
రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన వ్యాపారి కరణం రాహుల్ హత్య కేసులో ఏ2 నిందితుడు కోగంటి సత్యంకు విజయవాడ 1వ అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ 14 రోజుల రిమాండ్ విధించారు.
సాక్షి, విజయవాడ: రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన వ్యాపారి కరణం రాహుల్ హత్య కేసులో ఏ2 నిందితుడు కోగంటి సత్యంకు విజయవాడ 1వ అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ 14 రోజుల రిమాండ్ విధించారు. నిందితుడిని మచిలీపట్నం సబ్ జైలుకు తరలించేందుకు ఎర్పాట్లు చేయవలసిందిగా పోలీసులను ఆదేశించారు. కోవిడ పరీక్ష అనంతరం నిందితుడిని రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించే అవకాశం ఉంది. కాగా, రాహుల్ హత్య తర్వాత రెండ్రోజుల పాటు పరారీలో ఉన్న కోగంటి సత్యంను విజయవాడ పోలీసులు నిన్న బెంగుళూరులో అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు కోరాడ విజయ్ కుమార్ కూడా ప్రస్తుతం రిమాండ్‌లో ఉన్నాడు.
చదవండి: కామం మైకంలో ప్రైవేటు పార్ట్‌కు డ్రగ్స్.. తెల్లారి లేచి చూస్తే