హైదరాబాద్: అంతర్జాతీయ పెట్టుబడిదారులకు స్థిరాస్తి రంగం హాట్‌కేక్‌లా మారింది. దీంతో దేశీయ స్థిరాస్తి రంగంలోకి విదేశీ పెట్టుబడులు వెల్లువెత్తు తున్నాయి. పెట్టుబడి లావాదేవీలలో పారదర్శకత, విధానపరమైన సంస్కరణలు, వ్యాపారాలకు ప్రోత్సాహం, పారిశ్రామిక రంగంలో సాంకేతికత వంటివి ఇన్వెస్టర్ల ఆకర్షణకు ప్రధాన కారణాలని కొలియర్స్ నివేదిక వెల్లడించింది.
2017-22 మధ్య కాలంలో దేశీయ స్థిరాస్తి రంగంలోకి 32.9 బిలియన్ డాలర్ల సంస్థాగత పెట్టుబడులు వచ్చాయి. అదే 2011-16 మధ్య కాలంలో అయితే 25.8 బిలియన్ డాలర్లు వచ్చాయి. అయితే ఈ ఇన్వెస్ట్‌మెంట్స్‌లో విదేశీ సంస్థాగత పెట్టుబడుల (ఎఫ్‌ఐఐ) వాటా 2017-22 మధ్య కాలంలో రూ.2.18 లక్షల కోట్లు (26.6 బిలియన్ డాలర్లు), కాగా.. 2011-16లో కేవలం 8.2 బిలియన్ డాలర్లు మాత్రమే. గత ఆరేళ్ల కాలంతో పోలిస్తే 2017-22లో విదేశీ సంస్థాగత పెట్టుబడులు మూడు రెట్లు అధికంగా వచ్చాయని కొలియర్స్ ఇండియా నివేదిక వెల్లడించింది.
ఈ విదేశీ సంస్థాగత పెట్టుబడులలో 70 శాతం అమెరికా, కెనడా దేశాల నుంచే వచ్చా యి. యూఎస్ నుంచి 11.1 బిలియన్ డాల ర్లు, కెనడా నుంచి 7.5 బిలియన్ డాలర్లు, సింగపూర్ నుంచి 6 బిలియన్ డాలర్ల పెట్టుబడులు వచ్చాయి. మన దేశంలో ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలు, మౌలిక సదుపాయాల కల్పన తదితర కారణాలతో అంతర్జాతీయ సంస్థలు ఇక్కడ పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment