ఒక సంస్థలో ప్రధాన విభాగాలు అకౌంటింగ్, ఆడిటింగ్, టాక్సేషన్. వీటి గురించి వివరించేదే చార్టర్డ్ అకౌంటెన్సీ. కంపెనీలు, వ్యక్తుల పన్ను ప్రణాళికల విషయుంలో చార్టర్డ్ అకౌంటెంట్ (సీఏ) అవసరం తప్పనిసరి. అంతేకాకుండా పెట్టుబడులు, వాటి ప్లానింగ్, సంస్థాగత అభివృద్ధి, కొత్త ప్రాజెక్టుల రూపకల్పన, నిర్వహణలో సాధ్యాసాధ్యాలు, ఆర్థిక వనరుల సమీకరణ, జారుుంట్ వెంచర్స్, విదేశీ భాగస్వావ్యూలు, విస్తరణ, విలీనాల్లోనూ, ఉత్పత్తుల ధరలు మొదలైన వాటిలో సీఏలు కీలక పాత్ర పోషిస్తారు.
మూడు దశలు:
సీఏ కోర్సును ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా(ఐసీఏఐ) నిర్వహిస్తోంది. ఇందులో కామన్ ప్రొఫిషియెన్సీ టెస్ట్(సీపీటీ), ఇంటిగ్రేటెడ్ ప్రొఫెషనల్ కాంపిటెన్‌స కోర్సు (ఐపీసీసీ), ఫైనల్ దశలుంటాయి. పదో తరగతి పూర్తిచేసిన వారు సీపీటీకి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. సీపీటీ ఏటా జూన్, డిసెంబర్‌లలో జరుగుతుంది. ఈ పరీక్ష రాయడానికి ఇంటర్ ఆపై కోర్సులు పూర్తిచేసిన వారు అర్హులు. సీపీటీ పరీక్షను ఆబ్జెక్టివ్ విధానంలో నిర్వహిస్తారు.
ఐపీసీసీ:
సీపీటీలో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులు.. ఐపీసీసీ కోసం రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. ఈ కోర్సు రెండు గ్రూపులుగా ఉంటుంది. అభ్యర్థులు తమ ఆసక్తికి అనుగుణంగా ఏదైనా ఒక గ్రూప్ లేదా ఒకేసారి రెండు గ్రూప్‌లకు పేరు నమోదు చేసుకోవచ్చు. ఇలా నమోదు చేసుకున్న తర్వాత తొమ్మిది నెలల స్టడీ కోర్సును పూర్తిచేయాలి. దీంతోపాటు ఓరియెంటేషన్ కోర్సు, 100 గంటలపాటు సాగే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కోర్సును పూర్తి చేయాలి. ఏటా మే, నవంబర్‌లో ఐపీసీసీ పరీక్షలు జరుగుతాయి.
ఆర్టికల్స్:
ఐపీసీసీ కోర్సులోని గ్రూప్-1 గాని లేదా రెండు గ్రూప్స్ పూర్తిచేసిన వారు మూడు సంవత్సరాల ఆర్టికల్స్ పూర్తిచేయాల్సి ఉంటుంది. ఐసీఏఐ గుర్తింపు ఉన్న చార్టర్డ్ అకౌంటెంట్ దగ్గర ఆర్టికల్‌షిప్ చేయాల్సి ఉంటుంది. ఈ సమయంలో స్టైపెండ్ కూడా సంపాదించుకోవచ్చు.
ఫైనల్:
ఐపీసీసీలో ఉత్తీర్ణత సాధించిన వారు ఫైనల్‌కు రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. రెండున్నరేళ్ల ఆర్టికల్స్ పూర్తిచేసిన తర్వాత ఫైనల్ పరీక్షకు అర్హత లభిస్తుంది. ఇందులోని ప్రతి గ్రూపులో నాలుగు పేపర్లు ఉంటాయి.
కెరీర్:
సీఏ కోర్సు పూర్తిచేసిన వారికి సేవా రంగం, టెలికం, బ్యాంకింగ్, బీమా, సాఫ్ట్‌వేర్, మైనింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్, లీగల్ హౌసెస్ వంటివి ఉన్నత అవకాశాలు కల్పిస్తున్నాయి. స్టాట్యుటరీ అండ్ ఇంటర్నల్ ఆడిటింగ్, అకౌంటింగ్, డెరైక్ట్-ఇన్‌డెరైక్ట్ ట్యాక్స్; ట్యాక్స్ ప్లానింగ్, టెక్నికల్ అనాలసిస్, రిస్క్ అసెసర్స్, సర్వేయర్స్, మర్చంట్ బ్యాంకర్స్, అకౌంట్స్ అండ్ ఫైనాన్స్, కన్సల్టెన్సీ సర్వీసెస్, ప్రాజెక్ట్ మేనేజ్‌మెంట్, మెర్జర్స్ అండ్ ఎక్విజిషన్స్ వంటి ఆధునిక విభాగాల్లోనూ అవకాశాలు లభిస్తున్నాయి. స్వయం ఉపాధి కోరుకునే వారు సొంతంగా ఆడిటర్‌గా కూడా ప్రాక్టీస్ ప్రారంభించొచ్చు.
వేతనాలు:
సీఏ ఉత్తీర్ణులకు ఆకర్షణీయమైన వేతనాలు అందుతున్నాయి. కెరీర్ ప్రారంభంలో ఫ్రెషర్‌కు నెలకు కనీసం రూ.35,000 వేతనం లభిస్తుంది. తర్వాత ప్రతిభ, అనుభవం ఆధారంగా దాదాపు అధిక వేతనాలు అందుకోవచ్చు. 2014 ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్‌లో ఐసీఏఐ నిర్వహించిన క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో 1019 మందికి ఉద్యోగావకాశాలు రాగా, వారిలో 201 మందికి రూ.9 లక్షలు, ఆపై వార్షిక వేతనంతో ఆఫర్లు వచ్చాయి.
డిమాండ్-సప్లయ్ వ్యత్యాసం వేలల్లోనే..!
దేశంలో అకౌంటెన్సీ విభాగంలో మానవ వనరుల అవసరం కోణంలో డిమాండ్-సప్లయ్ వ్యత్యాసం వేలల్లో ఉంది. మ్యాథమెటికల్ స్కిల్స్, కంప్యూటేషనల్ స్కిల్స్ ఉన్న ఔత్సాహికులకు సరితూగే కోర్సు సీఏ. వాణిజ్య, వ్యాపార రంగాలు, అకౌంటింగ్ కార్యకలాపాలపై సహజ ఆసక్తితో ఈ సీఏ కోర్సును పూర్తి చేయడం సులభమే. ఈ కోర్సు అంటే సుదీర్ఘ కాలం సాగే ప్రక్రియ అనేది అపోహ మాత్ర మే. విద్యార్థులు బ్యాచిలర్ డిగ్రీ చేస్తూనే ప్రొఫెషనల్ సర్టిఫికెట్ సొంతం చేసుకునే అవకాశం అందించే కోర్సు ఇది. సమయాన్ని సద్వినియోగం చేసుకుంటే డిగ్రీ పూర్తయ్యే నాటికి ఐపీసీసీ దశ దాటుకుని ఫైనల్‌కు చేరుకోవచ్చు.
- ఆర్.చెంగలరెడ్డి, సెక్రటరీ,
ఎస్‌ఐఆర్‌సీ, హైదరాబాద్ బ్రాంచ్.
కంపెనీ సెక్రటరీషిప్ (సీఎస్)
కంపెనీ సెక్రటరీషిప్(సీఎస్) కోర్సును ద ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కంపెనీ సెక్రటరీస్ ఆఫ్ ఇండియా(ఐసీఎస్‌ఐ) నిర్వహిస్తోంది. ఒక కంపెనీలోని బోర్డ్ మీటింగ్‌ల నిర్వహణ, ఎజెండా, మినిట్స్ రూపకల్పన, వాటి ఆచరణపై పర్యవేక్షణ వంటి ఎన్నో ఉన్నత స్థాయి బాధ్యతలు నిర్వర్తించేది కంపెనీ సెక్రటరీలే. ఆ స్థాయికి చేరుకోవాలంటే ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కంపెనీ సెక్రటరీస్ ఆఫ్ ఇండియాలో మెంబర్‌షిప్ సొంతం చేసుకోవాలి. కంపెనీ సెక్రటరీషిప్ కోర్సు మొత్తం మూడు దశలుగా ఉంటుంది. అవి.. ఫౌండేషన్ ప్రోగ్రాం; ఎగ్జిక్యూటివ్ ప్రోగ్రాం; ప్రొఫెషనల్ ప్రోగ్రాం.
ఇంటర్‌తోనే ‘ఫౌండేషన్’:
ఐసీఎస్‌ఐ.. సీఎస్ కోర్సులోని తొలిదశ ఫౌండేషన్ ప్రోగ్రాం. దీనికి అర్హత ఇంటర్మీడియెట్ ఉత్తీర్ణతతో పేరు నమోదు చేసుకోవాలి.. ఈ ప్రోగ్రాం కోసం పరీక్ష ఏటా రెండుసార్లు జూన్, డిసెంబర్‌లలో జరుగుతుంది. ఏడాది మొత్తం పేరు నమోదు చేసుకునే అవకాశం ఉన్నప్పటికీ.. పేరు నమోదు చేసుకున్న తేదీకి, తొలిసారి పరీక్షకు హాజరయ్యే తేదీకి మధ్య కనీసం 8 నెలల వ్యవధి తప్పనిసరి. ఈ ప్రోగ్రాంలో మొత్తం నాలుగు పేపర్లలో పరీక్షకు హాజరుకావాల్సి ఉంటుంది.
రెండో దశ.. ఎగ్జిక్యూటివ్ ప్రోగ్రాం:
ఫౌండేషన్ ప్రోగ్రాంలోని అన్ని పేపర్లలో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులు కంపెనీ సెక్రటరీషిప్ ప్రోగ్రాంలోని రెండో దశ ‘ఎగ్జిక్యూటివ్ ప్రోగ్రాం’కు తమ పేరు నమోదు చేసుకోవాలి. ఈ ఎగ్జిక్యూటివ్ ప్రోగ్రాం రెండు మాడ్యూల్స్‌లో ఉంటుంది. ఒక్కో మాడ్యూల్‌లో మూడు పేపర్లు ఉంటాయి. ఈ పరీక్షలు ఏటా రెండుసార్లు జూన్, డిసెంబర్‌లలో జరుగుతాయి.
ప్రొఫెషనల్ ప్రోగ్రాం టు సెటిల్ ఇన్ ప్రొఫెషన్:
ఎగ్జిక్యూటివ్ ప్రోగ్రాంలో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులు.. సీఎస్ ప్రొఫెషన్‌లో సెటిలయ్యేందుకు చివరి దశ ప్రొఫెషనల్ ప్రోగ్రాంలో పేరు నమోదు చేసుకోవాలి. ప్రొఫెషనల్ ప్రోగ్రాంను మొత్తం నాలుగు మాడ్యూల్స్‌గా విభజించారు. ఒక్కో మాడ్యూల్‌లో రెండు పేపర్లు ఉంటాయి.
15 నెలల ప్రాక్టికల్ ట్రైనింగ్:
ఎగ్జిక్యూటివ్ ప్రోగ్రాంలో ఉత్తీర్ణత సాధించి ప్రొఫెషనల్ ప్రోగ్రాంలో పేరు నమోదు చేసుకున్న అభ్యర్థులు ఫ్రొఫెషనల్ ప్రోగ్రాం పరీక్ష రాసే సమయానికి తప్పనిసరిగా 15 నెలల ప్రాక్టికల్ ట్రైనింగ్ పూర్తి చేసుకోవాలి.
అవకాశాలు:
1956 కంపెనీల చట్టం ప్రకారం రూ.5 కోట్ల అధీకృత మూలధనం ఉన్న ప్రతి సంస్థ ఒక పూర్తి స్థాయి కంపెనీ సెక్రటరీని నియమించుకోవాలి. కార్పొరేట్ గవర్నెస్ అండ్ సెక్రటరీయల్ సర్వీసెస్, కార్పొరేట్ లాస్ అడ్వైజరీ అండ్ రిప్రజెంటేషన్ సర్వీసెస్, ఫైనాన్షియల్ మార్కెట్ సర్వీసెస్, మేనేజ్‌మెంట్ సర్వీసెస్ సంబంధిత కంపెనీల్లో అవకాశాలు విస్తృతం. స్వయం ఉపాధి దిశగా ఆలోచించే వారు సొంతంగా ప్రాక్టీస్ కూడా చేయవచ్చు.
వేతనం:
ఒక ఫ్రెషర్‌కు రూ.4 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు వార్షిక వేతన ప్యాకేజ్ లభిస్తుంది. ఈ రంగంలో కనీసం పదేళ్ల అనుభవం ఉంటే రూ. 25 లక్షల నుంచి రూ.40 లక్షల వరకు వేతనం అందుకోవచ్చు.
సీఎంఏ
అకౌంటింగ్ రంగాల్లో సమున్నత భవిష్యత్తును కోరుకునే విద్యార్థులకు మరో చక్కటి అవకాశం కల్పిస్తున్న కోర్సు కాస్ట్ అండ్ మేనేజ్‌మెంట్ అకౌంటెన్సీ (సీఎంఏ). ఈ కోర్సును ద ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కాస్ట్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా నిర్వహిస్తోంది. సీఎంఏ కోర్సు మూడు దశలుగా ఉంటుంది. అవి.. ఫౌండేషన్ కోర్సు, ఇంటర్మీడియెట్ కోర్సు, ఫైనల్ కోర్సు.
ఫౌండేషన్ కోర్సు:
ఈ కోర్సులో పేరు నమోదు చేసుకోవడానికి కనీస అర్హత ఇంటర్మీడియెట్/10+2/తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత. చివరి సంవత్సరం పరీక్షలు రాసి ఫలితాల కోసం ఎదురుచూసే వారు కూడా పేరు నమోదు చేసుకోవచ్చు. ఈ ఫౌండేషన్ కోర్సు పరీక్షలు ఏటా జూన్, డిసెంబర్ నెలల్లో జరుగుతాయి. ఫౌండేషన్ కోర్సులో మొత్తం నాలుగు పేపర్లుంటాయి.
ఇంటర్మీడియెట్ కోర్సు:
ఇంటర్మీడియెట్ కోర్సు రెండు స్టేజ్‌లుగా ఉంటుంది. ప్రతి దశలో మూడు పేపర్లుంటాయి. ఏటా జూన్, డిసెంబర్‌లలో నిర్వహించే ఇంటర్మీడియెట్ పరీక్షలకు హాజరయ్యే క్రమంలో నిర్ణీత తేదీల్లోపు సంబంధిత దరఖాస్తు ప్రక్రియ పూర్తి చేయాలి.
ఫైనల్ కోర్సు:
ఇంటర్మీడియెట్ కోర్సు పూర్తయిన తర్వాత పూర్తి స్థాయిలో కాస్ట్ అండ్ వర్‌క అకౌంటెన్సీ ప్రొఫెషనల్‌గా తీర్చిదిద్దే క్రమంలో చివరి దశ ఫైనల్ కోర్సు. ఇది రెండు దశలలో ఉంటుంది. సీఎంఏ ఇంటర్మీడియెట్ ఉత్తీర్ణులు తమ ఆసక్తికి అనుగుణంగా మొదట ఫైనల్ కోర్సులోని రెండు దశలలో ఏదో ఒకదానికి దరఖాస్తు చేసుకోవచ్చు. లేదా ఒకేసారి రెండింటికీ దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పరీక్షలను కూడా జూన్, డిసెంబర్‌లలో నిర్వహిస్తారు.
కెరీర్ అవకాశాలు:
సీఎంఏ పూర్తిచేసిన వారు బ్యాంకింగ్, ఫైనాన్షియల్ ఇన్‌స్టిట్యూషన్స్, వస్తూత్పత్తి తదితర సంస్థల్లో జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్, కాస్ట్ ఆడిటర్ వంటి హోదాలో ప్రవేశించొచ్చు. కేంద్ర ప్రభుత్వం ఐఏఎస్, ఐపీఎస్ మాదిరిగానే ఇండియన్ కాస్ట్ అకౌంట్స్ సర్వీస్ అనే కేంద్ర సర్వీస్‌ను కూడా ఏర్పాటు చేసింది. క్యాంపస్ ఇంటర్వ్యూల ద్వారా ఉద్యోగాలను సొంతం చేసుకోవచ్చు.
వేతనాలు:
ప్రారంభంలో ఏడాదికి రూ.6 లక్షల వార్షిక వేతనం లభిస్తుంది. తర్వాత ప్రతిభ ఆధారంగా రూ.30 నుంచి రూ.40 లక్షల వేతనాలు కూడా అందుకోవచ్చు.
లా
దేశంలో ఆర్థిక సరళీకరణ ప్రారంభమైన 1991 నుంచి లా వివిధ రంగాలకు విస్తరించింది. బ్యాంకింగ్, బీమా, ట్యాక్సేషన్, టెలికం, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, రియల్ ఎస్టేట్.. ఇలా చాలా విభాగాల్లో న్యాయ సేవల అవసరం పెరిగింది. ఆ అవసరమే అనేక కొత్త కొలువులను అందుబాటులోకి తెచ్చింది. దీంతో లా కెరీర్.. యువత ఆకర్షణీయ కెరీర్ ఆప్షన్ల జాబితాలోకి చేరింది.ఇంటర్మీడియెట్ ఉత్తీర్ణత తర్వాత ఐదేళ్ల ఎల్‌ఎల్‌బీ/బీఎల్ కోర్సులో చేరొచ్చు. ఇందులో ప్రవేశానికి లా కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ (లాసెట్) రాయొచ్చు.
ప్రతిష్ఠాత్మక జాతీయ స్థాయి లా కళాశాలల్లో ప్రవేశానికి కామన్ లా అడ్మిషన్ టెస్ట్ (క్లాట్) రాయాల్సి ఉంటుంది.న్యూఢిల్లీలోని నేషనల్ లా యూనివర్సిటీ.. ఐదేళ్ల వ్యవధిగల బీఏ ఎల్‌ఎల్‌బీ (ఆనర్స్) కోర్సులో ప్రవేశాలకు అఖిల భారత స్థాయిలో పరీక్ష నిర్వహిస్తోంది. అమెరికాకు చెందిన లా స్కూల్ అడ్మిషన్ కౌన్సిల్.. ‘ఎల్‌శాట్’ను నిర్వహిస్తోంది. దీంట్లో స్కోర్ ఆధారంగా దేశంలోని సుమారు 40కిపైగా లా స్కూల్స్‌లో ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ బీఏ ఎల్‌ఎల్‌బీ కోర్సులో సీటు సంపాదించొచ్చు.
కెరీర్ అవకాశాలు:
ప్రభుత్వ రంగంలో పబ్లిక్ ప్రాసిక్యూటర్‌స, మేజిస్ట్రేట్స్, సబ్ మేజిస్ట్రేట్స్, జూనియర్ జడ్జి స్థాయిల్లో ఎంట్రీ లెవల్ అవకాశాలు లభిస్తాయి. వీటికోసం ఆయా రాష్ర్ట ప్రభుత్వాలు, పబ్లిక్ సర్వీస్ కమిషన్లు నిర్వహించే పరీక్షల్లో ప్రతిభ కనబరచాల్సి ఉంటుంది. ప్రైవేటు రంగంలో కార్పొరేట్, బహుళజాతి కంపెనీలు తమ కార్యకలాపాలకు అవసరమైన న్యాయ సేవలు పొం దేందుకు లా గ్రాడ్యుయేట్లను నియమించుకుంటున్నాయి.
వేతనాలు:
ప్రభుత్వ లేదా ప్రైవేటు సంస్థల్లో అడుగుపెట్టిన వారికి హోదా, ఉద్యోగం స్వభావాన్ని బట్టి నెలకు రూ.20 వేల నుంచి రూ.లక్ష వరకు వేతనాలు లభిస్తున్నాయి.
ఆతిథ్య రంగం
భారత ఆర్థిక వ్యవస్థలో పర్యాటకం, ఆతిథ్య రంగం కీలకపాత్ర పోషిస్తోంది. విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ 2014 గణాంకాల ప్రకారం దేశ ఆతిథ్య రంగం ఏటా 14 శాతం వృద్ధిని నమోదు చేసుకుంటోంది. ఈ క్రమంలో సుశిక్షితులైన హాస్పిటాలిటీ మానవ వనరులకు డిమాండ్ ఉంటోంది. అందువల్ల 10+2 తర్వాత హాస్పిటాలిటీ అండ్ హోటల్ మేనేజ్‌మెంట్ కోర్సులను ఎంపిక చేసుకోవచ్చు.
జేఈఈ:
జాతీయ స్థాయిలో బీఎస్సీ హాస్పిటాలిటీ అండ్ హోటల్ అడ్మినిస్ట్రేషన్ కోర్సులో ప్రవేశాలకు నిర్వహించే పరీక్ష జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ). దీన్ని ఏటా నేషనల్ కౌన్సిల్ ఫర్ హోటల్ మేనేజ్‌మెంట్ అండ్ కేటరింగ్ టెక్నాలజీ (ఎన్‌సీహెచ్‌ఎంసీటీ) నిర్వహిస్తోంది. ఈ పరీక్ష ద్వారా 21 కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో, 16 రాష్ట్ర ప్రభుత్వ సంస్థల్లో, 15 ప్రైవేటు ఇన్‌స్టిట్యూట్‌లలో మూడేళ్ల వ్యవధి ఉన్న బీఎస్సీ హాస్పిటాలిటీ అండ్ హోటల్ అడ్మినిస్ట్రేషన్ కోర్సును అభ్యసించొచ్చు. దీనికి ఇంటర్మీడియెట్ లేదా తత్సమాన పరీక్షలలో ఉత్తీర్ణులు అర్హులు.
అవకాశాలు:
హోటల్ మేనేజ్‌మెంట్‌లో ప్రధానంగా నాలుగు విభాగాలు ఉంటాయి. అవి.. ఫుడ్ ప్రొడక్షన్, ఫుడ్ అండ్ బెవరేజ్ సర్వీస్(ఎఫ్ అడ్ బీ), ఫ్రంట్ ఆఫీస్, హౌస్ కీపింగ్. వీటిల్లో ఏదైనా ఒకదాన్ని ఎంచుకుని కెరీర్‌లో స్థిరపడొచ్చు. ప్రభుత్వరంగంలో కేంద్ర, రాష్ట్ర పర్యాటక శాఖల్లోనూ అవకాశాలుంటాయి. సొంతంగా సంస్థలను ఏర్పాటు చేయడం ద్వారా ఎంటర్‌ప్రెన్యూర్‌గానూ స్థిరపడొచ్చు.
వేతనాలు:
కెరీర్ ప్రారంభంలో ఐదంకెల జీతం పొందొచ్చు. మేనేజ్‌మెంట్ ట్రైనీగా అరుుతే రూ. 15 నుంచి రూ. 18 వేలు, ట్రైనీ సూపర్‌వైజర్‌కైతే రూ. 10 నుంచి రూ. 14 వేలు, మిగతా విభాగాల వారికి రూ. 10 వేలు వర కూ వేతనం లభిస్తుంది.
చార్టర్డ్ అకౌంటెన్సీ (సీఏ)
Published Thu, Apr 2 2015 3:00 AM | Last Updated on Sat, Jul 28 2018 8:18 PM
Advertisement
Advertisement