సాంకేతికతల బదిలీపైనా కన్ను
గోవా: దేశీయంగా షిప్ బిల్డింగ్, ఓడల మరమ్మతు రంగాలకు ప్రోత్సాహాన్నివ్వాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది. ఇందుకు దక్షిణ కొరియా, జపాన్ నుంచి పెట్టుబడులతోపాటు.. టెక్నాలజీ బదిలీకావలసి ఉన్నట్లు పోర్టులు, షిప్పింగ్, జలమార్గాల శాఖ సెక్రటరీ టీకే రామచంద్రన్ పేర్కొన్నారు. షిప్ రిపేర్ క్లస్టర్లకు దన్నునివ్వడం ద్వారా షిప్పింగ్ సరఫరాను మెరుగుపరచవలసి ఉన్నట్లు తెలియజేశారు.
ప్రస్తుతం భారత్ షిప్ బిల్డింగ్ మార్కెట్లో 1 శాతానికంటే తక్కువవాటాను కలిగి ఉన్నట్లు వెల్లడించారు. ప్రపంచ షిప్‌బిల్డింగ్ మార్కెట్‌లో చైనా, దక్షిణ కొరియా, జపాన్ ఆధిపత్యం వహిస్తున్నట్లు పేర్కొన్నారు. వెరసి దక్షిణ కొరియా, జపాన్‌వైపు పెట్టుబడులుసహా సాంకేతికతల కోసం చూస్తున్నట్లు వెల్లడించారు. తద్వారా దేశీయంగా నౌకా నిర్మాణం, నౌకల మరమ్మతుల క్లస్టర్లను అభివృద్ధి చేయాలని భావిస్తున్నట్లు తెలియజేశారు.
మ్యారీటైమ్ స్టేట్ డెవలప్‌మెంట్ కౌన్సిల్(ఎంఎస్‌డీసీ) 20వ సదస్సుకు హాజరైన సందర్భంగా రామచంద్రన్ విలేకరులతో పలు అంశాలపై స్పందించారు. పలు రాష్ట్రాలలో విస్తరించేలా మెగా షిప్ బిల్డింగ్ పార్క్ ఏర్పాటుకు ఎంఎస్‌డీసీ యోచిస్తోంది. కాగా.. టెక్నాలజీ, పెట్టుబడులతో రావలసిందిగా ఇప్పటికే దక్షిణ కొరియా, జపాన్‌లను ఆహా్వనించినట్లు రామచంద్రన్ వెల్లడించారు. వీటి ఏర్పాటుకు వీలుగా భూమిని సమకూరుస్తామని హామీ ఇచి్చనట్లు తెలియజేశారు.
Comments
Please login to add a commentAdd a comment