న్యూఢిల్లీ: చార్టర్ట్ అకౌంటెంట్లను నల్లధనం నిరోధక చట్టం (పీఎంఎల్‌ఏ) పరిధిలోకి తీసుకొస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం విదేశీ పెట్టుబడుల పై, వ్యాపార సులభతర నిర్వహణపై ప్రభావం చూపిస్తుందన్న ఆందోళన పరిశ్రమ వర్గాల నుంచి వ్యక్తమవుతోంది.
సీఏలతోపాటు, కాస్ట్ అకౌంటెంట్లు, కంపెనీ సెక్రటరీలను పీఎంఎల్‌ఏ పరిధిలోకి తీసుకొస్తూ కేంద్ర సర్కారు ఇటీవలే ఆదేశాలు జారీ చేయడం గమనార్హం. నిధుల దుర్వినియోగాన్ని అరికట్టేందుకు కేంద్రం ఈ చర్య తీసుకుంది. సీఏలు, కంపెనీ సెక్రటరీలు భారత్‌లో విదేశీ కంపెనీల ఏర్పాటుకు సహకారం అందిస్తుంటారని, తొలి దశలో విదేశీ కంపెనీల తరఫున తమ సొంత చిరునామా ఇస్తుంటారని పరిశ్రమ వర్గాలు వెల్లడించా యి.
విదేశీ కంపెనీకి రెసిడెంట్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తూ, ఇక్కడ కార్యాలయం ఏర్పాటుకు సాయం అందిస్తుంటారని.. తమ క్లయింట్ల తరఫున బ్యాంకు ఖాతాలను నిర్వహిస్తుంటారని తెలిపాయి. విదేశీ క్లయింట్ భారత్‌కు తీసుకొచ్చే పెట్టుబడి సొంతమా లేక నల్లధనమా, వాటి మూలం తెలుసుకునే అవ కాశం సీఏలు, కంపెనీ సెక్రటరీలు లేదని పేర్కొన్నా యి. ప్రాపర్టీల కొనుగోలు, విక్రయం, బ్యాంకు ఖాతాలు లేదా ఆస్తుల నిర్వహణ, లిమిటెడ్ లయబి లిటీ పార్ట్‌నర్‌షిప్ లేదా ట్రస్ట్‌ల నిర్వహణ వ్యవహారాలన్నీ పీఎంఎల్‌ఏ పరిధిలోకి రానున్నాయి. ఫార్మే షన్ ఏజెంట్లు లేదా డైరెక్టర్/సెక్రటరీ/పార్ట్‌నర్‌గా వ్యవహరించే వారినీ పీఎంఎల్‌ఏ పరిధిలోకి తీసుకొ స్తూ కేంద్ర ఆర్థిక శాఖ ఆదేశాలు జారీ చేయడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment