంస్థ ఒక పూర్తి స్థాయి కంపెనీ సెక్రటరీని నియమించుకోవాలి. కార్పొరేట్ గవర్నెస్ అండ్ సెక్రటరీయల్ సర్వీసెస్, కార్పొరేట్ లాస్ అడ్వైజరీ అండ్ రిప్రజెంటేషన్ సర్వీసెస్, ఫైనాన్షియల్ మార్కెట్ సర్వీసెస్, మేనేజ్మెంట్ సర్వీసెస్ సంబంధిత కంపెనీల్లో అవకాశాలు విస్తృతం. స్వయం ఉపాధి దిశగా ఆలోచించే వారు సొంతంగా ప్రాక్టీస్ కూడా చేయవచ్చు. వేతనం: ఒక ఫ్రెషర్‌కు రూ.4 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు వార్షిక వేతన ప్యాకేజ్ లభిస్తుంది. ఈ రంగంలో కనీసం పదేళ్ల అనుభవం ఉంటే రూ. 25 లక్షల నుంచి రూ.40 లక్షల వరకు వేతనం అందుకోవచ్చు. సీఎంఏ అకౌంటింగ్ రంగాల్లో సమున్నత భవిష్యత్తును కోరుకునే విద్యార్థులకు మరో చక్కటి అవకాశం కల్పిస్తున్న కోర్సు కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటెన్సీ (సీఎంఏ). ఈ కోర్సును ద ఇన్స్టిట్యూట్ ఆఫ్ కాస్ట్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా నిర్వహిస్తోంది. సీఎంఏ కోర్సు మూడు దశలుగా ఉంటుంది. అవి.. ఫౌండేషన్ కోర్సు, ఇంటర్మీడియెట్ కోర్సు, ఫైనల్ కోర్సు. ఫౌండేషన్ కోర్సు: ఈ కోర్సులో పేరు నమోదు చేసుకోవడానికి కనీస అర్హత ఇంటర్మీడియెట్/10+2/తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత. చివరి సంవత్సరం పరీక్షలు రాసి ఫలితాల కోసం ఎదురుచూసే వారు కూడా పేరు నమోదు చేసుకోవచ్చు. ఈ ఫౌండేషన్ కోర్సు పరీక్షలు ఏటా జూన్, డిసెంబర్ నెలల్లో జరుగుతాయి. ఫౌండేషన్ కోర్సులో మొత్తం నాలుగు పేపర్లుంటాయి. ఇంటర్మీడియెట్ కోర్సు: ఇంటర్మీడియెట్ కోర్సు రెండు స్టేజ్‌లుగా ఉంటుంది. ప్రతి దశలో మూడు పేపర్లుంటాయి. ఏటా జూన్, డిసెంబర్లలో నిర్వహించే ఇంటర్మీడియెట్ పరీక్షలకు హాజరయ్యే క్రమంలో నిర్ణీత తేదీల్లోపు సంబంధిత దరఖాస్తు ప్రక్రియ పూర్తి చేయాలి. ఫైనల్ కోర్సు: ఇంటర్మీడియెట్ కోర్సు పూర్తయిన తర్వాత పూర్తి స్థాయిలో కాస్ట్ అండ్ వర్క అకౌంటెన్సీ ప్రొఫెషనల్‌గా తీర్చిదిద్దే క్రమంలో చివరి దశ ఫైనల్ కోర్సు. ఇది రెండు దశలలో ఉంటుంది. సీఎంఏ ఇంటర్మీడియెట్ ఉత్తీర్ణులు తమ ఆసక్తికి అనుగుణంగా మొదట ఫైనల్ కోర్సులోని రెండు దశలలో ఏదో ఒకదానికి దరఖాస్తు చేసుకోవచ్చు. లేదా ఒకేసారి రెండింటికీ దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పరీక్షలను కూడా జూన్, డిసెంబర్లలో నిర్వహిస్తారు. కెరీర్ అవకాశాలు: సీఎంఏ పూర్తిచేసిన వారు బ్యాంకింగ్, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్, వస్తూత్పత్తి తదితర సంస్థల్లో జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్, కాస్ట్ ఆడిటర్ వంటి హోదాలో ప్రవేశించొచ్చు. కేంద్ర ప్రభుత్వం ఐఏఎస్, ఐపీఎస్ మాదిరిగానే ఇండియన్ కాస్ట్ అకౌంట్స్ సర్వీస్ అనే కేంద్ర సర్వీస్‌ను కూడా ఏర్పాటు చేసింది. క్యాంపస్ ఇంటర్వ్యూల ద్వారా ఉద్యోగాలను సొంతం చేసుకోవచ్చు. వేతనాలు: ప్రారంభంలో ఏడాదికి రూ.6 లక్షల వార్షిక వేతనం లభిస్తుంది. తర్వాత ప్రతిభ ఆధారంగా రూ.30 నుంచి రూ.40 లక్షల వేతనాలు కూడా అందుకోవచ్చు. లా దేశంలో ఆర్థిక సరళీకరణ ప్రారంభమైన 1991 నుంచి లా వివిధ రంగాలకు విస్తరించింది. బ్యాంకింగ్, బీమా, ట్యాక్సేషన్, టెలికం, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, రియల్ ఎస్టేట్.. ఇలా చాలా విభాగాల్లో న్యాయ సేవల అవసరం పెరిగింది. ఆ అవసరమే అనేక కొత్త కొలువులను అందుబాటులోకి తెచ్చింది. దీంతో లా కెరీర్.. యువత ఆకర్షణీయ కెరీర్ ఆప్షన్ల జాబితాలోకి చేరింది.ఇంటర్మీడియెట్ ఉత్తీర్ణత తర్వాత ఐదేళ్ల ఎల్ఎల్బీ/బీఎల్ కోర్సులో చేరొచ్చు. ఇందులో ప్రవేశానికి లా కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ (లాసెట్) రాయొచ్చు. ప్రతిష్ఠాత్మక జాతీయ స్థాయి లా కళాశాలల్లో ప్రవేశానికి కామన్ లా అడ్మిషన్ టెస్ట్ (క్లాట్) రాయాల్సి ఉంటుంది.న్యూఢిల్లీలోని నేషనల్ లా యూనివర్సిటీ.. ఐదేళ్ల వ్యవధిగల బీఏ ఎల్ఎల్బీ (ఆనర్స్) కోర్సులో ప్రవేశాలకు అఖిల భారత స్థాయిలో పరీక్ష నిర్వహిస్తోంది. అమెరికాకు చెందిన లా స్కూల్ అడ్మిషన్ కౌన్సిల్.. ‘ఎల్‌శాట్’ను నిర్వహిస్తోంది. దీంట్లో స్కోర్ ఆధారంగా దేశంలోని సుమారు 40కిపైగా లా స్కూల్స్‌లో ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ బీఏ ఎల్ఎల్బీ కోర్సులో సీటు సంపాదించొచ్చు. కెరీర్ అవకాశాలు: ప్రభుత్వ రంగంలో పబ్లిక్ ప్రాసిక్యూటర్‌స, మేజిస్ట్రేట్స్, సబ్ మేజిస్ట్రేట్స్, జూనియర్ జడ్జి స్థాయిల్లో ఎంట్రీ లెవల్ అవకాశాలు లభిస్తాయి. వీటికోసం ఆయా రాష్ర్ట ప్రభుత్వాలు, పబ్లిక్ సర్వీస్ కమిషన్లు నిర్వహించే పరీక్షల్లో ప్రతిభ కనబరచాల్సి ఉంటుంది. ప్రైవేటు రంగంలో కార్పొరేట్, బహుళజాతి కంపెనీలు తమ కార్యకలాపాలకు అవసరమైన న్యాయ సేవలు పొం దేందుకు లా గ్రాడ్యుయేట్లను నియమించుకుంటున్నాయి. వేతనాలు: ప్రభుత్వ లేదా ప్రైవేటు సంస్థల్లో అడుగుపెట్టిన వారికి హోదా, ఉద్యోగం స్వభావాన్ని బట్టి నెలకు రూ.20 వేల నుంచి రూ.లక్ష వరకు వేతనాలు లభిస్తున్నాయి. ఆతిథ్య రంగం భారత ఆర్థిక వ్యవస్థలో పర్యాటకం, ఆతిథ్య రంగం కీలకపాత్ర పోషిస్తోంది. విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ 2014 గణాంకాల ప్రకారం దేశ ఆతిథ్య రంగం ఏటా 14 శాతం వృద్ధిని నమోదు చేసుకుంటోంది. ఈ క్రమంలో సుశిక్షితులైన హాస్పిటాలిటీ మానవ వనరులకు డిమాండ్ ఉంటోంది. అందువల్ల 10+2 తర్వాత హాస్పిటాలిటీ అండ్ హోటల్ మేనేజ్మెంట్ కోర్సులను ఎంపిక చేసుకోవచ్చు. జేఈఈ: జాతీయ స్థాయిలో బీఎస్సీ హాస్పిటాలిటీ అండ్ హోటల్ అడ్మినిస్ట్రేషన్ కోర్సులో ప్రవేశాలకు నిర్వహించే పరీక్ష జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ). దీన్ని ఏటా నేషనల్ కౌన్సిల్ ఫర్ హోటల్ మేనేజ్మెంట్ అండ్ కేటరింగ్ టెక్నాలజీ (ఎన్సీహెచ్ఎంసీటీ) నిర్వహిస్తోంది. ఈ పరీక్ష ద్వారా 21 కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో, 16 రాష్ట్ర ప్రభుత్వ సంస్థల్లో, 15 ప్రైవేటు ఇన్స్టిట్యూట్లలో మూడేళ్ల వ్యవధి ఉన్న బీఎస్సీ హాస్పిటాలిటీ అండ్ హోటల్ అడ్మినిస్ట్రేషన్ కోర్సును అభ్యసించొచ్చు. దీనికి ఇంటర్మీడియెట్ లేదా తత్సమాన పరీక్షలలో ఉత్తీర్ణులు అర్హులు. అవకాశాలు: హోటల్ మేనేజ్మెంట్లో ప్రధానంగా నాలుగు విభాగాలు ఉంటాయి. అవి.. ఫుడ్ ప్రొడక్షన్, ఫుడ్ అండ్ బెవరేజ్ సర్వీస్(ఎఫ్ అడ్ బీ), ఫ్రంట్ ఆఫీస్, హౌస్ కీపింగ్. వీటిల్లో ఏదైనా ఒకదాన్ని ఎంచుకుని కెరీర్లో స్థిరపడొచ్చు. ప్రభుత్వరంగంలో కేంద్ర, రాష్ట్ర పర్యాటక శాఖల్లోనూ అవకాశాలుంటాయి. సొంతంగా సంస్థలను ఏర్పాటు చేయడం ద్వారా ఎంటర్‌ప్రెన్యూర్‌గానూ స్థిరపడొచ్చు. వేతనాలు: కెరీర్ ప్రారంభంలో ఐదంకెల జీతం పొందొచ్చు. మేనేజ్మెంట్ ట్రైనీగా అరుుతే రూ. 15 నుంచి రూ. 18 వేలు, ట్రైనీ సూపర్‌వైజర్‌కైతే రూ. 10 నుంచి రూ. 14 వేలు, మిగతా విభాగాల వారికి రూ. 10 వేలు వర కూ వేతనం లభిస్తుంది. -
కశ్మీర్ కలువ..!
2009. జమ్మూ కాశ్మీర్‌లోని బ్రెస్వానా గ్రామం. ఓ ఇంటిలోని పెద్దాయన కన్ను మూశాడు. దాంతో ఆయన కుమారుడు బెంగళూరు నుంచి తన కుటుంబ సభ్యులతో వచ్చాడు. కుటుంబ సభ్యు లంతా దుఃఖంలో మునిగిపోయారు. అంత్యక్రియల ఏర్పాట్లతో బిజీ అయిపోయారు. కానీ ఒక్క అమ్మాయి మాత్రం అక్కడ జరుగుతున్నదాన్ని వది లేసి, జరగాల్సినదాని గురించి ఆలోచిస్తూ కూచుంది. కార్యక్రమాలన్నీ ముగిసే సరికల్లా తాను చేయాల్సిన పనేంటో ఆమెకు బోధపడింది. ఓ దృఢ నిశ్చయంతో తిరిగి బెంగళూరు బయలుదేరింది. అనుకున్నది సాధించింది! ‘‘నాన్నా... నేను బ్రెస్వానాలో ఓ స్కూలు పెట్టాలనుకుంటున్నాను’’... సభా మాట వింటూనే అవాక్కయ్యారు ఆమె తల్లిదండ్రులు. డిగ్రీ పూర్తి చేసి, ఓ పక్క చార్టెడ్ అకౌంటెంట్ అవ్వాలని ప్రయత్నిస్తూ, మరోపక్క పత్రికల్లో కాలమిస్టుగా అప్పుడప్పుడే పేరు తెచ్చుకుంటోన్న కూతురు... ఉన్నట్టుండి ఆ నిర్ణయమెందుకు తీసుకుందో అర్థం కాలేదు వారికి. పైగా బ్రెస్వానా మామూలు ప్రాంతం కాదు. జమ్మూకి ఉత్తరాన 160 కి.మీ.ల దూరంలో ఉండే ఆ ఊరికి వెళ్లడమే పెద్ద పని. కొంత దూరం వెళ్లాక కొండ ప్రాంతం మొదలవుతుంది. ఆ కొండలు ఎక్కుతూ ఊరు చేరడం చాలా కష్టం. పైగా అక్కడ పురివిప్పిన తీవ్రవాదం, అవినీతి గుర్తొచ్చి వాళ్లు కంగారుపడ్డారు. కానీ సభా వెనక్కి తగ్గలేదు. తాతయ్య అంత్య క్రియలకు వెళ్లినప్పుడు, తన సొంత ఊరిలో రెండు తరాల నుంచీ అక్కడ ఎవ్వరూ చదువుకోవడం లేదన్న విషయం తెలిసి షాకయ్యిందామె. ఎలాగైనా అక్కడి వారికి విద్యనందించాలని ఆ క్షణమే నిశ్చయించుకుంది. అదే విషయం తల్లిదండ్రులతో చెప్పి ఒప్పించింది. బ్రెస్వానాలో హజీ పబ్లిక్ స్కూల్‌ని స్థాపించింది. తన సొంత స్థలంలో, సొంత ఖర్చుతో స్థాపించిన ఆ బడిలో ఇప్పుడు 160 మంది పిల్లలు ఉచితంగా చదువుకుంటున్నారు. నాలుగో తరగతి వరకూ ఉన్న ఆ బడిని పదో తరగతి వరకూ పెంచాలని, అలాగే ఓ కాలేజీని కూడా స్థాపించాలని ప్రయత్నిస్తోంది సభా. అడు గడుగునా అడ్డుపడే తీవ్రవాదుల్ని ఎదుర్కొంటూ, చదువుల తల్లికి ఆ ఊరిలో శాశ్వతస్థానం కల్పించా లని చూస్తోంది. ఇంతవరకూ అనుకున్నది సాధిం చాను, ఇకముందు కూడా సాధించి చూపిస్తాను అంటోంది ఎంతో నమ్మకంగా!! ‘‘విద్య అనేది అందరి హక్కు. దాన్ని లాక్కోవడం ఎంత తప్పో, అది అందనివాళ్లను పట్టించుకోకుండా వదిలేయడమూ అంతే తప్పు. మనిషి ఎదగాలన్నా, తన జీవితాన్ని అందంగా నిర్మించు కోవాలన్నా చదువు ఉండాలి. అందుకే విద్యావ్యవస్థ పటిష్టంగా ఉండాలి. విద్య అందరికీ అందుబాటులో ఉండాలి.’’ - సభా హజీ -
ఐటీ శాఖలో భారీ అవినీతి.. అధికారులు, సీఏల దందా
న్యూఢిల్లీ: ఆదాయ పన్ను శాఖలో భారీ అవినీతి కుంభకోణం వెలుగుచూసింది. లంచం కేసులో ఐటీ శాఖ జాయింట్ కమిషనర్, ఐఆర్ఎస్ అధికారితో పాటు ఇద్దరు చార్టర్డ్ అకౌంటెంట్లు, ఓ వ్యాపారవేత్త, మధ్యవర్తులు దొరికిపోయారు. సీబీఐ అధికారులు నిందితులను అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. ఐటీ శాఖ విచారణ విభాగంలో పని చేసే అధికారులు, చార్టర్డ్ అకౌంటెంట్లు, వ్యాపారవేత్తలు చేతులు కలిపి.. కంపెనీలు, బడా ప్రముఖుల ఐటీ లావాదేవీలను పరిష్కారించడానికి పెద్ద మొత్తంలో లంచాలు వసూలు చేస్తున్నట్టు సీబీఐ దృష్టికి వచ్చింది. సీబీఐ ఈ వ్యవహారంపై నిఘా వేసి.. శనివారం ముంబై, చెన్నైలో దాడులు నిర్వహించింది. చెన్నై ఐటీ శాఖ జాయింట్ కమిషనర్ సలోంగ్ యాడెన్ను అరెస్ట్ చేసినట్టు సీబీఐ ప్రతినిధి కంచన్ ప్రసాద్ చెప్పారు. అరెస్టయిన వారిలో సీఏలు సంజయ్ బండారి, శ్రేయ బండారి, చెన్నైకు చెందిన రియల్ ఎస్టేట్ సంస్థ ఎండీ తదితరులున్నారు. చెన్నై ఐటీ విచారణ విభాగం చీఫ్, సీనియర్ ఐఆర్ఎస్ అధికారి 10 లక్షలు లంచం తీసుకుంటుండగా దొరికిపోయారు. గతంలో ఐటీ అధికారులు దాడులు చేసి బంగారు, వెండి, ఇతర విలువైన వస్తువులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసు పరిష్కారం కోసం ఐటీ విచారణ విభాగం చీఫ్ లంచం తీసుకుంటూ పట్టుబడ్డారు. కాగా సీబీఐ అధికారులు ఆయన పేరును రహస్యంగా ఉంచారు. ఈ కేసుకు సంబంధించి సీబీఐ పలు కంపెనీలపై నిఘా వేసింది. -
సీఏలకు కాగ్ అక్షింతలు
న్యూఢిల్లీ: ఆదాయపు పన్ను శాఖ కింద పనిచేస్తున్న చార్టర్డ్ అకౌంటెంట్లకు కాగ్ అక్షింతలు వేసింది. సరైన పన్ను సమాచారం అందించనందువల్ల దాదాపు 367 కేసుల్లో శాఖకు రూ.2,813 కోట్ల పన్ను నష్టం వాటిల్లినట్లు తెలిపింది. తమకు సమర్పించిన 102 రిపోర్టులు లేదా సర్టిఫికేట్లలో లభించిన సమాచారాన్ని వినియోగించుకోవడంలో అసెస్మెంట్ అధికారుల వైఫల్యం వల్ల రూ.1,310 కోట్ల మేర పన్ను నష్టాలకు కారణమయ్యిందని సైతం కాగ్ తన తాజా నివేదికలో పేర్కొంది. అలవెన్సుల్లో మినహాయింపులు లేదా తగ్గింపులు, సెక్షన్ 115 జేబీ కింద బుక్ ప్రాఫిట్‌పై పన్ను విధింపు వంటి అంశాలకు సంబంధించి 616 కేసుల్లో సీఏలు కొన్ని పొరపాట్లు చేసినట్లు తెలిపింది. 2010-11 నుంచి 2012-13 ఆర్థిక సంవత్సరాల మధ్య పూర్తయిన అసెస్మెంట్లకు సంబంధించి కాగ్ తన ఈ తాజా నివేదికను రూపొందించింది. 18.87 శాతం సీఏలు (12,435 సీఏలు) 2013-14 సంవత్సరానికి సంబంధించి ఐసీఏఐ నిర్దేశించిన పన్ను ఆడిట్ నివేదికలకన్నా ఎక్కువగా పన్ను ఆడిట్ నివేదికలను జారీ చేసినట్లు తెలిపింది. కొందరు సీఏలు తమ మెంబర్షిప్ నంబర్లను కూడా పేర్కొనని వైనాన్ని తాము గమనించినట్లు వెల్లడించింది. -
2016 నుంచి సీఏ కొత్త సిలబస్
ఐసీఏఐ ప్రెసిడెంట్ కె.రఘు * అంతర్జాతీయ ప్రమాణాలతో కరికులమ్ * మహిళా సీఏల కోసం ఫ్లెక్సీ వర్కింగ్ పోర్టల్.. * ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో కలసి పనిచేయడానికి టాస్క్‌ఫోర్స్.. హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: మారుతున్న అకౌంటింగ్ నిబంధనలు, పన్ను చట్టాలకు అనుగుణంగా చార్టర్డ్ అకౌంటెంట్స్ సిలబస్‌ను రూపొందిస్తున్నట్లు ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ఐసీఏఐ) ప్రకటించింది. 2016 కల్లా కొత్త కరికులమ్‌ను ప్రవేశపెడుతున్నామని, దీనికి సంబంధించిన పనులు తుది దశలో ఉన్నట్లు ఐసీఏఐ ప్రెసిడెంట్ కె.రఘు తెలిపారు. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా కొత్త సిలబస్ ఉంటుందన్నారు. శనివారం ఐసీఏఐ ‘కంపెనీల చట్టం, ప్రత్యక్ష పన్నులు’ అనే అంశంపై ఏర్పాటు చేసిన సదస్సుకు హాజరైన రఘు విలేకరులతో మాట్లాడారు.అంతర్జాతీయంగా చార్టర్డ్ అకౌంటెంట్స్‌కి అధిక డిమాండ్ ఉందని, ఇక్కడ కోర్సు పూర్తి చేసిన వాళ్లకి విదేశాల్లో అధిక జీతాలకు ఉద్యోగాలు లభిస్తున్నయన్నారు. గతేడాది పరీక్ష రాసిన వాళ్లలో కేవలం ఏడు శాతం మంది మాత్రమే ఉత్తీర్ణత సాధించారంటే ఈ కోర్సు ఎంత కఠినమైనదో అర్థం చేసుకోవచ్చని, అందుకే ఇక్కడ ఉత్తీర్ణత సాధించిన వారికి ప్రారంభ వేతనంగా ఏడు లక్షల నుంచి గరిష్టంగా రూ. 21 లక్షల వరకు పొందుతున్నారన్నారు. ఈ ఏడాది దేశవ్యాప్తంగా హైదరాబాద్‌తో సహా 20 కేంద్రాల్లో క్యాంపస్ నియామకాలు జరిపామని, బ్యాంకులు, ఇన్సూరెన్స్, ఐటీ, ఈకామర్స్ రంగాల నుంచి డిమాండ్ బాగుందన్నారు. విద్యార్థులకు మెరుగైన సేవలను అందించే విధంగా క్లౌడ్ క్యాంపస్, 120 రీడింగ్ రూమ్స్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు రఘు తెలిపారు. ఫ్లెక్సీ వర్కింగ్ పోర్టల్ ప్రాక్టీసులో ఉన్న మహిళా సభ్యులు కుటుంబ బాధ్యతల వల్ల వృత్తికి దూరమవుతున్నారని, వీరు ఇంటి దగ్గర నుంచే సేవలను అందించే విధంగా ‘ఫ్లెక్సీ వర్కింగ్ పోర్టల్’ను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు తెలిపారు. దేశవ్యాప్తంగా 40,000 మంది మహిళా సీఏలు ఉండగా ఈ పోర్టల్ ఇప్పటి వరకు రెండు వేల మంది పేర్లు నమోదు చేసుకున్నట్లు తెలిపారు. అలాగే వీరి సేవలను ఉపయోగించుకోవడానికి 150 కంపెనీలు ముందుకొచ్చినట్లు ఆయన వెల్లడించారు. త్వరలో కంపెనీల చట్టంలో సవరణలు కొత్త కంపెనీల చట్టంలో సీఏలకు ప్రతికూలంగా ఉన్న కొన్ని నిబంధనలను మార్చడానికి కేంద్రం అంగీకరించిందని, దీనికి సంబంధించి వచ్చే పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో సవరణలు జరగొచ్చన్నారు. ముఖ్యంగా ఒక చార్టర్డ్ అకౌంటెంట్ 20కి మించి కంపెనీల్లో పనిచేయకూడదన్న నిబంధనలో ప్రైవేటు కంపెనీలకు మినహాయించడానికి ప్రభుత్వం అంగీకరించిందని, అలాగే ఆడిట్ రొటేషన్, ఫ్రాడ్ రిపోర్టింగ్ నిబంధనలను కూడా సవరించడానికి అంగీకరించినట్లు తెలిపారు. వచ్చే బడ్జెట్లో తీసుకోవాల్సిన చర్యలకు సంబంధించి ప్రీ బడ్జెట్ మెమొరాండం తుది దశలో ఉందని, ఈ నెలాఖరుకి కేంద్ర ఆర్థికమంత్రిని కలిసి ఇవ్వనున్నట్లు ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ఏపీ కోసం టాస్క్ ఫోర్స్ కొత్తగా ఏర్పాటైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజధాని నిర్మాణం, పరిశ్రమల ఏర్పాటుకు సంబంధించి సూచనలు సలహాలను ఇవ్వడానికి ప్రత్యేకంగా ఒక టాస్క్ ఫోర్స్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు రఘు తెలిపారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామని, ప్రధాని నరేంద్ర మోదీ ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న స్వచ్ఛ భారత్, మేకిన్ ఇండియా, జనధన యోజన పథకాలకు తమ వంతు సహకారం అందిస్తామన్నారు. -
మిల్లు అకౌంటెంట్ బిడ్డ... చార్టర్డ్ అకౌంటెంట్
భిన్నంగా ఉజ్వల భవిత ఉండే చార్టర్డ్ అకౌంటెంట్ (సీఏ)గా తనను తాను మలచుకోవాలని తపించాడు. ప్రతిభా పాటవాలకు పదునుపెడుతూ... అవగాహన, విశ్లేషణ సామర్థ్యాలను ఒంట బట్టించుకున్నాడు. ఫలితం... అసలు సిసలైన సీఏ పరీక్షలో జాతీయస్థాయిలో 34వ ర్యాంకర్‌గా నిలిచాడు. 21 ఏళ్ల ప్రాయంలోనే చార్టర్‌డ అకౌంటెంట్ పూర్తి చేసిన రామాయణం సాయి సూర్యతేజ విజయ రహస్యం ఆయన మాటల్లోనే. మాది గుంటూరు జిల్లా నరసారావుపేట. నాన్న శివ నారాయణ. ఓ దాల్ మిల్లులో అకౌంటెంట్. అమ్మ విజయ. పెద్దక్క నాగలక్ష్మీ ప్రసన్న బీటెక్ చదివింది. చిన్నక్క మాధవీలత. రాజస్థాన్‌లో బిట్స్ పిలానీ చేసింది. ప్రస్తుతం బెంగళూర్‌లో సాఫ్ట్వేర్ ఇంజనీర్. అన్నయ్య పవన్ జగదీశ్ బీటెక్ ఈసీఈ. సోనీ ఎరిక్సన్లో ఉద్యోగం వచ్చింది. వీరిని అనుసరించకుండా సీఏతో జీవితంలో బాగా స్థిర పడొచ్చని పదో తరగతిలోనే లక్ష్యాన్ని నిర్ణయించుకున్నాను. చిన్నక్క సలహా: ప్రస్తుతం అందరూ మెడిసిన్, ఇంజనీరింగ్ వైపు ఆసక్తి చూపుతున్నారు. అలా కాకుండా భిన్నంగా కెరీర్ ఎంచుకోమని చిన్నక్క మాధవీ లత సూచించింది. సీఏ చేస్తే కెరీర్ బాగుంటుందని సలహా ఇచ్చింది. సీఏసీపీటీ నుంచి సీఏ ఫైనల్ పరీక్షల దాకా ప్రోత్సహించింది. ఇంటర్ ఎంఈసీలో రాష్ట్రస్థాయి రెండో ర్యాంక్ సాధించాను. అదే నాలో సీఏ చేయడానికి ఆత్మవిశ్వాసాన్ని నింపింది. ఆరు సబ్జెక్టులకు కోచింగ్: హైదరాబాద్‌లో తుకారాం అండ్ కోలో ఆర్టికల్‌షిప్ చేస్తూ సీఏ ఫైనల్ పరీక్షలకు కేవలం మూడున్నర నెలల పాటు మాత్రమే ప్రిపేరయ్యాను. ఫైనల్ పరీక్షలకు మొత్తం 8 సబ్జెక్టులలో ఇస్కా (ఆరోపేపర్), డెరైక్ట్ టాక్సెస్ (ఏడో పేపర్)లను సొంతంగా ప్రిపేరయ్యాను. మిగతా ఆరింటికి కోచింగ్ తీసుకున్నాను. కష్టమనిపించిన సబ్జెక్ట్: ఆడిటింగ్ అండ్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ సబ్జెక్ట్ కష్టమనిపించింది. ఇందులో ఉత్తీర్ణుడవుతానో లేదో అనే భయమేసింది. దీనిపై మరింత అధికంగా దృష్టి సారించాను. నాణ్యమైన స్టడీ మెటీరియల్‌ను చదివాను. చదివే అంశాలను రివిజన్ చేశాను. నోట్స్‌లో పాయింట్లను రాసుకోవడం చేశాను. మిగతా వాటికంటే అధిక సమయం కేటాయించాను. ర్యాంక్ గురించి ఆలోచించకుండా సీఏలో ఉత్తీర్ణత సాధించాలనే లక్ష్యంతో చదివాను. ఖాళీ సమయాన్ని సద్వినియోగపరచుకున్నాను. విశ్లేషణాత్మక ఒరవడితో ప్రతీ పేపర్‌ను రాసి మంచి ర్యాంక్ సాధించాను. సబ్జెక్టుల వారీ ప్రణాళిక: గ్రూప్-1లో స్ట్రాటజిక్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్, కార్పోరేట్ అండ్ అలైడ్ లాస్ అడ్వాన్స్డ్ ఆడిటింగ్ అండ్ ప్రొఫెషనల్ ఎథిక్స్, ఫైనాన్షియల్ రిపోర్టింగ్ ఉంటాయి. గ్రూప్-2లో అడ్వాన్స్డ్ మేనేజ్మెంట్ అకౌంటింగ్, డెరెక్ట్ ట్యాక్స్ లాస్, ఇన్‌డెరైక్ట్ ట్యాక్స్ లాస్,ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ కంట్రోల్ అండ్ ఆడిట్ ఉంటాయి. రోజూ అన్ని సబ్జెక్టులనూ చదివేలా ప్రణాళిక రచించుకోవాలి. ఆర్టికల్ షిప్ సమయంలో ఒక్కో సబ్జెక్టుకు రోజుకు గంట సమయాన్ని కేటాయిస్తే తొలి ప్రయత్నంలోనే ఉత్తీర్ణులవడం సులభం. సీఏలో 64.25 శాతం మార్కులు సాధించాను. మార్పులు గ్రహించాలి: ఆర్టికల్ షిప్ కాలంలో సబ్జెక్టులను విస్మరించకుండా జాగ్రత్త పడ్డాను. అన్ని సబ్జెక్టులు ఆర్థి క వ్యవస్థకు సంబంధించినవి కాబట్టి ఎప్పటికప్పుడు వ్యవస్థలో చోటు చేసుకుంటున్న కొత్త మార్పులను ఆకళింపు చేసుకోవాలి. ఉదాహరణకు పన్నుల చట్టాలు, కార్మిక చట్టాలు, పరిశ్రమల చట్టాలు... ఇలా పాత చట్టాల స్థానంలో కొత్త చట్టాలు, నూతన ఆర్థిక పోకడలను ప్రభుత్వం అనుసరిస్తుంది. వీటిని అనునిత్యం గమనిస్తూ అదనపు సమాచారాన్ని సేకరించాలి. వాటిని సిలబస్‌కు జో డించి ప్రిపరేషన్ సాగించాలి. లేకపోతే ఫైనల్ పరీక్షలో విజయం సాధించడం చాలా కష్టం. ఈ విషయంలో అప్రమత్తంగా ఉండాలి. సివిల్స్ రాస్తా: సీఏగా రెండేళ్లు చేస్తా. అనంతరం సివిల్స్ రాస్తాను. ఐఏఎస్ కావాలనుంది. తర్వాత లక్ష్యం అదే. అకడెమిక్ ప్రొఫైల్: టెన్త్ (2008): 531 ఇంటర్ ఎంఈసీ: 966 (2010- రెండో ర్యాంక్) ఐసీడబ్ల్యూఏఐ ఇంటర్: 33వ ర్యాంక్ సీఏ: 34వ ర్యాంక్ (జాతీయస్థాయి) -
వాకింగ్ వెళ్తే ఇల్లు లూటీ
మైసూరు : ఇక్కడి విజయనగర మొదటి స్టేజ్ రెండో క్రాస్‌లో నివాసముంటున్న ఓ చార్టెడ్ అకౌంటెంట్ ఇంటిలో ఆదివారం రాత్రి భారీ చోరీ జరిగింది. పోలీసుల వివరాల మేరకు... కువెంపు ట్రస్ట్ సమీపంలోని ఇంటి నెంబర్ 74లో రవీంద్రనాథ్, ఆయన భార్య ఉషా నివాసముంటున్నారు. రవీంద్ర నాథ్ చార్టెడ్ అకౌంటెంట్‌గా పనిచేస్తున్నారు. ఆదివారం రాత్రి 7.30 గంటల సమయంలో రవీంద్ర భార్యతో కలిసి ఇంటికి తాళం వేసి సమీపంలోని పార్కుకు వాకింగ్ వెళ్లారు. దీన్ని గమనించిన దుండగులు ఇంటి మొదటి అంతస్తులోని బాల్కని ద్వారా లోనికి ప్రవేశించి మొదటి, రెండో అంతస్తుల్లోని మూడు బీరువాల్లో రూ. 10 లక్షల విలువైన బంగారు నగలతో పాటు విలువైన డైమండ్ నెక్లెస్‌తో పాటు పలు విలువైన నగలతో ఉడాయించారు. గంట తరువాత ఇంటికి వచ్చి తాళం తీసి చూడగా చోరీ జరిగినట్లు గుర్తించి రవీంద్ర పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సంఘటన స్థలాన్ని సీఐ రవి, క్రైం బ్రాంచ్ ఎస్ఐ రఘ ప్రసాద్, సీసీబీ సీఐ సూరజ్ తదితరులు పరిశీలించారు. పోలీసు జాగిలంతో ఆధారాలు సేకరించారు. దుండగులు తెలివిగా ఒక కర్ర సాయంతో మొదటి అంతస్తుకు చేరుకున్నట్లు పోలీసులు తెలిపారు. -
కుటుంబ నేపథ్యమే... స్ఫూర్తి
అక్క చార్టర్ అకౌంటెంట్.. నాన్న ఆడిటర్.. ఇలా కుటుంబ నేపథ్యం ఇచ్చిన స్ఫూర్తితో.. లక్ష్యం దిశగా కదిలింది.. లెక్కలు, పద్దులు అంటూ అంకెల సముద్రాన్ని తలపించే చార్టర్‌డ అకౌంటెన్సీ కోర్సును సులువుగా పూర్తి చేయడమేకాకుండా జాతీయ స్థాయిలో 42వ ర్యాంక్ సాధించింది.. అరవపల్లి హరిప్రియ.. ఈ దిశగా చేసిన కృషి, సీఏ ఔత్సాహికులకు విలువైన సూచనలతో హరిప్రియ సక్సెస్ స్పీక్.. స్వస్థలం గుంటూరు. నాన్న అరవపల్లి వెంకటేశ్వర్లు ట్యాక్స్ కన్సల్టెంట్లో ఆడిటర్. అమ్మ శశికళ గృహిణి. అక్క పుష్ప శిరీష చార్టర్‌డ అకౌంటెంట్. ప్రస్తుతం కరీంనగర్లో సొంతంగా సంస్థను నిర్వహిస్తుంది. కుటుంబమే స్ఫూర్తి: మొదటి నుంచి సైన్స్ సబ్జెక్ట్ అంటే ఆసక్తి. కాకపోతే పదో తరగతిలో ఉన్నప్పుడే అందరిలా మెడిసిన్, ఇంజనీరింగ్ కాకుండా భిన్నమైన కెరీర్‌ను ఎంచుకోవాలనుకున్నా. అదే సమయంలో నాన్న, అక్కల వృత్తి, విద్యా నేపథ్యం స్ఫూర్తిగా నిలిచింది. దాంతో చార్టర్‌డ అకౌంటెన్సీ (సీఏ) కోర్సును చదవాలని నిర్ణయించుకున్నా. అంతేకాకుండా సీఏ కోర్సుకు ఉన్న డిమాండ్ ఈ దిశగా నిర్ణయం తీసుకునేలా ప్రేరేపించింది. ఇంటర్మీడియెట్ ఎంఈసీ గ్రూపులో రాష్ట్రస్థాయిలో మొదటి ర్యాంక్ వచ్చింది. దాంతో ప్రతిభా పురస్కారానికి ఎంపికయ్యా. ఫైనల్ పరీక్షలకు: ఆర్టికల్‌షిప్ చేస్తూనే సీఏ ఫైనల్ పరీక్షలకు ప్రిపరేషన్ సాగించాను. ఇందుకోసం కోచిం గ్ కూడా తీసుకున్నా. సీఏ ఫైనల్లో మొత్తం 8 సబ్జెక్టులు ఉంటాయి. వీటిని గ్రూప్-1, గ్రూప్-2గా విభజించారు. గ్రూప్-1లో ఫైనాన్షియల్ రిపోర్టింగ్, స్ట్రాటజిక్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్, అడ్వాన్స్డ్ ఆడిటింగ్ అండ్ ప్రొఫెషనల్ ఎథిక్స్, కార్పోరేట్ అండ్ అలైడ్ లాస్ వంటి సబ్జెక్ట్‌లు ఉంటాయి. గ్రూప్-2లో అడ్వాన్స్డ్ మేనేజ్మెంట్ అకౌంటింగ్, ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ కంట్రోల్ అండ్ ఆడిట్, డెరైక్ట్ ట్యాక్స్ లాస్, ఇన్‌డెరైక్ట్ ట్యాక్స్ లాస్ సబ్జెక్ట్‌లను చదవాలి. వీటిలో కాస్టింగ్ సబ్జెక్ట్ కొద్దిగా కష్టమనిపించింది. దాంతో ఆ సబ్జెక్‌కు మిగతా వాటి కంటే ఎక్కువ సమయం కేటాయించా. ఈ విషయంలో అక్క ఇచ్చిన సలహాలు, సూచనలు కూడా ఉపకరించాయి. గ్రూప్-1, గ్రూప్-2 సబ్జెక్టులను ఒకే సారి ప్రణాళిక ప్రకారం చదివా. 63.25శాతం మార్కులు వచ్చాయి. కారణాలనేకం: సీఏ పూర్తి చేయడం చాలా కష్టమని అందరూ భావిస్తుంటారు. కానీ ఆ అభిప్రాయం సరికాదు. ఎందుకంటే చాలా మంది కీలక సమయాల్లో కొన్ని మౌలిక తప్పులను చేస్తుంటారు. ఉదాహరణకు ఆర్టికల్‌షిప్ చేస్తున్నప్పుడు చాలా మంది సీఏ ఫైనల్ పరీక్షలపై అంతగా శ్రద్ధ చూపకపోడం, తొలుత ఓ గ్రూపు, ఆ తర్వాత మరో గ్రూపు పూర్తి చేయడానికి ప్రాధాన్యతనివ్వడం, కేవలం మెటీరియల్ మీద మాత్రమే ఆధారపడి ప్రిపరేషన్ సాగించడం వంటివి. వీటికి తోడు నిరంతరం సాధన చేయరు. కాబట్టి ఈ అంశాల్లో కొద్దిగా జాగ్రత్తగా ఉంటే సీఏలో ఉత్తీర్ణత సాధించడం సులువే. నిరంతర మార్పులపై: చార్టర్‌డ అకౌంటెన్సీ కోర్సులో ఉండే సబ్జెక్టులంతా ఆర్థిక వ్యవస్థకు అనుబంధంగా ఉంటాయి. కాబట్టి ఆ వ్యవస్థలో ఎప్పటికప్పుడు పాత చట్టాల స్థానంలో కొత్త చట్టాలు వస్తుంటాయి. దాంతో నూతన ఆర్థిక పోకడలు చోటు చేసుకుంటుంటాయి. అంటే మనం చదివే పుస్తకాల్లో అప్పటికున్న సబ్జెక్టుకు అదనంగా సమాచారాన్ని జోడించాలి. వీటిని పట్టించుకోకుండా ఎంత చదివినా వృథానే అవుతుంది. కాబట్టి ఈ విషయాన్ని జాగ్రత్తగా గమనించాలి. ఎప్పటికప్పుడు వస్తున్న మార్పులను నోట్స్‌గా రాసుకోవడం, వాటిని సిలబస్ దృష్టి కోణంలో విశ్లేషించడానికి ప్రాధాన్యం ఇవ్వాలి. అంతేకాకుండా ప్రతీ రోజూ చదివేలా ప్రణాళిక రూపొందించుకోవాలి. ఆర్టికల్‌షిప్ చేస్తున్నప్పుడు కూడా ఒక్కో సబ్జెక్టుకు రోజుకు గంట సమయాన్ని కేటాయిస్తే తొలి ప్రయత్నంలోనే సీఏలో ఉత్తీర్ణత సాధించవచ్చు. లక్ష్యం: మంచి అవకాశాలు వస్తే ఉద్యోగంలో చేరతాను. లేకపోతే సివిల్స్ దిశగా దృష్టి సారిస్త. అకడెమిక్ ప్రొఫైల్ 10వ తరగతి (2008): 550/600 ఇంటర్ (ఎంఈసీ-2010): 968/1000 సీఏసీపీటీ: 6వ ర్యాంక్ (జాతీయ స్థాయి) ఐపీసీసీ: 24వ ర్యాంక్ (జాతీయ స్థాయి) సీఏ ఫైనల్: 42వ ర్యాంక్ (జాతీయ స్థాయి) -
సంకల్పమే సగం విజయం
సీఏ (ఛార్టర్డ్ అకౌంటెంట్) పాసవ డమంటే మాటలా... ఓ భగీరథ ప్రయత్నం.. అందరికీ సాధ్యం కాదు. అసాధారణ ప్రతిభ ఉంటే తప్ప ఉత్తీర్ణులు కాలేరు.. ఇది సీఏ గురించి సర్వ సాధారణ అభిప్రాయం. అయితే అనుకున్న లక్ష్యం దిశగా సాగితే సీఏ పాసవడం బ్రహ్మ విద్యేమీ కాదని చాటి చెప్పాడు లక్ష్మీశ్రీనివాసరెడ్డి చిలకల. సీఏ పరీక్షలో జాతీయస్థాయిలో 24వ ర్యాంకర్‌గా నిలిచాడు. శ్రీనివాసరెడ్డి సక్సెస్ స్టోరీ ఆయన మాటల్లోనే..మాది గుంటూరు జిల్లా దుర్గి మండలం అడిగొప్పల గ్రామం. నాన్న గురవారెడ్డి. అమ్మ పూర్ణమ్మ. సలహా: 10వ తరగతి పూర్తయిన తర్వాత ఇంటర్మీడియెట్‌లో ఏ గ్రూప్ తీసుకోవాలి? ఏం చదవాలి? అనే సంశయం. ఆ సమయంలో అక్క లక్ష్మీకుమారి, బావ శ్రీనివాసరెడ్డి సలహా మేరకు సీఏ చేయాలని నిర్ణయించుకున్నా. ఆ క్రమం లోనే ఇంటర్లో ఎంఈసీ ఎంచుకున్నాను. చాలా మంది సీఏ చేయడం కష్టమన్నారు. కానీ నేను చేయగలనని వారు ప్రోత్సహించారు. ఎందులోనైనా కష్టపడనిదే ముందు కు సాగలేం. ఇదే స్ఫూర్తితో సీఏ కోర్సును కొనసాగించాను. 24 ర్యాంక్ సాధ్యమైందెలా? ర్యాంక్ గురించి ఎప్పుడూ అంతగా ఆలోచించలేదు. కానీ మంచి మార్కులు తెచ్చుకోవాలి, మొదటి ప్రయత్నంలో సీఏలో ఉత్తీర్ణత సాధించాలి అనే లక్ష్యాన్ని నిర్దేశించుకున్నా. ఓ వైపు ఆర్టికల్‌షిప్ చేస్తూ నే ఉదయం, సాయంత్రం తరగతులకు హాజరయ్యే వాణ్ని. ఖాళీ సమయాన్ని పక్కా ప్రణాళికతో సద్వినియోగపరచుకున్నాను. మొత్తం 526 మార్కులు సాధించాను. దేశం మొత్తం మీద 42వేల మంది పరీక్ష రాయగా అందులో 7 శాతం మంది మాత్రమే ఉత్తీర్ణులయ్యారు. నాలుగు సబ్జెక్టులకే కోచింగ్: మొత్తం 8 సబ్జెక్టులను రెండు గ్రూపులుగా విభజించారు. గ్రూపు-1, 2లలో చెరో నాలుగు సబ్జెక్టులుంటాయి. నాలుగు సబ్జెక్టులను సొంతంగానే చదివాను. ఫైనాన్షియల్ రిపోర్టింగ్, స్ట్రాటజిక్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్, కార్పోరేట్ లాస్, అడ్వాన్స్ మేనేజ్మెంట్ అకౌంటింగ్ (కాస్టింగ్) సబ్జెక్టుల కోసం మాత్రం కోచింగ్ తీసుకున్నాను. అయితే కోచింగ్ తీసుకున్న సబ్జెక్టుల కంటే, సొంతంగా ప్రిపేరయిన వాటిలోనే ఎక్కువ మార్కులు వచ్చాయి. సీఏ ఫైనల్ పరీక్షల సయమంలో ఓ వైపు ఆర్టికల్‌షిప్ చేస్తూ, అన్ని సబ్జెక్టులను ఒకే విడతలో పూర్తి చేయాలనే లక్ష్యంతో సుదీర్ఘ ప్రణాళికతో సాగినప్పటికీ పరీక్షల సమయంలో కొంత ఒత్తిడికి గురయ్యాను. అయితే ఇది ఫలితంపై ఎటువంటి ప్రభావాన్ని చూపలేదు. కోచింగ్ కొంతమేరకే: కోచింగ్ తీసుకోవడం ప్రయోజనకరమే. కానీ అక్కడ అధ్యాపకులు చెప్పే అంశాలే ప్రామాణికం కాదనే విషయాన్ని గమ నించాలి. వాటిపైనే ఆధారపడొద్దు. కోచిం గ్ తరగతుల్లో చెప్పేది కొంతమేర పరీక్షలకు ఉపయోగపడుతుంది. కాబట్టి సబ్జెక్ట్ అంశాలను అవగాహనతో విశ్లేషించుకునే సామర్థ్యం అలవరచుకోవాలి. ఆ దిశగా అధ్యయనం సాగించాలి. ఆర్టికల్‌షిప్ చేయాలనుకునే: ఐపీసీసీ పూర్తి చేసిన తర్వాత మూడేళ్లపాటు ఆర్టికల్‌షిప్ చేయాల్సి ఉంటుంది. ఆర్టికల్‌షిప్ కోసం పెద్ద తరహా ఫర్మ్‌లను కాకుండా మధ్య స్థాయి ఫర్మ్లనుఎంచుకుంటేనే ప్రయోజనం ఎక్కువ. ఎందుకంటే వీటిలో సీఏ ఫైనల్ పరీక్షలకు దోహదపడే అన్ని అంశాలపైనా అవగాహన, అనుభవం ఏర్పడుతుంది. అదే పెద్ద తరహా ఫర్మ్‌ల్లో ఆర్టికల్‌షిప్ చేస్తే ఏదో ఒక సబ్జెక్కే పరిమితమవ్వాల్సి వస్తుంది. క్యాంపస్ ఇంటర్వ్యూకు సిద్ధం: ఈ ఏడాది సెప్టెంబర్-అక్టోబర్ మధ్యలో ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఛార్టర్డ్ అకౌంటెంట్ ఆఫ్ ఇండియా (ఐసీఏఐ) క్యాంపస్ ఇంటర్వూలను చేపట్టనుంది. అందులో మంచి ప్యాకేజీతో ఎంపికవుతాననే నమ్మకం ఉంది. లక్ష్యం: జీవితంలో స్థిరపడ్డాక ఓ ఫౌండేషన్ నెలకొల్పి పేద పిల్లలకు ఉచిత విద్య అందిస్తాను. అంతేకాకుండా సొంత ఊరికి సేవ చేయాలనే లక్ష్యంతో ఉన్నాను. అకడమిక్ ప్రొఫైల్: పదోతరగతి: 530 (2008) ఇంటర్: 965 (3వ ర్యాంకర్-2010) సీఏసీపీటీ: 8వ ర్యాంక్ (జూన్ 2010) ఐపీసీసీ: 29వ ర్యాంక్ (మే 2011) సీఏ ఫైనల్: 24వ ర్యాంక్ (మే 2014) సీఎంఏ ఇంటర్: 28వ ర్యాంక్ (2012) సీఎంఏ ఫైనల్: 17వ ర్యాంక్ (2013) -
జాబ్స్, అడ్మిషన్స్ అలర్ట్స్
కేఐవోసీఎల్ లిమిటెడ్-బెంగళూర్ పోస్టుల: జాయింట్ జనరల్ మేనేజర్ (ఫైనాన్స్) వయసు: 52 ఏళ్లు దాటకూడదు. అర్హతలు: గ్రాడ్యుయేట్ ఉత్తీర్ణతతో పాటు అకౌంటెన్సీ/కాస్ట్ అకౌంటెన్సీ సర్టిఫికెట్ ఉండాలి. సంబంధిత రంగంలో కనీసం 20 ఏళ్ల అనుభవం ఉండాలి. - డిప్యూటీ జనరల్ మేనేజర్ (ఫైనాన్స్) వయసు: 50 ఏళ్లు దాటకూడదు అర్హతలు: గ్రాడ్యుయేట్ ఉత్తీర్ణతతో పాటు చార్టర్డ్ అకౌంటెన్సీ/కాస్ట్ అకౌంటెన్సీ సర్టిఫికెట్ ఉండాలి. సంబంధిత రంగంలో కనీసం 15 ఏళ్ల అనుభవం ఉండాలి. - అసిస్టెంట్ జనరల్ మేనేజర్ (ఫైనాన్స్ అండ్ అకౌంట్స్) వయసు: 45 ఏళ్లు దాటకూడదు అర్హతలు: డిగ్రీతోపాటు చార్టర్డ్ అకౌంటెన్సీ/కాస్ట్ అకౌంటెన్సీ సర్టిఫికెట్ ఉండాలి. సంబంధిత రంగంలో కనీసం 15 ఏళ్ల అనుభవం ఉండాలి. ఆన్లైన్ రిజిస్ట్రేషన్‌కు చివరి తేది: జూలై 31 వెబ్సైట్: http://kioclltd.in/ - టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ పోస్టులు: 1.క్లర్క్(ఎ) అర్హతలు: 60 శాతం మార్కులతో ఏదైనా డిగ్రీ ఉండాలి. సంబంధిత విభాగంలో ఏడాది అనుభవం ఉండాలి. - ట్రేడ్స్‌మెన్ విభాగాలు: ఎయిర్ కండీషనింగ్, ఎలక్ట్రికల్ అర్హతలు: పదో తరగతితో పాటు సంబంధిత విభాగంలో ఐటీఐ ఉండాలి. - వర్క్ అసిస్టెంట్ అర్హతలు: పదో తరగతితో పాటు ఎలక్ట్రికల్/కార్పెంటరీ/ప్లంబింగ్/ఎయిర్ కండీషనింగ్ ట్రేడ్‌లో ఐటీఐ ఉండాలి. సంబంధిత విభాగంలో ఏడాది అనుభవం ఉండాలి. - టెంపరరీ వర్క్ అసిస్టెంట్ అర్హతలు: పదో తరగతితో పాటు సంబంధిత విభాగంలో ఏడాది అనుభవం ఉండాలి. వయసు: 28 ఏళ్లకు మించకూడదు. ఎంపిక: ఇంటర్వ్యూ ద్వారా ఆన్లైన్ రిజిస్ట్రేషన్‌కు చివరి తేది: జూలై 24 వెబ్సైట్: http://www.tifr.res.in/ ఆంధ్రా యూనివర్సిటీ - విశాఖపట్నం కోర్సులు: - ఎంటెక్ (ఈవెనింగ్) విభాగాలు: కెమికల్, సివిల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, జియో ఇన్ఫర్మేటిక్స్, మెరైన్ ఇంజనీరింగ్, మెకానికల్, ఇన్స్ట్రుమెంట్ టెక్నాలజీ, మెటలర్జికల్, కంప్యూటర్ సైన్స్ అండ్ సిస్టమ్ ఇంజనీరింగ్, ఆర్కిటెక్చర్ - ఎంఫార్మసీ (ఈవెనింగ్) - ఎంప్లాన్ (ఈవెనింగ్) కాలపరిమితి: రెండేళ్లు - ఎంఏ - ఎంబీఏ - ఎంకామ్ - ఎంఎస్సీ(హోమ్ సైన్స్) - ఎంఎస్ (జర్నలిజమ్ అండ్ మాస్ కమ్యూనికేషన్) కాలపరిమితి: రెండేళ్లు - పీజీ డిప్లొమా ఇన్ లా - పీజీ డిప్లొమా ఇన్ ఆర్ట్స్ విభాగాలు: ఫ్రెంచ్,జర్మన్, రష్యన్, ఫంక్షనల్ అరబిక్, ఉర్దూ, చైనీస్, ఫొటోగ్రఫీ, డ్యాన్స్, లైట్ మ్యూజిక్, డివోషనల్ సాంగ్స్, అన్నమాచార్య సంకీర్తనలు. కాలపరిమితి: ఏడాది దరఖాస్తు విధానం: వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసిన దరఖాస్తులను పూర్తి చేసి పంపాలి. ఎంఏ, ఎంకామ్, ఎంబీఏ, ఎంఎస్సీ కోర్సులకు చివరి తేది: జూలై 15 మిగతా కోర్సులకు చివరి తేది: జూలై 21 వెబ్సైట్: http://www.andhrauniversity.edu.in/ -
సీఏ కోర్సుకున్న డిమాండ్ ఏమిటి?
-
15 కోట్లతో ఐసీఎస్ఐ సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్సీ!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: కంపెనీ సెక్రటరీల ఉపాధికి విఘాతం కలిగించే విధంగా ఉన్న కొత్త కంపెనీల చట్టంలోని నిబంధనలకు త్వరలోనే సవరణలు జరగనున్నాయని, దీనికి ఎన్నికల సంఘం కూడా ఆమోదం తెలిపిందని ఇనిస్టిట్యూట్ ఆఫ్ కంపెనీ సెక్రటరీస్ ఆఫ్ ఇండియా (ఐసీఏఐ) జాతీయ అధ్యక్షుడు ఆర్.శ్రీధరన్ తెలిపారు. శుక్రవారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కొత్త కంపెనీల చట్టంలోని దొర్లిన లోపాలను కేంద్ర కార్పొరేట్ వ్యవహారాల మంత్రి సచిన్ పెలైట్ అంగీకరించారని, వీటిని తప్పక సరిచేస్తానని హామీ ఇచ్చారన్నారు. కొత్త కంపెనీల చట్టంలో ప్రైవేటు కంపెనీలు, రూ.10 కోట్ల లోపు చెల్లింపు మూలధనం ఉన్న పబ్లిక్ కంపెనీలకు కీ మేనేజరియల్ పెర్సనల్ (కేఎంపీ) నుంచి మినహాయింపు ఇవ్వడంతో అనేకమంది కంపెనీ సెక్రటరీల భవితవ్యం ప్రశ్నార్థకంగా మారిన సంగతి తెలిసిందే. ఈ నిబంధనను సవరించనుండటంతో కంపెనీ సెక్రటరీలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ఇప్పటీకి దేశం డిమాండ్‌కు తగ్గట్టుగా కంపెనీ సెక్రటరీలు లేక కొరతను ఎదుర్కొంటోందని శ్రీధరన్ తెలిపారు. హైదరాబాద్‌లో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీ రూ.15 కోట్లతో హైదరాబాద్‌లోని ఉప్పల్ ప్రాంతంలో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీని ఏర్పాటు చేస్తున్నట్లు ఐసీఎస్ఐ ప్రకటించింది. నెల రోజుల్లో పనులు ప్రారంభించి రెండేళ్లలో దీన్ని అందుబాటులోకి తీసుకురానున్నట్లు శ్రీధరన్ తెలిపారు. ముంబై తర్వాత రెండో కేంద్రం హైదరాబాద్‌లో ఏర్పాటు చేస్తోంది. -
‘ఏసీసీఏ’తో గీతం అవగాహనా ఒప్పందం
సాక్షి, హైదరాబాద్: ప్రపంచవ్యాప్తంగా 183 దేశాల్లో 8,500 కార్పొరేట్ సంస్థల అధికారిక చార్టర్డ్ అకౌంటెంట్స్ సంస్థగా బ్రిటన్ ప్రభుత్వ గుర్తింపు పొందిన అసోసియేషన్ ఆఫ్ చార్టర్డ్ సర్టిఫైడ్ అకౌంటెంట్స్ (ఏసీసీఏ)తో రాష్ట్రంలో తొలిసారిగా గీతం విశ్వవిద్యాలయం అవగాహనా ఒప్పందం కుదుర్చుకుందని విశ్వవిద్యాలయవర్గాలు ఒక ప్రకటనలో తెలిపాయి. శుక్రవారం ఒప్పందంపై సంతకాల కార్యక్రమం సందర్భంగా భారత్‌లో ఏసీసీఏ రిలేషన్షిప్ మేనేజర్ ఇల్హామ్ పంజానీ మాట్లాడుతూ... ఏసీసీఏ సిలబస్‌ను అధ్యయనం చేసే భారతీయ విద్యార్థులకు ప్రపంచవ్యాప్తంగా అవకాశాలు పెరుగుతాయని, దేశంలో పెట్టుబడులు పెట్టే బహుళజాతి సంస్థలకూ ఏసీసీఏ సర్టిఫికెట్ కలిగిన నిపుణుల అవసరం ఉంటుందన్నారు. దేశంలో ప్రస్తుతం 7 వేల మంది విద్యార్థులు ఏసీసీఏ కోర్సులు అభ్యసిస్తున్నారని ఆమె తెలిపారు. ఏసీసీఏ సిలబస్‌ను బీకామ్ కోర్సుతో కలిపి విద్యార్థులకు బోధించనున్నట్లు ఇన్స్టిట్యూట్ ప్రిన్సిపల్ పేర్కొన్నారు. -
ఉజ్వల కెరీర్‌కు సరైన సోపానం.. సీఏ
చార్టర్డ్ అకౌంటెన్సీ (సీఏ)లో ఉత్తీర్ణత అంత తేలిక కాకపోవచ్చు.. ఓ పట్టాన కొరుకుడుపడని సబ్జెక్టులూ ఉండొచ్చు.. అయితే ఇష్టపడి ఆపై కష్టపడితే సీఏలో అత్యుత్తమ స్కోర్‌తో ఉజ్వల కెరీర్ కూడా సొంతమవుతుంది. మంచి హోదా, ఆకర్షణీయ ఆదాయాన్ని అందించే సీఏలో తొలిదశ సీపీటీ పరీక్షకు నోటిఫికేషన్ వెలువడిన నేపథ్యంలో స్పెషల్ ఫోకస్.. అన్నా నందకిషోర్, డెరైక్టర్, శ్రీమేధ విద్యా సంస్థలు. ప్రస్తుతం దేశంలో అన్ని రకాల పరిశ్రమలు చార్టర్డ్ అకౌంటెంట్ల కొరతను ఎదుర్కొంటున్నాయి. ప్రస్తుత పరిశ్రమల అవసరాలను పరిగణనలోకి తీసుకుంటే కనీసం ఐదు లక్షల మంది చార్టర్డ్ అకౌంటెంట్లు అవసరమవుతారు. సాఫ్ట్వేర్, ఫార్మా, బ్యాంకింగ్, రియల్ ఎస్టేట్, ఫైనాన్స్ తదితర రంగాలు సీఏలకు మంచి ఉద్యోగావకాశాలు కల్పిస్తున్నాయి. సీఏలకు పెరుగుతున్న డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకొని, చార్టర్డ్ అకౌంటెన్సీ (సీఏ) కోర్సు ప్రవేశ అర్హతలు, ఇతర అంశాల్లో ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ఐసీఏఐ) చాలా మార్పులు చేసింది. 21 ఏళ్లు నిండేసరికి పూర్తిచేయొచ్చు: సీఏ అనగానే కొరుకుడుపడని కోర్సు అనే అభిప్రాయముం ది. కానీ, ఇష్టపడి చదివితే సీఏ పూర్తి చేయడం పెద్ద కష్టం కాదు. పట్టుదలతో ప్రణాళిక ప్రకారం కృషిచేస్తే 21 ఏళ్లు నిండేసరికి కోర్సు పూర్తిచేసి సుస్థిర కెరీర్‌ను సొంతం చేసుకోవచ్చు. ఇంజనీరింగ్, మెడిసిన్ వంటి ప్రొఫెషనల్ కోర్సులతో పోలిస్తే సీఏ కోర్సు భిన్నమైంది. ఆయా రంగాల్లో అభ్యర్థులు ఎక్కువగా, ఉద్యోగాలు తక్కువగా ఉంటాయి. సీఏలో మాత్రం అభ్యర్థులు తక్కువగా ఉంటే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. డిమాండ్ అధికంగా ఉన్న సీఏ కోర్సును పదో తరగతి దశ నుంచే లక్ష్యంగా పెట్టుకోవాలి. మూడు దశలు: సీఏ కోర్సును ఐసీఏఐ నిర్వహిస్తుంది. ఇందులో కామన్ ప్రొఫిషియెన్సీ టెస్ట్(సీపీటీ),ఇంటిగ్రేటెడ్ ప్రొఫెషనల్ కాంపిటెన్‌స కోర్సు (ఐపీసీసీ), ఫైనల్ దశలుంటాయి. సీపీటీ: పదో తరగతి పూర్తిచేసిన వారు సీపీటీకి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. సీపీటీ పరీక్ష ఏటా జూన్, డిసెంబర్లో జరుగుతుంది. ఈ పరీక్ష రాయడానికి సీనియర్ ఇంటర్ పరీక్షలు రాసి ఉన్నవారు లేదా ఇంటర్, డిగ్రీ.. ఆపై కోర్సులు పూర్తిచేసిన వారు అర్హులు. సీపీటీకి హాజరుకావాలంటే దరఖాస్తు చేసుకునే సమయానికి, సీపీటీకి మధ్య రెండు నెలల వ్యవధి తప్పనిసరి. అంటే జూన్‌లో సీపీటీకి హాజరవ్వాలంటే ఏప్రిల్ ఒకటో తేదీలోపు; డిసెంబర్లో సీపీటీకి హాజరవ్వాలంటే అక్టోబర్ ఒకటి లోపు దరఖాస్తు చేసుకోవాలి. పరీక్ష విధానం: సీపీటీ పరీక్షను ఆబ్జెక్టివ్ విధానంలో నిర్వహిస్తారు. దీనికి 200 మార్కులు కేటాయించారు. పరీక్ష రెండు సెషన్లలో ఉంటుంది. ఫండమెంటల్స్ ఆఫ్ అకౌంటింగ్‌కు 60 మార్కులు, మర్కంటైల్ లాకు 40 మార్కులు, జనరల్ ఎకనామిక్స్‌కు 50 మార్కులు, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్‌కు 50 మార్కులు ఉంటాయి. ఈ పరీక్షలో ఉత్తీర్ణత సాధించాలంటే ప్రతి విభాగంలో 30 శాతం మార్కులు, అన్ని విభాగాల్లో కలిపి 100 మార్కులు సాధించాలి. ఐపీసీసీ: సీపీటీలో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులు.. ఐపీసీసీ కోసం రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. ఈ కోర్సు రెండు గ్రూపులుగా ఉంటుంది. అభ్యర్థులు తమ ఆసక్తికి అనుగుణంగా ఏదైనా ఒక గ్రూప్ లేదా ఒకేసారి రెండు గ్రూప్‌లకు పేరు నమోదు చేసుకోవచ్చు. ఇలా నమోదు చేసుకున్న తర్వాత తొమ్మిది నెలల స్టడీ కోర్సును పూర్తిచేయాలి. దీంతోపాటు ఓరియెంటేషన్ కోర్సు, 100 గంటలపాటు సాగే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కోర్సును పూర్తి చేయాలి. ఏటా మే, నవంబర్‌లో ఐపీసీసీ పరీక్షలు జరుగుతాయి. ఈ పరీక్షలో ఉత్తీర్ణులయ్యేందుకు ప్రతి సబ్జెక్టులోనూ 40 శాతం, గ్రూప్ మొత్తంమీద 50 శాతం మార్కులు రావాలి. గ్రూప్-1: పేపర్-1: అకౌంటింగ్; పేపర్-2: బిజినెస్ లా, ఎథిక్స్, కమ్యూనికేషన్; పేపర్-3: కాస్ట్ అకౌంటింగ్ అండ్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్; పేపర్-4: టాక్సేషన్. గ్రూప్-2: పేపర్-5: అడ్వాన్స్డ్ అకౌంటింగ్; పేపర్-6: ఆడిటింగ్ అష్యూరెన్స్; పేపర్-7: ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ స్ట్రాటజిక్ మేనేజ్మెంట్. ప్రతి పేపర్‌కు గరిష్ట మార్కులు 100. డిగ్రీతో నేరుగా: గతంలో సీఏలో చేరాలంటే.. ప్రతి ఒక్కరూ సీపీటీ తప్పనిసరిగా రాయాల్సిందే. ఇది పూర్తయితేనే రెండో దశ ఐపీసీసీలో ప్రవేశించడానికి వీలయ్యేది. కానీ, ఇటీవల సడలించిన నిబంధనల ప్రకారం 55 శాతం మార్కులతో కామర్స గ్రాడ్యుయేట్స్/ పోస్ట్ గ్రాడ్యుయేట్స్ పూర్తిచేసిన వారు, 60 శాతం మార్కులతో ఏదైనా ఇతర గ్రాడ్యుయేషన్/ పీజీ పూర్తిచేసిన వారు, ఐసీడబ్ల్యూఏఐ లేదా సీఎస్‌లో ఇంటర్ పూర్తిచేసిన అభ్యర్థులు సీపీటీకు హాజరు కావల్సిన అవసరం లేదు. వీరు నేరుగా రెండో దశ ఐపీసీసీలో చేరొచ్చు. ఆర్టికల్స్: ఐపీసీసీ కోర్సులోని గ్రూప్-1 గాని లేదా రెండు గ్రూప్స్ పూర్తిచేసిన వారు మూడు సంవత్సరాల ఆర్టికల్స్ పూర్తిచేయాల్సి ఉంటుంది. ఐసీఏఐ గుర్తింపు ఉన్న చార్టర్డ్ అకౌంటెంట్ దగ్గర ఆర్టికల్‌షిప్ చేయాల్సి ఉంటుంది. ఈ సమయంలో స్టైఫండ్ కూడా సంపాదించుకోవచ్చు. ఫైనల్: ఐపీసీసీలో ఉత్తీర్ణత సాధించిన వారు ఫైనల్‌కు రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. రెండున్నరేళ్ల ఆర్టికల్స్ పూర్తిచేసిన తర్వాత ఫైనల్ పరీక్షకు అర్హత లభిస్తుంది. ఫైనల్ పరీక్షలు ఏటా మే, నవంబర్‌లో జరుగుతాయి. పూర్తిస్థాయి చార్టర్డ్ అకౌంటెంట్‌గా తీర్చిదిద్దే ఫైనల్ కోర్సు కూడా రెండు గ్రూపులుగా ఉంటుంది. ప్రతి గ్రూపులో నాలుగు పేపర్లు ఉంటాయి. అవి.. గ్రూప్-1: పేపర్-1: ఫైనాన్షియల్ రిపోర్టింగ్; పేపర్-2: స్ట్రాటజిక్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్; పేపర్-3: అడ్వాన్స్డ్ ఆడిటింగ్ అండ్ ప్రొఫెషనల్ ఎథిక్స్; పేపర్-4: కార్పొరేట్ అండ్ అలైడ్ లాస్. గ్రూప్-2: పేపర్-5: అడ్వాన్స్డ్ మేనేజ్మెంట్ అకౌంటింగ్; పేపర్-6: ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ కంట్రోల్ అండ్ ఆడిట్; పేపర్-7: డెరైక్ట్ టాక్స్ లాస్; పేపర్-8: ఇన్‌డెరైక్ట్ టాక్స్ లాస్. ఐపీసీసీ మాదిరిగానే ఫైనల్ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించాలంటే ప్రతి సబ్జెక్టులోనూ 40 శాతం, గ్రూప్ మొత్తం మీద 50 శాతం మార్కులు సాధించాలి. ఫైనల్‌తో పాటు జనరల్ మేనేజ్మెంట్ అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్ కోర్సు కూడా చేయాలి. ఉన్నత విద్య: కేవలం ఇంటర్ అర్హతతో పూర్తి చేయగలిగే సీఏ కోర్సుకి.. ప్రభుత్వం ఇతర బ్యాచిలర్ డిగ్రీలతో సమానంగా గుర్తింపు ఇచ్చింది. ఈ క్రమంలో సీఏ ఫైనల్ పూర్తిచేసిన అభ్యర్థులకు ఎంకాం, ఎంబీఏ వంటి పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సులు చేసే అవకాశం లభిస్తుంది. అదేవిధంగా బ్యాచిలర్ డిగ్రీ అర్హతతో నిర్వహించే సివిల్ సర్వీసెస్, గ్రూప్-1, గ్రూప్-2 మొదలైన అన్ని ఉద్యోగ పరీక్షలకు హాజరుకావచ్చు. కావల్సిన నైపుణ్యాలు: సీఏ కోర్సులో చేరేవారికి కొన్ని ప్రత్యేక నైపుణ్యాలు ఎంతో అవసరం. వాటిలో ముఖ్యమైనది సహనం. విస్తృతంగా ఉండే సిలబస్‌ను క్షుణ్నంగా పరిశీలించి ఆకళింపు చేసుకోవాలంటే సహనం ఎంతో అవసరం. అదేవిధంగా పుస్తకాల ద్వారా నేర్చుకున్న పరిజ్ఞానాన్ని ప్రాక్టికల్‌గా అన్వయించే సామర్థ్యం, తార్కిక ఆలోచన నైపుణ్యం కూడా కీలకమే. అదేవిధంగా కమ్యూనికేషన్ స్కిల్స్, సోషల్ నెట్వర్కింగ్ స్కిల్స్ అవసరం కూడా ఎంతో ఉంటుంది. కెరీర్ ఆప్షన్స్: సీఏ కోర్సు పూర్తి చేసిన అభ్యర్థులను నియమించుకునేందుకు కార్పొరేట్ కంపెనీలు క్యూ కడుతున్నాయి. క్యాంపస్ రిక్రూట్మెంట్లు నిర్వహించి ఉద్యోగాలు కల్పిస్తున్నాయి. ప్రపంచీకరణ నేపథ్యంలో దేశాల మధ్య సరిహద్దులు చెరిగిపోతున్న వేళ సీఏ కోర్సు పూర్తిచేసినవారికి అవకాశాలు అపరిమితమవుతున్నాయి. అవకాశాలకు ఆకాశమే హద్దు: సీఏ కోర్సు పూర్తిచేసిన వారికి వివిధ సంస్థలు అద్భుత అవకాశాలు కల్పిస్తున్నాయి. అవి: సేవా రంగం, టెలికం, బ్యాంకింగ్, బీమా, సాఫ్ట్వేర్, మైనింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్, స్టాక్ బ్రోకింగ్ కంపెనీలు, ఆడిటింగ్ ఫర్మ్స్, మ్యూచువల్ ఫండ్ సంస్థలు, ఇన్వెస్ట్మెంట్ హౌసెస్, పేటెంట్ ఫర్మ్స్, లీగల్ హౌసెస్. సంప్రదాయ, ఆధునిక విభాగాలు: సీఏ కోర్సు పూర్తిచేసిన వారికి స్టాట్యుటరీ అండ్ ఇంటర్నల్ ఆడిటింగ్, అకౌంటింగ్, డెరైక్ట్-ఇన్‌డెరైక్ట్ టాక్స్; టాక్స్ ప్లానింగ్ తదితర సంప్రదాయ విభాగాలతో పాటు టెక్నికల్ అనాలసిస్, రిస్క్ అసెసర్స్, సర్వేయర్స్, మర్చంట్ బ్యాంకర్స్, మేనేజ్మెంట్ అకౌంటెంట్స్, అకౌంట్స్ అండ్ ఫైనాన్స్, కన్సల్టెన్సీ సర్వీసెస్, ప్రాజెక్ట్ మేనేజ్మెంట్, మెర్జర్స్ అండ్ ఎక్విజిషన్స్ వంటి ఆధునిక విభాగాల్లోనూ అద్భుత అవకాశాలు లభిస్తున్నాయి. టైర్-3 పట్టణాల్లోని రిటైల్ షాపులు, జ్యువెలరీ, వస్త్ర, తదితర వాణిజ్య, వ్యాపార సంస్థల ఆదాయవ్యయాలు, ఉత్పత్తి ఖర్చులు, స్టేషనరీ, మానవ వనరులకు చెల్లించే వేతనాలు, ఇతర వ్యయాలు, అమ్మకాలు, కొనుగోళ్లు, కంపెనీ లాభనష్టాలు.. ఇలా ప్రతి దశలోనూ సీఏలతో సంస్థాగత ఆడిటింగ్ నిర్వహించడం అనివార్యం. ఈ నేపథ్యంలో నిపుణులైన సీఏల అవసరం భారీ స్థాయిలో ఉంటోంది. స్వయం ఉపాధి కోరుకునే వారు సొంతంగా ఆడిటర్‌గా కూడా ప్రాక్టీస్ ప్రారంభించొచ్చు. వేతనాలు: సీఏ ఉత్తీర్ణులకు ఆకర్షణీయమైన వేతనాలు అందుతున్నాయి. కెరీర్ ప్రారంభంలో ఫ్రెషర్‌కు నెలకు కనీసం రూ. 35,000 వేతనం లభిస్తుంది. తర్వాత ప్రతిభ, అనుభవం ఆధారంగా దాదాపు రూ. 10 లక్షల వరకు వార్షిక వేతనం అందుకోవచ్చు. విధులు: ఏ సంస్థలోనైనా ప్రధాన విభాగాలు అకౌంటింగ్, ఆడిటింగ్, టాక్సేషన్. వాటి గురించి వివరించేదే చార్టర్డ్ అకౌంటెన్సీ. కంపెనీలు, వ్యక్తుల టాక్స్ ప్లానింగ్ విషయుంలో సీఏ అవసరం తప్పనిసరి. అంతేకాకుండా పెట్టుబడులు, వాటి ప్లానింగ్, సంస్థాగత అభివృద్ధి, కొత్త ప్రాజెక్టుల రూపకల్పన, నిర్వహణలో సాధ్యాసాధ్యాలు, ఆర్థిక వనరుల సమీకరణ, జారుుంట్ వెంచర్స్, విదేశీ భాగస్వావ్యూలు, విస్తరణ, విలీనాల్లోనూ, ఉత్పత్తుల ధరలు, బీపీఓ మొదలైన వాటిలో సీఏలు కీలక పోషిస్తారు. కె రీర్ గ్రాఫ్: కెరీర్ ప్రారంభంలో అకౌంట్స్ లేదా ఫైనాన్స్ ఆఫీసర్‌గా అడుగుపెట్టిన వారు అనుభవం, నైపుణ్యం ఆధారంగా ఫైనాన్స్ డెరైక్టర్, సీఈఓ (చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్) స్థాయికి చేరుకోవచ్చు. అకౌంటింగ్ టెక్నీషియన్ కోర్సు: సీఏ గట్టెక్కలేని వారి కోసం ఐసీఏఐ ప్రవేశపెట్టిన కోర్సు అకౌంటింగ్ టెక్నీషియన్. సీపీటీ పాసైన విద్యార్థి సీఏ పూర్తి చేయలేను అని భావిస్తే ఐపీసీసీలోని గ్రూప్-1 పూర్తిచేసి, ఏడాదిపాటు సీఏ దగ్గర ఆర్టికల్ షిప్ చేస్తే అకౌంటింగ్ టెక్నీషియన్ సర్టిఫికెట్ లభిస్తుంది. పరిశ్రమలో దీనికి ప్రత్యేకమైన గుర్తింపు, డిమాండ్ ఉంది. ఈ సర్టిఫికెట్తో ప్రభుత్వ/ప్రభుత్వేతర సంస్థల్లో చేరి కనీసం రూ.15 వేలు నుంచి రూ.20 వేల వరకు వేతనం పొందొచ్చు. ఉద్యోగం చేస్తూనే ఐపీసీసీ రెండో గ్రూప్‌లో కూడా ఉత్తీర్ణత సాధించి తర్వాత ఫైనల్‌ను పూర్తిచేసి పూర్తిస్థాయి సీఏ హోదాను పొందొచ్చు. సీపీటీ పరీక్షకు ముఖ్య తేదీలు: దరఖాస్తుల లభ్యత: అక్టోబర్ 7 నుంచి 28, 2013 (ఆన్లైన్, ఆఫ్‌లైన్). దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ: అక్టోబర్ 28, 2013 (ఆన్లైన్, ఆఫ్‌లైన్). రాత పరీక్ష తేదీ: సీపీటీ పరీక్షను డిసెంబర్ 15న ఉదయం, మధ్యాహ్నం రెండు సెషన్లుగా నిర్వహిస్తారు. వెబ్సైట్: www.icai.org 2013లో ఐసీఏఐ నిర్వహించిన ప్రాంగణ నియామకాల్లో కొత్తగా సీఏ కోర్సు పూర్తిచేసిన 902 మంది అభ్యర్థులు ఉద్యోగాలు పొందారు. ప్రాంగణ నియామకాల్లో 58 కంపెనీలు పాల్గొన్నాయి. విదేశాల్లో ఉద్యోగం పొందిన అభ్యర్థుల అత్యధిక వేతనం ఏడాదికి రూ.21 లక్షలు. దేశీయంగా ఉద్యోగం లభించిన అభ్యర్థుల గరిష్ట వేతనం రూ.16.55 లక్షలు. ప్రణాళిక ప్రకారం చదివితే ఉత్తమ స్కోర్ కెరీర్‌కు సంబంధించి స్పష్టమైన అవగాహనతో, లక్ష్యంతో సీఏ కోర్సులోకి అడుగుపెట్టాలి. సబ్జెక్టులు ఎంత కష్టంగా ఉన్నాసరే సరైన ప్రణాళికతో చదివితే మంచి స్కోరింగ్ సాధ్యమన్న ఆత్మవిశ్వాసం ఉండాలి. ఏదీ కష్టపడకుండా రాదన్న వాస్తవాన్ని గుర్తించి, ముందడుగు వేయాలి. టైం మేనేజ్మెంట్ పాటిస్తూ ఒత్తిడికి గురవకుండా ప్రిపరేషన్ కొనసాగిస్తే ఎక్కువ స్కోర్ సాధించడం కష్టమేమీ కాదు. శిక్షణ తరగతుల్లో ఏ రోజు చెప్పింది ఆ రోజే చదవడం, సందేహాలు ఉంటే వెంటనే నివృత్తి చేసుకోవాలి. లేకుంటే సబ్జెక్టులపై అనాసక్తత ఏర్పడే ఆస్కారం ఉంటుంది. నేను ఇంటర్ ఎంపీసీ పూర్తిచేశాను. తర్వాత సీఏలోకి అడుగుపెట్టాను. అకౌంట్స్, ట్యాక్సేషన్, ఆడిటింగ్ తదితర అంశాలు పూర్తిగా కొత్తవి కావడం వల్ల నేర్చుకోవాలన్న ఉత్సుకత పెరిగింది. ఈ ఉత్సాహం చివరి వరకు ఉండటం వల్ల మెరుగైన స్కోర్ సాధించగలిగాను. సీఏ ఫైనల్లో భాగంగా ఉన్న ఆర్టికల్‌షిప్ చాలా ముఖ్యమైంది. అప్పటివరకు వివిధ అంశాలకు సంబంధించి పుస్తకాల్లో నేర్చుకున్న అంశాలను ప్రాక్టికల్‌గా అప్లై చేయడానికి ఆర్టికల్‌షిప్ వీలు కల్పిస్తుంది. ప్రస్తుతం చార్టర్డ్ అకౌంటెంట్లకు అవకాశాలు బాగున్నాయి. ఐటీ, ఫార్మా, ఆతిథ్యం, ఇన్ఫ్రా రంగాలు శరవేగంగా అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో సీఏ పూర్తిచేసిన వారికి డిమాండ్ బాగా పెరుగుతోంది. - పి. చంద్రమోహన్ రెడ్డి, అసిస్టెంట్ మేనేజర్, సీఏ, సెబీ. -
ఎన్‌ఎస్‌ఈఎల్‌కు ఐటీ స్పాట్
న్యూఢిల్లీ: నేషనల్ స్పాట్ ఎక్స్ఛేంజీ(ఎన్ఎస్ఈఎల్)పై ఆదాయ పన్ను(ఐటీ) శాఖ దృష్టి సారించింది. ప్రమోటర్ కంపెనీ ఫైనాన్షియల్ టెక్నాలజీస్(ఎఫ్టీఐఎల్)కు నిధులను బదిలీ చేయడంలో పన్ను నిబంధనల ఉల్లంఘన జరిగిందా అన్న విషయంపై దర్యాప్తు చేపట్టనుంది. దీనిలో భాగంగా ఎఫ్‌టీఐఎల్‌కు ఎన్ఎస్ఈఎల్ చేసిన చెల్లింపుల కు సంబంధించిన లావాదేవీలపై ఐటీ శాఖ ఆరా తీయనుంది. ఈ విషయాన్ని ఆర్థిక శాఖ అధికారి ఒకరు పేర్కొన్నారు. నిధులు ఎక్కడి నుంచి వచ్చాయి? అవకతవకలేమైనా జరిగాయా? తదితర వివరాలను పరిశీలించనున్నట్లు ఆ అధికారి తెలిపారు. ట్రేడింగ్ ప్లాట్‌ఫామ్‌ను వినియోగించుకున్నందుకుగాను ఎఫ్‌టీఐఎల్‌కు 2011-12లో ఎన్ఎస్ఈఎల్ రూ. 15.56 కోట్లను చెల్లించింది. తిరిగి 2012-13లో ఈ చార్జీలను రెట్టింపునకు పెంచి రూ. 33.8 కోట్లను చెల్లించింది. ఇన్వెస్టర్ల నిధులను సంబంధించిన వివరాలను అందించమంటూ ఇప్పటికే ఎన్ఎస్ఈఎల్ కమోడిటీ ఫ్యూచర్స్‌లో రూ. 50 కోట్లకుపైగా లావాదేవీలు కలిగిన 8 బ్రోకింగ్ సంస్థలను ఐటీ శాఖ ఆదేశించినట్లు తెలుస్తోంది. ఈ సంస్థలలో ఆనంద్‌రాఠీ, మోతీలాల్ ఓస్వాల్, ఇండియా ఇన్ఫోలైన్, సిస్టమాటిక్స్ తదితరాలున్నాయి. ఈ కేసులో విదేశీమారక నిబంధనల(ఫెమా) ఉల్లంఘన అంశంపై ఇప్పటికే ఎన్ఫోర్స్మెంట్ డెరైక్టరేట్ సైతం దర్యాప్తును మొదలు పెట్టిన విషయం విదితమే. కాగా, ఈ వార్తల నేపథ్యంలో బీఎస్ఈలో ఫైనాన్షియల్ టెక్నాలజీస్ షేరు 10%పైగా పతనమై రూ. 150 వద్ద ముగిసింది. వెనక్కి తగ్గిన ఆడిటర్లు గతేడాదికి(2012-13)గాను ఖాతాలపై నివేదిక ఇచ్చిన ఎఫ్టీఐఎల్ ఆడిటర్ సంస్థ ‘డెలాయిట్ హస్కిన్స్ అండ్ సెల్స్’ వెనకడుగు వేసింది. ఈ ఖాతాలపై తమ నివేదిక(ఆడిట్)ను ఉపసంహరించుకుంటున్నట్లు తెలిపింది. ఇన్వెస్టర్లకు రూ. 5,600 కోట్ల చెల్లింపుల్లో విఫలమైన గ్రూప్ సంస్థ ఎన్ ఎస్ఈఎల్ ఎదుర్కొంటున్న సంక్షోభం నేపథ్యంలో తాము ఈ నిర్ణయానికి వచ్చినట్లు ఆడిటర్ సంస్థ వివరణ ఇచ్చింది. సంక్షోభం తరువాత వరుసగా ఆరో వారంలోనూ ఎన్ఎస్ఈఎల్ చెల్లింపుల విషయంలో విఫలంకావడం గమనార్హం. కాగా, ఎన్ఎస్ఈఎల్ ప్రభావం తమ స్టాండెలోన్ ఆర్థిక ఫలితాల పై అంతంత మాత్రమేనని ఎఫ్టీఐఎల్ పేర్కొంది. నికర లాభంలో ఈ వాటా 6.6% మాత్రమేనని వెల్లడించింది. ఇక మరోవైపు ఎన్ఎస్ఈఎల్ సంక్షోభంపై రూపొందించిన నివేదికను ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి అరవింద్ మాయారామ్ ఇటు ప్రధాని కార్యాలయంతోపాటు, ఆర్థిక మంత్రి పి.చిదంబరానికి అందజేశారు. నివేదికలో కమోడిటీ ఎక్స్ఛేంజీ నిర్వహణలో జరిగిన లోపాలను ఎత్తిచూపినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. రంగంలోకి ఐసీఏఐ ఎన్ఎస్ఈఎల్ సంక్షోభం నేపథ్యంలో ఫైనాన్షియల్ టెక్నాలజీస్‌కు సంబంధించి ఓవైపు ఆడిటర్లు తాము నిర్వహించిన ఖాతాల ఆడిట్‌ను ఉపసంహరించుకోగా, మరోవైపు ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టెర్డ్ అకౌంటెంట్స్(ఐసీఏఐ) దర్యాప్తు మొదలైంది. ఆడిటింగ్ ప్రమాణాల నిబంధనల్లో భాగంగా కొన్ని సందర్భాల్లో ఆడిటర్లు తమ నివేదికలను ఉపసంహరించుకునేందుకు అవకాశం ఉంది. అయితే ఈ విషయాలపై వివిధ నియంత్రణ సంస్థలు, ఫైనాన్షియల్ టెక్నాలజీస్, ఎన్ఎస్ఈఎల్లకు సంబంధించిన వ్యక్తుల నుంచి సమాచారాన్ని సేకరిస్తున్నట్లు ఐసీఏఐ ప్రెసిడెంట్ సుబోధ్ కుమార్ అగర్వాల్ చెప్పారు. కాగా, ఎఫ్టీఐఎల్ ఖాతాల విషయంలో ఆడిటర్లు వెనక్కుతగ్గడంపై మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ దృష్టి సారించింది. ఈ విషయాలపై నిజానిజాల కోసం ఎఫ్టీఐఎల్ను సంప్రదిస్త్తున్నామని సెబీ హోల్‌టైమ్ డెరైక్టర్ రాజీవ్ కుమార్ అగర్వాల్ చెప్పారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఎఫ్టీఐఎల్ ప్రమోటర్ జిగ్నేష్ షా ఎన్ఎస్ఈఎల్ మేనేజ్మెంట్ చేసిన అవకతవకలకు తాను బలవుతున్నానని వ్యాఖ్యానించారు. ప్రస్తుత క్లిష్ట పరిస్థితుల నుంచి గట్టెక్కేందుకు అవసరమైన మద్దతు ఇవ్వాల్సిందిగా అటు వాటాదారులను, ఇటు ప్రభుత్వాన్ని అభ్యర్థించారు. -
సెప్టెంబర్‌లో సీఏ క్యాంపస్ ప్లేస్మెంట్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఆర్థిక వృద్ధిరేటు క్షీణిస్తున్నప్పటికీ అన్ని రంగాల నుంచి చార్టర్డ్ అకౌంటెంట్స్‌కి డిమాండ్ ఉందని ఇనిస్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ఐసీఏఐ) ప్రకటించింది. దేశవ్యాప్తంగా ఐసీఏఐ నిర్వహిస్తున్న క్యాంపస్ రిక్రూట్మెంట్స్కు అన్ని రంగాలకు చెందిన కంపెనీల నుంచి మంచి స్పందన వస్తోందని, కొన్ని కంపెనీలు గరిష్టంగా రూ.16 లక్షల వార్షిక వేతనం ఇవ్వడానికి కూడా ముందుకు వస్తున్నాయని ఐసీఏఐ సెంట్రల్ కౌన్సిల్ మెంబర్ విజయ్ కుమార్ గుప్తా తెలిపారు. సెప్టెంబర్10 నుంచి 13వ తేది వరకు హైదరాబాద్‌లో నిర్వహించనున్న క్యాంపస్ ఇంటర్వ్యూ విషయాలను తెలియచేయడానికి శుక్రవారం ఇక్కడ మీడియా సమావేశంలో గుప్తా మాట్లాడుతూ సీఏలకు దేశంలో నాలుగు లక్షల నుంచి రూ.16 లక్షలకు వరకు వేతనం లభిస్తోందని, అదే విదేశాల్లో అయితే రూ.21 లక్షల వరకు వేతనం లభిస్తోందన్నారు. గత సంవత్సరం సగటున రూ.7.11 లక్షల వేతనం లభించినట్లుగా గుప్తా తెలిపారు. మూడు రోజుల పాటు జరిగే ఈ ప్లేస్మెంట్ కార్యక్రమంలో ఆంధ్రాబ్యాంక్, ఎస్ఆర్బీసీ అండ్ కో, బజాజ్ ఫైనాన్స్, ల్యాంకో వంటి 130 కంపెనీలు పాల్గొంటాయని అంచనా వేస్తున్నట్లు ఐసీఏఐ హైదరాబాద్ చీఫ్ కో-ఆర్డినేటర్ ఎం.దేవరాజ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఈ మధ్యనే సీఏ కోర్సును పూర్తి చేసిన 5,000 మంది విద్యార్థులు పాల్గొంటారని అంచనా వేస్తున్నామని, గడిచిన సంవత్సరం జరిగిన క్యాంపస్ రిక్రూట్మెంట్లో 1,500 మందికి ఉద్యోగావకాశాలు లభించినట్లు తెలిపారు.