ఏపీకి రూ 7,211 కోట్లు | The Center has released tax shares to 28 states | Sakshi
Sakshi News home page

ఏపీకి రూ 7,211 కోట్లు

Published Fri, Oct 11 2024 4:01 AM | Last Updated on Fri, Oct 11 2024 4:01 AM

The Center has released tax shares to 28 states

28 రాష్ట్రాలకు పన్నుల వాటాలను విడుదల చేసిన కేంద్రం

తెలంగాణకు రూ.3,745కోట్లు

సాక్షి, న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా 28 రాష్ట్ర ప్రభుత్వా­లకు ఇవ్వాల్సిన రూ.1,78,173­కోట్ల పన్నుల వాటాను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. ఈ మొత్తంలో 2024 అక్టోబరులో చెల్లించాల్సిన సాధారణ వాయిదాకు అదనంగా ఒక ముందస్తు వాయి­దా రూ.89,086.50కోట్లు కూడా ఉన్న­ట్లు  కేంద్ర ఆర్థిక శాఖ గురువారం ఒక ప్రక­టనలో తెలిపింది. దీన్లో భాగంగా ఆంధ్ర­ప్రదేశ్‌కు రూ.7,211కోట్లు, తెలంగాణకు రూ.3,745కోట్లు విడుదల చేసినట్లు పేర్కొంది. 

ఈ పన్నుల వాటాలో అత్యధికంగా ఉత్తర్‌­ప్రదేశ్‌కురూ.31,962కోట్లు ఉండగా, అత్యల్పంగా గోవాకు రూ.688కోట్లు ఇచ్చింది. పండుగల సీజన్‌ దృష్ట్యా రాష్ట్రాల మూల ధన వ్యయాన్ని వేగవంతం చేయడం, అభి­వృద్ధి, సంక్షేమ తదితర వ్యయాలకు ఆర్థిక సహాయం చేయడానికి ముందస్తు వాయి­దాలు విడుదల చేసినట్లు కేంద్రం తెలిపింది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement