చార్టర్డ్‌ అకౌంటెంట్‌ సింధు అనుమానాస్పద మృతి | Chartered Accountant Sindhu Suspicious Deceased In Vijayawada | Sakshi
Sakshi News home page

చార్టర్డ్‌ అకౌంటెంట్‌ సింధు అనుమానాస్పద మృతి

Published Sat, Aug 21 2021 8:25 PM | Last Updated on Sat, Aug 21 2021 8:57 PM

Chartered Accountant Sindhu Suspicious Deceased In Vijayawada - Sakshi

( ఫైల్‌ ఫోటో )

సాక్షి, విజ‌య‌వాడ‌: కృష్ణా జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ఓ యువ చార్టెడ్ అకౌంటెంట్ అనుమానాస్ప‌ద స్థితిలో మృతి చెందారు. ఈ ఘటన మాచ‌వ‌రం పోలీస్‌స్టేష‌న్ ప‌రిధిలో జరిగింది. మృతి చెందిన చెరుకూరి సింధు కొద్ది రోజులుగా ప్రసేన్‌ అనే వ్యక్తితో సన్నిహితంగా ఉంటున్నారు. ఆ వ్యక్తి ఇంట్లోనే సింధు ఉరి వేసుకొని కనిపించారు. అదీ కాకుండా సింధు ముఖంగాపై గాయాలు కనిపించడంతో.. తమ కూతురిది ఆత్మహత్య కాదని ఆమె తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు.

సింధుతో సన్నిహితంగా ఉంటున్న ప్రసేన్‌ కుమార్‌ తమ కుమార్తెను హత్య చేశాడని ఆరోపిస్తున్నారు. ఈ ఘటనకు ప్రేమ వ్యవహారం కారణమని సమాచారం. అయితే సింధు,ప్రసేన్‌ల ప్రేమ వివాహానికి పెద్దలు అంగీకరించలేదని తెలుస్తోంది. దీంతో లాక్‌డౌన్‌ అనంతరం సింధు.. ప్రసేన్‌ ఇంట్లోనే ఉంటునట్లు సమాచారం. 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement