
సీఏ విద్యార్థిని సింధు
గుణదల (విజయవాడ తూర్పు): సీఏ విద్యార్థిని సింధు అనుమానాస్పద స్థితిలో మృతిచెందిన కేసులో నిందితుడు ప్రసేన్‌ను విజయవాడలోని మాచవరం పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. ప్రేమ పేరుతో సింధును లోబరుచుకుని మోసం చేయడంతో ఆమె మనస్తాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. మరో అమ్మాయితో సంబంధం పెట్టుకున్న ప్రసేన్.. సింధును వదిలించుకోవాలన్న దురాలోచనతో ఆమెను ఆత్మహత్యకు ప్రేరేపించినట్లు పోలీసులు వెల్లడించారు. మృతురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు వివరాలు సేకరించిన పోలీసులు 306 సెక్షన్ కింద ప్రసేన్‌ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపించారు.