Ship Repairing Unit
-
పెట్టుబడులకు షిప్‌బిల్డింగ్ ఆహ్వానం
గోవా: దేశీయంగా షిప్ బిల్డింగ్, ఓడల మరమ్మతు రంగాలకు ప్రోత్సాహాన్నివ్వాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది. ఇందుకు దక్షిణ కొరియా, జపాన్ నుంచి పెట్టుబడులతోపాటు.. టెక్నాలజీ బదిలీకావలసి ఉన్నట్లు పోర్టులు, షిప్పింగ్, జలమార్గాల శాఖ సెక్రటరీ టీకే రామచంద్రన్ పేర్కొన్నారు. షిప్ రిపేర్ క్లస్టర్లకు దన్నునివ్వడం ద్వారా షిప్పింగ్ సరఫరాను మెరుగుపరచవలసి ఉన్నట్లు తెలియజేశారు. ప్రస్తుతం భారత్ షిప్ బిల్డింగ్ మార్కెట్లో 1 శాతానికంటే తక్కువవాటాను కలిగి ఉన్నట్లు వెల్లడించారు. ప్రపంచ షిప్‌బిల్డింగ్ మార్కెట్లో చైనా, దక్షిణ కొరియా, జపాన్ ఆధిపత్యం వహిస్తున్నట్లు పేర్కొన్నారు. వెరసి దక్షిణ కొరియా, జపాన్‌వైపు పెట్టుబడులుసహా సాంకేతికతల కోసం చూస్తున్నట్లు వెల్లడించారు. తద్వారా దేశీయంగా నౌకా నిర్మాణం, నౌకల మరమ్మతుల క్లస్టర్లను అభివృద్ధి చేయాలని భావిస్తున్నట్లు తెలియజేశారు. మ్యారీటైమ్ స్టేట్ డెవలప్మెంట్ కౌన్సిల్(ఎంఎస్డీసీ) 20వ సదస్సుకు హాజరైన సందర్భంగా రామచంద్రన్ విలేకరులతో పలు అంశాలపై స్పందించారు. పలు రాష్ట్రాలలో విస్తరించేలా మెగా షిప్ బిల్డింగ్ పార్క్ ఏర్పాటుకు ఎంఎస్డీసీ యోచిస్తోంది. కాగా.. టెక్నాలజీ, పెట్టుబడులతో రావలసిందిగా ఇప్పటికే దక్షిణ కొరియా, జపాన్‌లను ఆహా్వనించినట్లు రామచంద్రన్ వెల్లడించారు. వీటి ఏర్పాటుకు వీలుగా భూమిని సమకూరుస్తామని హామీ ఇచి్చనట్లు తెలియజేశారు. -
ఏపీలో షిప్ రిపేరింగ్ యూనిట్!
సాక్షి, అమరావతి: రాష్ట్రానికి ఉన్న సుదీర్ఘ తీర ప్రాంతాన్ని ఆసరాగా చేసుకుని ఆదాయ, ఉపాధి మార్గాలకు ఏపీ మారిటైమ్ బోర్డు ప్రణాళిక సిద్ధం చేసింది. తూర్పు తీర ప్రాంతంలో షిప్ రిపేరింగ్ యూనిట్ ఒక్కటీ లేకపోవడంతో ఆ అవకాశాన్ని సద్వినియోగపర్చుకోవడంపై దృష్టి సారించింది. మారిటైమ్ ఇండియా విజన్–2030లో భాగంగా షిప్ రిపేరింగ్, రీసైక్లింగ్ క్లస్టర్‌ను రాష్ట్రంలో ఏర్పాటు చేయాల్సిందిగా ఏపీ మారిటైమ్ బోర్డు కేంద్రానికి ప్రతిపాదనలు పంపింది. ఈ క్లస్టర్‌కు శ్రీకాకుళం, విశాఖపట్నం జిల్లాలు అనుకూలంగా ఉన్నాయని, దీర్ఘకాలిక అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఈ అవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా కేంద్ర ఓడరేవుల శాఖ మంత్రి శర్బానంద్ సోనోవల్‌ను కోరింది. ఇటీవల ఢిల్లీ పర్యటన సందర్భంగా ఈ ప్రతిపాదన కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లినట్లు ఏపీ మారిటైమ్ అధికారులు వెల్లడించారు. షిప్ రిపేరింగ్–రీ సైక్లింగ్ యూనిట్ ఏర్పాటు ద్వారా ప్రత్యక్షంగా 15,000 మందికి ఉపాధి లభించనుంది. ఒక షిప్‌ను రీసైక్లింగ్ చేయడానికి సగటున 300 మంది నైపుణ్యం కలిగిన మానవ వనరుల అవసరం ఉంటుంది. దీనిపై ఆధారపడి 50 ఎంఎస్ఎంఈ యూనిట్లు ఏర్పాటు అవుతాయని అంచనా. దీంతో పాటు 10 లక్షల టన్నుల ఉక్కును తుక్కుగా మార్చి అమ్మితే జీఎస్టీ రూపంలో అటు కేంద్రానికి, ఇటు రాష్ట్రానికి రూ. 270 కోట్ల చొప్పున ఆదాయం సమకూరనుంది. ప్రపంచవ్యాప్తంగా ఏటా 1,000కుపైగా ఓడలు, దేశంలో 300 వరకు ఓడలు రీసైక్లింగ్‌కు వెళుతున్నట్లు అంచనా. ప్రస్తుతం మన దేశంలో రీసైక్లింగ్ వ్యాపారంలో గుజరాత్ రాష్ట్రం ముందంజలో ఉంది. ఇప్పుడు ఈ అవకాశాన్ని తూర్పు తీరప్రాంతంలో మన రాష్ట్రం అందిపుచ్చుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది.